డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఎంత రక్తపాతం జరుగుతుందో అంతకన్నా పదిరెట్ల రక్తదాహం ఎక్కువ అవుతూనే ఉంది. ఉఫ్.. మొదట గుడ్‌గాంవ్ పోస్టింగు. ఇప్పుడు ఈ జమీల్ ఆపరేషన్.
అతడిలో ఆచలోనా తరంగాలు లేస్తున్నాయి. జీవితం నుండి జీవితం దూరం కేవలం ఖాళీ బుర్ఖా. ఆత్మానుభవం లేనే లేదు.. మనస్సుకి శాంతే లేదు. జమీల్ చనిపోగానే తనను యూనిట్‌కి హీరో చేశారు. బహుశ భారత్ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి తను ఒక అడుగు ముందుకువేశాడు. ఈరోజు తన పైఅధికారులు, తోటివాళ్లు తనని ఎంతో మెచ్చుకుంటున్నారు. కాని కొంతకాలం అయ్యేసరికి తను నేపథ్యంలోకి వెళ్లిపోతాడు. పాపం నిస్సహాయురాలైన ఆ తల్లి వెక్కిళ్లు, తన మనస్సులో పెరుగుతున్న అశాంతి మాత్రం ఉండిపోతాయి. పగలు ఏదోవిధంగా గడిచిపోతుంది. కాని రాత్రి పరచుకున్న నిశ్శబ్దం తన మనస్సును కలచి వేస్తుంది. నిజానికి తన మనస్సు ఒక అశాంత సముద్రం అయిపోతుంది. అక్కడ మానసిక శాంతిని నష్టపరిచే సునామీలు లేస్తూ ఉంటాయి. ఇవి తనని స్మృతుల ఘాట్‌ల దగ్గరికి తోసేస్తాయి. తను మొట్టమొదటిసారి కాశ్మీర్ వచ్చినపుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. భూమిలోని ఈ ముక్క ఎంతో అందంగా, కోమలంగా, స్వర్గతుల్యంగా అనిపించింది. ఇంద్రియాలన్నీ సౌందర్యాననుభవించాయి. తన జీవితాన్ని మెరుగుదిద్దుకోవాలి. సౌందర్యంతో నింపాలి అన్న తన చిరకాల కోరికను నెరవేర్చేది ఈ భూమే. కాని రెండున్నర సంవత్సరాలలో తనను హంతకుడిని చేసి తన అంతరాత్మని లాగేసుకుంది. తనను ఏమీ లేనివాడిగా చేసింది. ఇప్పుడు తన ఇంద్రియాలలో సౌందర్యం కాదు, కురూపత్వం నిండిపోయింది. ఇప్పుడు తన శ్రవణేంద్రియాలు ఆకుల సర్‌సర్‌లను, మేఘాల గర్జనలను, అంతరాత్మ పిలుపును వినవు. అది గుండ్ల ఢాం ఢాంలు, గల్లీలో అరుపులు, కేకలు, పెడబొబ్బలు, బాంబుల కఠోరమైన శబ్దాలు, కడుపు తీపి వలన తల్లులు చేసే హాహాకారాలను వింటున్నాయి. ఇప్పుడు కళ్లు కొండల నునుపులను, జల జల పారే సెలయేళ్ళను, కాశ్మీరీ గులాబీలను, అందమైన కాశ్మీరీ యువతులను, అందమైన మేఘాలను, లోయలను, పైపైకి ఎగిరే పక్షులను చూడవు.. గుండెలను కొట్టుకుని ఏడ్చే జమీల్ అబ్బూ, భయంతో చచ్చిన బల్లిలా బయటికి వచ్చి జమీల్ తల్లి కళ్లు,, రక్తసిక్తం అయిన జమీల్ శవం, ఆర్మీని చూడగానే ఉచ్చపోసుకునే హమీద్‌ని, ఇంటి వెనక వున్న సమాధులను చూస్తాయి.
తన ఘ్రాణేంద్రియాలకు గులాబీలు, కేసర్‌ల సుగంధం కాదు, గంధకం పేలుళ్ల మందు, మండుతున్న మనిషి శవాల దుర్గంధానికి అలవాటుపడిపోయాయి. ఏ నగరం అయితే తనను ఆకర్షించేదో, స్వప్నాలో మునిగిపోయేటట్లు చేసేదో అదే నగరం తనను ఇప్పుడు భయపెడుతోంది. కన్నీళ్లు కారేలా చేస్తోంది. హృదయాన్ని లాగేసుకుంటోంది. మానవత్వం తనలో మెల్లి మెల్లిగా చచ్చిపోతోంది. పగలు ఏదో విధంగా గడిచిపోతుంది. రాత్రి కాగానే విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో నల్లటి కళ్లజోడును తీసిపడేస్తాడు. అంతే సంవేదన చుట్టుముట్టేస్తుంది. మళ్లీ తనలో మానవత్వం మేలుకొంటుంది. భావోద్వేగాలు తనపై ఎంతో ప్రభావం చూపుతాయి. జమీల్ తన హృదయాన్ని స్పర్శిస్తాడు. మృత్యువు తనలోని దానవత్వం వైపు ఎరుపెక్కిన కళ్లతో చూస్తుంది. అంతే తన నిద్ర పాడైపోతుంది. నిద్రపట్టక అటు ఇటు దొర్లుతూనే ఉంటాడు. పీడకలలు వదలవు. తన కళ్ల ఎదురుకుండా ఆ భయంకరమైన దృశ్యాలు తనలోని భావుకతను మంటకలిపిన అక్షరాలు. అసలు నువ్వు మనిషివేనా అని అడిగే ఆ సమయం. నీ ఆయుధాలతో నన్ను రక్తపాదం చేస్తావా అని అడిగే కాశ్మీరపు మట్టి, ఒకప్పుడు ఆ మట్టివాసనకి పరవశుడైపోయేవాడు. రక్తసిక్తం అయిన ఆ మట్టి కణాలు.. ఒక రాత్రి కలలో జమీల్ తల్లి తనను ఊపేస్తూ కళ్లు ఎర్రచేస్తూ ప్రశ్నిస్తోంది. ‘‘నా ఇంటికి వచ్చిన నా కొడుకుని, నా ఒళ్ళో పడుకుని సేదతీరుతున్న నా పుత్రుడిని చంపి నీ వీరత్వాన్ని చూపావా? ఇదా పరాక్రమం? చెప్పు.. చెప్పు..’’. మేం పరాక్రమంతో కాదు ఆ ఇంటివాళ్లపై దాష్టీకం చేసి రాక్షసుల్లా నిర్దాక్షిణ్యంగా చంపేసాము. ఇది పచ్చి నిజం. ఒక తల్లి మమతను లాగేసుకున్నాం. ఇదేనా పరాక్రమం? ఈ మేకవనె్న పులులను ఎవరైనా క్షమిస్తారా?
ఒక వారం తరువాత తను గడ్‌గాంవ్‌కి మళ్లీ వెళ్ళాడు. ఆ ఇంట్లో మళ్లీ పొయ్యి వెలుగుతోందా? లేదా? అసలు ఆ ఇంట్లో ఇల్లు ఎంత మాత్రం మిగిలి ఉంది? ఆ ఇంటిల్లిపాదీ ఎంతగా బాధపడుతున్నారు. కష్టాల కడలి ఆ కుటుంబాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా ముంచేసింది? మానవత్వం మంటకలిసిన ఆ క్షణాలు. ఆర్మీ నిప్పు కణాలు కురిపించిన ఆ సమయం. ఎంత దారుణం! ఎంత ఘోరం!
ఆ రోజు కూడా జమీల్ తల్లి ఒంటరిగా ఉంది. మనస్సు, దేహం, ఆత్మ, అన్నీ ఒంటరివే.. చుట్టుప్రక్కలి సంచార జాతుల్లా, పశ్చాత్తాపం, ఆత్మగ్లాని, నిరాశ, దుఃఖం, అశాంతి దారి తెన్నూ లేకుండా తిరుగుతున్నాయి. తనను చూడగానే ఆమె తడబడింది. ముఖం రక్తహీనంగా అయిపోయింది. తను కళ్లు దించుకున్నాడు. ఆమె ఏదో గొణుక్కుంటోంది. బహుశ ఆమె అడుగుతోంది- ‘వారె ఛుక్’ (ఎట్లా ఉన్నావు)- తను వౌనంగా ఉండిపోయాడు. అసలు తను ఏం జవాబు చెప్పగలుగుతాడు. తన బాధను వ్యక్తం చేసే శబ్దాలు ఏవి? శిథిలాలలో శిథిలంగా మారి సాంయ్.. సాంయ్ అంటున్న ఆవిడ అశాంతితో నిండిన ఆత్మ.. ఆ ఆత్మ ఘోష ఎవరు వినగలరు? చింపుల చినుగుల ఆ బుర్ఖా! బుర్ఖా చెప్పే కన్నీటి మున్నీటి గాథను!

- ఇంకా ఉంది

టి.సి.వసంత