డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదురుచూడని ఆ సమాధానానికి ఓ క్షణం నివ్వెరపోయి ‘‘అదేవిటమ్మాయ్.. నీ గాజులు నువ్వు చేయించుకోవడమేమిటి?’’ అని మళ్లీ ‘‘అవునులే.. పెద్ద ఉద్యోగమేదో చేస్తూండి వుంటావు. నీ జీతం డబ్బుల్తోనే నీకు నచ్చిన గాజులు చేయించుకుని ఉండుంటావు.
మా రోజుల్లో మాకంత అవకాశం ఎక్కడుందమ్మా.. ముక్కుకు చిన్న ముక్కుపుడక అమర్చుకోవాలన్నా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా అయినా అదృష్టవంతులే! పోనీలే.. సంతోషం! ఇద్దరే ప్రయాణం చేస్తున్నారు. ఇంకా పిల్లలు లేరా?!’’ అందావిడ.
సామ్రాట్, సాహిత్యా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఇబ్బందిగా.
‘‘అవునులే అమ్మా.. మీరేమీ మాలా పాతతరం వాళ్లు కాదు కదా! పిల్లలు ఇప్పుడప్పుడే వద్దనుకుని ఉంటారు.
మరీ ఎక్కువ కాలం వాయిదా వెయ్యకండి. మా బంధువుల్లో ఒకమ్మాయి ఇలానే తొందరగా పిల్లలు పుడితే అందం చెడిపోతుందని ఏవేవో మందులూ మాకు వాడి చాలా కాలం ఆలస్యం చేసింది.
తర్వాత కావాలని ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ ఆ అమ్మాయికి సంతాన యోగం కలగలేదు. అందరికీ అలా అవుతుందని కాదుగానీ, ఏదో మనసుండబట్టలేక చెప్పాను. మరోలా అనుకోకండి’’’ అంటూ చెరో చేత్తోనూ సామ్రాట్, సాహిత్య చేతుల్ని పట్టుకుంది ఆమె.
సాహిత్య ఓ వెర్రి నవ్వు నవ్వింది.
సాహిత్య నవ్వు మొహం చూసి సామ్రాట్ ధైర్యం తెచ్చుకుని ‘‘అలానే మామ్మగారూ.. మీ సలహా తప్పకుండా పాటిస్తాం...’’ అని సాహిత్య వైపు చూసి ఆమె కొరగా చూడ్డంతో తల దించుకున్నాడు.
తర్వాతి స్టేషన్ వచ్చేవరకూ భార్యాభర్తలు సుఖంగా కాపురం చేయాలంటే ఏం చేయాలో, ఎలా వుండాలో వివరంగా చెప్పి పుణ్యం కట్టుకుందావిడ.
ఆవిడ ఇంకా రైలు దిగీ దిగకుండానే ‘‘ఏవిటీ.. ఇందాక ఏదేదో మాట్లాడ్తున్నావ్! ఆవిడ ప్రతి మాటకూ బుద్ధిమంతుడైన బాలుడిలా.. నీ మాటలకు నేనేమనుకుంటానో అని కూడా పట్టించుకోకుండా నీ ధోరణిలో ఏదేదో చెప్తూ కాలక్షేపం చేశావు. ఆవిడ కంపెనీ అంత బావుందా నీకూ!’’ అంది సాహిత్య నిలదీస్తూ.
‘‘ఆవిడ మనల్ని భార్యాభర్తలుగా భావించి పెద్దదానిలా అయాచితంగా సలహాలిస్తోంటే తప్పేముందని నేను తగిన విధంగా సమాధానాలిచ్చాను. అయినా అదంతా ఉత్తుత్తిదే కదా!’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహూ.. నీ మాటలు ఉత్తుత్తి మాటల్లా లేవు. ఆవిడ మనిద్దర్నీ భార్యాభర్తలుగా భావించి మాట్లాడితే నువ్వు మనం నిజంగా భార్యాభర్తలమని భ్రమించినట్టుగా మాట్లాడావు. నేను గమనించలేదనుకోకు’’ అంది సాహిత్య.
రెండు అరచేతుల్నీ చెంపలమీద ఉంచుకుని ‘లెంపలు వాయించుకోనా?’ అన్నాడు సామ్రాట్.
