డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
కాని.. కాని.. మనుష్యులపైన ఉండే నమ్మకం వమ్మైపోవడం లేదా! నమ్మకాన్ని తుంగలో తొక్కిన ట్రాజడీ కాదా ఇది.. నమ్మకాన్ని తెంచే ఒక ప్రయత్నం.. సరాసరి మృత్యువు.. ప్చ్.. ఎత్తుకు పైఎత్తులు.. మానవత్వం మంటకలిసిపోతోంది. హింస.. రక్తపాతం.. నలువైపులా చావుకేకలు..
ఆర్మీకి ఈ సంఘటన పెద్ద పెన్నిధిలా అనిపించవచ్చు. కాని మానవ సమాజానికి ఇది ఒక దుర్ఘటన కాదా! స్నేహితుడి చేత కపటంగా స్నేహితుడిని హతమార్చడం.. ప్చ్.. ఉఫ్.. కాని యూనిట్ అంతా తను ఆలోచించినట్లుగా ఆలోచించదు కదా! యూనిట్‌కి ఇది తప్పుగా అనిపించడం లేదు కదా! తనెందుకు ఈ దుర్ఘటన మానవతా విలువలు చచ్చిపోతున్న ఈ సమాజానికి ఒక ఉదాహరణగా ఆలోచిస్తున్నాడు? తను ఈ ఆర్మీ సత్యాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు? ఆర్మీతో పూర్తిగా మమేకం ఎందుకు కాలేకపోతున్నాడు?
ఆలోచనా తరంగాలు సందీప్‌ని ముంచెత్తుతున్నాయి. మనస్సులోని ఉదాశీనత్వం సాయంత్రం వ్యాపించే ఉదాశీనత్వంతో కలిసి ఇంకా చిక్కగా అయిపోతోంది. నేడు హింస అనే వరదలో తను శవమై ప్రవహిస్తున్నాడు. తనే కాదు.. మొత్తం మానవ సమాజం అంతా.. అందువల్లే కాశ్మీర్ నదులు ఎండిపోవడం లేదూ? ఎండ నల్లబడటం లేదూ?
ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగితే ఎన్నో ప్రశ్నలు పురుగుల్లా అతని మైండ్‌లో పాకుతూ ఉంటాయి. అసలు వీటిని గురించి అతడు బాహాటంగా ఎవరికీ చెప్పనూ చెప్పలేడు. తన పైఆఫీసర్లకి ఏ మాత్రం చెప్పలేడు. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ మాత్రమే పనిచేస్తుంది. అసలు చర్చలు జరపడానికి అవకాశమే లేదు. తన ఆత్మీయుడు మిత్రుడు అయిన మేజర్ రాథోర్ తనను ఇటువంటి సమయాలలో తను చెప్పింది వింటాడు. తనను సంభాళిస్తాడు. తన ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. సందీప్! నువ్వు ఏదేదో ఆలోచిస్తూ ఉంటావు. ఈ ఆర్మీలో ఆలోచించడం అంటే క్రమశిక్షణని, సంప్రదాయాన్ని కాదనడమే..’ అని అతడిని ఈ ఆలోచనలనుండి బయటపడేశాడు.
అందుకేగా తను ఈ ఆర్మీలోకి వచ్చాడు. తన తండ్రిది పెద్ద వ్యాపారం. అయినా తను వద్దనుకున్నాడు. తను మంచి ఆలోచనలకి, విలువలకి మాత్రమే ఇమ్‌పార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే తన ఉద్దేశ్యంలో నాగరిక సమాజం సాగించిన ఈ సుదీర్ఘమైన యాత్రలో మనిషి పోగుచేసుకున్నది విలువలను, మంచి ఆలోచనలని మాత్రమే.
‘‘మరైతే తెలుసుకో నా హీరో! నీలాంటివాళ్ళు భారతదేశాన్ని ఇంకా ఉన్నతమైన విలువలతో వృద్ధి చేయాలని, మంచి నాగరికతను పెంపొందించాలి అన్న ఉద్దేశ్యంతో ఇందులో చేరుతారు. ఇట్లాంటివాళ్లకు ఏం భవిష్యత్తు ఉంటుంది? అసలు మిమ్మల్ని దీనికోసం రమ్మనలేదు. ఇంకొకళ్ళ భారం మనం ఎందుకు వహించాలి? ఇక్కడికి పిలిపించింది ఉగ్రవాదులని మట్టుపెట్టడానికి. మీరు నమ్మకంగా ఈ పని చేయాలి. ఎట్లా చేయాలి? కపటంగానా? మోసంచేసా? నైతికంగానా? అనైతికంగానా, ధర్మంగానా? అధర్మంగానా? వీటి గురించి మాకు ఆలోచించాల్సిన పనిలేదు. మేం ఏం చేయగలుగుతాం. మా ఆలోచన అందరి భవిష్యత్తు కోసమే. మేం కొంతవరకు బంధితులం. ఇక్కడి నీతి నియమాలకు. కేవలం సిస్టమ్ నడుస్తుంది- కాని మనసులో ఉండే ఈ భావుకత అనే పిట్టను ఏం చేయను చెప్పు? అది ప్రతి సంఘటన తరువాత తన ముక్కుతో నన్ను పొడుస్తూనే ఉంటుంది- బాధగా ప్రశ్నించాడు సందీప్. మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు- ‘ఇది నా పోస్టింగ్. అందువలన ఇంకా నాలో భావుకత, మనస్సు అనేవి నన్ను పట్టుకుని వేళ్లాడుతున్నాయి. తరువాత ఇవన్నీ నా జీవితంలో రొటీన్ అయిపోతాయి. వీటికి అలవాటుపడిపోతాను. ఒక సంఘటన గురించి చెబుతాను. ఇంతక్రితం నా పోస్టింగ్ సరిహద్దు దగ్గర ఉన్న చౌకీ దగ్గర ఉంది. రాత్రి చీకట్లో నేను ఎవరి గొంతో విన్నాను. ఎవరో సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తున్నారని అనిపించింది. మూడుసార్లు వార్నింగ్ ఇచ్చాము. ఆగమని అన్నాము. ఆ వ్యక్తి భయంతో ఆగలేదు. చిమ్మ చీకటి. అతడిని ఉగ్రవాది అని అనుకుని మేము పిస్తోలు పేల్చామని అతడు అనుకున్నాడు. ప్రొద్దునే్న చూసాను. ఎవరినైతే మేము ఉగ్రవాది అని అనుకున్నామో ఆ వ్యక్తి చిన్న దొంగ. బీదవాడు. వాడి మూటలో మూడు నాలుగు కిలోల బియ్యం ఉన్నాయి. వాడు సరిహద్దుకవతల ఎక్కువ ధరకు అమ్ముదామని అనుకున్నాడు. వాడు భయం వలన ఏమీ మాట్లాడలేకపోయాడు. కాని పిస్తోలు మాట్లాడింది. ఈ విధంగానే మేము మరో పిల్లవాడిని పట్టుకున్నాము. అప్పుడు పగలు. అందుకే వాడు బతికిపోయాడు. అదే రాత్రయితే ప్రాణాలు పోయి ఉండేవి. వాడి దగ్గర ఒక కోటి రూపాయల విలువ గల చరస్ దొరికింది. వాడికి తెలియను కూడా తెలియదు. వాడికి కేవలం 100 రూపాయలు సరిహద్దుకిటువైపు నుండి అటువైపు తీసుకెళ్ళడానికి ఇస్తారు. ఆ రోజు ఆ బీద దొంగ శవాన్ని చూసాక నేను ఏడ్చేసాను. ఇక్కడినుండి పారిపోవాలని అనిపించింది. కాని ఎక్కడికి పారిపోను? నన్ను పారిపోయినవాడిగా లెక్కిస్తారు. ఒకవేళ నేను పిస్తోలు పేల్చలేదే అనుకో. ఎవడైనా చొరబడితే? అప్పడు వాడు నన్ను వదిలేస్తాడా? మేము ఇక్కడ అస్తిత్వానికి పోరాటం చేస్తున్నాము. ఇంకోమాట, లోకం నుండి పారిపోతే ఇది మారుతుందా? సమాజాన్ని ఎదిరించాలి.
అప్పుడే ఈ సమాజం మారుతుంది- నేను అసలు ఈ చట్రంలో ఇమడలేకపోతున్నాను. ఇవన్నీ మూసల బతుకులు. ఆర్మీని వదిలివేయాలంటే అనుమతి లేదు. ఉండాలంటే ఏ పశుత్వం ఉండాలో అది నాలో లేదు. ఏ మంచి మనస్తత్వంతో, ఆర్మీ పట్ల ఎంత భక్తి భావంతో ఇక్కడ అడుగుపెట్టానో వీటికి అసలు విలువే లేదు. పోనీ విలువ లేకపోతే లేకపోయింది. నేను బాహాటంగా నా భావాలని వ్యక్తం చేయగలను.

- ఇంకా ఉంది

టి.సి.వసంత