డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఆలోచించండి.. ఆలోచించండి.. కశ్యపుడి పేరు మీద కాశ్మీర్ అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఏనాటి నుండో సౌభ్రాతృత్వం.. సమన్వయం.. సహ అస్తిత్వం మొదలైనవి ప్రతీ మనిషి మనస్సులోనూ చోటుచేసుకున్నాయి. దీని చరిత్ర మహోజ్వలమైనది. వీటన్నింటికి ఉత్తరాధికారులు ఎక్కడ ఉన్నారు? ఏమయ్యారు? గాలిలో కరుణ తప్ప మరొకటి ఉండేది కాదు. కాని ఎవడు ఈ గాలిని విషంతో కలుషితం చేసాడు. అంతటా ద్వేషం.. హింస..
ఆలోచిస్తూ.. ఆలోచిస్తూ సందీప్ మంచంమీద ఒరిగాడు.. ఆయన మనస్సు కూడా రెండు ముక్కలయ్యాయి. ఒక మనస్సు అంటుంది- ‘నేను మానవత్వాన్ని అవమానించలేదు. ఆ తల్లి మమతను బేరం చేయలేదు. నేను ఆర్మీ ధర్మాన్ని మాత్రమే పాటించాను. ఇంతలోనే రెండో మనస్సు అంటుంది- మరయితే మరో మనిషి పట్ల ధర్మాన్ని నీవే నిర్వర్తించు. కూలిపోతున్న ఆ కుటుంబానికి చేయూతనివ్వు.
నీకు తెలుసా! ఉగ్రవాదులు పిడుగుల్లా ఆ కుటుంబంపై పడుతున్నారు. ఒక్కసారిగా ఇదంతా ఎక్కువ అయింది. ఇంతక్రితం ఆర్మీవాళ్లకి ఆ ఇల్లు అడ్డాగా మారింది. తన కొడుకును ఆర్మీకి అప్పచెప్పినందుకు సైనికులు పోలీసులు ఎంతగానో సంతోషించారు. మిలిటెంట్లు తమ స్వార్థం కోసం ఆ ఇంటికి వస్తూ పోతున్నారు. అప్పుడప్పుడు భోజనానికి వస్తే అప్పుడప్పుడు రక్షణకోసం తన ముద్దుల కొడుకుని ఆర్మీకి అప్పచెప్పిన ఆమె అసలు ఏం తింటుంది? ఉగ్రవాదులకు రక్షణ ఎట్లా కల్పిస్తుంది?
రెండు విధాల ఆమె నరకం చూస్తోంది. మెతుకు మెతుకు కోసం బాధపడుతూ ఆకలి మంటలతో అలమటిస్తున్న ఆ కుటుంబం కోసం నీవేం చేసావు?
తనతో తను సందీప్-
నువ్వు ఈ విధంగా రుబీనాని కలవడం మంచిది కాదు. నీమీద అనుమానం రావచ్చు. భారతీయ ఆర్మీలో నువ్వు పేరు ప్రతిష్ఠలు కల మేజర్‌వి. నీ తెలివి తేటలను అందరు మెచ్చుకుంటారు. కానీ నీ మీద అనుమానం వస్తే నీమీద కూడా ఆర్మీ కన్ను ఉంటుంది. (ఇప్పటిదాకా సందేహం రాకపోతే మంచిదే) యు విల్ బి కెప్ట్ ఆన్ విజిలెన్స్. నీ మాటలని టేపు చేస్తారు. చేసే పనులను గమనిస్తారు.
రుబీనాకు అర్థం అయ్యేలా చెప్పాలి, అది అవసరం కూడా.
నీ మాట ఆమె విన్నదా!
విన్నది కాని ఆమెకు వాళ్ల వైపు వాళ్లమీదే సహానుభూతి ఉంది. కాశ్మీరు ఆర్మీని హిందుస్తాన్ గవర్నమెంటు వెనక్కి పిలవాలి అని అంటుంది.
నీవు 1989కి ముందు అసలు కాశ్మీర్‌లో సైన్యం ఉండేది కాదు అని చెప్పావా! అసలు సైన్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా! జిహాదీలు, డోగ్రీలను, కాశ్మీరు పండితులని కొట్టి తన్ని ఇళ్ల నుండి బయటికి లాక్కు వెళ్లేవారు. వాళ్లను చంపేసేవాళ్లు. కాశ్మీరీ డోగ్రీలకు, పండితులకు జమ్మూకి శరణాగతులుగా వెళ్లాల్సి వచ్చింది. వాళ్లది ఎంత నిస్సహాయ స్థితి. ఏం వాళ్లు కాశ్మీరీ ప్రజలు కారా? అసలు వాళ్లు చేసిన తప్పేమిటి? కాశ్మీరు ప్రశ్నని మతంతో ఎందుకు ముడివేశారు? అసలు ఈ అరాచక రాజనీతికి జన్మనిచ్చింది ఎవరు? 1987-89లో కాశ్మీర్‌లో రక్తపాతం జరిగింది. కొన్ని కుటుంబాలవారిని టార్గెట్ చేసి యుద్ధం చేసింది ఎవరు? అసలు వీటికి బలయింది ఎవరు? నేను ఇట్లా చెప్పదలుచుకున్నాను- ఇస్లాంలో మతం, సమాజం, రాజనీతి చట్టం అన్నీ ఒక్కటే. ఇక్కడ దేశము, రాష్ట్రీయ భావన, దేశభక్తి ఏ మాత్రం చోటులేదు. అందువలనే ఎక్కడ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో అక్కడ ఉదారమైన ఆలోచనలకు తావు ఏ మాత్రం లేదు. అందువలనే ఈనాడు పాకిస్తాన్‌లో కూడా పాకిస్తానీయులు తమ రాష్ట్రం బదులుగా ఇస్లాంని ఆధారంగా చేసుకుని తాలిబన్ల పట్ల సహానుభూతి చూపిస్తారు.
నేను ఇది కూడా చెప్పాను. మీరు రాళ్ళు విసరవద్దు. రక్తపాతం చేయవద్దు. మా సైన్యంమీద, రక్షక దళాలపైన దాడులు జరపకండి. మేం మా సైన్యాన్ని వెనక్కి పిలుస్తాం.
మేం ఎందుకు ప్రతిరోజు మూడు కోట్ల రూపాయలను కాశ్మీర్‌పైన ఖర్చుపెడుతున్నాం? కాని ఏం జరిగింది. ఆమె అర్థం చేసకోలేదు. నీవూ తల వంచలేదు. చెప్పే మాటలలో సత్యం వుంటే వాటి ప్రభావం అప్పటికప్పుడు పడకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు పడతాయి.

-ఇంకా ఉంది

టి.సి.వసంత