డైలీ సీరియల్

బడబాగ్ని 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవునూ.. నీకు ప్రియ ప్రెజెంట్ చేసిన స్వెట్టర్ ఎక్కడుంది?’’
‘‘రూమ్‌లోనే నా అల్మారాలో ఉంది.. ఏమిటిరా.. ఈ కేసు విషయం మానేసి ఏదేదో అడుగుతావ్? రేపు కోర్టు బోనులో నిలబడాలంటే ఏదోలా ఉందిరా.. దోషుల్ని పట్టుకోవాల్సిన నేను.. యిలా దోషిలా నిలబడాలంటే చచ్చిపోవాలనుంది..’’ విరక్తిగా అన్నాడు.
‘‘ప్లీజ్.. అలా మాట్లాడకురా.. తప్పకుండా నువ్వు ఈ కేసులోంచి బయటపడతావ్.. మన లాయర్‌గారి మీద నాకా నమ్మకం ఉంది..’’
‘‘మిస్టర్ అజిత్.. మీరు కొంచెం కోపరేట్ చేస్తే.. తప్పకుండా నిరపరాధిగా బయటపడతారు.. యిప్పుడు నేనడిగే ప్రశ్నలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, ఒకటికి రెండుసార్లు.. బాగా గుర్తుతెచ్చుకు చెప్పండి.. సరేనా?’’ అతనినే సూటిగా చూస్తూ అడిగాడు భగవాన్.
‘‘సరే సర్.. నాకు తెలిసినంతవరకూ అలాగే చెబుతాను.. అడగండి..’’
‘‘ఈ హత్య జరగడానికి ముందు.. అంటే సుమారుగా గత కొన్ని రోజులుగా మీ రూమ్‌కి కానీ.. మీ దగ్గరకు కానీ ఎవరైనా వచ్చారా.. మీరు లేనపుడు మీ రూమ్‌లోకి వచ్చే అవకాశం ఉందా?’’
‘‘...’’
‘‘బాగా ఆలోచించుకుని గుర్తుతెచ్చుకు చెప్పండి..’’
‘‘జనరల్‌గా ట్రైనింగ్ హాస్టల్స్‌లోకి ఎవరినీ అలౌ చెయ్యరు.. కానీ మరీ చిన్నపిల్లల హాస్టల్ కాదు కనుక అప్పుడప్పుడు ఎవరైనా వస్తే పెద్దగా పట్టించుకోరు.. క్రింది నెల ప్రియ వాళ్ల పేరెంట్స్‌తో వచ్చింది కాని.. బయట హోటల్ రూమ్ తీసుకు ఉన్నారు.. వాళ్లు రాలేదు.. కానీ వాళ్లు ఉన్నప్పుడు అమ్మ వచ్చింది.. ఇంటినుంచి నాకోసం తెచ్చిన ఫుడ్ ఐటెమ్స్ ఇవ్వడానికి.. బట్ వెంటనే వెళ్లిపోయింది..’’
‘‘ఆమె ఒక్కరే వచ్చారా.. వెంట ఎవరైనా ఉన్నారా?’’
‘‘ఆమెతోపాటు ‘రాహుల్’ వచ్చాడు..’’ అయిష్టంగా తప్పదన్నట్లు చెప్పాడు.
‘‘రాహుల్ ... ఎవరు?’’
‘‘నా స్టెప్ బ్రదర్..’’
‘‘ఓ.. అతనిమీద.. మీకేమైనా అనుమానం ఉందా..?’’
‘‘నో.. మా ఇద్దరిమధ్యా సయోధ్య లేనిమాట నిజమే కానీ, అంత శత్రుత్వం కూడా లేదు.. పైగా అతనికి అమర్‌తో పెద్దగా పరిచయం కూడా లేదు.. ఒకటి రెండుసార్లు చూడటం తప్ప.. ’’ అజిత్ క్లియర్‌గా అన్నాడు.
‘‘అతనికి ఏమైనా అబ్‌నార్మాలిటీస్... ఐమీన్.. కాలు అవుడు కానీ.. లేకపోతే.. లింబ్ ఎలైన్‌మెంట్‌లో ఏదైనా తేడా..’
‘‘నో సర్... అతనిమీద అనుమానపడటం వేస్ట్..’’ ముఖం చిట్లిస్తూ అన్నాడు అజిత్.
‘‘ఓ.కె.. ఓ.కె.. మేమింక వెడతాం.. మీరు ధైర్యంగా ఉండండి..’’
‘‘బై రా.. వర్రీ అవకు.. అంతా సవ్యంగానే జరుగుతుంది.. రేపు కోర్టులో కలుస్తాను..’’
‘‘సరే...’’
***
కోర్టు ఆవరణ అంతా జనంతో కిక్కిరిపోయింది.
అడవిలో.. హత్య.. అదీ ఒక ఐ.పి.ఎస్. ట్రైనీ ఆఫీసర్ కావడం.. ముద్దాయి ఇంకో ట్రైనీ ఆఫీసర్ కావడం.. కేసు బాగా సంచలనం సృష్టించింది.
జడ్జి వచ్చి కూర్చోవడంతో కేసు విచారణ మొదలైంది.
ముద్దాయిని బోనులో నిలబెట్టి విచారణ మొదలుపెట్టాడు పి.పి.
‘‘్భగవంతుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను.. అబద్ధం చెప్పను’’ గీత మీద ప్రమాణం చేయించారు.
‘‘మీరు అమర్‌ని ఎందుకు చంపాల్సి వచ్చింది.. మీకిద్దరికీ ఏమైనా తగాదాలు, కక్షలూ ఉన్నాయా.. లేక ఏదైనా ప్రేమ వ్యవహారంలో గొడవలా?’’
‘‘లేదు.. లేదు నేను అమర్‌ని చంపలేదు.. చంపలేదు.. అసలు నేనెందుకు చంపుతాను.. అయ్యో.. అమర్.. అమర్..’’ చేతుల్లో ముఖం దాచుకు ఏడుస్తున్న అతనిని కోర్ట్‌లో కొంతమంది జాలిగా చూస్తే.. కొంతమంది.. ‘ఆ అదంతా నటన.. ఏవో గొడవలొచ్చి ఉంటాయ్.. ఎలాగో పోలీస్ ఆఫీసర్ అవుతున్నాడు కదా, తన నెవరు పట్టుకుంటారులే అనుకుని లేపేసుంటాడు’ అనుకుంటూ చూసేరు.. ఒక వ్యక్తి మాత్రం.. ఆనందంతో.. అనుకున్నది సాధించగలిగానన్న తృప్తితో.. అజిత్‌ని చూస్తున్న అతని కళ్లు వికృతానందంతో మెరవడం.. ఎవరూ గమనించలేదు.
‘‘ఇది కోర్ట్... ఇక్కడ ఉద్వేగాలకు తావులేదు.. కంట్రోల్ యువర్‌సెల్ఫ్.. అమర్‌ని మీరు ప్లాన్ చేసి చంపేరనడానికి కావలసినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయ్...’’
‘‘ఐ అబ్జెక్ట్ యువరానర్.. బోనులో ఉన్న అజిత్ ‘ముద్దాయి’ మాత్రమే.. నేరం రుజువై హంతకుడు కాలేదు.. గౌరవనీయులైన పి.పిగారు మాటి మాటికి నువ్వు చంపేవ్.. చంపిన అంటూ నిందితుడు ఆ హత్య చేయడం కళ్లారా చూసినట్లు మాట్లాడటం, నా క్లయింట్‌ని ఉద్దేశపూర్వకంగా కించపరచడం తప్పు..’’ భగవాన్ లేచి చెప్పాడు.
‘‘హత్యానేరంతో బోనులో నిలబడ్డవారిని.. ఎందుకు చంపావ్ అని అడగడం తప్పా.. కించపరచడం ఎలా అవుతుంది యువరానర్.
‘‘అబ్జెక్షన్ సస్టైండ్.. విలువైన కోర్టు సమయం వృధా చేయకుండా.. ప్రాసిక్యూషన్ మొదలుపెట్టండి...’’
‘‘మిస్టర్ అజిత్.. సరే మీరు అమర్‌ని చంపలేదు... కానీ ముగ్గురు మాత్రమే ఉన్నప్పుడు.. పది చీటీలు వ్రాయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అదీ పది వాటిల్లో అమర్ పేరే ఎందుకు రాయాల్సి వచ్చింది? కమాన్ చెప్పంటడి.. ఎలిబి నెంబర్ వన్‌గా ప్రవేశపెడుతున్న వీటిని సగౌరవంగా కోర్టువారికి అందచేస్తున్నాను..

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్