డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యంగా సంధికి అనుకూల వాతావరణమంటూ ఉండగా, కదనానికి కాలు దువ్విన నేరం నా నెత్తిన పడుతుంది. అపుడు మనమెలా సమర్థించుకోవాలో చెప్పు?’’ అన్నాడు ఏంటనీ.
ఇంత చిన్న విషయానికి జవాబు చెప్పలేని అసమర్థురాలు కాదమె. తనకు అనుకూలంగా వుండే వాదాన్నీ పరిస్థితుల్నీ క్షణంలో ఆలోచించగల మహామేధావి.
‘‘ఈ బోడి అవమానాలతో ఎందుకు బాధపడతావు? సర్వాధికార వర్గ సమావేశంలో నీ మిత్రులు నీ పక్షాన ఉన్నారు కదా! నిన్ను ఆక్టోవియన్ అవమానకరంగా మాట్లాడినదానికి ఎదురొడ్డి నిలిచారు కదా! వారి నిరసనను ప్రకటించారు కదా! ఇప్పుడు నీవు మెదలకుండా ఊరుకున్నట్లయితే, నీ మిత్రులు ఏమనుకుంటారు? ఆక్టోవియన్ ఉపన్యాసంలోని ప్రతి అక్షరమూ కాచి వడబోసిన సత్యం కనుకనే, ఏంటనీ తన అంగీకారాన్ని తెలియపరిచేందుకే వౌనం వహించాడని తేల్చుకోరా? అపుడు వారి గతేమిటి? నిన్ను వెనకేసుకొచ్చినందుకు వారేం సమాధానం చెపుతారు? వారు సిగ్గుపడి చావరా? అపుడు మాత్రం వారు, తమ పొరపాటుకు నాలిక కరుచుకొని, ఆక్టోవియన్ పక్షంలో జేరరా? దాన్ని నీవెలా ఆపగలవు..? అలా కాకుండా నీ మిత్రులు, నీ శ్రేయోభిలాషులు, ఆక్టోవియన్‌ను ఎదుర్కొన్నవారి మాట నిలబెట్టేందుకు నీవే యుద్ధాన్ని ప్రకటిస్తే వారు తమ నాయకుని గౌరవాన్ని కాపాడేందుకు నీ పక్షమవరా? ఒకవేళ ఇది అంతర్యుద్ధం కనుక, తమ దేశభక్తిని నిరూపించేందుకు గాను వారు నీకు ఎదురు, రోమన్ ప్రభుత్వ పక్షమే వహించినట్లయితే, వారు నీకు మిత్రులూ, శ్రేయోభిలాషులూ అవనేరరు. ఏ రోటికి ఆ పాట పాడే మోసగాండ్రూ, కుటిల స్వభావులే అవుతారు. అలాంటి కపట మిత్రులు నీకు ఉండేదేమి? లేకేమి? చీదుతే ఊడిపొయ్యే ముక్కును నమ్ముకుంటావా? ఏంటనీ! దీనిమీద ఎన్నాళ్ళు ఎనే్నళ్ళు చర్చించినా ప్రయోజనం లేదు. యుద్ధ వాతావరణానికి తగినంత కారణాలంటూ ఉన్నవి. ఇది మనకు తప్పనిసరి అవుతోంది. కొంచెం వ్యవధితో విషమించవలసిన పరిస్థితి. ఇప్పుడే వచ్చిపడింది. అదీ మన మంచికే అని గుర్తుంచుకో.
ఎందుకంటే, మరికొంతకాలం సాగుతే, నీవు రోమ్‌లో లేని కారణంగా, నీ పలుకుబడిని తగ్గించేందుకు ఆక్టోవియన్ మరింతగా ప్రయత్నించి, కృతకృత్యుడు కావొచ్చు. సైన్యబలాన్ని మరింత పెంచి, అజేయుడైన శత్రువుగా పరిణమించవచ్చు.. ఏంటనీ! ఇది నీకూ, నాకూ కూడా జీవన్మరణ సమస్య. నీవో, ఆక్టోవియనో ఎవరికో ఒకరికే రుూ భూమిమీద చోటున్నది. నీ స్థానాన్ని నిర్ణయించుకోవటంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా, విధి ఆక్టోవియన్‌కు అనుకూలవౌతుంది. నీ శ్రేయస్సూ, నా శ్రేయస్సూ, నా సంతానానికి రక్షా కనుక, ఇంత దూరం చెపుతున్నాను. కాదంటవా, నీ దారిన నీవుపో.. నా బతుకు నేను బతుకుతాను. అంతేకాని నీవు అవస్థలపాలై నన్ను వేధించకు!’’ అన్నదామె ఉద్రిక్త కంఠస్వరంతో.
ఏంటనీ మళ్లీ ఆమె మాటలకు లొంగిపోయాడు. తన పరిస్థితి ఎంత క్లిష్టంగా తయారైందో అతను గ్రహించుకుంటున్నాడు. ఇప్పుడు తనకు రోమ్‌లో స్థానమంటూ ఉన్నదో, లేదో ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో అగమ్యగోచరంగా ఉన్నది. అక్కడ తానీ సమయంలో ఒక స్థానాన్ని ఆక్రమించటంలో ప్రమాదాలు కూడా ఉండొచ్చు. కాని ఇక్కడ ఈజిప్టులో తనకున్న ఈ లమైన సాథనాన్ని కోల్పోయాడంటే ఈవిశాల విశ్వంలో తాను కేవలం ఒక అణువుగా మాత్రమే బతకవలసి ఉంటుంది. అదీగాక తనకిక్కడ సంసారం మీద మమత తగినంత పెరిగింది. వీరి భవిష్యత్తును చూడవలసిన కనీస బాధ్యత కూడా తనకు ఉంది.
ఇనుము వేడెక్కితే సమ్మెట దెబ్బలకు లొంగుతుందనే నిత్య జీవిత సత్యాన్ని ఎరిగిన క్లియోపాత్రా ఏంటనీ ముఖకళను బట్టి తన వాదనను సాగించింది. ‘ఏంటనీ ! చివరకు నా సంగతి కూడా వొదిలెయ్ . ఎవరో కుర్రాడు నన్ను దూషించాడు. లెమ్మని సమాధాన పడతానుగాక! కానీ, నీ గతేమిటి? రోమ్‌లో నీవెవరివి? జీవితమంతా శ్రమపడినేదానికి నీ కొచ్చిన ఫలితమిదా? ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాల మంతా మించిపోతుంది. కనుక మేలుకో! నిషలోంచి బైటపడు!’ అని హెచ్చరించిందామె.
‘రాణీ! ఈ రాజకీయ దుమారం ఒకవే ఇంతటితో ఆగిపోతే యుద్ధానికి మనం కొత్త కారంన్ని వెతకవలసి వస్తుందికదా. ’అన్నాడతను.
తగిన కారణాన్ని ఆమె ఇదివరకే ఆలోచించించింది.బ్రహ్మాస్తమ్రల్లే దాన్ని ప్రయోగించిదిప్పుడు.
‘‘ఇప్పటి కారణాలే చాలు; ఒకవేళ నీవన్నట్లు మరొక దుమారం రోమ్‌లో లేనట్లయితే దాన్ని ఈసారి మనమే సాధిద్దాం. ఏంటనీ! ఎన్నాళ్లు నీవిలా ఈజిప్షియన్ వీ కాకుండా రోమన్‌వీ కాకుండా ద్వంద్వజీవితాన్ని గడుపుతావు. ఈనాకు అక్టోవియన్‌కు నీవేం బంధువువా? జన్మ విరోధివలె అతను నిన్ను చిత్రించాడు. నిన్ను ఏమరిచి ఈ ప్రాచ్య దేశాలకు పంపింది అధికారమంతా తన వంశం చేసుకొనేందుకనే సత్యాన్ని ఈనాడన్నా తెలుసుకో. ఇక్కడ పరిపాలనకు నీవే స్వయంగా రానసరం లేదు.నీ చిత్రపటాన్ని పంపినా సరిపొయ్యేదికదా.. పోతే, అక్టోవియన్ ను యుద్ధానికి ఆహ్వానించటం అంత కష్టం కాదు. నేను వేరొక ఉద్దేశంతో అంటున్నాననుకోకపోతే’’ అని ఆగిందామె.
‘రాణీ! నిన్ను నేను అపార్థం చేసుకుంటానా! చెప్పు’ అన్నాడతను హామీ ఇస్తూ
ఆమె తాను చెప్ప బొయ్యేదానికి ఒక్క క్షణం ఆలోచించింది.
‘ఎలా చెప్తే మృదువు ఉండగలదో తెలియటం లేదు. ఐనా, మాట్లాడేది డొంక తిరుగుడుగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని నీవేమనుకున్నా సరే.. ముక్కుకు సూటిగానే చెప్తాను. నన్ను మోటు మనిషిగా భావిస్తావేమో!.. ’ అని అతని ముఖంలోకి చూసిందామె. అతను కళ్లప్పగించి వింటున్నాడు. సరైన తోవలోనే ఉన్నాడని తేల్చుకుని ‘ఏంటనీ నీవు అక్టోవియాకు విడాకులివ్వు. అదే దానికి మందు..’ అన్నది.
ఏంటనీ అదిరిపొయ్యాడు. ఎందుకంటే క్లియోపాత్రా ప్రేమపాశంలో అతను పూర్తిగా బంధీ అయినప్పటికీ ఈ క్షణం వరకూ అక్టోవియాన్ అవమనించే సాహసం అతనికి లేదు. ఆ మహా పతివ్రతను గూర్చి రోమ్‌లో కథలు చెప్పుకుంటారు. స్ర్తి రత్నమని వేయినోళ్ల పొగడుతారు. మిగతా ఎవన్ని గూర్చయినా గుసగుస లంటూ జరగవవొచ్చేమో కానీ అక్టోవియా ఇలాంటి వాటికి అతీతురాలు. నిజానికి అక్టోవియాను భార్యగా పొందినందుకు తాను ఎంతో గర్వ పడ్డాడు. ఎప్పుడన్నా తను ఒంటరిగా కూర్చుని రోమ్‌లోని తన భార్యాబిడ్డల గురించి తలుకొంటుంటే గుండె చెరువవుతూటుంది. ఒక్కోసారి అక్టోవియాన్ తానెంతో అన్యాయం చేశానని కూడా బాధపడుతుంటాడు. తానామె పట్ల చూపిన కాఠిన్యానికి తనలో తాను కించపడతూ సిగ్గు పడుతూ ఉంటాడు. ఏనాటికైనా ఆమెకు న్యాయాన్ని చేకూర్చాలని కూడా అనేకసార్లు అనుకున్నాడు.
తన భర్తమీద ఎవరేమి చెప్పినా, తనను ఎంత నీచుడుగా చిత్రించినా అక్టోవియా పెడచెవిన పెడుతుంది. అలాంటి వారిని ఆ ప్రాంతాలలో లేకుండా తరిమి వేస్తూ ఉంటుంది. తనను మనోవాక్కాయ కర్మణా పూజిస్తున్నదామె.
క్లియో పాత్రా అందచందాలు తెలివితేటలూ ఆమెకు లేకపోవచ్చు. క్లియోపాత్రావలె ధనరాశుల మీదా, రాజ్యాధికారాల మీద ఆమెకు మనస్సు లేదు. ఆమెకల్లా తన భర్తా పిల్లలే ప్రపంచం.. సంసారంలో శాంతి భద్రతలను నెలకొల్పగల సర్వ సమర్థులామె.
అలాంటి ఉత్తమోత్తమురాలికా -తాను అన్యాయం చేయటం ఇంతకన్నా ఘోరం, అక్రమం ఉండగలవా? ఈ ప్రపంచమే తల్లకిందులవుతున్నట్లు సముద్రంలోని హాలాహలమే మింటికెగసి పోతూన్నట్లు తోచిందతనికి.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు