డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
మన పావురాలన్నింటికి ఇదే నీతి వర్తిస్తుంది. సందీప్ నడుస్తూ ఒక్కసారిగా అట్టహాసం చేసాడు... అహ.. హ.. మా ఆర్మీ విషయంలో కూడా ఇంతే.. ఎగరకు.. ఎగరనీయకు.. చుట్టుప్రక్కల వాళ్ళు అతడిని చూస్తున్నారు. అతడు ఈ లోకంలోకి వచ్చాడు. ఉఫ్.. తను ఏ లోకంలోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఈ లోకంలోకి వచ్చాడు. సిద్ధార్థ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు మొబైల్‌లో సిద్ధార్థతో మాట్లాడాలనుకున్నాడు. కానీ అక్కడి టవర్ వీక్ టవర్.. వాతావరణం సరిగా లేదు. అందుకే మాట్లాడలేకపోయాడు.
సిద్ధార్థ: రాత్రి నౌకరు భోజనం తీసుకువచ్చినపుడు సిద్ధార్థ అడిగాడు- ‘‘మిలిటెంట్లతో ఏమైనా గొడవ జరిగిందా? ఏదైనా ఆపరేషన్ జరుగుతోందా?’’
నౌకరు గంభీరంగా అన్నాడు- ‘సర్‌జీ! ఇక్కడ ఇరవై నాలుగుగంటలు ఇది జరుగుతూనే వుంటుంది. పైవారం అమర్‌నాథ్ యాత్ర మొదలవుతోంది. అందువలన ఇక్కడ దుర్గటనలు పెరుగుతూనే వుంటాయి. ఉగ్రవాదులు వస్తున్నారు. గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో ఉన్నారు. సరిహద్దు అవతల నుండి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కొత్త సి.వో తను శాంతిగా కూర్చోడు. ఎదుటివాళ్ళకు శాంతిగా కూర్చోనీయడు. ఎంతోమంది ఉగ్రవాదులు గ్రామ గ్రామాల్లో చొరబడ్డారు. కాని ఈ వార్తల్లో కొన్ని అబద్ధమైనవి. వీటిల్లో ఒకటి రెండు వార్తలు నిజమైనవి ఉంటాయి. అందువలనే ఆపరేషన్‌కి ఎక్కువ సమయం పడుతుంది. ఒకసారి ఆపరేషన్ మొదలయితే దాని నుండి ఎవరు బయటికి రాలేరు. తనన్నా చావాలి అవతలివాళ్ళన్నా చావాలి. ఏదో తెలియని భయం అడిని ఆవహించింది. ఒకవేళ ఈ ఆపరేషన్ ఇంకా కొంతకాలం కొనసాగితే.. తను అన్నయ్యని మళ్లీ చూడగలడా? ఒంటరిగా ఆ మూసి ఉన్న గదిలో.. ఎముకలు కొరికే చలి అంతటా భయంకరమైన నిశ్శబ్దం.. అసలు కాశ్మీరు ఇంత భయంకరంగా ఉంటుందని తనెప్పుడు ఊహించనైనా ఊహించలేదు.
ఎన్నోసార్లు ఫోను చేసాడు. ఒకసారి లాండ్‌లైన్ మీద. మరొకసారి మొబైల్ మీద. ఎక్కడా లైన్లు సరిగా లేవు. ఎక్కడో ఎన్‌కౌంటర్ నడుస్తోంది. అందుకేనేమో అన్ని లైన్లను కట్ చేసారు. ఇక సందేహం లేదు అని అనుకుంటూ కంట్రోల్ రూమ్‌కి కాంటాక్టు చేయడానికి ప్రయత్నించాడు. వాహ్ అదృష్టం లైన్లు కలిసాయి. మేజర్ సందీప్ వెనక్కి వస్తున్నాడని ఇన్‌ఫర్‌మేషన్ వచ్చింది. భూషణ్ కాంప్‌కి ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. చెప్పలేము. కొంచెం సేపయ్యాక ఫోను చేస్తే ఎంక్వైరీ చేసి చెబుతాము అని చెప్పారు.
మళ్లీ మొబైల్‌మీద కాంటాక్ట్ చేసాడు.. ఉదయం ఎనిమిది గంటలకు వస్తానని సందీప్ చెప్పాడు. ఆర్మీ జీపు రావడానికి వీలు లేదు. లేకపోతే వెంటనే బయలుదేరేవాడు.
ఓ భగవంతుడా! గుండెలమీద నుండి పెద్ద బండరాయిని దింపినట్లయింది. హాయిగా శ్వాస పీల్చుకున్నాడు.
భూషణ్ కాంప్ నుండి వచ్చిన సందీప్‌ని సిద్ధార్థ గట్టిగా కౌగిలించుకున్నాడు. అయ్యా! అబ్బ నువ్వు నా ప్రాణం తీసేసావు. అసలు ఇంత అపాయం ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. సందీప్ ఒక పేలవమైన నవ్వు నవ్వాడు. ‘అసలు అపాయం ఎక్కడ లేదని? ఒకచోట బయట అయితే మరోచోట లోపల. ముందు నువ్వు వెళ్ళడం ఎందుకు మానుకున్నావో చెప్పు? అన్నయ్య కనిపిస్తాడో లేదో అని అనుకున్నావా? ‘అన్నయ్యా! నువ్వు ఎంత కఠోరంగా మారావు?’ సిద్ధార్థ కంఠం వణికింది.
‘‘ఏం చేయను? ఈమధ్య వచ్చే వార్తలవలన నా మనస్తత్వం మారిపోయింది. నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తోంది’’.
‘‘నీకు ఏం వార్తలు వచ్చాయి?’’
‘‘ముందు కాస్త ఎంగిలి పడదాము. తరువాత మాట్లాడుకుందాం’’-
సందీప్ ముందే ఇంటర్‌కామ్ ద్వారా నౌకరుకి తను వస్తున్నానని చెప్పాడు. సాండ్‌విచ్, కహావా తెమ్మని చెప్పాడు.
సిద్ధార్థ వేడి వేడి కహావా తాగుతూ మళ్లీ అడిగాడు తన అన్నయ్యని.
సందీప్ చెప్పడానికి కొంత సందేహించాడు. కిందటిరోజుల్లో జరిగిన సంఘటన లోయలోని పొగమంచులా అతడి హృదయాన్ని ఆవరించుకుని ఉంది. సిద్ధార్థకి కూడా కొంత దీనితో సంబంధం ఉంది. అందుకే చెబుతామనుకున్నాడు సందీప్. ‘‘నీకు నా ఫ్రెండ్ అభిషేక్ తెలుసు కదా!’’ సాండ్‌విచ్‌ని కొరుకుతూ అన్నాడు.
‘‘అవును నీతోపాటు స్కూల్ ఫైనల్‌లో చదివాడు. ఆ అభిషేకే కదా! ఏమయింది అతడికి?’’’ ‘‘అతడికేం కాలేదు. కాని అతడి చిన్నతమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు’.
‘‘ప్చ్.. ఎందుకు? అతడు ఎంతో బ్రిలియంట్. ఐఐటి కాన్‌పూర్‌లో చదివేవాడు, కదూ!’’ ఇంత తెలివి కలవాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నాడు. ‘అపాయం ఎక్కడ లేదని ఇందాకేగా అన్నాను. కొన్నిసార్లు బయట అయితే, కొన్నిసార్లు మన లోపల. అతడు ఆర్.ఆర్ పోస్టింగ్‌లో లేడు కదా! అన్నింటికన్నా ఎంతో సురక్షితమైన స్థలం. ఐఐటి కాంపస్. తన మనసును కంట్రోలు చేసుకోలేకపోయాడు’.
‘‘ఏదో కారణం ఉండి తీరాలి. ప్రేమ గీమలో పడలేదు కదా!’’’ ‘‘ఉంది కారణం- కాని ప్రేమ ప్రకరణం వలన కాదు. ఎప్పుడు చదువులో ఫస్టే. ఓడిపోలేదు. కాని ఫెయిల్ అయినందుకు చచ్చిపోయాడు’’. సందీప్ రుమాల్‌తో ముఖాన్ని తుడుచుకున్నాడు. ‘‘నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. అసలు ఈనాటి జీవితపు పాట్రన్ సరిగా లేదు. అసలు ఈ లైఫ్ స్టైల్‌లోనే ఏదో లోపం ఉంది.

-ఇంకా ఉంది

టి.సి.వసంత