డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
శ్రమ మీరే కాదు మేం కూడా చేస్తాం. భేదం ఏమిటి అంటే, మా శ్రమ ఒక పెద్ద ఉద్దేశ్యాన్ని పూర్తిచేసుకోవడానికి, ఒక హోలీ కాజ్ కోసం.. మీ శ్రమ కేవలం నాలుగు డబ్బులు కోసమే..
సందీప్ తండ్రిని బాధపెట్టకూడదని అనుకున్నాడు. కాని క్రితంరోజు దినపత్రికలో చదివాడు. ఢిల్లీలో ఒక యువకుడు తను పెళ్లిచేసుకోబోయే అమ్మాయిని తందూరిలో వేసి కాల్చి పడేశాడు. ఎంత ఘోరం.. కాని కాని సమాజంలో ఏ తుపాను రాలేదు. తను శవంగామారి ఈ సమాజంలో బతకలేడు.. బతకడం ఇష్టంలేదు. ఇక్కడ ప్రతి నిమిషం మానవత్వం హత్య చేయబడుతుంది. మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి.
పద్ధెనిమిది సంవత్సరాల వయస్సు. భావుకతతో కూడిన పుస్తకం అతడి మనస్సు. ఆ సాయంత్రం సందీప్ తిరిగి మరొకసారి తన స్నేహితుడు అభిషేక్‌తో మానసికంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. ఏది కావాలి అని ఎంచుకోవడంలోనే ఉంది. ఎంచుకోవడం అనేది వారి వారి శక్తిమీద ఆధారపడి ఉంటుంది. ఢిల్లీయా! లేక ఆర్మీయా! మనుశర్మగానా! (తందూర్ కేసులో ముఖ్య అపరాధి) లేక ఫీల్డ్ మార్షల్ మానేక్‌షా? నువ్వు నా ఉద్దేశ్యాన్ని తెలుసుకునే ఉంటావు మిత్రమా! నేను ఇంటికివచ్చినపుడల్లా నాన్నగారు ముందు నా ఎదురుగుండా భావుకత అనే గడ్డి పడేస్తారు. నేను ఈ మోహం, ఈ సంసర జంజాటాలకి ఆకర్షితుడనై మళ్లీ వెనక్కి వస్తానని ఆయన ఆశ. సరే ఒకవేళ దీనికి లొంగలేదనుకో.. ఇక సరేసరి ఆర్మీమీద దండయాత్ర చేస్తారు. నేను ఆర్మీని ఎంచుకుని ఎంతగా తప్పు చేసానో, భవిష్యత్తులో నేనెంత పశ్చాత్తాపం పడతానో నాకు నూరిపోయడానికి చూస్తారు. ఏమో! నాన్నగారు చెప్పిందాట్లో కూడా నిజం ఉండి ఉండవచ్చును. కాని ఆయన నిర్మించిన దారులపై నేను చస్తే నడవను. నడువను కాక.. అది అంతే.. అదంతా వేరే లోకం, మోసాలు.. రెండు.. రెండు ముఖాలు, ద్వంద్వ విలువలు.. నిజానికి ఇప్పుడు ఆర్మీ నన్ను నలిపి నలిపి ముక్కలు చేస్తోంది.. తొక్కేస్తోంది. ఆ తరువాత కుమ్మరివాడిలా నన్ను తన ఇష్టం వచ్చిన తీరులో మలపనూ వచ్చు.. మూసలలో నన్ను బిగించనూ వచ్చును. నువ్వు ప్రతిచోటా ఛాలెంజ్‌లు ఉన్నాయని రాశావు.
మరి అందుకే ఆ ఛాలెంజ్‌లనే ఫేస్ చేద్దాం.. మన మనస్సుకు నచ్చినవి.. ఆ దారులలోనే నడుద్దాం. ఏమంటావు మిత్రమా..
మరుసటి రోజు..
ఇవాళ డెహరాడూన్ బయలుదేరాలి. అతడికి వీడ్కోలు చెప్పడానికి ఇంటిల్లిపాదీ వచ్చారు. బయలుదేరేముందు తండ్రి అతడి నుండి ఒక హామీ తీసుకున్నాడు.
‘‘ఒరేయ్ సందీప్! నువ్వు రాగింగ్ చేయనని ప్రామిస్ చేయరా!’’
‘‘నాన్నగారూ! అసలు ఇదెట్లా సంభవం అవుతుంది. ఆర్మీ రాగింగ్ ద్వారానే మేము ఎటువంటి కటు పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. శిక్షణనిస్తుంది. లోకం పోకడ నేర్పిస్తుంది. లోకాన్ని మేం చదవగలుగుతాం-’’
‘‘ఇవన్నీ ఆర్మీ టఫ్ ట్రైనింగ్, జీవితం నేర్పిస్తాయిరా! మీరు చేసే రాగింగ్ అంత క్రూరత్వంరా! ఒరేయ్ ఒకసారి గుర్తుచేసుకోరా! రాగింగ్ వలన నీ క్లాస్‌మేట్ ఆ క్రూరత్వానికి కలతపడి, భయపడి, ఆత్మహత్య చేసుకున్నాడు’’. ఎండిపోతున్న పెదిమలను నాలుకతో తిప్పి తడి చేసుకుంటూ అన్నాడు శేఖర్‌బాబు.
‘‘ఆ గుర్తుంది. కాని నేను అంత దూరం పోను. నేను రాగింగ్ అనుభవించానుగా. కనీసం దాంట్లో ఒక వంతైనా నా జూనియర్స్‌ని అనుభవించనీయండి’.
‘నువ్వు అట్లా చేయకూడదురా! ఇంగ్లీషులో ఒక సామెత ఉంది- ‘యాన్ ఐ ఫర్ యాన్ ఐ విల్ మేక్ ది వరల్డ్ బ్లైండ్’- అంటే ‘నీ కన్ను ఎవరైనా పొడుస్తే నువ్వు వాడి కన్ను పొడు, వాడు నీ రెండో కన్ను.. మళ్లీ నువ్వు వాడి కన్ను..’ ఇట్లాగే కళ్ళను పొడుస్తూ వుంటే ఒక రోజు లోకం అం గుడ్డిదైపోతుంది- శేఖర్‌బాబు కొంచెం వణికాడు.
సందీప్ తన తండ్రి వంక ఆశ్చర్యంగా చూసాడు. తను ఎవరినైతే కేవలం నోట్లు సంపాదించే, అవతలివాళ్లపై అజమాయిషీ చేసే, నాలుగు డబ్బులు కోసం ఎదురుచూసే మిషను అని అనుకున్నాడో, ఆయనలో ఇంత భావుకత వుందా? ఇంత లోతుగా ఆలోచించగలడా? మొట్టమొదటిసారిగా తన తండ్రి పట్ల గర్వంగా ఫీల్ అయ్యాడు. ఎవరికి తెలుసు? సృష్టిలో ప్రథమ సూర్యోదయంలాగా తన తండ్రి తన వయస్సులో ఆదర్శవంతుడిగా ఉండి ఉండవచ్చును. మానవత్వం కల మనిషిగా రంగుల కలలను చూసే వ్యక్తిగా ఉండవచ్చును. కాని జీవితంలోని ఆటుపోట్లు, మండుటెండలవలన ఈ విధంగా కేవలం వ్యావహారికంగా మనిషిగా తయారయ్యాడేమో. అన్ని విలువలు కోమలమైన భావాలు మొత్తాన్ని ఈ ఎండలే కాల్చేస్తాయేమో. ఋషికేష్‌లో జన్మస్థానం నుండి బయలుదేరే గంగ నీళ్ళు ఉజ్వలంగా, శే్వతంగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఇట్లాగే తను కూడా ఉజ్వలంగా, స్వచ్ఛంగా, శే్వతంగా ఉండటానికేగా ఆర్మీలోకి వెళ్తున్నాడు. అతడు ప్రేమగా గర్వంగా తండ్రివైపు చూశాడు- ‘సరేనండి నాన్నగారూ నేను నా జూనియర్స్‌ని రాగింగ్ ఎప్పుడు చెయ్యను’ అని మాట ఇచ్చాడు.
రైలు కదిలే సమయం వచ్చింది. అతడు తన తల్లిదండ్రుల కాళ్ళకు దండం పెట్టాడు. తండ్రి అతడి తలపై చేయి పెడుతూ ఆశీర్వదించాడు. అతడు తండ్రి వంక చూసాడు. తండ్రి కళ్ళు చెమ్మగిల్లాయి. ఏదో చెప్పలేని బాధను వ్యక్తం చేస్తున్నాయి ఆ కళ్ళు. ఆయన ఆత్మని ఏదో రంపం కోస్తోందా అనిపించింది. తల్లి సంగతి చెప్పనే అఖరలేదు. ఆవిడ కళ్ళు గంగాజమునలయ్యాయి. తను వాళ్ళ ఎదుట ఎక్కడ భావుకుడు అయిపోతాడోనని వెంటనే సిద్ధార్థ వీపు చరిచాడు. ధన్నుమని తన సీటుమీద కూర్చున్నాడు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత