డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
కంఠం ఫ్రీజ్ అయినట్లుగా అనిపించింది. సంత్ మహాత్ముడి లాంటి అన్నయ్య గురించా ఈ మాటలు. ఏ మాట మాట్లాడలేకపోయాడు. కాని టేబిల్‌పైన చేత్తో బలంగా కొట్టాడు. పెద్దగా అరిచాడు. ‘‘ఈ పెళ్లిగోల ఇక ఆపేయండి. ఇంటికి వచ్చినప్పుటినుండి చూస్తున్నా. పెళ్లి, ఆడపిల్లలు, ఫొటోలు- ఇవి తప్ప మరి దేన్ని గురించి మాటలే లేవు. అసలు నేను ఈ పెళ్లి గిళ్లి చేసుకోను’’ టిఫిన్, టీ లేకుండానే అక్కడినుండి వెళ్లిపోయాడు.
‘‘సందీప్! పద మనం దేశబంధు పార్క్‌దాకా వెళ్లివద్దాం’’ అంటూ సిద్దార్థ మూడ్‌ని బాగు చేయడానికి ప్రయత్నించాడు.
ఇద్దరు పార్కుకి బయలుదేరారు. చిన్నప్పుడు ఇద్దరు ఎనె్నన్నో సాయంత్రాలు ఆ పార్కులోనే గడిపారు. దేశబంధు చిత్తరంజన్‌దాస్ పేరుమీద ఈ పార్కు కట్టారు. ఇదంటే వాళ్లకి చిన్నప్పటినుండి ఇష్టం. కలకత్తాలో అన్ని పార్కుల్లోకి ఈ పార్కులో పిట్టలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటి కిలారావాలు, కువకువలు మనస్సును పరవశింపజేస్తాయి.
ఇద్దరు పక్కపక్కనే నడుస్తున్నారు కాని సిద్ధార్థ మాటామంతీ లేకుండా వౌనంగా నడుస్తున్నాడు. సందీప్ అడిగాడు- ఏమిటి సిద్ధార్థా మనౌంగా ఉన్నావు. ఇంటినుంచి విముక్తి కలగాలనే కదా మనం ఇక్కడికివచ్చాం. కాని ఇంకా ఆ ఇల్లు నిన్ను వదలనే లేదు.
నిజానికి ఈ మాటల్లో ఎంతో సత్యం వుంది. కాని సిద్ధార్థ మెదడులో ఇంటితోపాటు కంపెనీని గురించిన ఆలోచనలు కూడా వస్తున్నాయి. క్రితం రోజు సర్వేలో కొత్త విషయాలు తెలుసుకున్నాడు. కంపెనీ వాళ్ల ప్రోడక్ట్ అక్స్ రెండో ప్రోడక్ట్ అయిన ‘అక్స్‌సైండల్’ని తినేస్తోంది. ఏ కస్టమర్స్ అయితే మొదట అక్స్‌ని వాడేవారో వాళ్లందరు కొత్త అడ్వర్టైజ్‌మెంట్ చూసి అక్స్‌కి బదులు అక్స్ సైండల్ వాడుతున్నారు. కంపెనీకి ఈ కానిబాలైజేషన్ ఏ మాత్రం లాభదాయకం కాకుండా పోతోంది. ఎందుకంటే దీనివలన కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ సేల్స్ తగ్గిపోతున్నాయి. సిద్ధార్థ తన అన్నయ్యకి ఈ సర్వే గురించి చెప్పాడు. సందీప్ అతడి సమస్యను తెలుసుకుని బాధపడ్డాడు. ఎంత తెలివి కలవాడు కాని పనికిరాని వాటికోసం ఆలోచిస్తూ తన టైమ్‌ని ఇంటలిజెన్స్‌ని వేస్ట్ చేసుకుంటున్నాడు. కంపెనీ తయారుచేసే ఒక ప్రోడక్ట్ రెండో ప్రోడక్ట్‌ను తినేస్తోందన్న ఆలోచనతో బుర్ర పగలగొట్టుకుంటున్నాడు. కాని ఈ దేశంలో ఎన్నో చోట్ల ఒక మనిషిని మరో మనిషి తినేస్తున్నాడు. ఈ ఆదివాసీల గురించి వాడేమైనా ఆలోచిస్తున్నాడా? భావుకతతో మనస్సు బరువు ఎక్కుతోందా?
‘‘వాహ్.. ఏం ఆలోచన! ఎంతో చింత?’’ హఠాత్తుగా అతడి నోట్లోంచి ఈ మాటలలు వెలువడ్డాయి.
‘‘ఏమన్నావు?’’
‘‘ఊహూ.. ఏమీ లేదు’’
సిద్దార్థకి అంతగా తిరగాలనిపించలేదు. ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు.
సందీప్‌కి తను ఈ ఇంటికి పరాయివాడా అన్నట్లుగా అనిపించింది. ఆత్మీయత, అనురాగాలతో నిండి వుండే ఆ ఇంటికి ఇప్పుడు ఏమైందో అతడికి ఏ మాత్రం అర్థం కాలేదు. శేఖర్‌బాబు కోపంతో ఊగిపోయాడు. సందీప్‌కి బొటాబొటిగా వచ్చే జీతం.. జీవితంలోని ప్రమాదాలు, రాలిపోతున్న జుట్టు, ముఖంలో ఉదాసీనత అన్నీ కలిపి అతడి మనస్సును బాలెన్స్‌గా ఉంచడంలేదు. ఆర్మీలో తన కొడుకు పనిచేస్తున్నాడు. పెళ్లి పెటాకులు లేకుండా వాడు జీవితాన్ని ఎట్లా గడుపుతాడు అన్న చింత సందీప్ తల్లిని తినేస్తోంది. బాగా బిజీగా ఉండే సిద్ధార్థ సందీప్ దగ్గరిగా రాలేకపోయాడు. ఇరవై రోజులు అందరు కలిసి ఉన్నా ఇల్లంత ఉదాసీనంగానే ఉంది. నిత్యకళ్యాణం - పచ్చతోరణంలా ఉండే ఆ ఇంట్లో ఇప్పుడు ఏ ఆనందం లేదు. సందీప్ మళ్లీ భూషణ్ కాంప్‌కి వెళ్లిపోయాడు.
కాంప్‌కి వచ్చేసరికి కమాండింగ్ ఆఫీసరు కర్నల్ ఆర్య మారిపోయాడు అన్న సంగతి తెలిసింది. అంతే అక్కడ వచ్చే పరిమళం అంతా మాయం అయిపోయింది. అతడి శరీరం నుండి ఏదో ఒక క్రూర జంతువు దుర్గంధం వస్తోందా అని అతడికి అనిపించింది.
అతడు కాంప్‌కి వచ్చేలోపల అక్కడి పరిస్థితులు చాలా మరాయి. హింస పెరిగింది. ఉగ్రవాదుల ఆతంకం పదిరెట్లు పెరిగింది. అందువలన కొత్త సి.వో రక్షణ విషయంలో ఇంకా జాగ్రత్త వహించసాగాడు. ప్రతిక్షణం తను ఎటూ మెలుకువగానే ఉంటాడు. తనతోపాటు స్ట్ఫానంతా కూడా అలెర్ట్‌గా ఉండాలని ఆజ్ఞ జారీచేశాడు.
ఒకరోజు మధ్యాహ్నం కర్నల్ ఆర్య సందీప్‌ని పిలిచాడు. ఎండ తీవ్రంగా ఉంది. కర్నల్ ముఖంలో మార్పుని సందీప్ గ్రహించాడు. ఆయన నల్లటి కళ్లజోడు ధరించాడు. ఆయనకి కళ్ల ఇన్‌ఫెక్షన్ వచ్చి ఉంటుందని సందీప్ అనుకున్నాడు. ఆయన్ని అడుగుదామని అనుకుంటూ ఉండగానే మరో కళ్లజోడు ఇస్తూ ‘ఇది పెట్టుకో’ అని సందీప్‌కిచ్చాడు.
‘నా కళ్లు బాగానే ఉన్నాయి..’
‘‘అసలు జీవిత సత్యాలు నీకు తెలియవు. నువ్వు ఎంతసేపు మనస్సుతో ఆలోచిస్తావు. నీవు ఆ భావుకతా లోకంలోకి వెళ్లిపోతావు. బయటికి రావాలనుకున్నా రాలేవు. ఈ కళ్లజోడు పెట్టుకుంటే ఇక ఈ భావుకత - భీవుకత అంతా మరచిపోతారు. అసలు ఆత్మ మొద్దుబారిపోతుంది. ఉగ్రవాదులను చంపాలనుకున్నపుడు వాళ్ల ముఖాలని నల్లటి బట్టతో కప్పుతారు. వాళ్లు ఎవరో తెలియకుండా ఉండటానికి ఇట్లా చేస్తారు అని అనుకుంటారు. కాదు. చంపేసేవాళ్లు వాళ్లతో పూర్తిగా భావనాత్మక సంబంధాన్ని తెంపేసుకుంటారు.
‘‘ఉహూ.. నేను పెట్టుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు తోవ తప్పను. నేను మానవత్వంకల మనిషికోసం అందమైన జీవితానే్వషణలో ఉన్నాను’’.

- ఇంకా ఉంది

టి.సి.వసంత