డైలీ సీరియల్

మరకతాలు.. బిల్వపత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి దినం తాను చేసే రత్నపూజ శివుని మీద నిలిచియుండక పోవడానే్న చింతిస్తూ రాత్రి శివరాత్రిగా జాగరం చేసింది.
ఆ రీతిగా సర్పం తాను పూజించిన తరువాత శివుని పూజించేందుకు ఆ మత్త్భేం వచ్చింది. వచ్చి ముందు దినంలో శివుని మీద అనేక రత్నాలుండటాన్ని చూచి మిక్కిలి చిన్నబోయింది. తనలో ఇలా అనుకొంది. ‘ఎవ్వడో గాని నామీద పట్టుదలతో కాబోలు ఈవిశ్వనాథునిపై ఈ శిలల్ని పేరుస్తున్నాడు. అచ్చపు నీలవర్ణమైన ఈ నల్లనిరాళ్లు నల్లని కల్వరేకులా? పచ్చని రాళ్లు బిల్వపత్రాలా? ఎఱ్ఱని రాళ్ల ముక్కలు విచ్చిన ఎఱ్ఱ తామరలా? ఓ విశ్వపతీ ! కఠినమైన ఈశిలలు నీకే విధంగా ఇష్టమయ్యాయి? వానికి మంచి సువాసన-మృదుత్వం-చల్లదనం లక్షణాలు అబ్బుతాయా? నీవుండేది రాళ్లపర్వతం. భార్యామణి పర్వతరాజపుత్రి. నీధనుస్సు కూడ పర్వతమే (మేరుపర్వతం) ఓ త్రిపురాసురసంహార! భూమే రథంగా గలవాడా! ఈ రాతిముక్కల నగ నీకు ఎట్లు ప్రియమయ్యింది? నా వ్రతాన్ని భంగం చేసే దురాత్ముడుండగా ఇక నిన్ను నేనేమంటాను? పోనీ నేడేదో అయింది. అతడు దుర్బుద్ధితో ప్రవర్తించాడు. సరే. దీనికి విచారింపనేల? నిత్యం శివుని కొలిచే సమయాన గాక ఉదయానే్న వస్తాను. నా పూజా వ్రతాన్ని భంగం చేసే ఆ దుర్మార్గుడు నాకు కనబడితే అది నా భాగ్యమే. వాడో నేనో ఒకరే నిన్ను పూజిస్తాము. లేదా నా బ్రతుకెందుకు? నా ప్రాణాలను ఆ ఈశ్వరుడికే అర్పిస్తాను. రేపు పూజకు వస్తాను. అప్పుడు పాషాణాలు ఉండవచ్చు. అందుకు సందేహం లేదు. ఇక ఆలోచన దేనికి? ప్రాణాల మీద తీపి గల జీవులకు బిరుదులు మరియు వ్రతాలు శుభాన్ని కలిగిస్తాయా?’ అంటూ పలుకుతూ ఆ గజరాజు యథావిధిగా శివుని పూజించింది.
అయినా ప్రతి దినమూ ప్రాణమైన శివలింగానికి తాను చేసే పూజకు కలిగే విఘ్నం వలన కలిగిన విచారమనే జ్వరం ఆ మదగజాన్ని పట్టి పీడించింది. దానివలన నిత్యమూ తాను ఆడ ఏనుగుల వెంటబడి జత కట్టకపోవడం చేత కలిగే విరహతాపం విబలుగనే లేదు. తుండంతో తన మీద నీరు చల్లుకోకపోయినా సూర్యుని వలన కలిగే వేడి తొలగిపోయింది. సరస్సులలో చేరి తామర తూళ్లను తినకపోవడం వలన కలిగే ఆకలిబాధ కలుగనేలేదు. సింహపు పిల్లలు గర్జింపులకు పుట్టే భయమే కలుగలేదు. బయట ఉండే ఏ వేడిమి కూడ దాని శరీరంలో ప్రవేశించనేలేక చెల్లాచెదరైపోయింది. ‘‘ఇక ఏమి చేయాలి’’ అని తలంచి తన నివాసానికి ఆ గజరాజం వెళ్లిపోయింది. ఎప్పుడు సూర్యుడు పడమటి కొండ నెక్కగలడు. తిరిగి ఎప్పుడు తూర్పుకొండపై ఉదయిస్తాడు. ఎప్పుడు మరల శివపూజకు నేను పోతాను. అనే చింతనలో అ మత్త్భేం మునిగిపోయింది.
