డైలీ సీరియల్

ఆవేశమెన్నడూ అనర్థమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనివితీరని కోరికతో, నవ్వుముఖంతో చిక్కుపడ్డ శృంగారపు కొప్పుతో; చెక్కులపై (బుగ్గలు) కారే చెమటతో, నిట్టూరుపు వాయువేగంతో; వినోదాల చేత ఉప్పొంగే శరీరంతో వాలుచూపులతో బ్రహ్మ ప్రకాశించాడే గాని రతి క్రీడయందు కించిత్తు కూడ తృప్తి పొందలేదు.
ఈ రీతిగా కామాంధుడై అదే పనిగా స్వకార్యాలనన్నీ విడిచి పుణ్యపాపాల్ని ఎంచక రతి సౌఖ్యాలలో తేలిన వారికి క్రూరులు - వంచకులు - దుష్టులు - జగద్ద్రోహులు - భయంకరాకారులు- పరస్ర్తికాముకులు - సదాచార భ్రష్టులు - లోకకంటకులు - ఆయుధధారులు - దయాహీనులు అయిన ముప్పదివేలమంది రాక్షసులు వెంటనే జన్మించారు.
బ్రహ్మ కొడుకుల దుష్టచేష్టలు
వెంటనే వారు నవవనలై తండ్రియైన బ్రహ్మతో ఇలా అన్నారు. ‘‘తండ్రీ! శ్రీమహాలక్ష్మిని చెరపట్టి తెమ్మంటారా? వెండికొండను పిండిగా చేయమంటారా? సూర్యమండలాన్ని మ్రింగి వేయమంటారా? సముద్రాన్ని త్రాగివేయమంటారా? సర్పరాజుల్ని ఆడించమంటారా? భూమిని పెకలించి వేయమంటారా? మృత్యుదేవత కోరలు విరిగిపోయే విధంగా దున్ని వేయమంటారా? యమధర్మరాజు గర్వాన్ని చెరచివేయమంటారా? కులపర్వతాలను పీకివేసి ఆకాశమంతా ప్రతిధ్వనించే రీతిగా బంతులాడుతూ ఎగురవేయమంటారా? ఏ పని చేయమంటారో దానికి మమ్మాజ్ఞాపించు.’’ వారి మాటన్ని విని చతుర్ముఖుడు ‘‘మన్మథుని పూలబాణాల చేత మనసున కారుచీకట్లు కమ్మిన మూలంగా రతి క్రీడలం తేలి మదించిన వాళ్లు - దుష్టకర్ములు అయిన కొడుకుల్ని గన్నాను.’’ అని బాధపడి భరింపరాని ఆ రాక్షసుల్ని చూచి ‘మీరు నింగినంటే శిఖరాలు కలిగి నట్టిది - తూర్పు - పడమర - ఉత్తరం - దక్షిణం ఇలా నాల్గుదిక్కులకు తగిన అగడ్తలుగా ఉండే గంగా - గోదావరీ- సముద్రాలు చేత చుట్టుకొనబడి ప్రవేశింపరానిది - వివిధ మృగసంచార భయంకరమైన వింధ్య పర్వత మధ్య ప్రాంతాలకు పొండి’ అని ఆజ్ఞాపించాడు.