‘‘ఊ.. మాట్లాడకూడని మాటలు మాట్లాడడం.. తర్వాత దీనంగా చూడడం నీకలవాటేగా! వచ్చే స్టేషన్‌లో మనం తినేందుకు ఏదో ఒకటి సంపాదించు. త్వరగా ఆ పని ముగించి ఎవరి బెర్తును వాళ్లు అధిరోహించుదాం’’ అంది సాహిత్య.
‘‘అప్పుడేనా?’’ అన్నట్టుగా చూశాడు సామ్రాట్.
‘‘మైసూర్‌లో దిగాక మనం చేసేదేం ఉందీ?’
’ నీకు నిద్ర పట్టకపోతే రేపేం చేయాలో ఆలోచిస్తూ పడుకో. అదిగో ఏదో స్టేషన్ వస్తోంది’’ అంది సాహిత్య.
రైలు ఆగిన వెంటనే క్రిందకు దిగి రెండు నిముషాల్లో చెరో చేత్తోనూ చెరో ప్యాకెట్ పట్టుకుని లోపలికి వచ్చాడు సామ్రాట్. అతడు తెచ్చిన పదార్థాల్ని రుచి చూసి అంది సాహిత్య. ‘‘ఇంతకుముందు ప్లాట్‌ఫాంమీద కాఫీ త్రాగినపుడు నేను ఇచ్చిన కాంప్లిమెంట్‌ను ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను.
రైల్వేలు ఎప్పటికైనా బాగుపడతాయేమోగానీ, రైళ్లలో ప్రయాణికులకు అందే ఆహారం మాత్రం మనం బ్రతికుండగా బాగుపడదు’’
‘‘చాలా వెదికాను సాహిత్యా. ఇంతకంటే మంచి ఐటెమ్స్ దొరకనేలేదు’’ అన్నాడు సామ్రాట్ నొచ్చుకుంటూ.
‘‘నువ్వు వివరణ ఇవ్వకముందే నేను శపించేశానుగా! ఇక మనం తినే ఆహారపు రుచి ఎలా ఉన్నా మనల్ని బాధించదు’’ అంటూ నవ్వింది సాహిత్య.
సామ్రాట్ కూడా మనఃస్ఫూర్తిగా నవ్వి, ‘‘పడుకుంటావా సాహిత్యా..’’ అన్నాడు.
‘‘ఊ.. ఊ.. నా బెర్తు ఖాళీ చేసేయ్ త్వరగా..’’ అంది సాహిత్య.
***
ఉదయం మెలకువ వచ్చేసరికి అప్పుడే తెలవారుతూ ఉంది. రైల్లో అక్కడక్కడా బెర్తులు ఖాళీ అయ్యాయి. సామ్రాట్ తన బెర్తుమీదినుంచి క్రిందికి దిగేసరికి అప్పటికే లేచి మొహం కడుక్కున్న సాహిత్య మొహం ఎంతో తాజాగా కళకళలాడుతోంది.
అతణ్ణి చూసి నవ్వి అంది సామ్రాజ్ఞి ‘‘రాత్రి నిద్ర రాలేదన్న వాడివి క్షణాలమీద శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోవడమే కాకుండా నా నిద్ర కూడా పాడుచేశావు’’.
‘‘నిజమా.. నేను గురక పెట్టానా?’’ అని ఆశ్చర్యపోయాడు సామ్రాట్.
‘‘ఏం సామ్రాజ్ఞి ఎప్పుడూ చెప్పలేదా నీకీ విషయం?’’
‘‘హు.. అంత అవకాశమేదీ! రోజూ నాకంటే ముందే తను నిద్రపోతుంది. తనింకా నిద్రలో ఉండగానే నేను లేచిపోతాను. ఇక నా గురక గురించి చెప్పే అవకాశం సామ్రాజ్ఞికేదీ!?’’
‘‘బానే వుంది మీ ఇద్దరి ప్రహసనం! ఇక సామాన్లు సర్దు. కొద్దిసేపట్లో వైజాగ్ వచ్చేస్తుంది’’ అంది సాహిత్య.
ఆమె సూచనను అక్షరాలా అమలులో పెట్టి ఇద్దరి బ్యాగ్‌లూ సర్ది సిద్ధంగా ఉంచాడు సామ్రాట్.

-ఇంకా ఉంది

సీతాసత్య