సూర్యాస్తమయ వర్ణన
అంతట పశ్చిమాద్రిపై భానుబింబం అస్తమించింది. అది చాల మనోహరమై ఉంది. అది తూర్పుకాంత విసరగా దాన్ని పశ్చిమదిక్కాంత పట్టిన చెంగల్వబంతిలా మనోజ్ఞంగా ఉంది. కాలమనే విష్ణువు చీకటి అనే రాక్షసుని తునుమడానికై విసరగా పడమటి కొండవెంట బడి పోవు చక్రాయుధమో అన్నట్లు రమణీయమైయుంది. దినమనే చెట్టునుండి ఎఱ్ఱగా పండి రాలిపడిన పండేమో అన్నట్లు కాషాయమయమై ఆకర్షణీయంగా ఉంది. దివి నుండి దేవదానవయుద్ధంలో రక్తంతో తడిసి క్రిందపడిన రధచక్రమే మో అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంది. భార్యామణియైన పద్మినిని (తామర) కూడి రతిసౌఖ్యం పొందిన తరువాత శ్రమను పోగొట్టుకోవడానికి సంధ్యారాగమనే చంద్రకావి (ఎరుపు) రంగు శాలువ నేలపై పెట్టి స్నానం చేస్తున్న విధంగా సూర్యుడస్తమించాడు.
అస్తమించే ఆ సూర్యుడు నీటికాసుల నేత్రరోగం చేత ఎర్రబడిన నేత్రం ఎర్ర కలువగా అయినట్లుగా ప్రకాశించాడు. అలా ఎర్రనికాంతి కనుగ్రుడ్లలో (తారాలోకం) వ్యాపించడం చేత కంటిలో గ్రుడ్డితనం (చీకట్లు) ఆవరించినట్లు సూర్యుని సంధ్యారుణకాంతి తారాలోక(నక్షత్రమండలం)మంతట వ్యాపించడం చేత ఆ నక్షత్రాల (తారల) తెల్లనికాంతి (ఆలోకం) హీనమై లోకమంతట చీకట్లు వ్యాపించాయి. అంతేకాక నేత్రరోగం వలన కంటినుండి నీరు కారే విధంగా సూర్యుడు పడమటి సముద్రంలో మునకవేయగా ఉవ్వెత్తున పైకెగసిన నీరు ప్రకాశించింది. ఆ రీతిగా రోగగ్రస్తమై ఎర్ర కలువగా మారిన నేత్రం మనుష్యులను గ్రుడ్డివారినిగా చేసే విధంగా జగత్తునకు కన్ను అయిన సూర్యుడు లోకాన్ని గ్రుడ్డిదానిగా చేస్తూ చీకట్లు వ్యాపింపచేసి అస్తమించాడు. సూర్యుని ఈ దీనస్థితిని చూచి తమకు ప్రియుడైన చంద్రుడు ఇక ఉదయిస్తాడనే సంతోషంతో ఎర్రకలువలు పకపకనవ్వుతూ సూర్యుణ్ణి పరిహసించాయి.
చీకట్లనే సర్పసమూహాన్ని గుహల్లో నుండి బయటకు తరిమి వేసి దానిని నింగి నెక్కిచూస్తూ తాను పాతాళలోకం ప్రవేశిస్తున్నట్లుగా సూర్యుడు పడమటి సముద్రంలో మునిగాడు. ఆ సూర్యుని కిరణసేనలు చీకట్లు శిథిలమయ్యే విధంగా యుద్ధంచేసి తిరిగి సూర్యుని వెంట వెళ్లిపోగానే అవి భూమంతా వ్యాపించినట్లుగా దట్టంగా చీకట్లు కమ్ముకొన్నాయి.
భూమి అనే పాదు (నీరు ప్రక్కలకు పోకుండ చెట్లమొదళ్ల చుట్టు మట్టి తీసివేయగా ఏర్పడినది) నిండిపోగా, శైలగుహలలో వేళ్లు గట్టిగ నాటుకొని కొమ్మలు దిగంతాల వరకు వ్యాపించి నింగి వరకు పైకెగసిన దట్టపు చీకటి అనే వృక్షం వర్తులాకారంగా విస్తరించింది. ఆకాశంలోని నక్షత్రాలు ఆ చెట్ల ఆకుల సందుల నుండి కనిపించే పైలోకాలలోని భవనాలలో వెలిగే దీపాలుగా ప్రకాశించాయి.
చంద్రోదయ వర్ణన
షోడశ కళాపూర్ణుడయిన చంద్రుని ధరించిన శివుడు నీలవర్ణుడైన విష్ణువే అని తెలిపే విధంగా లోకమంతట చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఆ భగవానుడికి దేవతలు అర్పించిన పూజా పుష్పాలేమో నన్నట్లు నక్షత్రాలుదయించాయి.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512