డైలీ సీరియల్

నత్కీరుని శరణు.. శరవణుని అభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నత్కీరుని సుబ్రహ్మణ్య స్వామి రక్షించుట
‘తారకాసురుని సంహారం చేసిన వాడూ, మహా శక్త్యాయుధాన్ని చేత ధరించినవాడూ, మయూర వాహనుడూ, దీనజనుల పాలిటి కల్పవృక్షమూ, ఆరుముఖాలతో చేసిన అట్టహాసధ్వని చేత దిగంతాలను పగులగొట్టిన వాడూ, అయిన సుబ్రహ్మణ్యస్వామి ఈ బ్రహ్మరాక్షసుని బట్టి సంహారం చేసి దయతో ఇందలి వారందరిని రక్షించుగాక. తారకాసురుని సంహారం చేసిన మహాప్రతాపశాలియైన ఆ షణ్ముఖుడికి ఈ భూతాన్ని చంపడమన్నది ఏమంత గొప్పవిషయం? వజ్రాయుధాన్ని పోలిన ‘శక్తి ఆయుధంతో’ క్రౌంచపర్వతాన్ని చీల్చి వేసిన ఆ స్వామికి ఈ కొండ గుహను చెండాడటం ఏమంత ఘనకార్యం? దేవతల బాధలనే తొలగించిన ఆ కరుణామూర్తికి ఈ గుహలో చిక్కిన మనుష్యుల్ని రక్షించడం ఒక పెద్దపనియా?
ఈ ప్రకారంగా అనేక రీతులుగా ఇష్టదేవతా శ్రేష్ఠుడూ, భక్తశరణ్యుడూ అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆ నత్కీరుడు అచట గల బ్రాహ్మణజనహితార్థంగా ప్రార్థించాడు. అంతట కరుణాతరంగి- తాంతరంగుడై ఆ సుబ్రహ్మణ్యస్వామి ఆ భూతాన్ని నేలకొరిగే విధంగా ఎడమచేత చరచి గుహద్వారంలో ఉంచిన రాతిని లాగి వేసి అందున్న వారందరిని బయటకు రండని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారంతా మనస్సులలో సంతోషపడుతూ ఇందుశేఖర కుమారు డయిన షణ్ముఖుడికి నమస్కరించి వెళ్లిపోయారు. నత్కీర కవిచంద్రుడు మాత్రం తిరిగి తిరిగి అనేక నమస్కారాల్ని చేస్తూ నిలువబడే యున్నాడు. ఆయనను చూచి ప్రసన్నవదనంతో కుమారస్వామి ‘నీవిచ్చటకు రాకారణ మేమిటి?’ అని ప్రశ్నించాడు. దానికి నత్కీరుడిలా విన్నవించాడు.
‘ఓ శరణాగతవత్సలా! కాశవనంలో (రెల్లువనంలో) జన్మించిన వాడా! దీనుల పాలిట కల్ప వృక్షమా! ఆపదల్ని నాశనం చేయువాడా! పాపపు పర్వతాలను ఛేదించే ఇంద్రుడా ! నన్ను దయ చూడు. నాకు సుఖం కలుగుతుంది. శివుడు నేనొక తప్పుపని చేయడం వలన కుష్ఠరోగవ్యాధి పీడితుడవు కమ్మని శపించాడు. ఆ శాపానికి విమోచనంగా నిజనివాసమైన కైలాసాన్ని దర్శిస్తే కుష్ఠవ్యాధి తొలగి పోతుందని ఆనతిచ్చాడు. ఆ కైలాసమార్గం చాలా దుర్గమమైనది. ఇక నేనేమి చేయగలను? ఆ కైలాసాన్ని నేనేవిధంగా దర్శించగలను? దర్శించిన గాని దుఃఖకరమైన ఈ రోగసముద్రాన్ని ఎలా దాటజాలను.’ ఆ నత్కీరుని మాటలు విని పార్వతీ తనయుడు ఈశ్వరుడు కైలాసాన్ని దర్శించ మన్నాడే గాని అది దక్షిణ దిశలోనిదా ఉత్తర దిశలోనిదా అని నిర్దేశించలేదు కదా. కాబట్టి దక్షిణకైలాసాన్ని చూచినా చాలు. కుష్ఠవ్యాధి తీరిపోగలదు. అని తన మనస్సులో భావించి అచటకు సులభంగా చేరే ఉపాయాన్ని ఆలోచించాడు. తన మాహాత్మ్యాన్ని కనబడ నీయక అచటి కొను మహిమ యే అన్నట్లుగా ఆ కొలనులో స్నానం చేయుమని ఆడబోవు తీర్థం ఎదురుకాగలదని శివ కుమారుడు నత్కీరుని ఆదేశించాడు.
నత్కీరుడు శివసాయుజ్యం పొందుట
సేనాని (కుమారస్వామి) వచనామృతాన్ని అప్పుడు నత్కీరుడు చెవులార గ్రోలి అత్యంత నిష్ఠతో ఆ కొలనులో స్నానార్థం మునిగి తలయెత్తి చూడగా ఎదురుగా సువర్ణముఖ రీనది తీరంలో దక్షిణకైలాస పర్వతమైన శ్రీ కాళహస్తి దర్శనమిచ్చింది. అప్పుడా నత్కీరమహాకవికి కుష్ఠవ్యాధి పూర్తిగా తొలగి పోయింది. శివదీక్షాతత్పరుడై అతడు దక్షిణకైలాసంలోని సువర్ణముఖరీనదిలో స్నానమాడి అచటగల గిరిజాధీశ్వరుని స్తుతిస్తూ తమిళ భాషలో నూరు పద్యాల్ని రచించాడు.
ఆ నూరు పద్యాల్ని విని సేనానీ జనకుడునూ, ఆర్తుల పాలిటి చింతామణియూ, సకలవిద్యా నిధియూ, జ్ఞానప్రసూనాంబా నాథుడునూ అయిన శ్రీకాళహస్తీశ్వరుడు మిక్కిలి సంప్రీతుడై ప్రత్యక్ష మయి సాహిత్య శ్రీవర! నీ జన్మ ధన్యమయ్యింది. నీకిష్టమైన వరాన్ని కోరుకో. నీకు అభయ మిస్తున్నాను. అన్నాడు. వెంటనే నత్కీరుడు పరంజ్యోతి అయిన శివునకు మ్రొక్కి సంతోష మనస్కుడై నత్కీరుడు ఫాలతలంపై (నుదురు) అంజలి ఘటించి ఒడలిపై గగుర్పాటు కలుగగా వణుకుతున్న కంఠంతో శివుని ఇలా స్తుతించాడు.
‘‘దేవా! ఈ సంసారం ఆనందాన్ని పోలిన దుఃఖానికి నిలయం. దీనిని విడిస్తే ఏ బ్రహ్మానందం కలుగుతుందో నాకా బ్రహ్మానందాన్ని అనుగ్రహిం చు కృతార్థుడనౌతాను.’’ అని ప్రార్థించిన నంతనే భక్తుల పాలిట కల్పవృక్షమూ, అజ్ఞానమనే త్రాటికి కొడవలి వంటివాడూ, సంసార జీవితమనే వస్త్రాన్ని ఛేదించే కత్తెర వంటివాడూ, కైవల్యరూపమైన అమృతాన్నాన్ని దానం చేసే మహాచింతామణి రత్నమూ- గిరిజాదేవితో కూడి సంపన్నమైన పవిత్రమైన గార్హస్థ్య జీవనభాగ్యం కలవాడూ అయిన శ్రీకాళహస్తీశ్వర మహాదేవుడు నత్కీరుడికి సాయుజ్య సుఖాన్ని అనుగ్రహించాడు.
ఈ విధంగా యాదవనరేంద్రునికి శివుడు నత్కీరమహాకవి వృత్తాంతాన్ని వివరించగా ఆతడు ఈశ్వరుని పూజించి ఈ శ్రీకాళహస్తిలో మోక్షాన్ని పొందిన మహాభక్తులింక ఎందరెందరున్నారు? తెలుపుమని ప్రార్థించాడు. దానికి సమాధానంగా శివుడీవిధంగా పలికాడు.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512