డైలీ సీరియల్

ఉగ్రుని భండనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసురులతో ఉగ్రుని యుద్ధము
ఆ ఘోరాసురులు విషయమంతా తెలిసికొని గజ- రథ-అశ్వ-కాల్బలాలు సేవిస్తూ వెంటరాగా బంగారు రథాల నెక్కి తిరుగులేని ధనుర్బాణాల్ని ధరించి బంగారు రథాలపై కూర్చుని వచ్చారు. ఆ సమయంలో రేగిన ధూళి కలియడం చేత గంగానది బురదగా మారిపోయింది. సైనికఖలాల్ని మోహరించి మహాబలవంతుండైన ఉగ్రుడిపై ఆ బ్రహ్మ తనయులైన రాక్షసులు తమ బలమెంతో శత్రుబలమెంతో విచారింపక శ్రీరఘురామునిపై యుద్ధానికి పోయిన రాక్షసులవలె యుద్ధానికి సిద్ధ పడ్డారు. ముందుగా కాల్బలం ఆ తరువాత వరుసగా అశ్వసైన్యం - గజసైన్యం - రదసైన్యం నిలిచి నడువగా చూచేవారికి చాల ఆశ్చర్యం కలిగించింది.
అప్పుడు ఉగ్రుడు హాలాహలాన్ని భక్షింపబోవు ఉగ్ర శివాకారుడై; సముద్రాన్ని ఆపోసన పట్టబోవు అగస్త్యమహర్షిలా చీకట్ల సముదాయాన్ని చీల్చు చండభానుడిలా ఉగ్రా కృతివహించి రాక్షససైన్యాల్ని ఎదుర్కొన్నాడు. ముందుగా కాల్బలాల్ని అణచివేసాడు. తదుపరి అశ్వసైన్యాన్ని నాశనం చేసాడు. పిదప మదగజబలాల్ని గింజలులేని కంకుల వలె నిస్సారం చేసాడు. వెంటనే ప్రచండవీరుల్ని మట్టుపెట్టాడు. మరణింపగా మిగిలిన సైన్యాన్ని రెండుగా విభజించి వాని మధ్యనుండి ఇరుప్రక్కల ఉన్న ఇండ్ల వరుసల మధ్య నడచి వెళ్లిన రీతిగా ఉగ్రుడు ప్రయాణించాడు. చెదరి పారిపోయిన సైన్యాల్ని కదలకుండ ఒకచోట నిలిచే రీతిగా తిరిగి గజసైన్యాలు-అశ్వసైన్యాలు-కాల్బలం యుద్ధంలో ఒక్కమారుగ మరణించే విధంగా ఉగ్రుడు తన ప్రతాపాన్ని చూపాడు.
ఆవిధంగా మహాయోధాగ్రణియైన ఉగ్రుని చేత బ్రహ్మ పుత్రులైన రాక్షససైన్యాలు చెల్లా చెదరయ్యాయి. శస్త్రాస్త్ర ప్రయోగాల చేత పాయలు పాయలుగా చీలిపోయాయి. యుద్ధ్భూమిలో శరీరావయవాలు చెల్లాచెదరు కాగా భయ భ్రాంతులయ్యారు. ఆ విధంగా సైన్యం రాక్షసుల్ని శరణు వేడుకొంది. అప్పుడా రాక్షసులు సాయంకాల సూర్యునితో సమానమైన ముఖం కలవారై కోధంతో ఓడి పారిపోయే సైన్యాల భీతిని తీర్చి విక్రమంతో వారు ఉగ్రుని ఢీ కొన్నారు. అప్పుడు యుద్ధ్భూమిలో తీవ్రమైన అరుపులు - పెడబొబ్బలు ఉఱు ములను మీరిపోతూ వ్యాపించాయి.
ఉగ్రుడు వారి ఆ సంకులసమరానికి జంకక భూమి కంపించునట్లుగా ఆ బ్రహ్మపుత్రులైన రాక్షసులతో తలపడ్డాడు. అప్పుడా రాక్షసులు కూడ పిడుగులతో సమానమైన బాణాలసమూహాన్ని కురిపిం చారు. ఆ బాణాలను ఉగ్రుడు విరిచి వేసి అరణ్యం దావాగ్నితో వ్యాపించిందా అన్నట్లుగా రాక్షససైన్యాన్ని బాణాగ్నులతో కప్పివేసాడు. అయినా ఆ బాణాలు దావానలంలో పడిన మిడతల వలె సముద్రం మీద కురిసిన వర్షధారల వలె రాక్షసుల మీద పడి వ్యర్థమై పోయాయి. అప్పుడు సింహ వాహనుడైన ఆ ఉగ్రుడి కను కొలకుల నుండి క్రోధాగ్ని కణ జాలం కురిసింది. బ్రహ్మాండం పగిలి పోయేటట్లుగా బిగ్గరగా అరచి విలువిద్యా నైపుణ్యంతో నేలమీద దుమ్ము ఆ రాక్షసుల రక్త్ధారలచే కడిగి వేయబడిన రీతిగా బాణాలను సంధించాడు. అయినా ఆ రాక్షసవీరులు ఆ ఉగ్రుని బాణపరంపరలచే కులపర్వతాలు కుంభవృష్టి వర్షధారలచేత బాధింపబడక నిశ్చలంగా ఉండే రీతిగా చెక్కుచెదరక నిశ్చలంగా ఉన్నారు. అప్పుడు దిక్కులన్నీ కూడ గజగజలాడగా విల్లును చెవివరకు లాగి రెక్కలు వచ్చిన కాలసర్పాలవలె రెక్కల బాణాలను ఆ యోధుడైన ఉగ్రుడు రాక్షసుల రక్తం కోసం బేతాళాలు గుటకలు వేస్తూ ఎదురు చూస్తుండగా వాడియైన బాణాలను విరివిగా ఆ రాక్షసులపై ప్రయోగించాడు.
అప్పుడు బ్రహ్మపుత్రులైన రాక్షసులు ప్రతీకారవాంఛతో ఆ బాణసముదాయాన్ని నుగ్గు నుగ్గు చేసి ఉగ్రునితో ఇలా అన్నారు. ‘ఓ అన్నా! ఈ పదునాలుగు భువనాలలో నీ వంటి వానిని చూడలేదు. మాతో యుద్ధం చేయడానికి నిన్ను నియమించిన వారెవ్వరు? సమరానికి నీవు రావడం తప్పుకాదు. కాని మమ్ము జయింపక నీవు పోవడం కూడ సాధ్యం కాదు.’ ఆ సమయాన వీరాగ్రణియైన ఉగ్రుడు వారి మాటల్ని లెక్కచేయక అనేక బాణాలను ప్రయోగించాడు. వాని నా రాక్షసులు తమపై పూలు పడినట్లు తలంచి ఆకాశమంతా నిండే విధంగా పెద్దగా అరుస్తూ నీ కొవ్వు నీ విధంగా అణచెదమని పలికి అందరు ఒక్కుమ్మడిగా గువ్వలు డేగ నెదుర్కొన్న విధంగా ఉగ్రుని ఎదుర్కొన్నారు.
ఆ విధంగా అసురులందరూ కలిసివిబట్టుగా ఉగ్రునిపై వాడియైన బాణాలను అత్యధికంగా ప్రయోగించగా ఆతని సింహరథచక్రం రక్తంలో మునిగిపోయింది. అప్పుడు భూమండలం సమూలంగా లేచి క్రిందపడే విధంగా బిగ్గరగా అరచి కన్నులనుండి నిప్పులు రాలగా ఉగ్రుడు ఆ ముప్పది వేల రాక్షసులపై ఈశ్వరుడు త్రిపురాసులసైన్య సమూహాన్ని కుమ్మినట్లుగా కఠినమైన బాణపరంపరల్ని గుమ్మరించాడు.
అయినా ఆ రాక్షసులు ఆ బాణసమూహానికి భయపడక రేగిన రోషావేశంతో కొండనుండి జేగురు రంగు కలిసిన ఏరులు ప్రవహించే విధంగా వారి ముఖం - కంఠం - భుజాల నుండి రక్తం స్రవిస్తూ ఉండగా సాక్షాత్తు వీర రసమే స్రవిస్తూ ఉన్నదా అన్నట్లు ప్రకాశించారు. ఉగ్రుడు విజృంభించి ఆ రాక్షసుల రథాలను ముక్కలు చేసాడు. అశ్వాలను సంహ రించాడు. జెండాలను క్రింది పడగొట్టాడు. వారి రత్నమయ కిరీటాలను బాణాలతో ముక్కలు చేసాడు. ధరించిన కవచాల్ని దుమ్ములో కలిపాడు. రదసారథులను చెండాడాడు. విండ్లను విరిచివేసాడు. దీనితో రాక్షసులు మనసులో చాలా సంక్షోభం పొందారు. అప్పుడు రాక్షసులు రథాలను విడిచి అరిగెలు (ఒక రకం ఆయుధం) పట్టెలు (పెద్దకత్తులు) తీసికొని నింగిలో చీవిబట్లు కల్పిస్తూ నింగికెగిరారు. ఎగిరిన ఆ రాక్షసులు ఆ మాయాంధకారంలో కనబడకుండ యుద్ధం చేయసాగారు. అప్పుడు ఆ మృగేంద్రరథుడైన ఉగ్రుడు మత్తగజాలను పోలిన ఆ రాక్షసులపై చీకటిని ఛేదించే అస్త్రాన్ని ప్రయోగించి చీకట్లను తొలగించాడు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512