డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఎవరికైనా సరే ఆటలు, పాటలు, నృత్యం ఇలాంటివాటితో సంబంధం ఉండితీరాలి. అందుకే బడుల్లో వీటిన్నింటికీ కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ అలా సంబంధం లేకుండా ఎవరైనా ఉంటే వారు క్రూరత్వంగా ప్రవర్తించేవారిలాగా మారిపోవచ్చు. కళలు జీవితానికి అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఆత్మను మంచి భావాలతో నింపేస్తాయి.
కాని, ఆమె ఏం జవాబు చెప్పింది?
ఆమె జవాబు విని నేను అవాక్కయ్యాను. ఇక్కడ కళాకారులకు స్వేచ్ఛ వుంది. కళలు ప్రజలలో అందమైన ఆలోచనలు నింపుతాయి. క్రూరత్వం నుండి దూరంగా ఉంచుతాయి. మరయితే పదివేలమంది యువకుల ఆచూకీ ఎందుకు తెలియడంలేదు? అసలు వాళ్లు బతికి ఉన్నారో చనిపోయారో ఎవరికి తెలుసు?
మరయితే నువ్వు వౌనంగా ఉండిపోయావా? ఇది సంపూర్ణ సత్యం కాదుగా?
చెప్పాల్సినవన్నీ చెప్పాను. మాపైన కూడా మానవ హక్కుల సంఘం నిఘా వేసి ఉంచుతుంది. మా సిపాయిలు, ఆఫీసర్లు ఒకవేళ ఉమ్మేసినా సరే మానవ హక్కుల సంఘం మమ్మల్ని బోనులో నిలబెడుతుంది. కాని మీ తరపు నుండి ఎంతో ఘోరమైన కృత్యాలు జరిగినా మిమ్మల్ని ఎవరు అడగరు. అన్ని బాధ్యతలు మేమే నెరవేర్చాలి.
ఈనాడు కాశ్మీరులోని అర్థవ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపైనే ఆధారపడి వుంది. మేము కాశ్మీరులందరిని మావాళ్లే అని అనుకుంటాం. అందుకే కాశ్మీరుపైన కోట్లు- కోట్లు ఖర్చుపెడుతున్నాం. భారతదేశంలోని ఏ రాష్ట్రంపైనా ప్రభుత్వం ఇంత ఖర్చుపెట్టదు. కాశ్మీరును ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తించారు. మీ రాష్ట్రం అర్థవ్యవస్థ ఏ మాత్రం బలంగా లేదు. ఒకవేళ మీకు స్వతంత్రం వచ్చినా పాకిస్తాన్ మీ కాశ్మీర్‌ని మింగేస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు కూడా పాకిస్తాన్‌లో కలవడానికి ఏ మాత్రం ఒప్పుకోవడంలేదు. పాతతరం ఉగ్రవాదులలో ఇప్పుడు ఎవరు మిగలలేదు. ఈనాడు ఎనభై శాతం మిలిటెంట్లు విదేశీ మిలిటెంట్లే. ఆప్ఘనిస్తాన్, చెచెన్యా, బోస్నియా, పాకిస్తాన్‌ల నుండి వచ్చిన మిలిటెంట్లే. వీళ్ళందరూ డబ్బులకు అమ్ముడుపోయిన వారే.
అయినా కాశ్మీరు ప్రజలకు తమ రాతను తామే రాసుకునే అధికారం ఉంది. ఏ దిశలో వెళ్లాలి, ఏం చేయాలి, ప్రశాంతంగా అల్లకల్లోలం కాని కాశ్మీరును నిర్మించుకునే హక్కు కాశ్మీరు ప్రజలదే.
అవును ఆ హక్కు ఉంది. ఎన్నికల్లో తమ నేతలను తామే ఎన్నుకునే స్వతంత్రం ఉందా? వాళ్లు వాళ్ల ఇష్టమైన రీతిలో బతికే స్వతంత్రం ఉందా?
మరి రుబీనా ఏమన్నది?
నేను నీలాగే ఆలోచించాలని నువ్వెందుకు అనుకుంటావు?
ఉహూ.. నేను ఎప్పుడు అట్లా అనుకోను. కాని నీవు అసలు సిసలైన సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటాను. సత్యం ఎప్పడూ సుందరంగా ఉంటుంది. అమర్‌నాథ్ గుహ ఉన్న ఈ కాశ్మీరంలో సృష్టి, అమరత్వం గురించిన రహస్యం తెలుసుకోవచ్చును. కాని కాశ్మీరం, ప్రజలు, ఆర్మీల గురించిన సత్యాలను తెలుసుకోవడం ఎంతో కష్టం.
2
5 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఎన్నో సంవత్సరాల తరువాత సందీప్ ఇంట్లో మంగళవాద్యాలు మోగాయి. మంగళమైన గీతాలతో ఆ ఇల్లు ప్రతిధ్వనించింది.
‘‘ఊంట్ ఛడీగడ్ ఆవే లాడో
సాగే నహీం భౌజూంగీ
కేసరియా బాలమ్ ఆవోగీ, పధారే హమారే దేశ్
బాయిసారా వీరా మహానే పిబరియోం తా చలోసా
వివాహ మహోత్సవం.. అందంగా.. ఆనందంగా వసంతోత్సవం.. పాటలు.. గోరింటాకు.. సంగీతం.. నృత్యం.. నలువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం..
అతిథులతో నిండిపోయిన ఆ ఇల్లు.. నవ్వులతో ఇంద్రధనుస్సులా వెల్లివిరుస్తోంది. కాని శేఖర్‌బాబు ఆయన భార్య ముఖాల్లో సంతోషం లేదు. అందరికోసం పైపైకి నవ్వుతున్నా లోపల అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నాయి. సిద్ధార్థ వివాహం జరిపిస్తున్నారు కాని మనస్సులో ఏ కోశాన ఆనందం లేదు. సందీప్‌ని చూస్తుంటే వాళ్ళల్లో దుఃఖం పెల్లుబికింది. వాడి శరీరం ఎందుకిట్లా బలహీనం అయిపోతోంది.
వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ముఖంలో కళాకాంతులు లేకుండా పోతున్నాయి. కాని వాళ్లు మాత్రం ఏం చేయగలుగుతారు? సందీప్‌ని పెళ్లికి ఒప్పించడానికి ఎంతో తంటాలు పడ్డారు. ఉహూ.. సందీప్ ఒప్పుకుంటేగా? చూస్తూ చూస్తూ ఉంటే సిద్ధార్థకి ముప్ఫై సంవత్సరాలు దాటుతున్నాయి... మంగళవాద్యాలు మారుమ్రోగుతున్నాయి. ఢోలకీల సంగీతం నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. పాటలు ఆ ఇంటికి సుగంధాన్ని ఇస్తున్నాయి. కాని వాళ్ల మనస్సులు ఎడారిలా వున్నాయి. హిందూ వివాహాలలో ఒక విశేషం ఉంది.

- ఇంకా ఉంది

టి.సి.వసంత