డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణభంగురమైన రుూ జీవితంలో చేతికందినంతవరకూ సుఖపడదామనేది ఆమె నూతన సిద్ధాంతమూ, జీవితాశయమూ అయినవి.
ఇక్కడ రోమ్‌లో సీజర్, క్లియోపాత్రా రాకకోసం ఎదురుచూస్తున్నాడు. తనకు ఈజిప్టులో ఆమె చేసిన అతిథి సత్కారం, తన పట్ల ఆమె చూపిన అనురాగం, గౌరవం మొదలైనవి ఆయన మరిచిపోలేదు. తన జీవితంలో నిజంగా సుఖపడింది క్లియోపాత్రో గడిపిన రోజుల్లోనేననే మాటను ఆయన ఖండించలేదు. ఇపుడు క్లియోపాత్రా ఇక్కడికి వస్తే తాను కృతజ్ఞత చూపి, ఆమెను గౌరవించటంలో, కనీసం సగం ఋణాన్నన్నా తీర్చుకోగలనా అనిపించిందాయనకు.
ముఖ్యంగా నైల్ నది మీద ఓడలో తేలియాడిన ఆ రాజభవానాన్ని ఆయన మరువలేదు. అదేవిధంగా ఉండేట్లుగా ఆమెకు విడిది ఏర్పాట్లు చేయాలి. అందుకుగాను, రోమ్ పట్టణానికి చివరి నాగంలోని ఒక ప్రాసాదాన్ని ఆమె కొరకై కేటాయించాడు. ఈ భవనం తోటలు, చెట్లమధ్య వున్నది; చాలా ప్రశాంతమైన వాతవారణం, కనుచూపు మేర దూరంలో టైబర్ నదిగలగలలాడుతూ ప్రవహిస్తూనే వుంటుంది. ఐతే ఇదంతా కలిసినా, ఈమెను ఈజిప్టు మహారాణికి తగిన గౌరవాన్ని ఇవ్వలేకపోయాననే బాధ సీజర్‌ను బాధించింది.
క్లియోపాత్రా రాకకొరకై ఒక్క సీజరే ఆతృత పడటంలేదు. రోమన్‌లు అందరూ ఈ జగన్మోహిని చూడాలని కుతూహలపడుతున్నారు. రోమన్ సామ్రాజ్యాన్ని ఉద్ధరించి, విపరీతంగా సహాయపడిన దేశాల్లో ఈజిప్టుకే ప్రథమ స్థానమున్నది. అన్నిటికన్నా ముఖ్యం సీజర్‌లాంటి కేసరిని తన చూపులతో, ప్రణయంతో కట్టిపారేసి బంధించిన ఈ రాచకన్య ప్రదర్శనార్థం రోమన్‌లు తహతహలాడుతున్నారు.
ఈజిప్టు ప్రపంచ వింతలున్న దేశం. ఇపుడు క్లియోపాత్రా కూడా ఆ ప్రపంచ వింతల్లో ఒకతెగా కన్పడసాగింది. ఆమె సౌందర్యాన్ని గూర్చిన కథలు విని, నిజంగానే ఆమె చూడగల అదృష్టమంటూ తమ జీవితాల్లో సంభవం కాబోతున్నందుకు రోమన్‌లు ఎంతో సంతోషించారు.
ఓడరేవులోనే బ్రహ్మాండమైన స్వాగతం ఇవ్వబడింది. సీజర్ స్వయంగా వచ్చాడు. ఆమె విడిదికి వెళ్ళే మార్గంలో జనం తండోపతండాలుగా గుమికూడారు. ఆమె సందర్శన భాగ్యం కోసం వారు ఉవ్విళ్ళూరారు. రోమన్ సైనికులు రుూ జనాన్ని సమర్థించలేకపోయారు. ఏమైనా అల్లరంటూ జరుగకముందే ఆమె తన విడిది జేరుకుంది. రోమన్‌లు తనను విదేశీయురాల్ని ద్వేషిస్తారేమోనని ఆమె పొరబడింది. కాని, రోమన్ ఆదరణ ఆమెకు అన్యమైనందుకు ఎంతో ఆనందపడింది.
విడిదిలో ఆమె సీజర్ కౌగిలి కోసం తహతహలాడింది. సీజర్ కూడా మొట్టమొదటిసారి ఆమెను చూసినపుడు ఎంత సుందరంగా వున్నదో, ఈనాడూ అంత సుందరంగా ఉన్నదనుకున్నాడు. కాలమనే సాన చక్రం మీద ఈమె మెరుగులు దిద్దుకున్న రత్నం! సీజర్ క్లియోపాత్రాల ప్రతిపక్షం తిరిగి, పూర్వంవలెనే చాలా ఉద్రిక్తంగా ఆరంభమైంది. ఈ వియోగం కలిగించిన వ్యవస్థ పట్ల వారు కసి దీర్చుకున్నారు. అనురాగం మరింత బలపడింది.
అయితే ఈజిప్టులో వలె సీజర్‌కు తీరికలేదు. అతి ముఖ్యమైన రాజకీయ వ్యవహారాలు ఆయన్ను ఒకచోట నిలువనీయడం లేదు. అందుకని ఆయన అప్పుడప్పుడు మాత్రమే క్లియోపాత్రను చూసి పొయ్యేందుకు రాగలుగుతున్నాడు..
క్లియోపాత్రా గౌరవార్థం రోమ్ -జిప్టు దేశాల సౌహార్ధ్ర సూచనార్థం పెద్ద విందు ఏర్పాటు చేయబడింది. ఈవిందులో ఉన్నత రాజోద్యోగులందరూ క్లియోపాత్రాకు పరిచయం చేయబడ్డారు. యువకులూ, మహావీరులూ అయిన రోమన్‌లను చూసి పాల్కొన్న వారందరి కళ్లూ ఆమె అందచందాలను తాగుతున్నట్టే తోచినవి.
అయితే విందులో మార్క్ ఎంటనీ ఆమెకు ఎక్కడా కనిపించలేదు. అతని పరు ఆమెకు బాగు గుర్తు. అంతకన్న అతని రూపం ఆమె హృదయ ఫలకం మీద గాఢంగా హత్తుకున్నది. సరిగ్గా పదేళ్ల క్రితం ఏంటనీని ఆమె, తన తండ్రితోపాటు సేనానాయకుడుగా ఈజిప్టు వచ్చినప్పుడు మొదటిసారి చూసింది. ఆనాడే అతను రోమ్‌కు తిరిగి వెళ్లాడు. అనుభవపూర్వకంగా ఆమె తన ప్రణయాన్ని సీజర్‌కు అర్పించినా రోమ్‌కు తిరిగి వెళ్లాడు. అనుభవపూర్వకంగా ఆమె తన ప్రణయాన్ని సీజర్ ను అర్పించినా, హృదయపూర్వకంగా ప్రప్రథమ ప్రణయ పుష్పాల్ని ఏంటనీ కాళ్లముందు ఉంచింది.
ఆ తరువాత ఆమె స్వప్నాలన్నీ ఏంటనీనే నాయకుడుగా గుర్తుకు తీసుకున్నవి. సీజర్‌తో గడిపిన ప్రణయంలో కూడా ఆమె సీజర్‌కు మారుగా ఏంటనీనే జ్ఞాపకం చేసుకొంటూ ఊహించుకుంట ఆనందిస్తూ ఉండేది. ఆ తరువాత సీజర్ మాటల సందర్భంలో ఏంటనీనీ గూర్చి చెబుతున్నప్పుడూ, అతను గమనించకుండానే ఎంతో కుతూహాలాన్ని చూపుతుండేది. కాని, ఏంటనీ పట్ల సీజర్‌కు సదభిప్రాయమంటూ ఉండనందుకు ఆమె ఎంతో నొచ్చుకునేది.
ఇపుడు రోమ్‌లో అతన్ని చూసే అవకాశం ఉంటుంది కదానని ఆమె ఆశపడింది. ఆనాడు తాను పద్నాలుగేళ్ల వయసులో ఉండగా తనను చూసీ చూడనట్లు ఊరుకున్న ఏంటనీ, ఇపుడు తన సౌందర్యానికి మూర్చపోక తప్పదని ఆమె ఆశించింది. అలా జరిగితే తన వయసుతో, వలపుతో అతన్ని ముప్పతిప్పలూ పెట్టి తాను ఆనందింపగలదు. అంతకు అతను అసలు తనకు కనిపిస్తే కదా?
చివరకు తెగించి ‘ ఏంటనీ ని నాకు పరిచయం చేయలేదు?’’అని ఆమెసీజర్‌ను అడిగింది.
సీజర్ నవ్వి ఊరుకున్నాడు. తన మనసులోని విషయం సీజర్‌కు తెలిసిపోయిందేమోనని ఆమె భయపడింది. అందుకనే తాను కూడా పట్టించుకోన ట్లే మాటలు తప్పించింది.
ఆ మర్నాటి నుంచి ఆమెకు రోమన్ రాజ్యాంగంలోని కీలకాలు పరిపూర్ణంగా తెలియసాగినవి. ఉన్నతోద్యోగులు ఈజిప్టు మహారాణికి జోహారులు అర్పించే నిమిత్తమూ ముఖ్యంగా సీజర్ కొడుకుని చూసి నిమిత్తమూ పనిగట్టుకుని క్లియోపాత్రాను దర్శించసాగారు. తన అందచందాలకు భ్రమిసి కొంతసేపైనా తననూ , తన యవ్వనాన్ని చూసి కలలు కందామనే ఉద్దేశ్యంతోనే ఈ రాజోద్యోగులు తన దర్శనమనే వంకతో వస్తున్నారని ఆమెకు తెలుసు.
తదనుగుణంగానే ఆమె చిలిపిగా నవ్వటం, వారిని కవ్వించటం దాంతో వచ్చినవారు మదనుని నిశిత శరాలకు గురై ముళ్లమీద కూర్చున్నట్టుగా కదిలి దిగులుగా ఇంటికి పోవటం జరుగుతోంది. ఈ విధంగా కొమ్ములు తిరిగిన పురుషుల మనసులు సైతం తాను వికలం చేయగలిగాను కదాననే గర్వంతో ఆమె ఆనంద పడుతూంటుంది.
తనకొక పుత్రుణ్ణి ఇవ్వలేకపోయిందనే కారణంతో సీజర్ తన భార్య ను సరిగా చూడటం లేదు. క్లియోపాత్రా రాక పూర్వం, సీజర్ భార్యమీద ఎవ్వరికీ సానుభూతి ఉండేది కాదు. క్లియోపాత్రాను చూశాక. బహువా ఈర్ష్యతో కావచ్చు- సీజర్ తన భార్య పట్ల అక్రమంగా ప్రవర్తిస్తున్నాడని ప్రజలు అభిప్రాయపడసాగారు. కానీ సీజర్, తాను పితృత్వానికి అర్హుడని క్లియో పాత్రా ఆధారంగా రుజూ చేసుకొని గర్వపడుతున్నాడు.
ఒకనాటి సాయంత్రం అక్టోవియస్, క్లియోపాత్రాను చూసేందుకు వచ్చాడు. అతను సీజర్ కు మేనల్లుడు. సీజర్ తనువాత అతని ఆస్తిపాస్తులకూ, అధికారాలకూ, అక్టోవియన్ వారసుడని అందరూ అనుకుంటున్నారు. అతని వయస్సు 17 సంవత్సరాలు. ఎప్పుడూ గ్రంథ పఠనంలో నిమగ్నుడై ఉంటాడని ప్రతీతి. ఇది తెలుసుకొని క్లియో పాత్రా, అలెగ్జాండ్రియాలోని ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలయం తగలబడినపుడు రక్షించబడినవాటిల్లోని కొన్ని గ్రంథాలను తెప్పించి అక్టోవియన్‌కు బహూకరించింది.
సీజర్ కు వారసుడుగా తనను తాను పరిచయం చేసుకునేందుకు ఇతను వచ్చి ఉంటాడని క్లియోపాత్రా తలచింది.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు