డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమాషా - తనకు సాక్షాత్తు తమ్ముడైన సైప్రస్ రాజు- టాలమీ వంశీకుణ్ణి రోమన్లు హత్య చేశారన్న వార్త విన్నప్పుడు కూడా తన తండ్రి విచారించలేదు. ఎవరో ఎక్కడో చనిపోయినట్లు ఊరుకున్నాడు. లేక రోమన్‌ల వల్ల తనక్కూడా అలాంటి ప్రమాదమే ఉన్నదని భావించి, భయపడి ఊరుకున్నాడేమో?
బహుశా ఆ భయంతోనే ఈజిప్టును కూడా రోమన్ సామ్రాజ్యంలో కలుపుకోకుండా సామంత రాజ్యంగా ఉంచి, తనను సామంతరాజుగా అంగీకరించమని ప్రాధేయపడేందుకే తన తండ్రి రోమ్ వెళ్ళి ఉంటాడు. ఐతే రెండు సంవత్సరాలుగా ఆయన అక్కడ ఏం చేస్తున్నట్లు? ఆయన్ను కూడా ఆయన తమ్ముడి దగ్గరకే రోమన్‌లు సాగనంపి ఉంటారా?
కాని అలా జరిగి ఉండదని ఆమె తలచింది. ఎందుకంటే, ఈజిప్టును రోమన్ సామ్రాజ్యంలో కలుపుకోవాలంటే దానికీ డొంక తిరుగుడు పద్ధతి అనవసరం. ఏనాడో రోమనులు కైంకర్యం చేసుకొని ఉండేవాళ్ళు. ఒకవేళ తన తండ్రిని వారు చంపివేసి ఉంటే, వెంటనే ఈజిప్టు పరిపాలనకుగాను రోమన్ అధికారులు దిగుమతై ఉండేవారు. అలాగూ జరగలేదు.
తన అక్క- ఔలటీస్ టాలమీ సంతానంలోకెల్లా పెద్దది- బెరినైస్ టాలమీ రాణి అయింది. తండ్రి రోమ్ వీధుల్లో తిరుగుతూ వుంటే ఇదే సమయమని అక్కడ ఈజిప్టు సింహాసనాన్ని వశపరచుకుంది. తన తండ్రిమీద ప్రజలకు ఏనాడో గురి తప్పిపోయింది. ఆయన వొట్టి మూర్ఖుడు. రాజరికానికి కావలసిన తెలివితేటలూ, ధైర్యసాహసాలూ, మంచి మర్యాదలూ ఏమీ తెలియవు. పొగడ్తలకు ఉబ్బి తబ్బిబ్బై, అలెగ్జాండ్రియా పుర వీధుల్లో నాట్యమాడతాడు. ఇలాంటి తండ్రికి కూతురైనందుకు తానెంతో దుఃఖపడుతోంది. అలాంటివాడిమీద తనకు అనురాగమంటూ లేదు. కాని ఆయనస్థానే వున్న తన అక్క తనకు పరమ శత్రువు!
నిన్నమొన్నటిదాకా తనకు లేని భయం ఇప్పుడు ఆరంభమైనదంటే, తాను తెలుసుకున్నవీ, తేలిగ్గా ఊహించగలిగినవీ తనను ప్రశాంతంగా నిలవనీయటంలేదు. తన తల్లి తనకంత గుర్తులేదు కాని, హఠాత్తుగా తెల్లవారేటప్పటికి హత్య చేయబడిందన్నారు. ఆ హత్యను గూర్చి ఆరా తీసినవాళ్ళు లేరు. టాలమీ వంశంలో హత్యలు కొత్త కాదు. అదొక వంశాచారమైపోయింది. సమయం చిక్కితే తాను తప్ప రాజ్యార్హత గలవారంటూ మరి ఉండరాదనే ఆశయే ఈ హత్యలకు కారణం. టాలమీ వంశ చరిత్రలోనే అనేక పుటలు రక్తసిక్తమైపోయినవి. మరి తాను ప్రవేశించినపుడు మాత్రం రక్తవర్ణాన్ని దాల్చదని నమ్మకమేమిటి?
తన అక్కమీద తనకు ఏనాడూ అభిమానం లేదు. అదొక పెద్ద ముం...! ఏ దాసీదానికో తన తండ్రివల్ల పుట్టి వుంటుంది. జిడ్డుకారే మొహం, నలుపు, పసుపు వర్ణం కలిగిన శరీరచ్ఛాయ! అది మహారాణి అవుతుందని ఊహించి ఉండరు, ఐతే తన అక్కమీద అభిమానం కన్నా, తండ్రిమీద ప్రజలు చూపే అసహ్యం కారణంగా ఆమె సింహాసనమెక్కి పరిపాలిస్తోంది.
అక్కకు మొదటి పెళ్లి- వరసకు అన్నయ్యే- వాడితో జరిగింది. టాలమీ రాజ వంశీకుల ఆచారాలననుసరించి, రాజవంశంలో పెళ్లిళ్ళకు ఇతరులు పనికిరారు. రాజ వంశీకుల రక్తం కలుషితం కాకూడదు. అందుకని వంశాచార ప్రకారం అన్నలకూ చెల్లెళ్ళకూ లేదా అక్కలకూ తమ్ముళ్ళకూ వివాహాలు జరగడం సశాస్ర్తియంగానూ, నీతివంతంగానూ పరిగణించబడుతోంది.
అక్క దాంపత్య జీవితం అధ్వాన్నంగా తయారైంది. రాజకళలేని దాని మొహానికి తగినవాడే దొరికాడు. ఆమె భర్త చాలా నీచంగానూ, అనాగరికంగానూ ప్రవర్తిస్తూ రాజప్రసాదానికే తలవంపులు తెచ్చేట్లు బతకసాగాడు. నిజమైన పరిపాలనను సాగించే రాజోద్యోగులు ఇది సహించలేక అతన్ని చంపి పారేశారు.
బెరినైస్‌కు రెండోసారి కూడా పెళ్లయింది. రాజవంశంలో వయసొచ్చిన పురుషుడు లేనందువల్ల పర్షియన్ రాకుమారుడితో ఆమెకు వివాహమైంది. ఐతే ఆమె దాంపత్య జీవితం సుఖంగా గడపటంలేదని తాను వింటోంది.
నిజానికి తమ వంశంలో తన తండ్రి తరువాత రాజరికానికి తనే తగినదని అనేకులు అనుకుంటూండటం తను విన్నది. పిల్లలందరిలోకి అందమైనదేగాక, స్ఫటికమంత తెల్లగా ఉండే శరీరచ్ఛాయ, రాజరికం ఉట్టిపడే కళాకాంతులు తనలో మాత్రమే ఉన్నవనే విషయం తనకూ తెలుసు. ఐతే నిన్నసాయంత్రందాకా తన ఊహలు సింహాసనం చుట్టూ తిరుగులాడలేదు.
ఇప్పుడు ప్రాణభయం కలిగిన క్షణం నుంచీ, ముందు చావకుండా బతకటమెలాగనేది పెద్ద సమస్యగా తయారైంది. దాంతోపాటే ఈజిప్టుకు సర్వాధికారిణి, రాణి అవటం ఎలాగా అనే ఆలోచనలు కూడా ఊడలు దింపుకుంటున్నవి. ఈ రెండు ఊహలూ ఒకదానిమీద మరొకటి ఆధారపడి వున్నవి.
తాను ఇన్నాళ్ళూ తెలుసుకోలేపోయింది కాని, ఇప్పుడీ అంతఃపురం, నిజంగా అంతఃపురం కాదు. అవటానికి రాజప్రాసాదమే అయినా, ఇది బందిఖానా! తన అక్క బెరినైస్ తనను బందీగానే ఉంచిందనే సంగతి గత సాయంత్రమే తనకు అర్థమైంది. తన చుట్టూ వున్న దాసదాసీజనం, సేవకులూ, అతి బలాఢ్యులైన బానిసలూ- వీరంతా తన సేవకై నియమించబడినవారు కాదు, తాను పారిపోకుండా కాపలాగా ఉంచబడ్డారు!
ఈ రహస్యాన్ని తెలుసుకోగానే పూర్వంవలె ఆమె సుఖపడుతున్నానని అనుకోలేకపోయింది. తన చుట్టూ వున్న వాళ్ళందరూ తనకు ఆగర్భ శత్రువులే! ఏ క్షణాన్నయినా తనను హతమార్చేందుక్కూడా వెనుకాడరు.
నిన్నమొన్నటిదాకా, నిజంగానే ఈ సేవకు లంద రూ తన కనుసన్నలలో మెలుగుతున్నారనీ, తన అడుగులకు మడుగులొత్తుతున్నారనీ, తనంటే భయపడి ఛస్తున్నారనీ అనుకునేది. వీళ్ళందర్నీ తాను కుక్కలకన్నా హీనంగా చూసేది. ఈనాడు కూడా ఈ సేవకులంతా కుక్కలే! ఐతే పిండం వేసే వాడికే కుక్క తన విశ్వాసాన్ని చూపుతుంది. కనుక వీరందరూ తన అక్కకు విశ్వసనీయంగా ఉండటమే కాక, తన పట్ల అవిశ్వాసనీయంగా కూడా ఉంటారు. కనుకనే నిన్న సాయంత్రం నుంచీ తాను స్వర్గమని భావించిన రుూ రాజమందిరం నరకంగా మారింది!
తాను హంసతూలికా తల్పంమీద పడుకుంటే, వాడైన బల్లేలమీద పడుకున్నట్లుంది. తాను ధరించిన చీని చీనాంబరాలు- దుస్తులు కావవి- తన స్వేచ్ఛను అరికట్టేందుకు ఏర్పడిన ఇనుప సంకెళ్ళు! గదిలో వెలిగే దీపాల కిరణాలు, వాడయిన కత్తులవలె తోచినవి. పీల్చే గాలిలో ప్రాణవాయువు లేదు; విషపూరితమై ఉన్నట్లు తోస్తోంది. తన గదిలోని ప్రతి వస్తువూ ప్రపంచంలో చాలా అరుదుగా దొరికేదిగా చెప్పుకుంటారు. కాని రుూ క్షణంలో అవన్నీ తనకు గడ్డిపోచతో సమంగా ఉన్నవి. గదిలోని ప్రతి చీకటి మూలల్లోనూ తన కొరకై మృత్యుదేవత దాక్కొని ఉన్నదనిపిస్తోంది. జీవితమే దుర్భరమైపోయింది.
ఆ గదిలోని నలుమూలల్లోనూ, ఏ అర్ధరాత్రి తనకు ఏ అవసరమొస్తుందోనని, దాస దాసీలు సిద్ధంగా ఉంచబడ్డారు. కాని రుూ సమయంలో వారందరూ గాఢ నిద్రలో ఉన్నారు. గదికి బైట బలిష్టులైన బానిసలు విచ్చుకత్తులతో పహారా తిరుగుతున్నారు. నాకు అపాయం కలుగుతుందేమోనని, రాజవంశీకుల ప్రాణాలు కాపాడేందుకు రుూ కట్టుబాట్లు ఏర్పడినా, తన విషయంలో మాత్రం, తన వల్ల తన అక్కకు ప్రమాదం వాటిల్లకుండా రుూ బందిఖానా ఏర్పడింది. కాదు- బహుశా అక్క తనను చంపేందుకు ఇంకా నిశ్చయించుకుని ఉండదు. ఆ నిశ్చయం దరిదాపుల్లోనే ఉన్నదని అనుమానించేందుకు తనకు తగినంత అవకాశం వుంది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు