డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన మనసులోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న నగ్న సత్యాల్ని ఇంత స్పష్టంగా విప్పి చెప్పుకున్న తర్వాత మనిద్దరం పూర్వంలా కల్సుకోవడం వల్ల అనర్థాలే ఎక్కువగా జరిగే అవకాశముంది. అంటే ఇహ ముందు మనం కల్సుకోవద్దని నేననటంలేదు.
మున్ముందు కూడా మనం స్నేహితులుగానే ఉందాం. తప్పకుండా కల్సుకుందాం. కాకపోతే ఇహముందు మనతోపాటు మన భాగస్వాముల్ని కూడా మన స్నేహంలో భాగస్తుల్ని చేద్దాం. సరేనా! మన భార్యాభర్తల్ని మన కొత్త స్నేహితులుగా చేసుకుందాం!
రేపే మన తిరుగు ప్రయాణం. ఏమీ ఆలోచించకుండా పడుకో! గుడ్‌నైట్!’’ అంటూ దుప్పటిని మొహంమీదకు లాక్కుంది సాహిత్య.
12
‘‘ఏవండీ.. కాఫీ!’’
దుప్పటి ముసుగులో నిద్రా, మెలకువా కాని స్థితిలో మత్తుగా పడుకున్న సామ్రాట్ తనకు అతి సమీపంలో వినబడిన మాటలకు మొహం మీది నుంచి దుప్పటి తొలగిస్తూ కళ్లు తెరిచాడు.
మరుక్షణంలో అతడి కళ్లకు ఘుమఘుమలాడే వాసనలు వెదజల్లుతోన్న కాఫీ కప్పు, ఆ కప్పును పట్టుకుని వయ్యారంగా నిలబడిన సామ్రాజ్ఞీ కనిపించారు.
తనకిష్టం ఉండదని తెలిసినా.. బారెడు పొద్దెక్కినా లేవకుండా, లేచినా నైటీతో ఇల్లంతా తిరుగుతూ, ఇంటిపనీ, వంటపనీ వగైరా పూర్తయిన తర్వాత కానీ స్నానం చేసి చీర ధరించని సామ్రాజ్ఞి ఆ రోజు తలారా స్నానం చేసి, తనకెంతో ఇష్టమైన చీర కట్టుకుని సౌందర్య రాశిలా కళ్లముందు నిలబడి కాఫీ అందిస్తోంటే.. తను కలలో ఉన్నాడో, ఇలలో ఉన్నాడో అర్థం కాలేదు సామ్రాట్‌కు కొన్ని క్షణాలసేపు.
అతడి ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా, ‘‘కాఫీ త్రాగి త్వరగా తయారైతే ఈలోగా నేను టిఫిన్ సిద్ధం చేస్తాను’’ అంది సామ్రాజ్ఞి.
వెంటనే ఒక్క ఉదుటన మంచంమీద నుంచి క్రిందికి దూకి ఆమె చేతిలోని కప్పునందుకుని పక్కన ఉంచి, ఆమెను గట్టిగా హత్తుకుని ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు సామ్రాట్.. ‘‘సామూ.. ఇదంతా నిజమేనా? నువ్వు నా సామ్రాజ్ఞివేనా?’’
అతణ్ణి మరింతగా హత్తుకుపోతూ, ‘‘మీరు కలగనడంలేదు. నేను మీ సామూనే..’’ అందామె ముద్దు ముద్దుగా.
అలా ఒకరి కౌగిలిలో మరొకరు కాస్సేపు ఉండి మరికొన్ని ప్రేమ కబుర్లు చెప్పకున్నారు.
తర్వాత.. ఎప్పుడూ సామ్రాట్‌కు ఎదురుగా కూర్చుని టిఫిన్ తినే సామ్రాజ్ఞి ఆ రోజు అతడి పక్కనే కూర్చుని తను తింటూ, అతడితో తినిపిస్తూ, మధ్యమధ్యలో అతడు తనకు తినిపిస్తోంటే మురిసిపోతూ ఆ రోజు టిఫిన్ కార్యక్రమాన్ని ముగించింది.
ఆ తర్వాత... జడ వేసుకోకుండా వదిలేసిన సామ్రాజ్ఞి జుట్టుకు సామ్రాట్ చిక్కు తీస్తే ఆమె అతడి గోళ్లు కత్తిరించింది. కూరలు కోసి అతడందిస్తే మిగిలిన వంట కార్యక్రమాన్ని ఆమె పూర్తిచేసింది.
ఆమె ఇల్లు తుడిస్తే..కుర్చీలూ, బల్లలూ వంటి ఫర్నిచర్‌కు అంటుకుని ఉన్న దుమ్మునతడు తుడిచాడు. ఆ రోజు.. ఇద్దరికీ అవతలివారి ప్రవర్తన నమ్మశక్యం కాకుండానే ఉంది.
తను ఊరు వెళ్లకముందు, ‘నీ అంతు చూస్తాన’నే ధోరణితో దాదాపు శపథం చేసినట్టుగా మాట్లాడిన సామ్రాజ్ఞి ఈరోజు ఉన్నట్టుండి తను కోరుకున్నట్టు ప్రవర్తించి తన మనసుకెందుకు సంతోషం కలిగించేందుకు ప్రయత్నిస్తోందో సామ్రాట్‌కూ, ఊరువెళ్ళే ముందు, ‘నువ్వంటే నాకు లెక్కలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో!’ అనే రీతిలో మాట్లాడిన సామ్రాట్ హఠాత్తుగా తన అడుగులకు మడుగులొత్తుతున్నట్టుగా తను ఏ పని చేసినా అందులో పాలు పంచుకుంటూ, సహధర్మచారుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో సామ్రాజ్ఞికీ అర్థం కాలేదు ఎంత ఆలోచించినా.
ఆ రోజంతా ప్రేమించి పెళ్లిచేసుకున్న కొత్త దంపతుల్లా ప్రవర్తించారిద్దరూ. మగవారిలోనూ మహానుభావులుంటారనే విషయాన్ని సామ్రాజ్ఞికి పుట్టింటి ప్రయాణం తెలియచెపితే, పరాయి స్ర్తితో జంటగా విహారయాత్ర చేయడంవల్ల ఎటువంటి అనర్థం సంభవించే అవకాశముందో సామ్రాట్‌కు అవగతమైంది.
ప్రయాణంలో తమకెదురైన అనుభవాల్ని తన భాగస్వాములతో పంచుకోవాలా..? వద్దా..? అనే తర్జన భర్జన ఇద్దరి మనసులోనూ కొనసాగింది ఆ రోజంతా.
భార్యాభర్తలమధ్య రహస్యాలు ఉండకూడదని గతంలో ఎవరైనా అంటే వారిమీద విరుచుకుపడే సామ్రాజ్ఞి ఆ రోజు వేరే కోణంలో ఆలోచించసాగింది.
‘‘ఎవరి రహస్యాల్ని వారు దాచుకునే భార్యాభర్తలు కలిసి జీవించడానికి అర్హులేనా?’’ అని ఆమె మనసు ఆమెను ప్రశ్నించసాగింది.
తను చెప్పే విషయాన్ని సామ్రాట్ ఎలా తీసుకుండోనని సందేహిస్తూ తన మనసులో ఉన్న మాటను మనసు పొరల్లోనే నిక్షిప్తం చేయడం సబబేనా అనిపించిందామెకు.
సామ్రాజ్ఞి ఆలోచనలిలా సాగుతోంటే... తాను సాహిత్యతో కలిసి విశాఖపట్నం వెళ్లడం.. ఆ ప్రయాణంలో తన మనసులో చెలరేగిన సంఘర్షణ యథాతథంగా సామ్రాజ్ఞితో చెప్పడం వల్ల ఏదైనా అనర్థం జరిగే అవకాశముందా?
లేక నిజాయితీగా తను చెప్పడంవల్ల తాత్కాలికంగా సామ్రాజ్ఞి మనసు కలత చెందినా ఉత్తరోత్తరా అది తమ వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా సాఫీగా సాగేందుకు దోహదపడుతుందా? అని సామ్రాట్ ఆలోచించసాగాడు.
తర్జన భర్జన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన సామ్రాజ్ఞి అంది, ‘‘మీతో ఒక విషయం చెప్పాలండీ!’’
తనెంతకాలంగానో ఎదురుచూస్తోన్న విధంగా ఆ రోజుదయం నుంచీ ప్రవర్తిస్తోన్న ఆమెను గమనించిన సామ్రాట్‌కు ఆమె అలా అనడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

-ఇంకా ఉంది

సీతాసత్య