డైలీ సీరియల్

బడబాగ్ని-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దాయి స్వహస్తాలతో రాసిన ఆ చీటీలు.. ముద్దాయి ప్లాన్ ప్రకారం హతుడిని ఆ రాత్రి, ఉద్దేశపూర్వకంగా.. అడవిలోకి తీసుకెళ్లి మట్టుపెట్టాలన్న ప్లాన్‌తోనే.. లాటరీలో వేరే ఎవరి పేరు రాకుండా ఉండటం కోసమే.. అన్ని చీటీల్లో అమర్ పేరు మాత్రమే వ్రాసాడు యువరానర్.. నిస్సందేహంగా ఇది ప్లాన్డ్ మర్డర్..
‘‘నో.. నేనందుకు రాయలేదు.. అమర్ స్వతహాగా భయస్తుడు.. కాబోయే పోలీస్ ఆఫీసర్‌గా అతను దానిని అధిగమించాలనీ.. అదీకాక అదొక అడ్వెంచర్‌లా ఫీల్ అయ్యా కాని దానివలన ఇంత అనర్థం జరిగి అమర్ బలి అవుతాడని ఊహించలేదు.. నన్ను నమ్మండి...’’
పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో హతుడి మృతి.. మెడకి తాడు గట్టిగా బిగించి, గుండెలపైన గట్టిగా తొక్కడంతో ఊపిరాడక మరణించినట్టు ఉంది.. హతుడిని బెట్ పేరిట రెచ్చగొట్టి ఒంటరిగా అర్థరాత్రి అడవికి బయలుదేరేలా చేసి.. అతని వెనకాలే వెళ్లి హతమార్చినట్లు స్పష్టమవుతోంది.
‘‘అమర్‌ని ఎలాగైనా బయలుదేరదీసి అతని అంతు చూడాలని రాసి యిప్పుడేదో చెబుతున్నాడు మిస్టర్ అజిత్.. సరే పోనీ అలాగే అనుకుందాం.. అతనే చెబుతున్నాడు అమర్ ‘్భయస్తుడు’ అని.. మహా మహా ధైర్యవంతులే.. ఊహమాత్రానికే భయంతో గుండె జారిపోతుంది.. అర్థరాత్రి.. అమావాస్య.. చిమ్మ చీకటి.. పైగా కారడవి.. అలాంటిచోటుకి అంత భయస్తుడిని ఒంటరిగా పంపితే.. ఎవరో చంపక్కర్లేదు.. ఆ భయానికి గుండె ఆగిపోతుంది..
ముద్దాయి చెప్పినట్లు అమర్ భయస్తుడు కాడు.. పైగా తెలివైనవాడు.. అందుకే ఆ చీకటిలో ఒకవేళ ముందుకి వెళ్ళలేని పరిస్థితులే ఎదురైతే.. దారి తప్పకుండా.. వెనకకి రావడానికి వీలుగా గుర్తుగా తాడు విడిచాడు. అడవిలోకి ప్రవేశించగానే.. కానీ పాపం ఆ అమాయకుడికి తెలియదు.. మిత్రద్రోహి వెన్నంటి వచ్చి.. ఆ తాడుతోనే హతమారుస్తాడని.. ఆ తాడే తన పాలిటి యమపాశమవుతుందని.. ఇది క్లియర్ కట్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్.. నమ్మించి గొంతుకొయ్యడం.. అయితే ఆ హడావుడిలో తన సెల్ అక్కడ పడిపోయి తన పాపానికి ప్రత్యక్ష సాక్షి అవుతుందని.. ఊహించలేదు పాపం..’’
‘‘లెర్నడ్ ఫ్రెండ్ పి.పి.గారు తన అమోఘమైన వాక్చాతుర్యంతో.. అభినయంతో జరిగినదానికి ఎరుపు రంగులద్ది.. అజిత్ హత్య చెయ్యడం కళ్లారా చూసినంత అనుభూతితో వర్ణించడంలో కొన్ని ముఖ్యమైన విషయాలు విస్మరిస్తున్నారో లేక ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తున్నారో కానీ.. ఇంత కుట్ర మనసులో పెట్టుకుని.. ఆ అర్థరాత్రి అమర్‌ని చంపడమే ధ్యేయంగా ప్లాన్ చేసుకున్న అజిత్.. తను వ్రాసిన ఆ చీటీలు నాశనం చేయకుండా.. ‘అయ్యా.. వీటిని ఎలిబిగా ప్రవేశపెట్టండి.. నా నేరం నిరూపించి నన్ను శిక్షించండి..’ అంటూ ఒక బాక్స్‌లో పెట్టి కోర్టుకి అందచేస్తాడా? ఒకవేళ ఆ చీటీలను అంత సీరియస్‌గా తీసుకోక నిర్లక్ష్యంగా వదిలేసేడనుకున్నా.. వాటిని భద్రం చేసి.. బాక్స్‌లో పెట్టి భద్రంగా కోర్టుకి అందచేసే అవసరం ఎవరికుంటుంది? అజిత్‌ని యిందులో ఇరికించాలనే దురుద్దేశ్యం.. దురాలోచన వున్న వాళ్లకి తప్ప.. అనాలోచితంగా.. సరదాకి చేసిన ఈ పనిని.. దురుద్దేశ్యంతో.. దుర్బుద్ధితో తనకి దొరికిన అవకాశంగా వినియోగించుకుని తనతో శత్రుత్వం వున్న అమర్ అడ్డు తొలగించుకుని.. తెలివిగా ఆ హత్య అజిత్ మీద వచ్చేలా ట్రాప్ చేసేడనడానికి ఇంతకంటే సాక్ష్యాధారాలు అక్కరలేదు.. కనుక మనం ఇపుడు చెయ్యని నేరాన్ని అజిత్ చేత బలవంతంగా ఒప్పించే ప్రయత్నం కాక.. ఈ హత్య ఎవరు.. ఏ ఉద్దేశ్యంతో చేశారు? దానికి అజిత్‌ని ఎందుకు పావుగా వాడుకున్నారు? అన్నదాని గురించి ఆలోచించాలి. ‘వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు’ అన్న న్యాయశాస్త్ర శాసనాన్ని గౌరవించాలన్న విషయం గౌరవనీయులైన పి.పిగారికి గుర్తుచెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను.. కనుక కోర్టువారు దయార్ద్ర హృదయంతో ఆలోచించి అసలు దోషిని పట్టుకునేందుకు నాకు కొంత వ్యవధి ఇయ్యవలసిందిగా కోరుకుంటున్నాను.. దట్సాల్ యువరానర్.
‘‘ముద్దాయి తరఫు లాయర్ శ్రీ్భగవాన్‌గారి వాదనలో నిజానిజాలు వెలికితీయవలసిన అవసరం ఉందన్న విషయంతో ఏకీభవిస్తూ.. వారికి ఒక వారం రోజులు గడువిస్తూ.. ఈ కేసు వచ్చే గురువారం నాటికి వాయిదా వేస్తున్నాను.. నౌ ద కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్’’ జడ్జి లేచి వెళ్లడానికి ఉద్యులయ్యారు.
కోర్టు నుంచి బయటకు వచ్చిన అనే్వష్, అరుణ్‌లకు అజిత్ అమ్మ, నాన్నలతోబాటు రాహుల్ కూడా రావడం ఆశ్చర్యమనిపించింది. ఎప్పుడూ అతనిని వాళ్లతో కలిసి చూడకపోవడంతో.. కొత్తగా అనిపించింది.
‘‘రాహుల్.. మీరెప్పుడొచ్చారు? ఎంత దారుణం జరిగిపోయిందో చూడండి.. మా అమర్ గుర్తున్నాడా? ఎవరో వాడిని చంపి ఆ కేసులో మన అజిత్‌ని యిరికించారు.. రాస్కెల్.. తప్పకుండా దొరుకుతాడు.. దేముడనేవాడుంటే... వాడు.. వాడు చేసిన పాపానికి.. అంతకంత అనుభవిస్తాడు.. ఎమోషనల్ అయిపోయాడు అనే్వష్.
రాహుల్ ముఖంలో అసహనం కొట్టచ్చినట్లు కనబడింది.
‘‘నేను కొంచెం అర్జెంట్ పనిమీద వెళ్లాలి.. మళ్లీ కలుద్దాం.. సీ.. యూ’’ జవాబు కోసం ఎదురుచూడక వడివడిగా వెళ్లిపోయాడు.
బిత్తరపోయి చూస్తున్న అనే్వష్, అరుణ్‌లతో... ‘‘అజిత్‌కి యిలా జరిగిందని వాడు చాలా అప్సెట్ అయ్యాడు. విషయం తెలిసి ఉదయమే వచ్చాడు. వాడి మూడ్ బాగుండకపోతే వాడంతే. ఏమీ అనుకోకండి..’’ సర్ది చెప్పింది వాళ్ల అమ్మ.
‘‘వాడో అడవి మనిషి.. వాడి మూడ్ ఎప్పుడు బాగుండి ఏడిసింది గనుక..’’ ఈసడింపుగా అన్నాడు అజిత్ తండ్రి, వాళ్ళ వైపు ఓ వెర్రి చూపు చూసి.. ‘‘వస్తాం అంకుల్... మళ్లీ కలుద్దాం’’ అంటూ వెళ్లిపోయారు.
***

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్