డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అతడు ఈ లోకంలో లేనట్లుగా తనలో తను గొణుక్కుంటున్నాడు. అతడు ఎవరినో తిడుతున్నాడు. శాపనార్థాలు పెడుతున్నాడు. దేవుడా! ఇదేం లోకం, పనివాడు కూడా శాంతిగా బతకలేకపోతున్నాడు అని అనుకున్నాడు సిద్ధార్థ.
అతడు మళ్లీ లాప్‌టాప్‌లో మునిగిపోయాడు. కాని అతడి చెవులను పనివాడి ఏడుపు శాపాలు వినిపిస్తూనే ఉన్నాయి. మళ్లీ అన్నయ్యని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. మళ్లీ అదే జవాబు. సాహెబ్ బయట ఉన్నాడు. ఇంకా వెనక్కి రాలేదు. ఎప్పుడు వస్తాడు. వచ్చాక మీకు తెలియపరుస్తాము. కట్...
రాత్రి మళ్లీ పోస్టు చేశాడు. మళ్లీ అదే సమాధానం. కాని ఈసారి కొంచెం ఆశ చిగురించే జవాబు వచ్చింది. ఉదయం వచ్చే అవకాశం ఉంది.
సిద్ధార్థ రాత్రంతా రామ రామ అంటూ గడిపాడు. ఉదయం ఆరు గంటలయింది. మళ్లీ ఫోన్ చేశాడు. కాని లైన్ డెడ్ అయి ఉంది. సిద్ధార్థ భయంతో ఒణికిపోయాడు. అన్నయ్య ఒక్కసారి చెప్పాడు- వాళ్ళు ఎన్‌కౌంటర్ చేసేటప్పుడు బి.ఎస్.ఎన్.ఎల్ కనెక్షన్‌లని ఆఫ్ చేస్తారు. ఎందుకంటే మిలిటెంట్లు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేరు. దేవుడా! అన్నయ్య ఏదైనా ఆపరేషన్‌లో... ఎవరిని అడగాలి? పనివాడిని అడిగాడు. ఆజ్ తక్ చానల్ పెట్టండి. ఎక్కడైనా బ్లాస్ట్ అయినా, ఎన్‌కౌంటర్ అయినా తెలుస్తుంది అని అతడు జవాబు చెప్పాడు.
అతడు దేవుళ్ళను ప్రార్థించడం మొదలుపెట్టాడు. భగవంతుడా, అన్నయ్య క్షేమంగా ఉండాలి. దాదాపు ఎనిమిది గంటలకు అతడు బయటకి వచ్చాడు. చుట్టుప్రక్కల ఉన్న ఆఫీసర్లని అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని అనుకున్నాడు. కర్నల్ ఆప్టే తన చేంబర్ వైపు వెళ్తున్నాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
‘గుడ్ మార్నింగ్ సర్!’
‘గుడ్ మార్నింగ్, మీరు మేజర్ సందీప్‌గారి సోదరుడు కదా!’
సిద్ధార్థకి కర్నల్ సాహెబ్‌కి తను ఇక్కడికి రావడం తెలుసును అని తెలుసుకోగానే ఆశ్చర్యం కలిగింది. (అసలు కర్నల్ అనుమతి లేనిదే అతడికి ఉండే అవకాశం లేదు)
సిద్ధార్థ అడిగాడు- ‘సర్! సందీప్ నిన్న ఉదయం వెళ్ళాడు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. తను సాయంత్రం ఫ్లైట్‌లో వెళ్లాలి. తను వెళ్ళేముందు అతడిని కలుసుకోగలడా! కర్నల్ ఆశ్చర్యంగా అడిగాడు- మీకు మేజర్ సందీప్ ఆపరేషన్ పనిమీద వెళ్లారని తెలియదా! రెండు రోజుల ముందు అసలు రాలేడు. ఇంకా సమయం పడుతుంది’.
‘‘ఏమిటి? ఆపరేషన్.. అంటే అపాయం’’.
‘నో డౌట్.. అపాయం ఎటూ ఉంది. నేను ఆపరేషన్ అంతా అయ్యాక వెళ్తాను. అతడికే అపాయం.. ఈలోపల ఏదైనా సరే అంతా అతడే సంబాళించుకోవాలి’.
కర్నల్ చెబుతున్నాడు. సిద్ధార్థ అన్నయ్య విషయంలో ఎంతగా బాధపడుతున్నాడో, కుంగిపోతున్నాడో అన్న సంగతి అతడికి అక్కరలేదు. సిద్ధార్థలో భయం ఎక్కువ కాసాగింది. ఉగ్రవాదులతో తలపడటం, ఎన్‌కౌంటర్ల వలన కర్నల్‌లో ఏ మాత్రం సంవేదనా లేకుండా పోయింది. తను ఇచ్చే జవాబు సిద్ధార్థకి పిస్తోలు గుండులా తగులుతుంది అన్న ఆలోచన కూడా అతడికి లేకుండా పోయింది. ఆయన ముందుకి నడిచాడు. స్తబ్దంగా నిలిచిపోయిన సిద్ధార్థ అక్కడే మెట్ల మీద కూర్చండిపోయాడు. లోపల దేవుడిని ప్రార్థించసాగాడు. దేవుడా! అన్నయ్యని రక్షించు. నేను వెళ్ళే ముందు సందీప్‌ని చూడగలగాలి. భగవంతుడా! ఇక ముందు కూడా ఎటువంటి చెడు సమాచారం రాకూడదు. అతడు క్షేమంగా ఉండాలి.
మెట్లమీద కూర్చున్న సందీప్ భూషణ్ కాంప్‌లో జరుగుతున్న కార్యకలాపాలను చూడడం మొదలుపెట్టాడు. యూనిఫామ్‌లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు ఎంతో చురుకగా గబగబా నడుస్తూ వచ్చారు. ఆర్మీ డాగ్స్ బయట లాన్‌లో తిరుగుతున్నాయి. అవి నల్లగా బలిష్టంగా ఉన్నాయి. వీటి ట్రైనింగ్ ఎంతో కఠోరంగా ఉంటుంది. ఈ ఆర్మీ కుక్కలకు కూడా క్లాసులు ఉంటాయి. వీటిని బ్రహ్మచారులుగానే ఉంచుతారు. దీనివలన వాటి బలం అంతా ఆర్మీకే ఉపయోగపడుతుంది. ఇంతలో లోపలికి వస్తున్న అంబులెన్స్‌పై అతడి దృష్టి పడ్డది. సందీప్.. అతడు వణికిపోయాడు. ఎన్నో యుగాల నుండి తను అక్కడే ఉన్నాడా అని అనిపించింది. ఇంతలో ఒక అతను అటునుండి వెళ్తున్నాడు. అతడిని ఆపి సిద్థార్థ అడిగాడు- ఈ అంబులెన్స్ ఎందుకు వచ్చింది? ఎంతో వినయ విధేయతలతో అతడు జవాబు చెప్పాడు. సాహెబ్‌జీ! దగ్గర ఉన్న గ్రామంలో మేము ఫ్రీ కాంపు పెట్టించాము. మందులు పంచాము. అక్కడినుండే వస్తోంది ఈ అంబులెన్స్..
సిద్ధార్థ రెండు చేతులు జోడించాడు- భగవంతుడా నువ్వు నిజంగా ఉన్నావు. కొంచెం దూరంలో ఆర్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అతడు వినసాగాడు. ఆ రోజే జమ్మూలో ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో బిఎస్‌ఎఫ్ సిఫాయి ఒకడు వీరగతి పొందాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తప్పదు. చిన్న బంతిలా ఉండే హాండ్ గ్రెనేడ్ ఎవరైనా ఎక్కడైనా దాచుకుని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. సిద్ధార్థ వినలేకపోయాడు. తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. తనని తను సంభాళించుకోవడానికి వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న సిమెంట్ అరుగుమీద కూర్చున్నాడు. ఇప్పటిదాకా తను ఎన్నోసార్లు ఆపరేషన్ల గురించి, ఇద్దరిమధ్యా జరిగే యుద్ధం గురించి విన్నాడు. కాని ఇందులో ‘నేను’ అన్న అంశం లేదు.. అది అతడి నిజ జీవితంలోని సరిహద్దులకి బయట ఉంది

- ఇంకా ఉంది