డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఎంతో బొద్దుగా స్మార్ట్‌గా కనిపించే తన కొడుకు సందీప్ నా ముద్దుల కన్న.. సందీప్.. వెన్న, పాలతో పెరిగిన సందీప్.. నేతి లడ్డూలు తినే సందీప్.. ఒరేయ్ సందీప్ ఎందుకురా నీకు లేనిపోని ఈ గొడవ. కడుపులో చల్ల కదలకుండా కూర్చోక..
కారు వేగంగా పరుగెత్తసాగింది. ఇంటికి చేరింది. ఇంటిలోపలకి వెళ్ళగానే సందీప్ ఒక బోర్డు చూసాడు. ‘వెల్ కమ్ హోమ్’- జి.సి.108 బ్రాకెట్‌లో రాసి ఉంది - గోబర్‌చంద్ 108. (గోబర్ అంటే పేడ అని అర్థం). సందీప్ బోర్డు చూడగానే పెద్దగా నవ్వాడు. తమ్ముడు సిద్ధార్థ చేసిన చిలిపి పనికి పదే పదే నవ్వాడు. జంటిల్‌మెన్ కైడిట్‌ని గోబర్‌చంద్ కైడెట్‌గా మార్చాడు.
తల్లి సందీప్‌కి ఇష్టమైన పదార్థాలన్నీ చేసింది. తన ప్రేమను రంగరించి వాటి రుచిని ఇంకా పెంచింది. మెంతికూర పరాఠాలు, వెల్లుల్లిపాయల చట్నీ, బాదమ్ హల్వా.. కచౌడీలు, వేడి వేడి జిలేబీలు బ్రేక్‌పాస్ట్.
సందీప్ నోట్లో నీళ్ళూరాయి. ఆ పదార్థాలనుండి వస్తున్న సువాసనలు ఏడు జన్మల ఆకలిని ఇంకా పెంచింది. అసలు ఇంటినుండి వెళ్ళిపోయాక ఇంత కమ్మని వంట దొరకనే దొరకలేదు. కాని ఇప్పుడు ఒకవైపు కడుపు నిండా తినాలని అనిపిస్తోంది. కాని మరోవైపు బరువును నియంత్రణలో పెట్టకోవాలి అన్న ఆలోచన. బరువు పెరిగి మళ్లీ పెద్ద శిక్షని అనుభవించాల్సి వస్తుంది. అందువలన అతడు ప్రతి పదార్థాన్ని కొంచెం, కొంచెం తింటున్నాడు. తల్లి మనసు విలవిలలాడింది. అసలు ఆర్మీ అంటేనే భయపడే ఆ కోమటివాళ్ళకి, ఆర్మీ అంటేనే అదేదో విచిత్రం అని అనుకునే ఆ కుటుంబానికి సందీప్ ఇంతగా బక్క చిక్కిపోవడం, సగం గుండుతో ఉండటం, ముఖం వడలిపోవడం చూసాక ఆర్మీ అంటే ఇంకా దడ తగ్గలేదు. ఇప్పటినుండే పరిస్థితి ఇట్లా ఉంటే ఇక ముందు ముందు తల్లి అతడిని గుచ్చి గుచ్చి అడగడం మొదలుపెట్టింది. ‘‘మంచి భోజనం దొరుకుతుందా? ఆఫీసర్లు ఎట్లాంటివాళ్ళు? ఇప్పుడు ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? నువ్వు రైఫిల్‌ని ఉపయోగించగలవా? జుట్టు ఇంత తక్కువగా ఎందుకు ఉంది? ప్రొద్దున్న ఎన్ని గంటలకు లేవాలి? పగలు చదువు సాగుతుందా? ఎన్నిగంటల దాకా చదువుతావు? ఇల్లు గుర్తుకు వస్తుందా?’’
సందీప్ ముక్తసరిగా ఆ.. ఊ.. అంటూ జవాబులిస్తున్నాడు. అతడి మనస్సులో తను ఆర్మీలో చేరిన ప్రారంభపు రోజులు గుర్తుకు వస్తున్నాయి. వడ్డించిన పళ్ళెం ఎదురుగుండా కూర్చున్నాక పళ్ళెంలోని చపాతీలు మాయం అయ్యేవి. ఉత్తి పప్పు, బిస్కెట్లు, గ్లూకోజ్ తిని బతికాడు. కాని ఇప్పుడు ఎదురుగుండా వడ్డించిన విస్తరి ఉన్నా ఎక్కడ బరువు పెరుగుతానోనని తినడానికి మనస్సు ఒప్పడంలేదు. ఎంత విచిత్రం? తల్లి భావుకురాలైంది. కళ్ళల్లో కన్నీళ్ళు- తన ప్రాణం- బంగారుకొండ.. ఈ విధంగా మనస్సు విప్పి మాట్లాడకుండా ఎట్లా తయారయ్యాడు? ఆరునెలలో ఎంత మార్పు.
తమ్ముడు సిద్ధార్థ తల్లి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ‘‘అమ్మా! ఈ ఆర్మీ వాళ్ళు సివిలియన్లతో ఎక్కువగా మాట్లాడరమ్మా! వాళ్ళ గంభీరత్వానికి, వాళ్ళ ఇమేజ్‌కి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్న ఆలోచన వీళ్ళది’’.
సిద్ధార్థ అన్నమాటలు సందీప్ మనస్సులో ఎక్కడో గుచ్చుకున్నాయి. అతడి వీపుమీద ఒక దెబ్బ వేశాడు. ‘‘ఒరేయ్ నువ్వు నాకు ఆర్మీ రూల్స్, ఆచారాలు నేర్పిస్తున్నావురా?’’
పదిరోజులు ఎట్లా గడిచాయో ఎవరికీ తెలియదు. పక్షి ఎగిరిపోయినట్లు రోజులు ఎగిరిపోయాయి.
అసలు రెక్కలు పూర్తిగా విప్పనే లేదు, మళ్లీ ఎగరడానికి సిద్ధం. అతడు తనలో తను నవ్వుకున్నాడు. అతడి స్నేహితులు, సీనియర్ ఆఫీసర్లు అసలు ఇంత పెద్ద వ్యాపారం వదిలేసి వచ్చాడని, ఇంత సంపాదనను కాలదన్ని వచ్చాడని తెలిస్తే ఎంతగా వేళాకోళం చేస్తారు. ఇక్కడ ఏం వెలగబెడదామని? అమ్మ నాన్నలను సంతోషపెట్టాలని ఎంతో షాన్‌గా ఆర్మీ డ్రెస్ వేసుకుని ఆ వాడ అంతా తిరిగాడు. కాని అతడి తండ్రి సంతోషపడటానికి బదులుగా కఠోరంగా అన్నాడు- ‘ఈ డ్రెస్ విప్పి పారేయి. మా ఎదురుగుండా దీన్ని వేసుకోకు’-
బాధపడుతూ సందీప్ అన్నాడు- ‘నాన్నగారూ! ఈ డ్రెస్ వేసుకోవాలన్న కోరికతో ఎంతోమంది వచ్చారు. కాని ఈ గౌరం ఎంతమందికి దక్కింది? ఎనభై శాతం ఇంటర్వ్యూ, రెండో టెస్టింగ్ దాకా వచ్చాక రిజెక్ట్ అయ్యారు. టఫ్ ఇంటర్వ్యూ, టఫ్ ట్రైనింగ్ తరువాత ఈ డ్రెస్ లభించింది. మీరు దీన్ని చూడటానికి కూడా ఇష్టపడటంలేదు.
శేఖర్‌బాబు కోపంగా అన్నాడు- ‘‘సంవత్సరం పనిచేస్తే ఈ డ్రెస్ ఎంత సంపాదన ఇస్తుందో ఒక నెలలో బిజినెస్ అంతా ఇస్తుంది. నువ్వు అదృష్టవంతుడివిరా, ఏ కష్టం ఎరుగవు. ఈతిబాధలు ఎరుగవు. కడుపునిండా తిండి దొరికింది. ఆకుపచ్చటి ఆకులనే చూసావు కాని శిథిలమై రాలిపోతున్న వాటిని నీవు చూడలేదురా! అందుకే నీకు పైసల విలువ తెలియదు. నేను ఈ స్థితికి చేరానంటే నానా కష్టాలు పడ్డానురా! ఈ ఆఫీసును కొని బిజినెస్‌ను నిలుపుకోవటం మాటలా! పెట్టుబడి నా శ్రమ, నా ధైర్యం తప్పితే మరేవీ లేవు. అసలు ఇల్లు ఉందా? కింద భూమి, పైన ఆకాశం, పరాయి వాళ్ళ పరువుమీద నిద్రపట్టీ పట్టక గడిపేవాడిని. డబ్బులు దాచాలన్నా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఇవాళ నేతి రొట్టె తింటున్నానంటే ఎంత కడుపు మాడ్చుకున్నానో నీకేం తెలుసురా? నీ ఎదుట ఉన్నట్లు మరో మార్గం కూడా లేదురా! ఈ ఇత్తడి సామాన్లు తూస్తూ బతకను అనే దమ్ము ఉందిటరా!’’
‘‘్భగవంతుడి దయవలన రోజులు మారాయి. ఇప్పుడు కూడా మీరు పైస పైసని ఎందుకు లెక్కవేస్తారు. ఎందుకు నాన్నా ఈ గాడిద చాకిరీ! మీరు భౌతికంగా దారిద్య్రం నుండి విముక్తి పొందారు కాని అంతరంగికంగా దారిద్య్రంనుండి ముక్తి పొందలేకపోతున్నారు. నన్ను క్షమించండి నాన్నగారూ.

- ఇంకా ఉంది

టి.సి.వసంత