డైలీ సీరియల్

శివాజ్ఞతో దక్షిణపథ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ జ్ఞానాన్ని తర్కించి తర్కించి చూచి నిస్సంశయచిత్తులై అరమోడ్పు కన్నులతో సమాధి నిష్ఠులై వారందరు ఆ దక్షిణకైలాసంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు.
ఆ దక్షిణకైలాస గిరిపై విహారం చేయడానికి వచ్చిన దేవతా స్ర్తిలు ఆ కొండపై సంచరించే వృక్షాలు ఏవేవో గుర్తించలేక కొన్నింటికి ఉయ్యాలలు కట్టి ఊగారు. కాని అవి మెల్లగా చాలా దూరం జరిగిపోయాయి. అందుకు వారు భయాందోళన చెంది తమ కొప్పుల నుండి జారిన పూలచాళ్ల (వరుసలు) గుర్తుల్ని చూచుకుంటూ తమ గృహాలకు చేరుకొన్నారు.
సువర్ణముఖరీనదీ జనన వృత్తాంతం
ఇలా దక్షిణకైలాసాన్ని వర్ణించి చెప్పి తదుపరి సువర్ణముఖరీ జననకదను వివరిస్తానని శివుడిలా చెప్పాడు.
హిమగిరి రాజతనయయైన పార్వతితో ఈశ్వరుడికి జరుగుతున్న వివాహాన్ని చూడటానికి దక్షిణదిశ నుండి చరాచర జీవరాసులన్నీ హిమాలయానికి వచ్చి చేరుకున్నాయి. వాని భారం చేత ఉత్తర దిక్కున ఉండే భూమి క్రుంగి దక్షిణదిక్కున ఉండే భూమి పైకి లేచింది. దానిని చూచి మహేశ్వరుడు అగస్త్యమహర్షిని చూచి ‘ఓ అగస్త్యా! ఈ ఒడుదుడుకును నేను గాని నీవుగాని మాత్రమే నివారించగలం. కాబట్టి నీవు దక్షిణాపథానికి పోయి ఈ ఉపద్రవాన్ని నివారించు’ అని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా శివాజ్ఞను తలదాలిచి భార్య లోపాముద్రతో కూడి అగస్త్యుడు త్రోవలో గల వింధ్య పర్వతగర్వాన్ని అణచివేసి గోదావరి-కృష్ణా నదులలో స్నానమాచరించి శ్రీమల్లికార్జునుని, జ్యోతిఃస్వరూపుడైన సిద్ధవట- నాథుని దర్శిస్తూ దక్షిణపథానికి చేరుకొన్నాడు.
అక్కడికి చేరుకొని పార్వతీపరమేశ్వరుల శ్రీపాద సంచారం చేత పవిత్రమైనది, నవరత్నాలకు - మంత్రాలకు - ఓషధులకు - నిలయమైనది, సంసారమనే మాయాజాలాన్ని తలక్రిందులు చేసేది, అసంఖ్యాకమైన భరతనాట్యకత్తెల విలాసాలచే సుందరమైనది, పరిపూర్ణవైభవానికి సంపూర్ణ నిలయ- మైనది అయిన దక్షిణ కైలాసాన్ని దర్శించి లోపాముద్రతో కూడి అగస్త్యుడు సాష్టాంగ దండప్రణామాల నాచరించాడు. సముద్రమే కాంచీవలయంగా (స్ర్తిలు నడుమునకు కట్టుకొనే మొలనూలు అను బంగారు ఆభరణం) ప్రకాశించే భూమం డలంపై స్థిరంగా అయోధ్య- మధుర-హరిద్వారము- కాశి- కంచి- అవంతి- ద్వారక అనే ముక్తిప్రదమైన సప్తనగర లక్ష్ములు తమ నడుములలో ధరించే కాంచీమణిగా (మొల నూలు మధ్యలో ఉండే మణి) ప్రకాశించే ఆ దక్షిణ కైలాసగిరి దక్షిణ దిగ్భాగానికి చేరుకొని సంసార బంధాల నుండి అగస్త్య దంపతులు విముక్తుల య్యారు. (మోక్షం సంసార బంధాల నుండి విముక్తి పొంది- నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. ఆ ముక్తి కాశీలో మరణించిన వారికే లభిస్తుంది. కాని శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శిస్తేనే ఆ ముక్తి లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైనదీ క్షేత్రం.
శ్రీమద్దక్షిణకైలాసమదృష్ట్వా ముక్తిమిచ్ఛతః
నాస్తి సంసారవిచ్ఛిత్తిః సత్యం సత్యం న సంశయః ॥
ఈ ప్రమాణం చేతనే ధూర్జటి మహాకవి దక్షిణకైలాసమైన శ్రీకాళహస్తి దక్షిణదిగ్భాగాన్ని దర్శించి నంతనే అగస్త్యుని సంసారబంధాలు తొలగిపోయా యని చెప్పాడు.) ఆరీతిగా పునీతులయిన ఆ దంపతులు తన కనుగొలంకులనుండి ఆనంద భాష్పాలు రాలుతుండగా నోటమాటరాక శ్రీకాళ హస్తీశ్వరలింగాన్ని దర్శించారు. అది పాంచభౌతికమైన సంసారసుఖాన్ని నిరసింప చేసే మహాలింగం. అంతేకాదు చిచ్ఛక్తి అనే నాట్యకత్తె నాట్యకౌశలం చేత సదా ఆనందించే రంగస్థలమది. మరియు కేవలం మునీశ్వరుల మనసులయందు పెనవేసుకొని పోయినట్టిది. అంత మాత్రమే కాదు, మన్మథుని ఉసురు (ప్రాణం) తీసే కాలసర్పం కూడ. నిత్యదయా స్వభావం చేత అజ్ఞానాంధకారాన్ని తొలగించే కరుణావీక్షణం కలది. సర్వజనులకు ఉత్తమ మైన ముక్తి అనే భార్యను ప్రియంతో కూర్చేది. పడగలచే ప్రకాశమానమైన ఆ మహాదేవ లింగాన్ని దర్శించి అగస్త్యుడు భార్యాసమేతుడై పులకించిపోయి నమస్కరిస్తూ అర్ధనిమీలిత నేత్రుడై ధ్యానంలో నిమగ్నుడ య్యాడు.
అట్టి ధ్యాన పరవశత్వం చేత అర్ధనిమీలిత నేత్రుడై శ్రీకాళ హస్తీశ్వరుని దర్శించి ఆనందంతో ఆ ముని కాళహస్తీశ్వరుని సహస్రనామాలతో అర్చించాడు. వివిధరీతుల స్తోత్రనైపుణితో శివుని స్తుతించాడు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీమంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణమాచరించాడు. ధ్యాన నిష్ఠచేత వౌనముద్ర వహించి ఆనందపరవశుడయ్యాడు. శివుని వీడజాలక అచటనే నిశ్చలంగా నిలిచి తలపంకిస్తూ తదేక దృష్టితో చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆ రీతిగా వసిష్ఠమునీంద్రుని తప్ఫఃలమైన మహాలింగమూర్తిని దర్శిస్తూ కాశీనగరాన్ని విడిచిరావడం చేత కల్గిన మనోవ్యద నుండి విముక్తుడై అగస్త్యుడు భార్యాసమేతుడై వసిష్ఠుని తపఃసంపదకు సాకారమైన దక్షిణామూర్తి రూపుడైన మహాదేవునికి మ్రొక్కి సేవించాడు. తదుపరి ఆ మునిదంపతులు ఏఖదివర్ణాలు గల మంత్రమే స్వరూపంగా కలదియు, పంచభూతాలే ఆత్మపీఠంగా కల్గినది పంచక్లేశాల్ని (అవిద్య- అస్మిత (అహంకారం)- రాగం-ద్వేషం- అభినివేశం (ప్రాణా లపై తీపి) వినాశనం చేసే కౌశల్యం కలది, పంచవిద్యలే నిజస్వరూపంగా కలది, ఏబది కోట్ల భూమండలాల్ని భరించే సామర్థ్యం కలది, యోగీశ్వరుల హృదయమనే గుహల్లో విహరించేది అయిన జ్ఞాన ప్రసూనాంబను భక్తి శ్రద్ధలతో కొలిచారు. అనంతరం దుర్గాంబ నెలకొన్న కొండనెక్కి ఆమె పాదపద్మాలకు భక్తితో నమస్కరించి ఆ దివ్యరూపాన్ని సందర్శించారు. అప్పుడు వారికి ముక్తి- కాంత వశమయ్యింది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512