డైలీ సీరియల్

శివదర్శనం.. సర్వ పాపహరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అభ్యర్థనను విని జంగమవేషధారుడగు శివుడు యాదవరాజు మనస్సులోని సంశయాన్ని నివారణచేసేందుకు క్రమంగా సాలెపురుగు-పాము- ఏనుగు-తిన్నడు పుట్టిన విధానాన్ని వారి మదిలో సహజంగా కలిగిన శైవభక్తిని ఇలా వివరించాడు.
చెలది పూర్వజన్మ వృత్తాంతం
విశ్వకర్మ కుమారుడు ఊర్ణనాభుడు. అతడు బ్రహ్మ చేసే సృష్టికి ప్రతిసృష్టి చేయసాగాడు. అందుకు కోపించిన బ్రహ్మ ఆతనిని కీటకంగా జన్మించమని శపించాడు. అప్పుడు ఊర్ణనాభుడు ఆందోళనతో అన్యాయమార్గంలో నడిస్తే ఆపద రాక పోతుందా అని దీనుడై నమస్కరిస్తూ ఇలా అన్నాడు. ‘ఓ కృపాసాగర! మునిమానసధ్యేయ! నా అపరాధాన్ని మనసున తలంపక ఈ నీ శాపానికి విమోచనమెప్పుడో తెలపండి? ఏ వనానికి పోయి నేను నివసించాలి? ఏ పురుగుగా పుట్టిన శాపాంతం కలుగుతుంది? అనుజ్ఞ ఈయవే’’ అని అభ్యర్థించాడు. ఆతని మాటల్ని విని కోపం వీడిన మనస్సు కలవాడై బ్రహ్మ ‘జగత్తును సృష్టింప గల బుద్ధి నైపుణ్యం కలిగిన వాడననే గర్వకారణంగా నీకు ఈ శాపం కలిగింది. శివుడు నీకు దర్శన మయినంతనే నీకు శాపవిమోచనం కలుగుతుంది. అంతవరకు భూలోకంలోని గజారణ్యమనే పేరు గల వనంలో ఆత్మవిచార గుణాలతో కూడి నిత్యం వినోదక్రీడలతో సాలిపురుగువై సంచరిస్తూ ఉండు. పూర్వం వసిష్ఠ మహర్షికి ముక్తి సుఖాన్ని కలింగించేందుకై శివుడు లింగాకృతిలో అచట వెలసియున్నాడు. ఆ లింగం సర్పాకృతిగా ఉంటుంది. ఆ లింగాన్ని ఒక భక్తుడు నిత్యం పూజిస్తూ ఉంటాడు. ఆ పార్వతీశ్వరుని జ్ఞానం కలిగి నీవు అర్చించి సౌఖ్యాన్ని పొందుతావు. శ్రీ అనే పేరుతో గజారణ్యంలో బిల్వవృక్ష శాఖల్లో నీ దారాలతో వస్త్రాలనల్లే సహజనైపుణ్యం కలిగి సంచరిస్తూ ఉండు. ఈ జన్మకంటె నీకు ఆ జన్మమే చాల పవిత్రమైనది. గజారణ్యంలో నీవు నివసిస్తూ తేజోనిధియైన సర్వేశ్వరుణ్ని పూజించి శివసాయుజ్యాన్ని పొందు. నీవిక విచారాన్ని విడిచిపెట్టు. నీవా గజారణ్యంలో సంచరించడ మన్నది మంచంపై కోపగించి పరుపుడై పడినటువంటిది. ఆలస్యం చేయక ఆ అరణ్యానికి పొమ్ము.’ అని ఆజ్ఞాపించాడు. తదాజ్ఞానుసారంగా విశ్వకర్మ కుమారుడు గజారణ్యంలో చెలది పురుగుగా మారేడు వృక్ష శాఖాగ్రాలపై అటునిటు విహరిస్తూ తన గర్భం నుండి పుట్టే దారాలపై ప్రీతిగ వసింప సాగింది. ఒక భక్తాగ్రగణ్యుడు ఈశ్వరార్చనా భావనతో ఆ చెలది ఉన్న మారేడుచెట్టు చేరి పూజావేళ మించిపోకుండా వెళ్లాలనే తొందరలో మారేడు పుష్పాలు - పత్రాలు కోసాడు. అప్పుడు ఆ చెలదిపురుగు వెదురుపూలసజ్జలో శివదర్శనా న్ని పొందే భాగ్యం చేత మారేడాకులతో కూడ కలిసి పడింది. ఆ భక్తుడు సువర్ణముఖీలో స్నానం చేసి కైలాసవాసియైన శివుని అర్చించాడు. అప్పుడు మారేడు దళాలున్న పూలసజ్జలో పడియున్న చెలదియు భక్తుని చేతికి వచ్చి ఈశ్వరదర్శనం చేసింది. ఆ విధంగా తన జన్మకు ప్రధానకారణమైన బ్రహ్మశాపాన్ని ఆ చెలది పురుగు తలంచుకొంది. ఓరాజా ! నీకు ముందు తెలిపిన రీతిగా దానికి ఈశ్వరార్చనరూపమైన శాశ్వతజ్ఞానభాగ్యం నిరాఘాటంగా కలిగి ఆ దక్షిణకైలాస వాసుని పూజించి శివసాయుజ్య సామ్రాజ్యవైభవాన్ని పొందింది. ఇంక కాళంబు కథచెప్తాను. విను.
