డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామ్రాజ్ఞి కూడా ముందులా.. ముడుచుకుని, ఒదిగిపోయినట్టు కాకుండా మామూలుగా కూర్చుని ఉంది తన సీట్‌లో.
ఆ ఊళ్ళో ఎక్కిన ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చాక తన కార్యక్రమం పూర్తిచేసుని ‘లైట్లు తీసేయ్ గురూ!’’ అని అరిచాడు కండక్టర్.
అప్పటివరకూ లేని బెరుకు అప్పుడావహించింది సామ్రాజ్ఞిని. వేరే చోటు ఖాళీ ఉన్నా తనే కోరి అతణ్ణి అక్కడ కూర్చోమని చెప్పి పొరపాటు చేసిందా? అని మధనపడసాగిందామె.
అతణ్ణి లేచి వేరే సీట్‌లో కూర్చోమని చెప్పాలని మనసులో అనిపించినా ఆమాట పైకి చెప్పలేక సతమతవౌతూ కిటిలోంచి వీస్తోన్న చల్లటి గాలికి కళ్ళు మూతలు పడి కాస్సేపటికి నిద్రలోకి జారుకుంది సామ్రాజ్ఞి.
అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. ఎవరో తన భుజం పట్టికుదుపుతున్నట్టనిపించడంతో ఉలిక్కిపడి కళ్లు తెరిచిన ఆమెకు తన మొహంలోకి చూస్తూ కనిపించాడతడు.
అతడి చేయి ఆమె భుజంమీద ఉందప్పుడు. ఒక్క క్షణం తనెక్కడుందో, ఏం జరిగిందో అర్థం కాలేదు ఆమెకు.
‘‘మిమ్మల్నే.. లేవండి బస్ ఆగిపోయింది. అందరూ అప్పుడే దిగిపోయారు’’ అన్నాడతడు.
‘‘అర్థరాత్రి బస్ ఆగిపోవడం ఏమిటి? బస్ ఆగినంత మాత్రాన అందరూ దిగిపోవడమేమిటి?’’ అంటూ సీట్లోంచి లేచి నిలబడి బస్ అంతా పరికించి చూసింది. బస్‌లో కండక్టరూ, డ్రైవరూ తప్ప ప్రయాణీకులెవరూ లేరు.
ఆమె తత్తరపాటు గమనించిన అతడు నవ్వి అన్నాడు, ‘‘మరేం కంగారు పడకండి. బాగుచేయడానికి వీల్లేని మరమ్మత్తేదో వచ్చి బస్ ఆగిపోయింది. ఈ రాత్రి ఇక్కణ్ణించి ఎటూ వెళ్లడానికి బస్‌లు లేవు.
ప్రయాణికులంతా దిగిపోయి, ఊళ్లో ఉన్న చిన్నా చితాకా హోటళ్లలో సర్దుకున్నారు. డ్రైవరూ, కండక్టరూ తప్పదు కనుక బస్‌కు కాపలాగా బస్‌లోనే ఉండిపోయారు.
రాత్రి గడవడానికింకా చాలా సమయముంది. మీకభ్యంతరం లేకపోతే పదండి ఏదైనా హోటల్‌లో ఈ రాత్రికి తలదాచుకుని ఉదయానే్న లేచి ప్రయాణం కొనసాగించవచ్చు’’.
ఆమె ఉలిక్కిపడింతడి మాటలకు. ‘ఏవంటున్నాడితడు? ఊరుగాని ఊళ్ళో ముక్కూ మొహం తెలియని మనిషిని నమ్మి అతడితో హోటల్‌లో గడపాలా తను ఈ రాత్రికి?!’’ ఆ ఊహకే ఆమె ఒళ్లంతా కంపించిపోయింది.
‘‘తనతడితో హోటల్‌కు వెళ్ళే బదులు ఎలాగోలా బస్‌లోనే తెల్లారేవరకూ కాలక్షేపం చేయొచ్చుగా! ఈ కండక్టర్‌నీ, డ్రైవర్‌నీ నమ్మొచ్చా?
వాళ్లు మంచివాళ్లే అయినా బెల్లం ఉనికిని చీమలు ఇట్టే కనిపెట్టినట్టుగా ఆగిపోయిన బస్‌లో ఆడమనిషెవరో ఒంటరిగా ఉందనే విషయాన్ని కనిపెట్టిన పోరంబోకు వెధవలెవరైనా బస్సులో జొరపడి తనమీద ఏ అఘాయిత్యమో చేస్తే!’’
ఓ వైపు భయం, మరోవైపు ఆందోళన- ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయింది సామ్రాజ్ఞి.
