డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒకవేళ రోమన్‌ల సహాయంతో తిరిగి నాయనగారు ఈజిప్టు వొస్తే, రుూ ప్రజలు ఆయన్ను రాజుగా అంగీకరిస్తారా? ఈజిప్టును రోమన్‌లకు అమ్మాడనీ, వొట్టి బుద్ధిహీనుడనీ మా నాయనకు పేరున్నది. ఇలాటి రాజు వొదిలిపోయినందుకు ప్రజలు ఆనందిస్తారు గానీ, తిరిగివస్తే తిరుగుబాటు చేయరా?’’
‘‘తప్పక తిరుగుబాటు జరుగుతుంది. బెరినైస్ మీది అనురాగం కన్నా, మీ నాయనగారి మీద ప్రజలకున్న ద్వేషకారణంగా ఆయనకు ఈజిప్టులో స్థానం ఉండదు. ఈ సత్యాన్ని గ్రహించే ఆయన రుూ రెండేళ్ళుగా రోమ్‌లోనే పడి ఉన్నారు. ఈయన ఈజిప్టు తనంతటానుగా రాలేరు. రోమన్ సైన్యాలతో సహా దిగి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు’’ అన్నాడు ఇరాస్.
క్లియోపాత్రా మాట్లాడలేదు. ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. గురువుగారు చెప్పినట్లు జరిగే అవకాశం వున్నదని ఆమె ఇంకా నమ్మలేకపోతోంది. ఈజిప్టు భావి అంతా రోమ్‌మీదనే ఆధారపడింది మరి, వారి నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికెరుక? శిష్యురాలి అవస్థను గురువుగారు గ్రహించలేకపోలేదు.
‘‘యువరాణీ!’’ అన్నాడాయన. ‘‘ప్రస్తుతానికి నీకొచ్చిన భయమేమీ లేదు. ప్రజల్లో కూడా రెండు పక్షాలున్నవి. ఒక పక్షంవారు నీవే రాణివి కావాలని కోరుకుంటున్నారు. ఐతే వారి నిర్ణయానికి ఇప్పుడేమీ విలువలేదు. ముందు రోమ్‌లో నిర్ణయం జరగాలి. ఈజిప్టు సింహాసనం ఎవరికి చెందుతుందనే సమస్యలో ప్రస్తుతం నీకు స్థానం లేదు. ముందుగా నీ తండ్రిగారూ, అక్కగారూ రుూ విషయానే్న తేల్చుకోవాలి. త్వరలోనే ఇదితేలగలదని నా నమ్మకం!’’
‘‘అంతవరకూ?’’’
‘‘అంతవరకూ పరిస్థితుల్ని అర్థం చేసుకోవటం మినహా మరేమీ లేదు. ఒకటి మాత్రం నిజం. బెరినైస్ నిన్నొక కంట కనిపెడుతూ వుంది. రెండో కంటితో కాపాడుతూనూ ఉంది. రుూ సమయంలో రాజవంశంలో ఎలాటి హత్యాకాండ జరిగినా ఆమెకు నష్టమే! ఒకపక్క ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఇలాంటిది రాణిగా ఉండతగదని రోమ్ నిర్ణయిస్తుంది. కనుక నీకేమీ భయం లేదు’’ అన్నాడాయన.
‘‘మీ మాటలతో నాకు భయం తీరినా, నాయనగారు రాజుగా తిరిగివచ్చే శుభ సమయం కోసం ఎదుచూస్తుంటాను. జీవితం ఎలా పరిణమిస్తుందో తెలియని అగాధాల్లో పడ్డాను!’’ అని ఆమె విచారంగా మాట్లాడింది.
‘‘ఆడపిల్లవు. తీవ్రంగా ఆలోచించి, మనస్సు పాడుచేసుకోకు. మనస్సును వినోదాల మీదికి పోనివ్వు. కంటికి రెప్పవలె నేను నిన్ను కాపాడుతాను. మనకు కూడా కొంత బలగం ఉన్నది. పైవారంలో రోమ్ నుంచి వార్తావహులొస్తున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా వున్నవో ఈసారి స్పష్టంగా తెలుస్తవి’’ అన్నాడాయన.
‘‘మీ సహాయానికి కృతజ్ఞురాలిని. రుూ దీనురాల్ని మాత్రం మరచిపోకండి’’ అన్నది క్లియోపాత్రా.
‘‘యువరాణీ! నీవలా మాట్లాడకు. నీవు దైవాంశగల దానివని నా అంతరాత్మ మాటిమాటికీ చెపుతోంది. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. ఐనప్పటికీ నీ క్షేమం కోసమై చివరి రక్తకణాన్ని కూడా వెచ్చించేందుకు నేను వెనుకాడను.. మరి సెలవా?’’ అని ఆయన లేచి నిలబడ్డాడు.
ఆయన్ను సాగనంపేందుకు క్లియోపాత్రా కూడా లేచింది. కష్ట సమయంలో తనకొరకై ప్రాణాల్ని సైతం లెక్కచేయని మహామేధావి, పండితుడు వేదాంతి, గౌరవనీయుడైన ఇరాస్‌కు ఆమె హృదయపూర్వకంగా నమస్కరించింది.
ఇరాస్ వెళ్లిపోయిన చాలాసేపటికి ఆమె తీవ్రంగా ఆలోచిస్తూనే వుంది. అక్కడ రోమ్‌లో ఏం జరుగుతుందో ఆమె ఊహలకు అందటంలేదు. అలంకరణ సామగ్రి ఉన్న అద్దం దగ్గర వేలాడదీయబడిన బంగారు నాణెంమీద ఆమె కన్నుపడింది. లేచి వెళ్లి దాన్ని తీసుకొచ్చి పరిశీలనగా చూచింది.
రోమన్ సామ్రాజ్యాధికారి పాపం తల ముద్రించబడిన బంగారు నాణెమది! తన జీవితమంతా ఎక్కడో పరాయి దేశాన్ని పరిపాలించే రుూ తలమీద, తలలోని ఆలోచనలమీదనే ఆధారపడి ఉంది! తనకు వ్యక్తిత్వమంటూ లేదు. ఈ తల ముందు మోకరించాలి. ఈ తలకు కీలుబొమ్మవలె ప్రవర్తించాలి. రోమన్ జాతిపట్ల ఆమె హృదయంలో ద్వేషాగ్ని ప్రజ్వరిల్లింది.
కాని రుూ రోమన్‌లు ఎంత అందగాళ్ళు! ప్రాణాలకు తెగించైనా సరే పోరాడుతారు! కేవలం బలాతిశయమే కాదు; యుద్ధ నైపుణ్యం కూడా ఉన్నది! ఎంత సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారో, ఇంకా ప్రపంచంలో ఏయే రాజ్యాలను ఆక్రమించుకోస్తున్నారో, ఆ కథలు వింటూంటే ఆ వీరగాథలకు తన శరీరంలోని రక్తం ఉడికిపోతూంటుంది.
రోమన్ పరాక్రమాలూ, విజయాలూ వింటూన్నప్పుడు అదంతా తనకు సంబంధించిందిగానే భావిస్తుంది. ఏనాటి బంధమో అదృశ్యరూపాన రుూనాడు తనను రోమ్‌వైపు బంధించి లాగుతున్నట్లనిపిస్తుంది. రోమన్ నాగరికత ఇప్పుడిప్పుడే ఈజిప్టును ఆక్రమిస్తోంది. తనను ఏనాడో ఆవహించి వశపరచుకుంది.
క్లియోపాత్రా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఆయా ప్రవేశించింది. ఆమె ఆశ్చర్యపడుతూ ‘‘ఏం తల్లీ! ఫలహారమే ముట్టలేదు’’ అని అడిగింది.
‘‘తిన్నాను ఆయా!’’
‘‘ఏం తిన్నావమ్మా! పాపం ఆచార్యులు కూడా ఏమీ తిన్నట్లు లేదు. అమ్మారుూ! రాచకార్యాలకోసం అన్నపానాదులు మానుకుంటారా?’’ అన్నది ఆయా.
తనమీద మమకారంతో ఆయా బాధపడుతుంది. ఐనా తనకిప్పుడు ఆలోచనే ఆహారం!
‘‘నేను తినిపించేదా తల్లి’’
‘‘వొద్దు..’’ ఆమె ఆయాను వారించేందుకూ, ఆచార్యులు ఆదేశించినట్లు మనస్సును వినోదాలమీదికి మళ్లించేందుకూ నిశ్చయించి ‘‘మనసేమీ బాగాలేదు ఆయా!’’ అన్నది.
‘‘నాట్యాలూ, సంగీత వినోదాలూ ఏర్పాటుచేశాను. నీవు కాస్త అలంకరించుకుని రెండు మెతుకులు ఎంగిలిపడితే, వినోదాలలో పాల్గొనవచ్చు. రా అమ్మా! మా బంగారు తల్లివి! జగదేక సుందరివి! స్ర్తి జాతిలో నీలాంటి అప్సరస పుడుతుందని ఏ కవిగాడూ ఊహించి ఉండడు. అసలు నీవు దేవతవే తల్లీ!’’ అన్నది ఆయా.
క్లియోపాత్రా కళ్ళు గర్వంతో మెరిసినవి.
‘‘ఆయా! నిజంగా నేనంత అంగదగత్తెనా?’’ అన్నది.
‘‘నేను అబద్ధమాడితే, ప్రాణంలేని అద్దాలు అబద్ధమాడగలవా తల్లీ! ఈ ప్రపంచమంతా అందానికి దాసోహం. అనంతకాలమూ, నిన్ను ఆరాధించక తప్పుతుందా?

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు