డైలీ సీరియల్

యమహాపురి 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శశి ప్రదీప్ ప్రేమ వలలో పడిపోయింది. అయినవాళ్ళందర్నీ కాదనుకుని అతడితో లేచిపోయింది.
ఆ తర్వాత అంతా మామూలు కథే!
రెండు వారాలు ప్రదీప్, శశి- తమ ఊరికి దూరంగా ఓ విహార స్థలంలో హనీమూన్ చేసుకున్నారు. శశి తనను బాగా నమ్మింది కాబట్టి- నమ్మించి ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు ప్రదీప్.
అక్కడ శశి పాప అయింది. ఆమెకి మగాడిలో పులి, సింహం, తోడేలు, మొసలి, కొండచిలువ వగైరా క్రూర జీవాల క్రూరాత్మలు దర్శనమిచ్చాయి. ఒక ఏడాది పాటు మృగాళ్ల భయంకర మృగయా వినోదానికి గురైన ఆమెకి, మగాణ్ణి స్నేహపూర్వకంగా ఆహ్వానించే భయంకర తప్పిదాన్ని జీవితంలో మళ్లీ చెయ్యకూడదనిపించేది.
కానీ ముందా నరక కూపం నుంచి బయటపడాలి కదా!
ఒకసారి పోలీసు రైడింగులో అరెస్టయింది శశిపాప. చాలామంది దురదృష్టంగా భావించే ఆ సంఘటన ఆమెకి వరంగా పరిణమించింది. కారణం ఆమెని అరెస్టు చేసిన ఇన్స్‌పెక్టర్ ఈశ్వర్ మానవతావాది. స్ర్తిజన పక్షపాతి. ఆ కథ విని జాలిపడ్డాడు. అతడి ధర్మమా అని ఆమె ఆర్నెల్ల జైలు శిక్షతో బయటపడింది.
ఈశ్వర్ ఆమెకి నీతి బోధ చేసి మామూలు జీవితం ప్రారంభించమన్నాడు.
శశి ఒప్పుకోలేదు. ‘‘మామూలు జీవితమంటే ఒక మగాడికి కట్టుబడి, ఆ మగాడికి సేవలు చేస్తూ, అతడి వారసులకి జన్మనిస్తూ గడపాలి. నా జీవితం గతి తప్పడానికి కారణం మగాడు. నేనెదుర్కొన్న భయంకర అనుభవాలన్నీ మగాణ్ణించి. ఐతే మగాళ్లంతా ఒక్కలా ఉండరని నాకు కూడా తెలుసు.
అందుకు మీరే నిదర్శనం. ఐనా ఓ మంచి మగాడు మంచి మనసుతో నా మీద ఆసక్తి చూపిస్తే- మనిషిగా దూరాన్నుంచి గౌరవిస్తాను కానీ, నా మనిషిగా నా జీవితంలోకి ఆహ్వానించి దగ్గర చేసుకోలేను. మెజారిటీ మగాళ్లు మృగాళ్లని- అనుభవం నుంచి తెలుసుకున్నాను. ఆడాళ్లని వేటాడ్డం వాళ్లకి వినోదమని నాకు స్పష్టమయింది. ఇప్పుడు నేను వాళ్ల వేటని నాకు ఆటగా మార్చుకుని వినోదిస్తాను. సంపద శిఖరాలు చేరడానికి- పురుషులనే మెట్లుగా చేసుకుంటాను. నాకు నేనే బాస్‌గా ఉంటూ జీవితాంతం స్వతంత్రంగా బ్రతకడానికి ఎప్పటికీ శశి పాపగానే ఉండిపోతాను’’ అని- ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే నేను కాల్‌గర్ల్‌గా కొత్త జీవితం ప్రారంభిస్తాను’’ అంది.
‘‘నువ్వు కాల్‌గర్ల్ అయితే, అది కొత్త జీవితం అనిపించుకోదు. పాత సీసాలో కొత్త సారా ఔతుంది. సమాజంలో నీకు గౌరవం దక్కదు. నేనే నిన్ను మళ్లీ రెయిడింగ్‌లో పట్టుకుని అరెస్టు చెయ్యొచ్చు. నా మాట విని నీ ఆలోచనల్ని తప్పుదారి తొక్కనివ్వకు’’ అని హెచ్చరించాడు ఈశ్వర్.
శశి నవ్వింది, ‘‘సారా కల్లుపాకలో తాగితే అగౌరవం. బార్లో తాగితే ఆధునికం. నా జీవితమిప్పుడు పాత సీసాలో కొత్త సారా కాదు సార్! నేను సారా, జీవితం సీసా అనుకుంటే- నా జీవితమిప్పుడు కొత్త సీసాలో పాత సారా! అదీకాక నాకిప్పుడు గత జీవితపు నీడలు నన్ను వెంటాడుతాయన్న బెంగ లేదు. ఎందుకంటే కాలం మారిపోయింది సార్! ఇంటర్నెట్లో పూర్తిగా బరితెగించి కనిపించే సన్నీ లియోన్ అంటే నేడు మన దేశంలో పెద్ద క్రేజ్. ఆమె కోసం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ఆమెతో నటించాలని మన హీరోలు తహతహలాడుతున్నారు. నేపథ్యం కంటే హోదాకి విలువిచ్చే ఈ ఆధునిక ప్రపంచంలో- నేను నా హోదాని నిలబెట్టుకుంటే చాలు- సమాజం నాకు సలాం చేస్తుంది’’ అంది.
ఈశ్వర్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని, ‘‘మా పరిధిలోకి రానంతవరకూ, నీ దారి నీది. నీకు మేలు జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నాడు.
‘‘అందుకు మీ నుంచి చిన్న సాయం కావాలి సార్!’’ అంది శశి.
‘‘అడుగు, చెయ్యగలిగిందైతే చేస్తాను’’ అన్నాడు ఈశ్వర్.
‘‘నా కోసమే కాదు- సమాజం కోసం కూడా ఏమైనా చెయ్యాలనుంది. మీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఫార్మర్స్ జాబితాలో నన్ను వేసుకోండి’’ అంది శశి.
‘‘నువ్వా, ఇన్‌ఫార్మర్‌వా?’’ అన్నాడు ఈశ్వర్ ఆశ్చర్యంగా.
‘‘ఔను సార్! నేను మీ డిపార్ట్‌మెంట్‌కి బాగా అక్కరకొస్తాను- జేమ్స్‌బాండ్‌లా! అంటే అచ్చం జేమ్స్‌బాండ్‌లాగే’’ అంది శశి.
‘‘నీ ఆంతర్యం అర్థమైంది. నిన్ను ఇన్‌ఫార్మర్స్ జాబితాలో వెయ్యడమే కాదు- నేనిక్కణ్ణిచి బదిలీ ఐనప్పుడు- నా స్థానంలో వచ్చినవాళ్ళకి కూడా నిన్ను ఇన్‌ఫార్మర్‌గా పరిచయం చేస్తాను’’ అన్నాడు ఈశ్వర్.
****
శశి కథ చెప్పడం పూర్తయింది.
‘‘నా గురించి నేను ఇంత గొప్పగా చెప్పుకోవడం ఇబ్బంది కదా! అందుకే కథ ఆమెని చెప్పమన్నాను’’ అన్నాడు ఈశ్వర్.
‘‘మీ గురించి గొప్పగా చెప్పానా? చెప్పిందంతా సొంత డబ్బాఐతే’’ అని శ్రీకర్ వంక తిరిగి, ‘‘మిమ్మల్ని చూస్తే- మీరు తాగే డ్రింక్ కంటే సాఫ్ట్ అనిపిస్తుంది. నాలాంటి రా కాండిడేట్‌తో పరిచయమైనందుకు బాధగా ఉందా?’’ అంది శశి.
శ్రీకర్ చటుక్కున లేచి నిలబడి ఆమెకి రెండు చేతులూ జోడించి ‘‘మీరంటే నాకు చాలా చాలా గౌరవముందండీ, అది మాటల్లోనే చెప్పలేక చేతులు జోడించా’’ అన్నాడు పాట పాడుతున్నట్లు.
‘‘సెభాష్, శశిని ఇలా గౌరవించొచ్చన్న ఐడియా ఇంతవరకూ నాకు రానందుకు సిగ్గుపడుతున్నాను.

ఇంకా ఉంది

వసుంధర