ఆమె మనసులో చెలరేగుతున్న సంఘర్షణను కనిపెట్టినట్టుగా అన్నాడతడు, ‘‘ఏ విధంగా చూసినా ఈ రాత్రి ఆగిపోయిన బస్‌లో గడపడం కంటే ఏ హోటల్‌లోనో తలదాచుకోవడమే మంచిది’’.
సామ్రాజ్ఞి కళ్లు పెద్దవి చేసి చూస్తూ, ‘‘హోటల్‌లోనా?’’ అంది.
సందిగ్ధావస్థనుంచి ఆమె ఇంకా బయటపడడం లేదని ఆమె ముఖ కవళికలే చెప్పాయతడికి.
‘‘అవును.. మరేం భయంలేదు. నేనెవరో మీకు తెలియకపోయినా మీ పట్ల నా ప్రవర్తనను ఇంతవరకూ చూశారుగా.. నన్ను మీ స్వంత మనిషిలానే భావించి వేరే ఆలోచనలేవీ పెట్టుకోకుండా నాతో రండి’’ అంటూ లగేజ్ రాక్‌లోంచి ఆమె బ్యాగూ, తన బ్రీఫ్‌కేసూ తీసి పట్టుకుని ముందుకు నడిచాడతడు.
అతడి వెనుక నడుస్తోంటే, ‘ఒకోసారి మన ఇష్టా యిష్టాలతో నిమిత్తం లేకుండా పరిస్థితులు నిర్దేశించినట్టుగా మనిషి నడుచుకోక తప్పదనే విషయానికింతకంటే ఉదాహరణ ఏముటుంది?’ అనిపించిందామెకు.
బస్ ఆగిన చోటినుంచి వందడుగుల దూరం నడిచాక ఒక హోటల్ కనిపించింది. అతడి వెనుకే మెట్లెక్కి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు చేరి అక్కడున్న సోఫాలో ఒదిగి కూర్చుంది సామ్రాజ్ఞి.
అతడు కౌంటర్‌లో ఎడ్వాన్స్ చెల్లించి రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆమె వైపు తిరిగి ‘పద.. వెళదాం..’ అన్నాడు.
ఆమెకు ఉక్రోషం తన్నుకొచ్చింది. తన ఉక్రోషాన్ని గదిలోకి వెళ్ళేవరకూ అతి కష్టంమీద అదిమి పెట్టుకుని రూమ్ బోయ్ సామాన్లు గదిలో పెట్టి వెళ్లిన తరువాత విరుచుకుపడింది.
‘‘ఏవిటి మీ ఉద్దేశ్యం? బస్‌లో నా పక్కన బుద్ధిగా కూర్చున్న మీ ప్రవర్తనకూ, ఈ హోటల్‌లో ప్రవేశించాక మీ ప్రవర్తనకూ పోలిక లేకుండా ప్రవర్తిస్తున్నారు?!
పైగా అందరి ముందూ నేను మీ భార్యనైనట్టు నాతో ఏకవచనంలో వ్యవహరించడవేమిటి?’’
అతడు కోపం తెచ్చుకోకుండా చిన్నగా నవ్వి అన్నాడు, ‘‘ఊరంతా మాటుమణిగిన వేళ, రాత్రి సమయంలో, ఊరుగాని ఊళ్లో వయసులో వున్న ఒక మగాడూ, ఆడదీ గది కోపం హోటల్‌కు వస్తే వారిని భార్యాభర్తలుగా కాక మరో విధంగా గౌరవంగా చూసే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు.
అందుకే అందరి ముందూ మిమ్మల్ని, ‘పద.. వెళదాం..’ అన్నాను. నేనలా కాక ‘పదండి.. వెళదాం’ అని అంటే ఈ గదిలోకి సామాన్లు తీసుకొచ్చిన రూమ్‌బాయ్ నుంచి, రిసెప్షన్ కౌంటర్‌లో వున్న వ్యక్తితోపాటు, మనమీ హోటల్‌లో ప్రవేశించినప్పటినుంచీ మనకు తెలియకుండా మనను గమనిస్తోన్నవారి దృష్టిలోనూ మీ గౌరవం ఎంతో పలచబడిపోయి ఉండేది.
అలానే ఒక గది కాకుండా మనిద్దరికీ చెరో గదీ కావాలని అడిగినా మీరూ, నేనూ ఈ రాత్రి ఏ ఇబ్బందీ లేకుండా గడిపే అవకాశాలుగా తక్కువగా ఉండేవి’’.

-ఇంకా ఉంది

సీతాసత్య