డైలీ సీరియల్

శివసన్నిధే శూలిభక్తులకు పెన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కుమ్మరి కొకయేడు సుత్తికి ఒక పెట్టు’’ అన్నట్లుగా నేడు ఈ దీపపుశిఖ చేత అన్ని బూడిదయ్యాయి. అయ్యో! ప్రయాసపడి నేను కట్టిన ఇండ్లన్ని ఈ దీపం కాల్చి వేసింది. దీని మ్రింగి వేస్తాను. అప్పటికి గాని నాకోపం చల్లారదు. నాకిక ఈ జీవితం మీద వ్యామోహమిక చాలు.’ అని ఆ దీపాన్ని ఉద్రేకంతో మ్రింగ బోయింది.
అప్పుడా దేవదేవుడు భక్తవత్సలుడు, గౌరీవామాంగుడు అయిన శంకరుడు ఆ సాలిపురుగుపై దయారసముప్పొంగగా ఎఱ్ఱనై యున్న తన హస్తంతో దానిని వారించి ‘నీ భక్తి మెచ్చుకొన్నాను. నీవు దేనిని కోరుకొంటున్నావో తెల్పుము’ అని పలికాడు. ఆ మాటవిని చెలది పురుగు ‘నా తపమింతటితో ఫలించింది.’ అని భావించి ప్రమధగణాధిపతియైన ఈశ్వరుడికి నమస్కరించి తొట్రుపాటుపడుతూ భక్తితో ఇలా అంది. ‘దేవా! హీనమయిన బుద్ధిగలవాడను, నుతింపగల్గినా అవి నీ ఆది అంతాలను మాత్రం వర్ణింపలేవు. అంతేకాదు ఆ బ్రహ్మాదులకు కూడ నిన్ను వర్ణింపసాధ్యమా? అందుచేత సేవా ధర్మమే మేలని నేను నీ శ్రీపాదపద్మాలను సేవించాను. నాకు ఈ లోకంలో జననమరణాలు వల్ల కలిగే దుఃఖాలు లేకుండా చేయవయ్యా! బ్రహ్మజ్ఞానంలో పరవశుడనై లోకులెవ్వరూ ఎరుగని మోక్షపద సౌఖ్యాన్ని అనుభవించే వరమిమ్ము’. అని ప్రార్థించింది.
ఆ ప్రార్థన విన్న కైలాసాధిపతి వెంటనే ఆ ఊర్ణనాభమును (సాలి పురువును) దశదిశలా వ్యాపించే తన మహాతేజంలో విలీనం చేసుకొన్నాడు. దానిని చూచి నిత్యం తాము చేసే శివార్చనల్ని దేవతలు నిందించుకొన్నారు. సురలు- మునులు- దానవులు- మానవులు- సర్పరాజులు అందరు మ్రొక్కుతూ ధ్రువమండల వీథి వరకు వ్యాపించే రీతిగా సన్నుతులు చేసారు. దిగంతాల వరకు వ్యాపించిన తన దివ్యతేజస్సులో ఈశ్వరుడు ఆ సాలిపురుగును ఐక్యం చేసుకొన్నాడు. ఇది లూతాధీశ్వరుని (శ్రేష్ఠమైన సాలిపురుగు) కద. సర్పం మరియు హస్తి కదలను కూడ వివరిస్తాను. అవి పాపపు పర్వతాలకు వజ్రాయుధం వంటివి. అని పలికి ఈశ్వరుడు కాళహస్తుల కథలను ఇలా చెప్పనారంభించాడు.
కాళ-హస్తి కథలు
త్రేతాయుగంలో ఒక కాళమనే సర్పం పాతాళలోకం నుండి దివ్యమాణిక్యాలను తెచ్చి చంద్రశేఖరుని పూజించేది. ఆ విధంగా అది ఆ యుగాంతం వరకూ పూజిస్తూ వుంది. పి మ్మట ద్వాపర యుగారంభం లో ఒక ఏనుగు అదే ప్రదేశం లోని ఈశ్వరుని పూజించేం దుకు వచ్చింది. అది సువర్ణ ముఖరీ నదిలో స్నానం చేసేది. అడవులన్నీ తిరిగి మారేడు దళాలను, కొలనులు తిరిగి తామరలను, ఎఱ్ఱకలువలను - నల్ల కలువలను కోసి తెచ్చేది. ముందు దినం పాము సమర్పించిన మణుల్ని తొండంతో తెచ్చిన నీటితో తొలగించేది. తాను తెచ్చిన పుష్పాదులను కైలాసవాసుని శిరంపై ఉంచేది. ఈ విధంగా ఆ గజం శివుని పూజలు చేసి పోతూ వుండేది. మరునాడు ఆ సర్పరాజు కారు చీకట్లను తొలగించే సూర్యుడికి తోడుగా తన శిరోమణి కాంతులతో చీకట్లను తొలగిస్తూ ఉదయానే్న వచ్చి ఏనుగు చేసిన పూజను చూచి ఇలా భావించింది. ‘అయ్యో! ఎవడో గాని శివలింగం మీద ఉంచిన రత్నాలను కంపల్లో కలిపి వేసి ములుకంపలు, తీగెలు తెచ్చి పెట్టాడు. శివునకీ విధంగా అపచారం చేసాడు. నా అదృష్టాన్ని ఈ రీతిగా మంటగల్పిన ఆ మదాంధుని ఏమని అనాలి’? అని అనుకొని మెల్లగా ఏనుగు పెట్టిన వాని నన్నింటిని పాము తొలగించేది. ఈర్ష్యతో కూడిన భక్తితో ఆ సర్పం మరల గౌరీవల్లభుని మణులతో పూజించేది.
అంత కొంత సమయం తరువాత ఆ గజరాజు వచ్చి రత్నాలతో అలంకరింపబడిన ఈశ్వరుని చూచి ఎవ్వడో నేడు అజ్ఞానాంధకారం చేత వెఱ్ఱి మొఱ్ఱి పూజలు చేసాడు. అతడు మతి చలించిన వాడు కాబోలు కాకుంటే రంగు రంగుల రాళ్లను కపర్దికి (శివునకు) పెట్ట చూస్తాడా? అని విచారించి పూర్వం వలె శివపూజ చేసి ఏనుగు వెళ్లిపోయింది.
మరునాడు ఉదయాననే పాము శివుని పూజించేందుకు వచ్చి యథాప్రకారంగా శివలింగం మారేడు, కాడలతో కూడిన తామరలు, కలువలతో కప్పబడి యుండటం చూచి ‘నాజన్మ వృథాయే కదా. ఆలోచింపగా నాతపస్సు, భక్తి రేపు కూడ ఇదే రీతిగా వ్యర్థమయితే? ఇక చూచెదగాక. ఈ దుర్మార్గుడు ఎక్కడివాడోగాని నేను చేసిన రత్నాల పూజను నలుదిక్కుల విసరి వైచి చెట్లకొమ్మలు - తామరతూళ్లు ఎన్నింటినో తెచ్చి శివలింగం మీద పెట్టాడు. ఆవిధంగా చేసినా శంకరుడు మిన్నకున్నాడు. దైవం కూడ పగవానితో జత కూడింది కదా ! దేవా ! ఈ కంటకాలు ఏ విధంగా భరించేది అనకుండ పులకాంకురాలతో (శరీరంమీద సంతోషంతో వెంట్రుకలు పైకి లేచుట) కూడిన లతల వంటి బాహువుల కల పార్వతి కౌగిలి అనుభవించిన నీవు ముళ్లు-తామరతూడులు కల పూజను ఎట్లు భరించావు? ఓ ముక్కంటి ! నీనొసటి కంటికి గల మాహాత్మ్యాన్ని ఎరుగవా?’ అని దుఃఖించింది. ఎట్టకేలకు దృఢమైన చిత్తంతో తన ప్రభువుకు అర్చన చేయదలంచి, ఆ పాము ఏనుగు చేసిన పూజలను త్రోసివేసింది. తొండంతో బుస్సున ఊది పైపై దుమ్మును తొలగించింది. తాను తెచ్చిన అమూల్యమైన రత్నాలతో లింగాన్ని పూజించింది. కాని తాను చేస్తున్న పూజ ఆ విధంగా విఫలం అవుతూ ఉండటం చేత మిక్కిలి దుఃఖిస్తూ శత్రువుని నిందిస్తూ తన నివాసానికి పాము వెళ్లిపోయింది. కాని భోగవతి అనే నదిలో తన భార్యలతో కలిసి చేసే జల క్రీడల్ని విసర్జించింది. వానినే కాదు తన వనితలతో కలిసి మధురాహారాలను భుజించే వినోదాన్ని విడిచి పెట్టింది. బహువిధమైన రాగతానాలతో సుసంపన్నమైన గానాన్ని విని ఆనందించే తన నిత్యవినోదాన్ని పరిత్యజించింది. మెత్తని తన పర్యంకాల మీద భార్యామణితో సాగించే రతి క్రీడావినోదాన్ని మానివేసింది. నిద్రసుఖాన్ని మరచిపోయింది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512