డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మో.. అంత శిక్ష భరించలేను. ఇకనుంచి నువ్వు మాట్లాడమన్నపుడు తప్ప నోరెత్తను. సరేనా?’’
‘‘ఉహూ.. నువ్వు కీ ఇస్తే ఆడే బొమ్మలా ఉండేటట్టయితే ఇట్నించిటే ఇంటికి వెళ్లిపోదాం..’’ అందామె ఆట పట్టిస్తూ.
‘‘సరే.. సరే.. అప్పుడప్పుడూ మాత్రమే నువ్వు చెప్పినట్టు నడుచుకుంటూ ఎక్కువసార్లు నేను స్వయంగా ఆలోచించే ఏ పనైనా చేస్తాను, సరేనా?’’ అన్నాడు.
ఆమె ఏదో మాట్లాడేలోగా రైలు వస్తున్న ప్రకటన వినిపించింది లౌడ్ స్పీకర్‌లో. బోగీ నెంబర్లు చూసుకుంటూ తమ బోగీ వద్దకు చేరి తలుపు పక్కన అంటించి ఉన్న రిజర్వేషన్ లిస్ట్‌వైపు చూసి వేలితో పైనుంచి క్రిందికి పేర్లు చెక్ చేయసాగాడు సామ్రాట్.
సామ్రాట్ ‘‘పద.. పద’’ అంటూ కంపార్ట్‌మెంట్‌లోకి దారితీశాడు సామ్రాట్.
ట్రైన్‌లో చుట్టూ పరికించి చూసిన అతడికి ఎవరి పనిలో వారు మునిగి ఉండడం కనిపించింది. తేలిక పడిన మనసుతో తలను మరోవైపు యధాలాపంగా తిప్పి, తిరిగి సాహిత్య వైపు చూసేలోపు అతడి దృష్టినో వ్యక్తి ఆకర్షించాడు.
అతడూ తనలా వయసులో ఉన్నవాడే! అతడి చూపులు మాత్రం సాహిత్యను నఖశిఖ పర్యంతమూ శల్య పరీక్ష చేస్తున్నాయి.
ఎప్పుడూ ఆడదాన్ని చూడని వాడిలా.. రెప్ప వేయకుండా ఆమె వైపే ఆబగా.. దృష్టి మరల్చకుండా నిర్నిమేషంగా ఆమెనే చూస్తున్నాడతడు.
ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న కోపాన్ని అదుపు చేసుకుంటూ ఒక్క క్షణం ఆలోచించి ‘సాహిత్యా’ అని పిలిచాడు. అతడిమీద కోపంగా ఉన్న సాహిత్యకు అతడి పిలుపు వినబడలేదు.
మళ్లీ పిలిచాడు సామ్రాట్.
ఈసారి తల తిప్పి చూసింది సాహిత్య, ‘పిలిచావా?’ అంటూ.
‘‘ఆ.. ఇటువైపు కూర్చుంటావా?’’ అన్నాడు సామ్రాట్ తను కూర్చున్న వైపు చూపిస్తూ.
‘‘ఏం నేను కూర్చున్న సీట్లో ఏమైనా ప్రత్యేకత ఉందా?’’ అంది సాహిత్య.
‘‘ఉహూ.. ఏం లేదు.. ఊరకే! నాకు ట్రైన్ వెళ్ళే దిశకు వ్యతిరేక దిశలో కూర్చుని ప్రయాణించడమంటే ఇష్టం’’ అని నసిగాడు సామ్రాట్. నిజం చెపితే ఆమె మళ్లీ విరుచుకుపడుతుందని నిస్సందేహంగా తెలుసు కనుక.
‘‘ఊ... నీ కోరికలన్నీ చిత్రమైనవే! ఈరోజైతే నీ కోరికలు మరీ విచిత్రంగా ఉన్నాయి’’ అంటూ తాను కూర్చున్న చోటునుంచి లేచి అతడు కూర్చున్న చోటుకు మారింది సాహిత్య.
ఆమె ఖాళీ చేసిన సీటులో కూర్చుని కను కొసలనుంచి అంతవరకూ సాహిత్యను అంగాంగ వీక్షణ చేసిన వ్యక్తి వైపు చూశాడు సామ్రాట్.
ఆ వ్యక్తి మొహంలో చేతికి చిక్కిన అదృష్టమేదో చేజారిపోయిందనే భావన స్పష్టంగా కనబడడంతో ఆ ప్రయాణంలో తొలి విజయం సాధించినట్టుగా మనసులోనే తృప్తిగా నిట్టూర్చాడు.
సామ్రాట్ ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తోన్న సాహిత్య అడగనే అడిగింది, ‘‘ఏవిటి సామ్రాట్.. ఇంతకుముందు నేనన్న మాటలకు ఇప్పటివరకూ గంటు మొహం పెట్టుకుని కూర్చున్నవాడివి ఇంతలోనే అంత సంబరపడిపోతున్నావేమిటి?’’
‘‘నేనేదైనా అంటే నిన్ను పొగుడుతున్నానంటావ్! అందుకే నీతో నిజం చెప్పాలంటేనే భయం వేస్తోంది’’
‘‘్ఫర్వాలేదు. ఇక ముందలా అనని అభయహస్తం ఇస్తున్నాను’’ అంటూ చేతిని పైకెత్తి అభయహస్తముద్ర నభినయించింది సాహిత్య.
‘‘నువ్వా మాత్రం భరోసా ఇవ్వాలేగానీ ఇక రెచ్చిపోనూ?’’ అన్నాడు సామ్రాట్, ఆమె ఎప్పటిలానే మామూలుగా మాట్లాడడంతో.
కాస్సేపటికి ట్రైన్ ఒక స్టేషన్‌లో ఆగింది. ఎక్కేవాళ్లూ, దిగేవాళ్లతో కాస్సేపు హడావుడిగా మారింది ట్రైన్ లోపలి వాతావరణం. ఈసారి వారి చుట్టు పక్కల ప్రయాణికులు మారారు.
అది గమనించిన సామ్రాట్ అన్నాడు కసిగా ‘‘రిజర్వేషన్ కంపార్ట్‌మెంటే అయినా గంట, రెండు గంటలు ప్రయాణం చేసేవాళ్లు కూడా వీలు చూసుకునో, వీలు చేసుకునో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుల మధ్య పళ్లికిలిస్తూ కూర్చుని వారి స్టేషన్ రాగానే దిగిపోవడం ఒక అలవాటుగా మారిపోయింది మన దేశంలో.
అతడలా అన్న వెంటనే ఎవరో పంపించినట్టుగా తట్టా బుట్టా జాగ్రత్తగా చెరో చేత్తోనూ పట్టుకుని ఒక అరవై ఏళ్ల వయసున్న ఆవిడ సామ్రాట్, సాహిత్యలకు దగ్గరగా వచ్చి నిల్చుంది.
ఆవిడ ఓసారి సామ్రాట్ వైపు, మరోసారి సాహిత్య వైపూ మార్చి మార్చి చూసి ‘‘పెద్ద ముండాదాన్ని.. కీళ్ల నొప్పులతో ఎక్కువేపు నిలబడలేను. వచ్చే స్టేషన్‌లో దిగిపోతాను. కాస్త చోటిస్తారా?’’ అంది.
ఆమె చూపుల్లో దినత్వానికి, కీళ్లనొప్పులతో బాధపడుతోన్న పెద్దమ్మ సామ్రాట్‌కూ, అమ్మమ్మ సాహిత్యకూ కళ్లముందు మెదలడంతో అప్రయత్నంగా జరిగి ఆమెకు చోటిచ్చారు.
‘‘మా నాయనే.. మా తల్లే..’’ అంటూ వాళ్ళనాశీర్వదిస్తూ వాళ్లమధ్య చోటుచేసుకుని కూర్చుందావిడ. తన సీటు పదిలం అని ఖాయపరచుకున్నాక తన గళం విప్పిందావిడ ‘‘ఎక్కడిదాకా అబ్బాయ్!’’ అంటూ. చెప్పాడు సామ్రాట్.
సాహిత్య చేయి పట్టుకుని గాజుల మీద వ్రేళ్లతో సుతారంగా రాస్తూ, ‘‘రాళ్ల గాజులు చాలా బావున్నాయమ్మాయ్.. మీ పుట్టింటివాళ్లు పెట్టారా? మీ ఆయన చేయించాడా? అని సామ్రాట్ వైపోసారి చూసి తిరిగి సాహిత్యవైపు చూసింది. ‘‘నేనే చేయించుకున్నానండీ!’’ అంది సాహిత్య.
-ఇంకా ఉంది

సీతాసత్య