తండ్రి ఆజ్ఞ శిరసావహించి ఆ రాక్షసులు మీసాలు మెలితిప్పుతూ, పూల పొదరిండ్లను చీల్చే రీతిగా దిక్కుల్ని చీల్చివేస్తూ, కత్తులు ఝళిపిస్తూ, వింధ్య పర్వతప్రాంతానికి వచ్చారు. ఆ విధంగా వారు వచ్చే సమయంలో వారి నల్లని శరీరకాంతి చేత నింగిలోని ఆ సూర్యుడు కూడ కాంతి విహీనుడయ్యాడు. వింధ్య పర్వతప్రాంతానికి వచ్చిన ఆ రాక్షసులు ఒక దుర్గమారణ్యంలో నివాసముంటూ అచట గల జంతువుల్ని వధించసాగారు. మునీంద్రుల్ని బంధింపసాగా రు. స్వర్గం మొదలైన దేవతల నగరాల్ని దహనం చేసారు. ఆత్మదర్శనం కోసం తపస్సు చేసే మునీశ్వరుల మనస్సుల్ని కష్టపెట్టసాగారు. పురుషుడన్న ప్రతి వ్యక్తిని వధించారు. కనిపించిన స్ర్తిలనల్లాసంభోగిం చారు. ధనాల్ని కొల్లగొట్టారు. వర్ణాశ్రమధర్మాల్ని నాశనం చేసారు. దేవతల్ని బాధించారు. ప్రత్యక్షమే ప్రమాణంగా భావించే చార్వాకుల వలె శరీర సౌఖ్యమే పరమావధిగా భావించి సంచరించసాగారు. కులం- శీలం- జాతిభేదం-దయ- సిగ్గు-నీచం-సందేహం- వీనిని దూరం చేసే విషయంలో భ్రష్టులు - యోగులు సమానమే. అయినా యోగులు ఆ విధంగా చేస్తూ నిస్సారమైన - భయంకరమైన సంసారవ్యామోహంలో పడకుండ మోక్షానం దాన్ని పొందుతారు. కానీ ఈ రాక్షసులు యోగి లక్షణాలు కలిగియుండి కూడ సంసారకూపంలో పడ్డారు. వారివలె మోక్షానందాన్ని ఎప్పటికి పొందరు? వారి ధనాగారాలన్ని ఇతరుల్ని దోచి తెచ్చినవే. కారాగారాలలో బంధింపబడిన కులవధువుల నుండి చండాల కన్యల పర్యంతం వారికి భార్యలే. క్రూరమైన చేష్టలే వారి సత్కర్మలు. భోజనపదార్థాలు సమస్త జంతువులు. పానీయాలు కుండలనిండుగా ఉండే మద్యం. ఆ విధంగా పాపకర్మలతో వారు తిరిగారు.
ఆ బాధలు భరింపజాలక దుఃఖాక్రాంత యై తలపై చేతులు జోడించిన భూదేవి ‘ఓ దేవా! నీ రాక్షస తనయుల వలన ఈ లోకం దహింపబడుతూ ఉంది. సత్వరమే రక్షా కార్యంలో నీ బుద్ధి నిలుపుము’ అని వచన బద్ధస్వభావుడగు బ్రహ్మదేవునకు ఆక్రోశిస్తూ విజ్ఞాపన చేసింది. ఆ ఆర్తనాదాన్ని విని బ్రహ్మ దయతో భూదేవిని పిలిచి ‘్భయపడకు ఈ నిమిషంలోనే నీకు మేలు చేస్తాను’ అని వాగ్దానం చేసాడు.
బ్రహ్మకు ఉగ్రుండను కొడుకు కలుగుట
బ్రహ్మ తన కొడుకులపై కలిగిన ఆగ్ర హావేశాన్ని ఆపుకోలేక పోయాడు ఫలితంగా ఆయన కోపావేశంలో నుండి ఉగ్రుడనే కొడుకు సమస్త జీవరాసులు భయపడు నట్లుగా జన్మించాడు. ఆ ఉగ్రుడికి బ్రహ్మ వజ్రకవచంతో కూడిన ఉగ్రమైన సింహం- రథం- అస్తస్రమూహాలనిచ్చి ‘నా సుతులైన ఆ రాక్షసులు నీకు సహూదరులు. అయినా ఆ విధంగా లెక్కింపక భయంకరంగా వారిని సంహరించి దేవతలు సంతోషించే విధంగా భూదేవికి ప్రీతి కలిగించు’ అని ఆజ్ఞాపించి వారిపై యుద్ధానికి పంపాడు. అతడు వెంటనే భయంకరంగా అరిచాడు. ఆ అరుపుకు నాలుగు దిక్కుల యందున్న ఏనుగులన్ని చెదిరిపోయాయి. అతడు మీటిన వింటిత్రాటి మ్రోతతో సముద్రాలు అల్లకల్లోల మయ్యాయి. వేగంగా పరుగిడే రథచక్ర ధ్వనులచేత కులపర్వతాలు అణగిపోయాయి. రథవాహనాలైన సింహాదుల సాంద్రమైన గర్జనలచే దిక్కులు ముక్కలయ్యాయి. ఇంకా ఏమని చెప్పాలి? తనను భూమండలానికి పొమ్మన్న మాట బ్రహ్మనోట నుండగానే సింహవాహనుడైన ఉగ్రుడు వింధ్యగిరి ప్రాంత భూమికి వచ్చాడు.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512