డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అడుగు అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. ఎన్నో ఆపరేషన్లకి అతడు వెళ్ళాడు. కాని ఇవాళ కళ్ళెం అతడి చేతిలోనే ఉంది. సూత్రధారుడు అతడే. అందువలన ప్రతి అడుగు తూచి తూచి వేస్తున్నాడు. చెవులు నిక్కపొడుచుకున్నాయి. కళ్ళు పెద్దవయ్యాయి. ఎక్కడినుండో చప్పుడు వస్తోంది. ఉహు.. ఎక్కడ ఏ శబ్దం వినబడటంలేదు. హెచ్.హెచ్.టి.ఐ ఆన్ మోడ్‌లో ఉన్నది. దాన్ని ఐ గ్లాస్‌లోంచి మళ్లీ ఒకసారి చూసాడు. దూరంగా ఉగ్రవాదులే కాదు ఒక్క పిట్ట కూడా కనబడటంలేదు. అతడు గడియారం చూసుకున్నాడు. 12 గంటల 56 నిమిషాలయ్యాయి. ఏమో! అసలు ఈ వార్త నిజమేనా? అబద్ధం కూడా కావచ్చు. ఎన్నోసార్లు ఇట్లా జరిగింది. వార్త నిజమైతే సరే, లేకపోతే విరుద్ధంగా కూడా కావచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళ యూనిట్ మేజర్ రాధోర్ టీమ్ పట్ల జరిగిన విషాదకరమైన సంఘటనని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. బ్రేవో కొండమీదనుండి ఒక మిలిటెంటు కిందికి దిగి వస్తున్నాడు అన్న వార్త వచ్చింది. మేజర్ రాథోర్, చార్లీ కంపెనీ కమాండర్ కెప్టెన్ బలవీర్‌సింహ్ ఆరుగురు సిపాయిలతో బ్రేవో కొండ వైపు బయలుదేరారు. దాదాపు ఎనిమిది మంది సైనికులు చీకటిలో పాక్కుంటూ కొండపై చేరారు. ఇంతలో వాళ్ళని మిలిటెంట్ల చుట్టుముట్టారు. ఒకటే చోటున దాదాపు పనె్నండు మంది మిలిటెంట్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆధునికమైన సాధనాలు ఎన్నో ఉన్నాయి. అక్టోబరు నవంబరులో మొక్కజొన్న కంకులు వస్తాయి. పొలాలన్నీ ఆ మొక్కలతో నిండిపోయి ఉంటాయి. మిలిటెంట్లు వాటి వెనక దాక్కున్నారు. మిలటరీ వాళ్ళని మిలిటెంట్లు గడ్డిపోచలను నరికినట్లుగా వాళ్ళని ముక్కలు ముక్కలుగా కోసారు. బస్తాలలో ఆ ముక్కలను పడేసి భూషణ్ కాంప్‌కి బయటపడేసి పారిపోయారు. ఆలోచిస్తున్న సందీప్ హృదయం బరువెక్కింది. ప్చ్ ఎవరైనా రెండు వైపుల వాళ్ళలో ఉన్న కోప ద్వేషాలను ఆపగలిగితే ఎంత బాగుండును.
మళ్లీ అతడు తనని తను సంబాళించుకున్నాడు. వీటిని గురించి ఆలోచించే సమయం ఇది కాదు.
గడియారంపై దృష్టిపడ్డది- 2 గంటల 35 నిమిషాలు. అతడు హతాశుడయ్యాడు. ప్రతి గూపునుండి ఇద్దరు నిద్రపోవాలి, ముగ్గురు మేల్కొనాలి అని నిర్ణయించుకున్నారు. ఒక గ్రూపు అయ్యాక మరో గ్రూపు ఈ విధంగానే చెయ్యాలి. సందీప్ అతడి టీమ్ లోడెడ్ ఎ.కె.47తో సహా చెట్లకు వీపులను ఆనించి, కొంచెం తాగి ఒరిగారు.
రాత్రి వాళ్ళు అట్లానే పడుకుని ఉంటే అసలు తెల్లారకపోతే ఎంత బాగుండును. కాని రాత్రి గడిచిపోయింది.
ఉదయం సందీప్ సెకెండ్ ఇన్ కమాండ్ కర్నల్ బక్లీకి వార్త పంపించాడు. కిందకి దిగమని సర్చ్ చేయమని అక్కడినుండి ఆర్డర్ వచ్చింది.
మూడు గంటలు నడిచి కిందకి దిగారు. రోజంతా వెతుకుతూనే ఉన్నారు. మూల మూలలో వెతికారు. ఎలుకలు వస్తాయి అన్న ఉద్దేశ్యంతో పిల్లులులాగా పొంచి కూర్చున్నారు. ఎంతోసేపు ఎదురుచూసారు. కాని ఎలుకలు రాలేదు. మళ్లీ కర్నల్ భక్షీని కాంటాక్ట్ చేసారు. పైకి వెళ్ళమని పైన సర్చ్ చేయమని ఆర్డర్ వచ్చింది.
కాటేజ్‌లో సిద్ధార్థ ఒంటరిగా ఉన్నాడు. మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో.. చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచననుండి తప్పించుకోవడానికి లాప్‌టాప్‌ని ఓపెన్ చేశాడు. మెయిల్ చెక్ చేసుకున్నాడు. ‘వన్ మినిట్ మేనేజర్’ పుస్తకాన్ని తిరిగేశాడు. అయినా మనస్సుకి శాంతి కలగలేదు. కాసేపు బయట తిరిగాడు. భూషణ్ కాంప్ నుండి బయటికి వెళ్ళేందుకు అనుమతి లేదు. లోడెడ్ పిస్తోలు దగ్గర ఉన్న అతడిని వెంట పంపిస్తే కొంత ఫరవాలేదు. గదిలో ఉన్నా చికాకుగా ఉంది. ముఖ్యద్వారం దాకా వచ్చాడు. బయట నిలబడి ఉన్న సిపాయితో తనకి బయటికి వెళ్లాలని ఉంది అని అన్నాడు. అతడు ఎంతో విధేయతతో మరొక సైనికుడిని అతడికి రక్షణగా పంపించాడు.
ఎదురుగుండా గలగలా ప్రవహిస్తున్న సింధునది. ఒడ్డున నడవడం మొదలుపెట్టాడు. తపోవనంలో వున్నట్టుగా వాతవారణం అంతా శాంతి నెలకొల్పి ఉంది. కొంచెం దూరం నడిచాడో లేదో చెవులు పగిలేలా శబ్దం వినిపించింది. థాంయ్.. థాంయ్.. దట్టమైన అడవులలో సిఆర్‌పిఎఫ్ ప్రాక్టీసు ఫైరింగ్ చేస్తున్నారు. మధ్యలో ఉగ్రవాది బొమ్మ. దానిని గురిపెట్టి కాలుస్తున్నారు. గుళ్ళు ఆ బొమ్మకి తగులుతున్నాయి. అతడు సరదాగా కాల్చాలని ఉంది అని అడిగాడు. పిస్తోలు అతడికి ఇచ్చారు. అసలు ఆ పిస్తోలే చాలా బరువుగా వుంది. ఎట్లాగొట్లా కష్టపడి మరో సిపాయి భుజంమీద పిస్తోలు పెట్టి ఏదో విధంగా ట్రిగర్ నొక్కాడు. బొమ్మ పక్కనుండి గుండు దూసుకుపోయింది. కొంచెంసేపు అక్కడే నిల్చున్నాడు. ఫైరింగ్ సౌండ్‌ని వింటూ యుద్ధ దృశ్యాన్ని ఊహించుకున్నాడు. కొంచెం ముందుకు నడిచాడు. ‘బజారు ఎంత దూరంలో ఉంది?’ అని అడిగాడు.
‘‘దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది’’
‘‘నీవు నడవగలుగుతావా?’’
‘‘సైనికుడు నవ్వాడు. ‘సర్ మీరు నడవగలుగుతారా? ఆలోచించండి. మాకు అలవాటే. పదికిలోమీటర్ల దాకా నడుస్తాం’’
ఒకవైపు ఎండిన ఆకుల గలగలలు.. మరోవైపు కలకలా ప్రవహిస్తున్న నది. మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే చల్లటి గాలులు. సిద్ధార్థ మనస్సు పరవశింపజేశాయి. నడుస్తున్న సిద్ధార్థ ఆగిపోయాడు. అక్కడి సస్యశ్యామలాన్ని, అద్భుతమైన అందమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న అతడిపై పిడుగుపడ్డట్లయింది. ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత