డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావ్ రాణీ! అయినా, నేను నీ మాట కాదనను. నీ అభిప్రాయాన్ననుసరించే ఈ లోకం తల్లకిందులయ్యేది గాక, నీ దగ్గరే వుంటాను సరేనా?’’ అన్నాడను. ‘‘ఏం అంతలోనే జారిపొయ్యారు? మాటల్లోనే ఇంత తారతమ్యం ఉంటే ఎలా? నేను ఆలోచిస్తున్నది వేరు విషయం’’ అన్నదామె.
‘ఏమిటిది?’
‘సీజర్ టాలమికి ఇప్పుడు పదమూడేళ్లు నిండుతున్నవి. వాడికీ రాజ్యార్హత ఉన్నది. ఈ సంవత్సరమే వాడికి పట్టం గట్టి రాజ్య పాలనా భారాన్ని భరించేందదుకు వాడికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఉద్దేశ్యం ఏమిటి?’
ఏంటనీ ఒక్క క్షణం ఆలోచించాడు.
‘అంత చిన్నవయసులో రాజరిక భారాన్ని వాడినెత్తిన వేయటం మంచిదంటావారాణీ’ అన్నాడు సున్నితంగా తన అభిప్రాయాన్ని తెలియబరుస్తూ.
‘అంటే వెనుక నేనే ఉంటాను. ప్రజలకు నా తరువాతి పాలకుడుగా సజర్ పరిచయం కావాలి కదా. వాడూ తెలివిగల వాడేననుకుంటాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే, పై ఎత్తున మనం ఉండి సరిచేసి ప్రభుత్వాన్ని సక్రమంగ సాగించే అవకాశాలుంటవి. ఒకనాడు హఠాత్తుగగా వాడు ఈ సింహాసనమెక్కుతే అంతా కొత్తగా తోచి గాబరాపడతాడేమోనని ’ అన్నదామె.
ఏంటనీ ఆమెతో మరి వాదించలేదు.
ఇది ఈజిప్టు కనుక ఇక్కడి ఆచారాల ప్రకారమే అంతాజరగాలనుకున్నాను.
‘కానీ.. ’ అన్నాడు ఏంటనీ. ‘ఈ పర్షియన్ యుద్ధం తేలేవరకు ఆగటం మంచిదనుకుంటాను రాణీ! ఎందుకంటే మరికొన్ని రాజ్యాలు కూడా మనకు కలిశాక ఒకేసారి పెద్ద ఎత్తున పట్ట్భాషేక మహోత్సవం జరుపుతే బాగుంటుందని నా అభిప్రాయం’
ఆమె వెంటనే సమ్మతించింది. ఏంటనీ అంతరాంతరాల్లో ఏ కోశానా రాజ్య కాంక్ష లేదని ఇప్పుడామెకు దృఢమైన నమ్మకం కుదరింది. అంతేకాక అతని మనోవాక్కాయ కర్మణా తన ప్రేమపాశంతో చిక్కుకున్నాడనీ తేలిపోయింది.
‘‘ప్రియా! నీ మాట కాదనను. నీ ఇష్టప్రకారమే కానివ్వు’ అన్నదామె.
ఉభయుల సమస్యలూ ఇంత తేలిగ్గా తీరిపోయినందుకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పడ్డారు. ఇక ఆ రాత్రి కామకేళిలో తేలియాడుతూ , భూవలయం మీద తమకన్న ఆనందమయ జీవితాన్ని గడిపే ప్రాణి ఉండేందుకు వీల్లేదనే సత్యాన్ని నిరూపించారు.
22
అనుకున్న ప్రకారం ఎండాకాలం ఆరంభదశలో ఏంటనీ నాయకత్వం కింద సేనలు పర్షియా వైపై తరలినవి. ఈసారి పెదద అట్టహాసాలేమీ లేవు. ఏంటనీ చాలా పట్టుదలగా ఉన్నాడు. తాను పర్షియా ను కాకున్నా, కొన్ని పరిసర రాజ్యాలన్నా జయించకపోతే ఈ విశావ విశ్వంలో కేవలం ఒక మానవ మాత్రుడుగా మాత్రమే జీవిత శేషాన్ని గడపవలసి ఉంటుందనే అభిప్రాయంలో ఉన్నాడు.
ఈసారి ఆర్మీనియాలో దిగటం ఆర్మీనియా రాజు సహాయాన్ని అర్థించేందుకు కాదు. మ ఉందు ఆర్మీనియానే జయించాలని నిశ్చయించుకున్నాడు. ఇలా జరుగుతుందని ఊహించని ఆర్మీనియా రాజు యుద్ధానిక్కూడా సిద్ధంగా లేడు. గద్దలున్న రోమన్ పతాకాలను చూసేటప్పటికీ అతనికి ఠారెత్తింది. పెద్ద పోరాటమంటూ జరగకుండానే లొంగిపొయ్యాడు. తన విజయానికి చిహ్నంగా ఆర్మీనియా రాజును ఏంటనీ బందీగా ఈజిప్టుకు పంపాడు.
ఈవిజయాన్ని చూసి ఆర్మీనియా పరిసర రాజ్యం మెడియా కూడా తేలిగ్గా ఏంటనీకి లొంగిపోయింది. ఇంకా ముందుకు సగటమా, వెన్కు తిరగటమా అని ఏంటనీ తీవ్రంగా ఆలోచించాడు. ఇప్పుడు అతనిలో మొదట్లో ఉన్న ఉత్సాహాన్ని కానీ పట్టుదలకానీ లేవు. కేవలం తన స్థానాన్ని బలపరుచుకునేందుకు ఈ యుద్ధానిక సిద్ధమయ్యాడు. ఇప్పుడు రెండు రాజ్యాలు జయించాడు.తన కీర్తి ప్రతిష్టలకిదిచాలు తానెంత కష్టపడ్డాడో తన సేనలు ఎన్ని ఇబ్బణదులకు లోనైవరో మొదలైన వాటిని, గోరంతలు కొండంతలుగా చేసి చెప్పగల కౌశలమున్న తన సేనానులే తన గొప్పతనాన్ని నలుదిక్కులా విస్తరింప చేస్తారు.
పోతే, తాను జయించిన ఈరెండు రాజ్యాలనూ అతను ఈజిప్టుకు కలిపాడు. రోమ్‌కు జవాబు చెప్పవలసి వస్తే లోగడ మధ్యధరా సముద్ర తీరంలోని చిన్న రాజ్యాలకు చెప్పిన సంజాయిషీయే వీటికి తెలిసిపోతుంది. ఇక పర్షియాను జయించటం మాటలు కాదు. తనకు ఎందుకొచ్చిన బాధ ఇదంతా.
ఒకవేళ పర్షియాను జయించినా, దాన్ని ఈజిప్టుకు కలిపినట్లయితే రోమన్ ప్రభుత్వం తనను దేశం నుంచే బహిష్కరించే స్థితికి పోవచ్చు. ఈజిప్టుకు కలపనట్లయితే క్లియోపాత్రా బాధపడుతుంది. అంతకని అటు రోమ్‌నూ, ఇటు ఈజిప్టునూ కూడా సమాధానపరిచే పరిస్థితుల్లో ఏంటనీ ఆలెగ్జాండ్రియాకు తిరిగి వచ్చాడు.
అలెగ్జాండ్రియా ఈసారి ఏంటనీ కి గొప్ప ఆహ్వానమూ, సన్మానమూ జరిగినవి. ఈజిప్టు క్షేమాన్ని, అభివృద్ధి ని హృదయపూర్వకంగా కోరే వ్యక్తిగా ఏంటనీనీ ప్రతి పౌరుడూ నమ్మాడు. దాంతోపాటు శ్రమలేకుండానే తమ రాణి ఈజిప్టుకు కొత్త కొత్త భూభాగాలను సంపాదించగలుగుతోంది దీనికి అందరూ ఆమెను అభినందించారు. క్లియోపాత్రా పరిపాలన ఎంతో జనరంజకంగా మారింది.
అక్కడ ఏథెన్స్‌లో ఏంటనీ భార్య అక్టోవియా తన పిల్లల్ని చూసుకుంటూ ఉన్నది. భర్త తనకు దూరమై పోతున్నాడనీ, త్వరపడమనీ అనేకులు ఆమెను రెచ్చగొట్టారు. కానీ, మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కిన అక్టోవియా తన గీత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని, భర్త మీద ఈగవాలనివ్వకుండా జాగ్రత్తపడింది. ఆమెకు బంగారమూ అక్కర్లేదు. ఆనందమూ అక్కర్లేదు. ఆమె సంతానమే ఆమెకు సర్వ ప్రపంచమూనూ. తన అన్నగారి అధికారం కూడా ఆమెను సుఖపెట్టలేదు. చివరకు తనకున్న దానితో తృప్తి పడటమే గాక, తన వల్ల ఇతరులు బాధపడకుంటా చూసుకునే స్ర్తి రత్నమామె.
అయితే, ఎంటనీ తన భార్య పట్ల చూపిన నిరాదరణను అక్టోవియన్ సహించలేక పోయాడు. సంధి షరతుల్ని ఎంటనీ అతిక్రమించాడంటూ అంతకన్నా నిదర్శభం అవసరం లేదు. ఏంటనీ మీద కత్తి దూసేందుకు ముందు, అతని కారణంగా నరకబాధల్ని అనుభవిస్తూన్న తన చెల్లెల్ని కూడా తన పక్షాన లాక్కోవాలి. అందుకని ఏంటనీ ఇంటిలోనుంచి బైటికి రమ్మని ఆమెకు కబురు పంపాడు.
అక్టోవియా దృష్టలో ఏంటనీ దుర్మార్గుడు కాదు. తానే పడే బాధలన్నిటికీ కారణం తన భర్త కాదు. విధి విలాసమెలా ఉన్నదో అలాగే జరిగిందనీ, అదే తన అదృష్టం కనుక దాన్ని ఎదిరించటం కేవలం మూర్ఖత్వవౌతుందనీ ఆమె నమ్మింది. చెల్లెలు ఎదురు తిరిగిన కారణంగా అక్టోవియన్ ప్రస్తుతానికి ఏంటనీ మీద విజృంభించ లేకపోయాడు.
ఏంటనీ- ఆర్మీనియా, మెడియా రాజ్యాలను జయించి, ఈజిప్టుకు అంటగట్టాడనే వార్తలు రోమ్‌కు చేరినవి. రోమన్ ప్రభుత్వాదాయంతో రోమన్ సైన్యాలతో, రోమన్ సర్వసేనానిగా ప్రాచ్య దేశాలకు వెళ్లిన ఏంటనీ విజయం, రోమన్ విజయంగానే భావించబడింది. కానీ, జయించినరాజ్యాలను రోమన్ సామ్రాజ్యానికి కాకుండా ఈజిప్టు కు కలపటంలో అర్థమేమిటి?
మొదటి దానికి అక్టోవియన్ కూడా కపడంతో కూడిన అభినందనల్ని సమర్పించాడు. ఇక రెండో దాన్ని ఏంటనీ దేశద్రోహానే్న తలపెట్టాడన్నంత తీవ్రంగా ఖండించాడు. ఐతే, అతని మాటలు ఎవ్వరూ వినిపించుకోలేదు.
ఎందుకంటే సీజర్ కు ప్రాణమిత్రుడుగా ఉన్న ఏంటనీ దేశద్రోసి అవుతాడంటే ఎవ్వరూ నమ్మలేదు.
కనుక, తన పథకం కుదరలేదని అక్టోవియన్ తేల్చుకున్నారు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు