డైలీ సీరియల్

బడబాగ్ని-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకేం భయం లేదు.. అయినా రాత్రిపూట తిరగలేకపోవడానికి నేనేమైనా అమ్మాయినా.. హాయిగా దొరికిన సెలవు సద్వినియోగం చేసుకు పడుకోక అర్థరాత్రి ఈ విన్యాసాలెందుకు..’’ నవ్వుతూ కొట్టిపారేశాడు అమర్.
‘‘అరె బాబూ.. భయాన్ని కవర్ చెయ్యడానికి ట్రై చెయ్యకు.. నువ్వు వెళ్లాల్సిందే..’’
‘‘చత్.. నాకేం భయం...సరే మీ సరదా నేనెందుకు కాదనాలి, అలాగే వెళదాం.. ’’ ఒప్పుకున్నాడు అమర్.
సాయంత్రంతోటే బైక్‌మీద వెళ్లిపోయారు అజిత్, అరుణ్.. రాత్రి భోజనం చేసి పనె్నండింటిదాకా ఒక ఇంగ్లీష్ హారర్ ఫిలిం చూసి.. కాదు.. కాదు అమర్ వద్దన్నా రూంలో అదే పెట్టి.. అమర్ భయపడితే నవ్వుకుంటూ ఏడిపించాడు.. పదకొండు దాటుతుండగా టిప్ టాప్‌గా తయారై చలికి తట్టుకునేలా ట్రోజర్స్.. బూట్స్.. వేసుకుని ఇద్దరూ బయలుదేరి చౌరస్త దాకా కలిసి వచ్చి అక్కడ ఆల్ ద బెస్ట్ చెప్పకు విడిపోయారు...
కన్ను తెరిచినా మూసినా ఒకేలా వున్న కారు చీకటి.. అది చాలనట్లు హోరు వర్షం, బయలుదేరిన పది నిమిషాలకే గుండె జారిపోయింది అమర్‌కి.. దారీ తెన్నూ గమ్యం లేకుండా నడుస్తున్న అతనికి తన ఊపిరే పది నాగుల బుసల్లా వినబడి అడుగు ముందుకి పడలేదు.. ఒక్కక్షణం వెనక్కి వెళ్లిపోవాలన్న కోరిక బలంగా కలిగింది.
కానీ తన స్నేహితులలో తను పిరికివాడనే ముద్ర జీవితాంతం పడిపోతుంది.. తన ట్రైనింగ్ పూర్తయ్యేలోపు అందరిలో తనకెంత అవమానం, స్నేహితులు చేసే అవహేళన గుర్తొచ్చి వెనక్కి తిరగలేకపోయాడు, కొద్దిసేపు అలాగే నిలబడి తనలో తనే ధైర్యం చెప్పుకున్నాడు.. చిన్నప్పుడు తనకి భయంవేసి అమ్మ పక్కలో చేరితే తన చుట్టూ చేతులేసి చదివిన ఆంజనేయ దండకం గుర్తొచ్చి మెల్లగా తనలో తనే చదువుకోవడం మొదలుపెట్టాడు.. మెల్లిగా నడుస్తూ అడవిదాకా వచ్చాడు. అలాగే చీకటిలో తడుముకుంటూ అక్కడ వున్న చెట్టు దగ్గరికి చేరి మెల్లిగా జేబులోంచి పైకితీశాడు.. అది ఒక సన్నని నైలాను తాడు చుట్ట.. దాని కొస ఆ చెట్టు మొదలకి కట్టడానికి చాలా ప్రయాసపడి మొత్తానికి సాధించాడు.. ఆ తాడు చుట్ట చేతిలో గట్టిగా పట్టుకుని నడక మొదలుపెట్టాడు.
కాళ్లకింద ఎండుటాకులు నలుగుతున్న శబ్దం.. ఉన్నట్లుండి వళ్లు జలదరించేలా నక్కల ఊళలు.. కీచురాళ్ల రొదలు.. కురుస్తున్న వాన హఠాత్తుగా ఆగిపోయి.. రివ్వున గాలి.. ఆ గాలికి చెట్లు చేస్తున్న విలయమారుతం.. ప్రకృతి మొత్తం ఏ ఉపద్రవాన్ని సూచిస్తూ.. వాతావరణాన్ని భయానకంగా మార్చేసింది.. అమర్ గుండె లబ్.. డబ్ అని కాక.. దడ్.. దడ్‌మని హౌరా బ్రిడ్జి మీద సూపర్ ఫాస్ట్ రైలు వెడుతున్నట్టు కొట్టుకోసాగింది.. ఉన్నట్లుండి.. కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులు.. ఆ గాలికి అమర్ చేతిలో వున్న నైలాన్ తాడు.. జారిపోకుండా భయంతో తనకి తనే నడుముకి చుట్టేసుకున్నాడు...
ఫ్లడ్ లైట్స్ మాదిరి మెరుపులు.. అనాలోచితంగా మూసుకుంటున్న కళ్ళకి తనకి అతి సమీపంగా కనిపించిన నిలువెత్తు ఆకారం.. క్రూరమైన చూపులతో గుచ్చుతూ.. అప్రయత్నంగా వచ్చింది అమర్ నోటి నుంచి.. ‘నువ్వా’.. ‘నేనే’ గరగరలాడిందా గొంతు అతని చెవి పక్కగా.
‘‘ఏం నోట మాట రావడంలేదా.. ఇంక నీకు ఆ అవసరం లేదులే.. నీ పని సరి’’. గరగరలాడుతున్న ఆ గొంతు ఈసారి మరీ చెవిలో వినబడింది. కాటేయబోయే త్రాచుబుసలాంటి అతని ఊపిరి వెచ్చగా అమర్ బుగ్గని తాకింది.. నిలువునా కూలిపోయాడు అమర్. నడుముకున్న నైలాన్ తాడు కట్లు కట్లుగా అతని మెడ వరకూ చేరి.. బిగిసిపోయింది.. శరీరాన్ని దొర్లించిన వేగానికి. ప్రకృతి స్తంభించిపోయింది.. మళ్లీ వాన మొదలయింది.
తెల తెలవారుతుండగా అనే్వష్ గెస్ట్ హౌస్ చేరాడు పూర్తిగా తడిసి ముద్దయి.
‘‘ఏరా.. నీ పనైపోయిందా. ఈ అమర్‌గాడేంటి ఇంకా రాలేదు.. సర్లే ఫ్రెష్ అయి వేడి వేడి చాయ్ తాగు.. ఆ ఫ్లాస్క్‌లో ఉంది.. నే పడుకుంటా.. తర్వాత మాటాడుకుందాం’’ మళ్లీ ముసుగు తనే్నసాడు అజిత్.
‘‘వాడెక్కడ రావాలి... భయంతో అటునించి అటే పోయుంటాడు’’ తడిసి ముద్దైన ట్రోజర్స్ తీసి హాంగ్ చేస్తూ అన్నాడు అనే్వష్.
‘‘పైకా.. వెనక్కా’’’ గరగరలాడింది అజిత్ గొంతు హస్కీగా ముసుగులోంచే.
‘‘్ఛ.. అలా మాటాడకురా.. వాడు ఈపాటికి హాయిగా ముసుగుతన్ని పడుకునుంటాడు. నాకు ఏం అనుమానం లేదు.. ఏదో మనతో వస్తానన్నాడు కానీ వాడికంత సీన్ లేదు, వాడసలు చౌరస్తానుంచే వెళ్లిపోయుంటాడు వెనక్కి.. అవునూ.. ఈ అరుణ్ గాడేంటి అలా పడి నిద్దరోతున్నాడు.. రాత్రి బాగా పీకలదాకా తాగేసాడా..’’
‘‘కొంచెం ఎక్కువైయిందిలే... సర్లే పడుకో బాగా అలసిపోయుంటావ్’’
***
‘‘ఏంట్రా? సాయంత్రం కావస్తూంది.. అమర్ రాలేదు.. కనీసం ఫోన్ చెయ్యలేదు.. నే రింగ్ చేస్తుంటే.. నాట్ రీచబుల్ అని వస్తోంది.. నాకేదో భయంగా వుంది’’ అజిత్ అన్నాడు.
‘‘్ఛ.. వాడు హాయిగా రూంలో పడుకుని ఉంటాడు సెల్ ఆఫ్ చేసి.. పదండి మనం కూడా ఇంక బయలుదేరుదాం. రాత్రి అయితే ఇబ్బంది పడతాం..’’ అంటూ బయలుదేరదీసాడు అనే్వష్.
రాత్రి అయింది.. తెల్లవారింది.. అమర్ జాడ లేదు.. అసలే భయస్తుడు.. పైన చిమ్మచీకటి.. ఆపై గాలివాన.. పైగా అడవి.. ఏమైపోయుంటాడు.. దేముడా వాడికి ఏ ఆపదా కలగనీకు.. ఎవరికివారే మనసులో దేముడిని ప్రార్థిస్తున్నారు...
మర్నాడు క్లాస్‌లో ట్రైనర్ సాహు సర్ అడిగాడు ‘‘ఏమిటీ మీ దోస్త్ అమర్ రాలేదు, నిన్న కూడా రాలేదు. పర్మిషన్ లేకుండా మానేస్తే ట్రైనింగ్ ఎక్స్‌టెండ్ అవడమే కాదు డిసిప్లినరి యాక్షన్ కూడా ఉంటుంది తెలుసా..’’

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్