డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఐదు నిమిషాల్లో ఎంతయితే అంతే నోట్లో కుక్కుకుంటాడు. ఒక్కొక్కసారి పళ్ళెం ఎదురుగా కూర్చోగానే చూస్తే.. పళ్ళెం నుండి చపాతీలు మాయం అవుతాయి. ఉత్త రసం తాగేసి బయలుదేరుతాడు.
ఇక్కడికి వచ్చాక తను చూసాడు- ఆర్మీలో స్కవార్ ఆఫ్ రాగింగ్‌ని. ఈ రాగింగు ఇంగ్లీషు వాళ్ల సమయం నుండి వస్తోంది. స్కవార్ ఆఫ్ మీల్ అంటే గొంతుదాకా తిండి, భోజనానికి రమ్మంటారు. ఎదురుగుండా వడ్డించిన కంచాన్ని పెడతారు. తిందామని చెంచాని కంచంలో పెడతారో లేదో సీనియర్స్ ఒక్కసారిగా వస్తారు. వీళ్ళు లేచి సీనియర్లకి సెల్యూట్ చేస్తారు. గాలిలో చెంచని స్కవార్ చేయమంటారు. వీళ్ళు అట్లాగే చేస్తారు. అంతే సీనియర్ ‘నౌ యు హావ్ ద ఎస్కవార్ మీల్.. నో మోర్.. ఇప్పుడు మీకు గొంతుదాకా తిండి పెట్టాము. ఇక ఇప్పుడు వెళ్ళు’ అంటూ బెదిరిస్తాడు. ఆ రోజుల్లో ఈ సంఘటన గుండెలను అకలావికలం చేసేది. రోజంతా తిండికి లేక మాడాల్సిందే. ఆలాసార్లు అతడు తన సాక్సులలో చాక్లెట్లు పెట్టుకునేవాడు. ఛాన్స్ దొరకగానే తినేవాడు.
ఒక రాత్రి ఎముకలు కొరికే చలిలో సీనియర్స్ ఆజ్ఞను ఇచ్చారు. బట్టలు విప్పేసి నేలమీద పడుకో. అండర్‌వేర్ తప్పితే శరీరం మీద ఏమీ ఉండటానికి వీల్లేదు.
ఇక ఆర్మీలో ఇచ్చే శిక్షలు.. కఠిన శిక్షలు.. ఏ దేవుడు రక్షించలేడు. వీపుమీద రాళ్ళతో నిండిన బస్తా పెట్టుకుని పరుగెత్తాడు. ప్రతిరోజూ ఈ పని చేయాల్సిందే. ఈ రొటీన్ పని చేశాక సైకిల్‌పై తన క్వార్టర్‌కి వెళ్తున్నాడు. సీనియర్లు ఆ దారి నుండే రావడం అతడు గమనించలేదు. అసలైతే ఆర్మీ నియమం ప్రకారం సీనియర్లు కనిపించగానే సైకిల్ దిగాలి. సైకిల్‌ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాలి. కాని బాగా అలసిపోవడంవలన కరకర ఆకలి వేయడంవలన అతడు ఈ లోకంలో లేడు. తన క్వార్టర్‌కి వచ్చాక చూస్తే అన్నం బదులు కఠోరమైన శిక్ష- సైకిల్‌ని భుజంమీద పెట్టుకుని పరుగెత్తు.
భగవంతుడా! ఎంత ఫ్యూడల్ మెంటాలిటీ.. ఆరు నెలల ముందు సీనియర్ అయితే చాలు యజమాని అవుతాడు.. యజమాని.. మాలిక్.. సర్..
మెల్లిమెల్లిగా తన పైవాళ్ళ దృష్టిలో ఒక గాడిద అని, ఆ గాడిదని సైనికుడిగా తయారుచేయాలన్న భూతం వాళ్ల నెత్తిన ఉందని తెలుసుకున్నాడు.
ఆర్మీలో కఠోరమైన దినచర్య. ఇదే కాక ఇంకా రాగింగ్. మనస్సు బలం పుంజుకోకుండానే కుంగిపోయేది. ఇంత బిజీగా వుండటంవలన ఆర్మీలో ఒక్క నిమిషం ఊపిరి సలిపే వీలు లేకపోవడంవలన మనస్సు కుంగిపోతున్నా తెలిసేదే కాదు. పొద్దున అవుతోంది, రాత్రవుతుంది, సమయం పరుగెత్తుతునే వుంటుంది. ఒక సాయంత్రం కొంచెం సమయం దొరికింది. ఇల్లు గుర్తుకు వచ్చింది. మనస్సు ఉదాశీనంగా అయిపోయింది. ఇంతలో అతడికి ఆఫీసు నుండి పిలుపు వచ్చింది. అక్కడ అతడి మిత్రుడు అభిషేక్ రాసిన ఉత్తరం ఉంది. చాలా పెద్ద ఉత్తరం. చూడగానే కప్పలా ఎగిరాడు. అభిషేక్ కూడా వేల మైళ్ళ దూరంలో తమిళనాడులో తిరుచ్చి నగరంలో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఉత్తరంలో ఇట్లా రాసి ఉంది.
సందీప్, నీ తలపైన ఆర్మీ చట్టాలు- నియమాల పర్వతం ఉందని, నేను ఇక్కడ జిలేబీలు తింటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని అనుకుంటున్నావు కదూ! నేనేదో ఇక్కడ సుఖంగా ఉన్నాను, అందుకే నీకు ఉత్తర పత్తరం రాయడం లేదనుకుంటున్నావు కదూ! నేను కావాలనే నీకు కార్డు ముక్క రాయడం లేదనుకుంటున్నావు కదూ! ఒరేయ్ కార్టూన్ ప్రపంచం అంతటా ఒకేలా ఉందిరా. ప్రతిచోటా మన కాలి కింద మంటేరా!
మీ దగ్గర జరిగే రాగింగ్ గురించి నేను వార్తాపత్రికలో చదివాను. ఐ.ఎమ్.ఎ. భగత్ బెటాలియన్ సింగారీ కంపెనీ జెంటిల్‌మాన్ కాడర్ నంబరు 111, రాగింగ్‌ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చదివాను. నిజానికి మీరు ఇంకా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఒకడు ఉరిపోసుకుని చనిపోయినందుకు మీ అందరి ప్రాణాలు తీసే రాగింగ్ నుండి విముక్తి లభించింది.
ఇక ఇప్పుడు ఇక్కడ పరిస్థితి గురించి విను. అసలు ఇక్కడికి వచ్చాకే తెలిసింది- ఇంటి విలువ, అమ్మ చేతి వంట, ఇంట్లోని సుఖాలు. ఇల్లు మనకు ఎంత రక్షణ ఇస్తుందో ఇక్కడే తెలుసుకున్నారా! అసలు ఇప్పటిదాకా మనం బయట లోకాన్ని చూడలేదు కదరా! బయట ప్రపంచం పట్ల మన అందరికి మంచి భావనే ఉండేది. అసలు కుటుంబ వికాసమే ప్రపంచం అని అనుకునేవాళ్ళం. ఎవరిపట్ల మనకు రాగద్వేషాలు లేవు. అందరూ మంచివాళ్ళే అన్న భావం మన మనస్సులో నాటుకుపోయింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది ప్రపంచం మనం అనుకున్నంతగా బాగాలేదని.. ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నా. ఎంత మోసం.. ఎంత క్రూరత్వం.. ఎంత హింస.. ఎంత ద్వేషం.. అంతటా మంచే ఉన్నది అని అనుకున్న నా వెన్నలాంటి మనస్సుకు ఒక్కసారిగా దెబ్బ తగిలింది. ప్రతిరోజూ మనం ఒక కొత్త యుద్ధం చేయాల్సి వస్తుందని తెలుసుకున్నాను.. అంతటా రణరంగమే...
నా బాచ్‌లో ఇద్దరు రాగింగ్‌కి భయపడి పారిపోయారు. కొంతవరకు మనలాంటి మొరటువాళ్ళు అవమానాలను కొంతవరకు సహిస్తారు. కాని పిరికితనం ఉన్న వాళ్ళు, అభిమానవంతులు పారిపోతారు.. దూర దూరాలకు. ఒక అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. అతడు పిచ్చివాడయ్యడు. అతడిని హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చింది. అతడి బట్టలన్నీ ఊడదీశారు. నగ్నంగా భూమి మీద నగ్నత్వాన్ని దాచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు. రాత్రంతా ఇదే దారుణమైన ఆట.

- ఇంకా ఉంది

టి.సి.వసంత