సర్పపు పూర్వజన్మ కథ
అది కైలాస పర్వతం. దాని మీద గంధర్వ స్ర్తిలు మధుర గానాన్ని విని సర్పరాజులు తలలెత్తి యాడుతున్నాయి. ఆ సర్పరాజుల పడగలపై ప్రకాశించే రత్నకాంతుల చేత తపోధనులున్న గుహలు ప్రకాశిస్తున్నాయి. గుహల్ని ప్రతిధ్వనింప చేస్తూ నిర్మలోదకాలతో సెలయేళ్లు గలగలపారు తున్నాయి. ఆ సెలయేళ్ల ఒడ్డులయందు నిర్వికల్పసమాధిలో మునులు యోగనిద్రాస్థితిలో ఉన్నారు. మునుల తపస్సులు నిర్విఘ్నంగా ఫలించేందుకు భక్తితో వారిని ప్రమదగణాలు రక్షిస్తున్నారు. ఆ ప్రమదగణ భార్యామణులతో కూడిన పార్వతీదేవి విలాసాలతో ఆ కైలాసపర్వతం ధవళకాంతులతో సుమనోహరంగా ఉంది. సర్పభూషణుడు- మన్మద భస్మలేపనుడు (పూసుకొన్నవాడు)- సుధాకర (చంద్రుడు) భూషితుడు - అయిన నిటలాక్షుని ధవళకాంతులచే వెలుగొందే కొండచరియల్లో తిరిగే ధవళవర్ణుడైన నందీశ్వరుడు ఖణీల్‌మని రంకెవేసే వరకు ఆయనను గుర్తించుట కష్టం. ఆ కొండ చరియలలో ప్రవహించే నదీ తీరాలలో భక్తులు ఈశ్వరుణ్ని సేవించేవరకు పార్వతి ముంజేతి చిలుక ఫలాల్ని రక్షిస్తూ ఉంటుంది. నందీశ్వరుడు అచటగల పచ్చిక బయళ్లకు కాపుదలగా ఉంటాడు. అక్షతల్ని వినాయక వాహనమైన ఎలుక తాను తినకుండ కాపాడుతూ ఉంటుంది. కాలభైరవుని వాహనమైన కుక్క తాను అన్నాన్ని తినకుండ రక్షిస్తుంది. ఆ కైలాసంలో నిరంతరం పుష్పించి- ఫలించిన మధుర ఫలరస నదీ ప్రవాహాలతో కలిసిన సెలయేళ్లలో నదీ సంగమమనే భ్రాంతి చేత మునులు స్నానం చేస్తుంటారు. పాదరసం తన చంచల స్వభావాన్ని వీడి నిలిచిపోయిందా! పాలసముద్రమే కొండగా వచ్చి నిలిచిందా! వెనె్నల గడ్డ కట్టిందా? మోక్షలక్ష్మీ క్రీడావిలాసం కోసం చంద్రకాంతశిలలతో నిర్మించిన విన్నూతన భవనమా అనునట్లు ప్రకాశించే ఆ వెండికొండ మునుల చేత సిద్ధుల చేత సేవింపబడుతూ వెలిగిపోతూంది.
ఒకనాడు మహేశ్వరుడు వేడుకతో బ్రహ్మాండమనే గృహానికి నాలుగు ముంగిళ్లలోని మనోహరమైన ఆవరణల్లో స్తంభంలా ప్రకాశించే కైలాసపర్వతం మీద గరుత్మంతుడు (విష్ణువు), రాజహంస (బ్రహ్మ), ఐరావతం (ఇంద్రుడు), మేకపోతు (అగ్ని), దున్నపోతు (యముడు), నరుడు (కుబేరుడు), మొసలి (వరుణుడు), జింక (వాయువు), గుఱ్ఱం (నిరృతి), ఎద్దు (ఈశానుడు) మొదలగు వివిధ దేవతల వాహనాలు దేవతల విమానాలు కైలాసపు మొదటి ప్రాంగణంలో కోలాహలంగా సంచరిస్తున్నాయి.

చరవాణి: 9490620512