డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

ఒకప్పుడు ఊళ్ళో ఎవరైనా మిలిటెంట్ చంపబడితే ఊరివాళ్ళు రాలీ తీసేవాళ్ళు. వాళ్ళకోసం అతడు ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వాళ్ళ ఉద్దేశ్యం. ఊళ్ళో నివసించే ముసలన్ములు ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చేవాళ్ళు.
ఇదంతా ప్రజలలో మానసికంగా వచ్చిన మార్పా లేకపోతే ఆర్మీ భయమా! ఎందుకంటే ఆర్మీ వాళ్ళు మిలిటెంట్లకి సహానుభూతి చూపేవారిని ఒక కంట కనిపెట్టి ఉండేవాళ్ళు. ఎదురుకుండా ప్రవహిస్తున్న సింధూనదిలా ఆలోచనా నదులు ప్రవహిస్తున్నాయి. అతడికి ఒక ఇరానీ కథ గుర్తుకు వచ్చింది. అందులో ఒక తండ్రి తిరుగుబాటు చేసిన కొడుకు శవం తీసుకుని పూడ్చడానికి ఇంత చోటిమ్మని ఇంటింటి గడప తొక్కాడు. కాని అందరు రాజుకి భయపడి సుది మోపినంత చోటు కూడా ఇవ్వలేదు.
ఉఫ్! రెండు వర్గాలమధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటే ఈ ప్రపంచంలో రక్తపాతం తప్పదు.
భూషణ్ కంపెనీలో ఉన్నవారికి హిందుస్తానీ అవడమే ఎంతో భయంకరమైనది అన్న విషయాన్ని ఆ భూమి గుర్తుచేస్తూ ఉంటుంది. సివిలియన్‌లకి నిజానికి ఈ అనుభూతి కలుగుతూనే ఉంటుంది. ఈ అనుభూతిలో భయం, గౌరవం రెండూ మిళితమై ఉన్నాయి.
సిద్ధార్థ ఇంకొంచెం ముందుకు నడిచాడు. మళ్లీ అక్కడ సూచనలు ఉన్న బోర్డు కనిపించింది. ఇక్కడ అన్ని బోర్డులమీద రాసి గోడలమీద వేళ్ళాడదీశారు. బయటవాళ్ళు ఎవరైనా చదివితే అతడికి వెంటనే గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆర్మీ బేస్ కాంప్. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్లు, ఆఫీసర్ల కుటుంబ సభ్యులు తప్ప ఒక్క పిట్ట కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు కూడా ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఉండటాని అనుమతి ఉంటుంది. ఈ సూచనలు కూడా ఎంతో ఇంటరెస్టుగా ఉన్నాయి. అతడు చదవసాగాడు.
హెచ్.హెచ్.టి.ఐని ఎప్పుడు రెడీమేడ్‌గా ఉంచాలి. లేకపోతే మీరు దీన్ని రెడీమేడ్‌కి తెచ్చేలోపల రెండు మూడు నిమిషాలు గడిచిపోతాయి. ఇంతలో మిలిటెంట్లు మీ దగ్గరగా వచ్చేస్తారు. ఇది ప్రమాదం. అందువలన రెడీమేడ్‌లో పెట్టి ఉంచాలి. దీనివలన మీరు దూరంగా జరిగే కార్యకలాపాలను చూడవచ్చును. వెంటనే ఫైర్ చేయవచ్చును.
-ఒక ఎడ్‌హాక్ యోజన మీ మైండ్‌లో వుంచుకోండి. ఒకవేళ ఎక్కడైనా వెంటనే ఏదైనా చర్య తీసుకోవాలంటే మీరు తీసుకోగలుగుతారు.
-కన్వాయ్‌లో అందరికన్నా చివర దిగేవాళ్లు ముందు ఎక్కాలి. అందరికన్నా ముందు దిగేవాళ్లు చివరికి ఎక్కాలి.
-జీప్‌ని ఎప్పుడు కన్వాయ్ లైట్ మీద నడపండి. దీనివలన దూరంగా వున్నవాళ్లకు ఈ జీప్ కనిపించదు.
-రాత్రిపూట చాలా చిన్నగా మాట్లాడాలి. చీకటిలో మన మాటల సౌండ్ దూరంగా వినిపించే అవకాశం ఎక్కువ. మెల్లిగా నడవండి దీనివలన చంపాలని పొంచివున్న మిలిటెంట్లకి ఎటువంటి సౌండ్ వినిపించదు. దగ్గుకాని తుమ్ముకాని వస్తే నోటిమీద చేతిని వత్తి పెట్టుకోండి.
-సైనికులు ఎప్పుడు తమ వెంట ఒక చిన్న టార్చ్ ఉంచుకోవాలి. పగలైనా రాత్రైనా ఇక్కడ కాశ్మీరంలో మన అందరి ఉద్దేశ్యం ఒకటే- మిలిటెంట్లని చంపేయడం.
ఎంతో లీనంగా చదువుతున్న సిద్ధార్థ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెనకనుంచి సందీప్ సిద్ధార్థ వీపుమీద గట్టిగా కొట్టాడు- సిద్ధార్థా! ఎందుకురా ఇవన్నీ చదువుతున్నావు? ఇవన్నీ ఆర్మీవాళ్ల కోసం. సివీలియన్లు వీటిని చదవకూడదు. ఇవన్నీ రహస్యాలు.
‘‘మరయితే వీటిని బాహాటంగా ఎందుకు పెట్టారు?’’
‘‘తమ్ముడు! ఇవన్నీ మా ఆర్మీవాళ్లలాగా బాహాటంగానే ఉంటాయిరా! తమరు ఇక్కడ నిల్చోకూడదు. నీ రూమ్‌కి వెళ్లు..’’ చెబుతూ చెబుతూ సందీప్ నవ్వాడు.
‘‘వెళ్తానులే... అయినా నాకు ఎటువంటి ఇంటరెస్ట్ లేదు. పిల్లల్లాగా పెద్దల వేలు పట్టుకుని నడవాలని నేను అనుకోవడంలేదు. హెచ్.హెచ్.టి.ఐ అంటే ఏమిటో చెబుతావా?
‘‘చెప్పడం ఎందుకు? నీకు చూపిస్తాను. ఇప్పుడు నేను తొందరలో వున్నాను. ఇది చాలా ఖరీదైన కెమెరా! ఇది ప్రతి యూనిట్లో వుండి తీరాలి. దీనివలన చిమ్మచీకట్లో రాత్రిపూట ఎన్నో కి.మీ దూరం చూడగలుగుతాము. స్పష్టంగా కనిపిస్తుంది.’’
‘‘కాని అడుగడుగునా సూచనలున్న ఈబోర్డులని ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదు.’’
‘‘ఎందుకంటే ప్రతీ సిపాయి కూర్చున్నా- నిల్చున్నా, పగలు- రాత్రి సమయం దొరికినప్పుడల్లా వీటిని చదువుకోవాలని. మా ఉద్దేశ్యం కేవలం మిలిటెంట్లని చంపడమే కాదు కాశ్మీరులకి ఆర్మీకి మధ్య సద్భావన వుండాలి. ఏం చెప్పను? ఇంత జాగ్రత్తగా వున్నా ఇంత నైతికతతో కూడిన పాఠాలు నేర్పించినా అప్పుడప్పుడు మా సైనికులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. ఇనే్నళ్ల శ్రమ అంతా వృధా అవుతుంది. దాదాపు ఒక నెల క్రితం ఒక సంఘటన జరిగింది. రాజోర్ ఊరులో ఈ సంఘటన జరిగింది. మాకు మిలిటెంట్లు కింద వున్నట్లుగా సమాచారం అందింది. హ్యూమన్ రైట్స్‌వాళ్లు ప్రతి దాంట్లో కలగజేసుకుని మమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏమాత్రం పరధ్యానంగా వున్నా మానెత్తికి చుట్టుకుంటుంది. అందుకే ప్రతీ అడుగు ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి. ఆరోజు మేం అందరం అక్కడ ముట్టడించి కూర్చున్నాము. హ్యూమన్ రైట్స్ వలన మేం అర్థరాత్రి ఎవరి ఇంట్లోకి వెళ్లకూడదు. చౌకసీ చేయకూడదు. మేం ఆ రాత్రంతా ఎముకలు కొరికే చలిలో అట్లాగే ఉన్నాము. పొద్దునే్న సర్చ్ చేయడం మొదలుపెట్టాము. ఒక ఇంటివాళ్లు అభ్యంతరం చెప్పారు. మా సైనికులు అసలే అలసిపోయి వున్నారు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత