డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
మత పిచ్చి నుండి బయటపడ్డారు యువకులు. ఎందుకంటే ఆ తరం వాళ్ళు ఈ మత పిచ్చివలన ఎంతో పోగొట్టుకున్నారు. సర్వస్వం కోల్పోయారు. ఇప్పుడు ఉగ్రవాదుల శవాలను తమ తమ ఊళ్ళలో పాతిపెట్టడానికి కూడా ఊరివాళ్ళు ఒప్పుకోవడంలేదు. ఇదే ఇంతకుముందయితే వాళ్ళు ఉత్సవాలు చేసేవారు. ఊరేగింపు తీసేవారు. ప్రస్తుతం కాశ్మీర్ యువకులు హిందూ ముస్లింల అండర్‌గ్రౌండ్ చీకటినుండి బయటపడి టూరిస్టులకు స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ బస్సులలో టాక్సీలలో చోటు దొరకదు’.
‘‘మరైతే నీకు పేరు మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముస్లింగా కనిపించాల్సిన గతి ఎందుకు పట్టింది?’’
‘‘నా పోస్టింగ్ కొండ ప్రదేశంలో జరిగింది. ఈ గుడ్‌గాంవ్ శ్రీనగర్‌కి 40 కి.మీటర్ల దూరంలో ఉంది. ఈ ఊళ్ళో ఉండేవాళ్ళందరు చాలా వెనుకబడి ఉన్నారు. ఇంకా ఆ వంద సంవత్సరాల పాత కాలంలోనే బతుకుతున్నారు. చెక్క ఇళ్ళు, మట్టి ఇళ్ళు, సిమెంటు ఇళ్ళే అక్కడ ఎక్కువ. అవన్నీ చాలా చిన్న చిన్న ఇళ్ళు. శిథిలావస్థలో ఉన్న దుకాణాలు. అసలు ఇక్కడ భోజనం తక్కువ. పిల్లా పాపలు ఎక్కువ. అందుకే ఇక్కడ చదువు సంధ్యలు లేవు. ఇక బీదరికం అయితే చెప్పనక్కరలేదు. ఆకలి గొడవలు తప్ప మరొకటి కనిపించవు. అందుకే ఇక్కడి వాళ్ళు వర్తమానంలో తక్కువ భూతకాలంలో ఎక్కువగా ఉంటారు. ఖురాన్ తప్పితే వాళ్ళకు మరొకటి తెలియదు. వాళ్ళ ప్రపంచంలో టీవీ లేదు. రేడియో లేదు. ఆటపాటలు అసలే లేవు. ఒకరిద్దరి ఇళ్ళల్లో టీవీలు ఉన్నా వాళ్ళు క్రికెట్ చూడకూడదు. నా ఫ్రెండ్ చెప్పాడు, వాళ్ళ ఇంట్లో టీవీ వుంది కాని క్రికెట్ చూడకూడదన్న నియమం వుంది.
ఎందుకంటే ఇటువంటి ఆటలు వాళ్ళ ఇస్లాంకి వ్యతిరేకం. అసలు వాళ్ళ మనస్సులకి ఆహ్లాదం అనేది అఖరలేదు. మరి ఆలోచించు- ఒక పాట వినకూడదు. ఒక ఆట ఆడకూడదు. జీవితంలో లయ లేదు. మరి వాళ్ళు నేరస్థులు కాక ఏవౌతారు? అసలు వీళ్ళలో దేశం, రాష్ట్రం అన్న భావనే లేదు. రెండే రకాలు- ఉంటే అందరు మహమ్మదీయులే కాకపోతే మహమ్మదీయులు కానివారు ఇస్లాం తప్పితే వీళ్ళు మరి దేని గురించి ఆలోచించరు. ఇక్కడ పిల్లలకు అంతో ఇంతో తెలివి వచ్చినప్పటినుండి ఇంట్లోనూ, స్కూళ్లలోనూ ఇస్లాం దారిలోనే నడవండి. నిజమైన జిహాదులు కండి అని నేర్పిస్తారు. ఎందుకంటే జిహాదులుగా మారడం అంటే కేవలం కుటుంబానికి అంతో ఇంతో ధనం వస్తుందనే కాదు, హీనత్వంతో, బీదతనంతో జీవిస్తున్న నిరుద్యోగి యువకులకు గొప్పగా బతకడానికి ఒక మార్గం. జిహాదీలుగా మారితే ఎంతో గౌరవం అని వాళ్ళు అనుకుంటారు. డబ్బుకి దాసోహం అయిపోతారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయన్న దురాశ. ఇస్లాం అపాయంలో వుంది అని చెప్పే, భయపెట్టే ఉగ్రవాదపు వలలో చిక్కుకుపోతారు కాని ఇదంతా మోసం, తాము వలలో చిక్కుకున్నారు అని యువత తెలుసుకునేసరికి ఉగ్రవాదులనే కొండచిలువలో పూర్తిగా చిక్కుకుని పోయి ఉంటారు.
‘‘అంటే అర్థం, బీదతనం అవిద్యల గర్భం నుండి పట్టున ఈ ఉగ్రవాదుల కథ అసలు కంచికే వెళ్లదని. ఈ ఉగ్రవాదాన్ని సైనికులు రైఫిళ్ళతో మట్టుపెట్టలేం అని అంటున్నావా?’’
సిద్ధార్థ మాటలకు సందీప్‌కి కొంత ఆనందం కలిగింది. సిద్ధార్థకి ఉగ్రవాదం గురించి వివరించి చెప్పే ఒక అవకాశం దొరికిందని అతడికి అనిపించింది.
‘‘అందుకే మేము దూర దూరాలు ఉన్న ఊళ్ళల్లో స్కూళ్ళు, కాలేజీలు, ఉచిత చికిత్సాలయాలను తెరిచాము. అంబులెన్స్‌లను నడిపించాము. మొబైళ్ళను కూడా ప్రవేశపెట్టాము. ఇవన్నీ చేసినందువలన లోకల్ మిలిటెంట్లని ఏరిపారేసే అవకాశం లభించింది. సగానికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. కొంతమంది పాకిస్తాన్‌కి పారిపోతే మరికొందరు లొంగిపోయారు. వాళ్ళకి శరణం ఇచ్చాము. ఇక ఇప్పుడు ఉన్నదంతా ఫారెన్ మిలిటెన్సీనే. ఉగ్రవాదులు ఎక్కువగా పాకిస్తాన్‌కి, ఆప్ఘనిస్తాన్‌కి, ఈజిప్టు, యెమన్, బంగ్లాదేశానికి సంబంధించినవారే. వీళ్ళందరు లోకల్ యూత్‌ని జిహాద్ అన్న పేరున రెచ్చగొడుతున్నారు. అమాయకులైన కాశ్మీరీ యువకులు వర్తమాన సత్యాన్ని తెలుసుకున్నా తిరిగి మళ్లీ వీళ్ళ వలలో పడిపోతున్నారు. విదేశీ ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నారు. వీళ్ళు రెచ్చిపోతున్నారు.
లోపల కూర్చున్న సిద్ధార్థకి ఊపిరి ఆడటంలేదు. ఖాళీ సమయంలో వనాలను, కొండలను చూడాలనిపించింది. వనాలకు చీడపట్టిందని, కొండలలో ఇప్పుడు ఆ అందం లేదని అతడికి తెలియదు. అన్నయ్య మాటలను మధ్యలో తుంచేస్తూ అన్నాడు. ‘అన్నయ్యా! ఏదైనా వెహికల్ తెప్పించు. బయటికి తిరిగి వద్దాం. భోజనం బయటే చేద్దాం’.
ఈ మాటలు వినగానే సందీప్ భ్రుకుటి ముడిపడ్డది. బయటికి వెళ్ళలేము అన్న సంగతిని తమ్ముడికి ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. ఈ గుడ్‌గాంవ్ గాలిలోనే అనుమానం, భయం, అసహ్యం, ద్వేషం మిళితమై ఉన్నాయని ఎట్లా చెప్పాలి. మృదువైన మాటలతో తమ్ముడికి నచ్చచెప్పచూసాడు. ‘బాడీగార్డ్ లేకుండా, ఆర్మీ వెహికల్‌లో సివిల్ డ్రెస్‌లో రావడం అపాయాన్ని ఆహ్వానించినట్లే. నాకు అనుమతి కూడా దొరకదు. వచ్చేటప్పుడు ఒకవేళ చీకటి పడ్డదంటే మనం అక్కడ చిక్కుకుపోతాము. ఉగ్రవాదం చీకట్లోనే చిందులేస్తుంది. ఇక్కడినుంచి అక్కడిదాకా.. ఒక ఊరినుండి మరో ఊరిదాకా.. గుడ్‌గాంవ్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ సిటిజిన్‌లకి రాత్రి బయట తిరిగే అనుమతి లేదు. ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా చేతిలో టార్చ్ కానీ దీపం కాని ఉండి తీరాలి. లేకపోతే ఆర్మీ వాళ్ళని కాల్చేస్తుంది. ఎందుకంటే రాత్రిపూట మిలిటెంట్లు బయటికివస్తారు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత