డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూడుమోయి
నా లీలల
నీకే అర్థమ్మగును
కోరినవారల కోర్కెల
నీడేర్చెద నేను’’
అనుచునంత శ్రీకృష్ణుడు

అభయ హస్తమును పట్టెను
అది ఎంతటి వైచిత్రియొ ?
లేక విష్ణుమాయయో ?
అందరి హస్తములందున

మెరిసె పాదరక్షలు
‘‘నా సంగతి ఏమి కృష్ణ ?
నా కివ్వరొ మీ రక్షల’’ ?
నంచు వేడుకొనియె హనుమ
అపుడాతని చేతులందు

వచ్చి చేరె పాదుకలు
వారంతట విచిత్రముగ
వానిని తలపై ధరించి
‘‘కృష్ణా ! కృష్ణా !’’ యటంచు
తిరిగిరి ఆతని చుట్టును.
*
3. సందర్శనం
శ్రీకృష్ణుడు: హనుమా ! రామా యణ మహాకావ్యాన్ని ఎవరు వ్రాశారో తెలుసా ?
హనుమ : తెలియకేమి స్వామీ ! త్రేతాయుగం నాటి వాల్మీకి మహర్షియే కదా !
శ్రీ.కృ. : అవును నిజమే ! చక్కగా చెప్పావు. కానీ భారత భాగవ తాదులను వ్రాసిందీ, వేదాన్ని నాలుగు భాగాలుగా విభజన చేసిందీ ఎవరో తెలుసా ?
హను : తెలియకేమి స్వామీ ! ఈ ద్వాపరయుగం నాటి వేదావ్యాసుల వారే కదా ?
కృ : ఆయనెక్కడుంటారో తెలుసా ?
హ : తెలుసు స్వామీ! వ్యాసాశ్రమంలో! రోజూ భూప్రదక్షిణ చేసి వస్తూంటాను కదా ?
కృ : ఎలావెళ్ళాలక్కడికి ?
హ : నేనున్నాను కదా ? ... నా భుజాలపై కూర్చోండి ! క్షణాల్లో అక్కడ దింపేస్తాను మిమ్మల్ని !
కృ : సరే మంచిది. త్రేతాయుగంలోరామావతారంలో మోశావు.మళ్ళీయిప్పుడు ద్వాపరయుగంలో కృష్ణావతారంలో మోస్తా నంటున్నావు.
ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087