డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
తన స్నేహితులు, పరమజీత్.. వినయ్.. గిరిరాజ్.. లక్ష్మణ్, హింమాషు.. తమ తమ నిర్ణయాలమీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి తను ఒక్కడే ఎందుకు పారిపోవడం.. వెనక్కి తిరిగి వెళ్లిపోవడం తను ససేమిరా ఈ పని చేయడు.. చేయడుగాక.. తన లక్ష్యం.. ఆర్మీ.. సైన్యం.. ఫౌజీ .. అంతే.. అంతే..
సందీప్ కలలు కన్న ఆ రోజు రానే వచ్చింది. ఒక రోజు మధ్యాహ్నం ఐ.ఇ.ఎమ్.ఎ. విశాల ప్రాంగణంలో పాసింగ్ అవుట్ పెరేడ్ అయింది. అతడి స్నేహితుల ఇంటివాళ్ళందరూ వచ్చారు. తన కుటుంబం వచ్చింది. ఇంటిల్లిపాదీ వచ్చారు. ఆ పెరేడ్‌లో విఐపిలు, నగరంలోని పెద్దలు అందరూ వచ్చారు. టివి కవరేజ్ కూడా ఉంది. రకరకాల గుర్రాలు.. అరబ్బీ గుర్రాలు.. రకరకాల దుస్తులలో పలుచోట్ల నుండి వస్తున్న చిన్న చిన్న గ్రూపులు.. అందమైన దృశ్యం.. ఆ సమయంలో అతడి హృదయంలో దేశభక్తి ఉప్పొంగింది. మాతృభూమిపై గౌరవం.. పది ఇంతలయింది.. మనస్సులో రాష్ట్ర ప్రేమ అనే అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అతడి ఆనందానికి సరిహద్దులు లేవు.. మార్చింగ్ పెరేడ్‌లో పలు దిశల నుండి ఎన్నో గ్రూపులు.. మనస్ఫూర్తిగా పాడుతున్నారు. కదమ్.. కదమ్.. బఢాయెజా.. ఖుషికె గీత్ గాయేజా.. ఏ జిందగీ కమ్ కీ.. కమ్ పర్ లుటాయెజూ.. (అడుగులు ముందుకు వెయ్యి.. ఆనంద గీతాలను పాడు.. ఈ జీవితం ఈ జాతిది.. ఈ జాతికోసం సర్వం అర్పించు) పాడుకుంటూ వస్తూ ఉన్న గ్రూపులన్నీ ఓ పెద్ద గ్రూప్‌లో కలిసిపోతున్నారు. అంతా ఒకటే ధార.. వర్షం కురుస్తున్న శ్రావణంలా ప్రతివైపు నుండి.. ఆశ్చర్యం, సౌందర్యం.. రాష్ట్ర ప్రేమ.. డిసిప్లిన్.. మొత్తం కార్యక్రమం అంతా భవ్యంగా.. దివ్యంగా.. దేశభక్తితో నిండిపోయింది.. అతడు పూర్తిగా భావుకుడయ్యాడు. మంత్రముగ్ధుడయ్యడు. రాష్ట్రీయ అనే మంత్రం.. అతడు మంత్రముగ్ధుడైపోయాడు.
పెరేడ్ అయ్యాక టోపీలను ఎగరేశారు. అతడికి కొత్తడ్రెస్ ఇచ్చారు. ఇప్పుడు అతడు జి.సి కైడేట్ 108 కాదు ఆర్మీమాన్. లెఫ్టినెంట్ అయ్యాడు. అతడి డ్రెస్‌కి రెండు భుజాల వైపు రెండు స్టార్లు ఉన్నాయి. రెండు స్టార్‌లు ఎరుపు రంగు బట్టతో కప్పి వేయబడ్డాయి. దీనిని తీసే గౌరవం ప్రతి లెఫ్టినెంట్ల తల్లులకే దక్కుతుంది.
పాసింగ్ ఔట్ పెరేడ్ తరువాత అందరి తల్లిదండ్రులను ఐఎమ్‌ఎ వైపు నుండి భోజనానికి ఆహ్వానించారు. తినేటప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు గాలిలో ఎగురుతూ సందీప్ దాకా వస్తున్నాయి. మొట్టమొదట పోస్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. సందీప్ స్నేహితుడైన నీరజ్ పోస్టింగ్ రాజౌరీలో అయింది. రాజౌరీలో ఎప్పుడు ఏవో ఒక గొడలు జరుగుతూ ఉంటాయి. నీరజ్ తండ్రికి ఏ మాత్రం మంచిగా అనిపించలేదు. సందీప్ తండ్రితో నీరజ్ తండ్రి భావుకతతో అన్నాడు - ‘చూడండి మొట్టమొదటి పోస్టింగ్ ఇంత దారుణంగా ఉంది. మరణానికి సిద్ధం కాకపోవడం కాకపోతే ఇంకేమీ లేదు’.
మరో స్నేహితుడు అఖిలేష్ పోస్టింగ్ అనంతనాగ్‌కి అయింది. వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు- ఆర్మీ తన లాభ నష్టాలనే చూసుకుంటుంది. వీళ్ళందరు ఇప్పుడిప్పుడే పుట్టిన పిల్లలు. వీళ్ళకు అనుభవం లేదు. ఇప్పటికైతే ఆర్మీ వీళ్ళమీద ఎక్కువగా ఏమీ ఖర్చు చేయలేదు. అందుకే ఉగ్రవాదుల అగ్నిగుండంలో వీళ్లని తోస్తే సరి ఎవరు వాళ్ళని అడిగే దిక్కు ఉండదు. 10, 20 సంవత్సరాల పాత మేనేజర్లను, కర్నల్‌లను పంపిస్తే చాలా ఖర్చవుతుంది’.
మరో తండ్రి అన్నాడు- ‘‘మన పిల్లలు ఎంతో గొప్ప ఉద్దేశ్యం కోసం, సెంటు భూమి కోసం ప్రాణాలు తెగిస్తారు. దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేస్తారు. కాని మన రాజకీయ నాయకులు మన సైనికులు దేనికోసం అయితే పోరాడారో, రక్తం చిందించారో ఆ భూమిపై చర్చలు జరుపుతారు. భూమిని మళ్లీ ఇవ్వడానికి సైతం ఒప్పుకుంటారు. ఎన్నో ఒప్పందాలు చేసుకుంటారు. కాని వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కుని? మరి వాళ్ళ ఆ భూమిని ఇచ్చేస్తే ఇంచ్ ఇంచ్ కోసం ప్రాణాలను త్యాగం చేసిన మన సైనికుల ప్రాణాలను కూడా తిరిగి ఇవ్వాలిగా.. నిజం చెప్పాలంటే ఈ రాజకీయ నేతల కొడుకులు ఆర్మీలో చేరి ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో’’.
‘‘కాని వీళ్ళ కొడుకులు ఆర్మీలోకి ఎందుకు వెళ్తారు? అసలు వీళ్లకి వెళ్ళే అవసరం ఏముందని? డబ్బుల మూటలు మూల్గుతున్నాయి. మనలాంటి వాళ్ళ పిల్లలే వెళ్తారు. ఏదో ఒక చోట పర్మినెంట్ జాబ్ దొరికింది కదా అని ఎగిరి గంతులు వేసేది మనవాళ్ళే. బయట ఏదైనా ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిస్తే లక్ష లక్షన్నర ఖర్చుచేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉచితంగా ఇంజనీరు అవుతాడు. అంతేకాదు జేబు ఖర్చు కూడా సంపాదించవచ్చు’’.
శేఖర్‌బాబు అంతరంగంలో పెద్ద పెద్ద అలలు లేచాయి. మనస్సును ఊపేస్తున్నాయి. తల తెగిన కోడిలా గిల గిల తన్నుకున్నాడు. తన ప్రాణం అయిన సందీప్ ఎక్కడికొచ్చి పడ్డాడు? చాలా బాధపడ్డాడు. ప్చ్.. తను విత్త సత్యమే (్ధనం అన్నింటికి మూలం) జీవిత సత్యం అని అనుకోకపోతే కొడుకు ఈ విధంగా చేతినుండి జారిపోయి ఉండేవాడు. కాదు.. ఛ... ఎంత పొరపాటు చేసాడు.. అసలు వాడు అర్మీలో చేరడానికి కారణం తన తండ్రి జీవితాన్ని వద్దనుకోవడమే కదా! కాకపోతే ఇప్పుడు గుడ్డిలో మెల్ల ఒకందుకు సంతోషపడవచ్చు. సందీప్ ఒక టెక్నికల్ స్కీమ్ కింద అందులో చేరాడు. కాబట్టి అతడిని లెఫ్టినెంట్ జనరల్‌గా చేసి నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదవడానికి మవుకి పంపించింది ఆర్మీ. కొత్త డ్రెస్, కొత్త ప్రయాణం కోసం మొట్టమొదటిసారిగా పయనం. ఆకాశం అంత ఎత్తున ఆగమేఘాలతో ఆ విహంగం.
ఒక్కసారిగా మెరుస్తున్న తన డ్రెస్ వంక చూసుకున్నాడు సందీప్. దాని మీద మెరుస్తున్న అక్షరాలతో మెటల్ మీద రాసి ఉంది సిగ్నల్.

- ఇంకా ఉంది

టి.సి.వసంత