డైలీ సీరియల్

బడబాగ్ని-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసురోమని రూం కొచ్చి పడ్డారు యిద్దరూ.. ఎంతలో ఎంత మార్పు.. నిన్నమొన్నదాకా నలుగురి నవ్వులతో, కబుర్లతో హోరెత్తిన ఆ గది ఇప్పుడు బావురుమంటోంది.. దిగాలుగా కూర్చుండిపోయారు.. అంతలో ఏదో గుర్తొచ్చి.. అనే్వష్ లేచి అజిత్ అలమరా వెదికాడు.. అక్కడ అతనికి ప్రియ ఇచ్చిన స్వెట్టర్ లేదు. ఏదో జరిగింది.. తమకి తెలియకుండానే.. తమ వెనకాల ఏదో కుట్ర.. ఎవరు చేశారు? ఎవరికి అంత అవసరం ఒక్క రాహుల్ తప్ప తమ గదికి ఎవరూ బయట నుంచి రాలేదు.. మిగతా ఇక్కడ కోట్రైనీస్.. అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్లడం తప్ప ఎవరికి అంత అవసరం, అవకాశం లేవు.
రాహుల్ అంత క్రూరమైనవాడా..? అజిత్ అంటే అతనికి అపేక్ష లేకపోవచ్చు.. కానీ అంత శత్రుత్వమూ లేదే.. పైగా అమర్‌తో ఏ శత్రుత్వం? అజిత్‌ని ఇరికించడానికి.. అమర్‌ని ఆయుధంలా వాడేంత నీచుడా? ఏమో.. రోజూ ఎన్ని వినడంలేదు.. చూడడం లేదూ? రకరకాల కక్షలతో కారణాలతో పెద్ద వాళ్లమీద పగతో అభం శుభం ఎరుగని చిన్నారులను హతమారుస్తున్నారు.. వాళ్ళు ఏం నేరం చేశారనీ.. ఏం పాపం చేశారని.. అదో రకం సైకో మెంటాలిటీస్.. ఈ నేరం కూడా ఆ కోవలోదే ఎందుకు కాకూడదు.. కానీ రాహుల్ నడక.. మామూలుగానే ఉందే.. ఏమో కేసు తప్పుదోవ పట్టించడానికి చేసిన ట్రిక్ కావచ్చు.. ఆలోచనల్లో మునిగిపోయన అనే్వష్.. అరుణ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు.
‘‘అవునూ... రాహుల్ ఎలాంటివాడంటావ్? వాడికి అసలే అజిత్ అంటే.. జెలసీ.. నాకెందుకో వాడిమీదే అనుమానంగా వుంది.. పైగా ఎప్పుడూ లేనిది ఈమధ్య తరచూ వస్తున్నాడు.. ఈవేళ కోర్టుకి కూడా వచ్చాడు..’’
అచ్చంగా తన మనసులో మాట అరుణ్ నోటంట విన్న అనే్వష్.. ఓ నిర్ణయానికి వచ్చేసాడు.
అనే్వష్ రాహుల్ దగ్గర చేరాడు. ఎలాగైనా మిస్టరీ ఛేదించాలని.. రాహుల్ కొరకరాని కొయ్య... అతనిని టార్గెట్ చేసి ఎలాగైనా పట్టుకోవాలనుకోవడం దుస్సాహసమే.. అయినా అనుమానం కలిగేకా అది వివృత్తి చేసుకోవడం తప్పనిసరి.
ఈ గొడవలు తెలిసి అరుణ్ తల్లి తండ్రి వాళ్ల వూరు నుంచి వచ్చేరు. అరుణ్ వాళ్లతో హోటల్ రూంలో ఉన్నాడు. అజిత్ జైల్లో ఉన్నాడు.. అమర్.. అలా, ‘‘ఆ హస్టల్ రూంలో ఒక్కడినీ ఉంచడానికి భయం వేస్తోంది. రాహుల్, నేను మీతో బాటు ఉంటా ప్లీజ్’’ అంటూ రాహుల్ గదికి చేరాడు అనే్వష్ ఒక చిన్న బ్యాగ్‌తో..
ఈ అనే్వష్‌గాడు ఇక్కడ చేరాడు. వీడికి నా మీద అనుమానంగాని వచ్చిందా.. లేకపోతే ఐపిఎస్ ఆఫీసర్‌కి భయమేమిటి?.. అందుకోసం నా దగ్గర చేరడం ఏమిటి?.. నానె్సన్స్.. ఇక్కడ కూపీ లాగడానికే చేరాడు... హనుమంతుని ముందా కుప్పిగంతులు.. చూస్తా వీడి తెలివితేటలు ఏపాటివో..
ఇద్దరూ ఒకరిని మించినవాళ్లు యింకొకళ్లు.
కోర్టు ఇచ్చిన గడువులోపల ఎలా అసలు హంతకుడిని కనిపెట్టి పట్టుకోవడం, అజిత్‌ని రక్షించడం.. యిదే ఆలోచన యిటు అనే్వష్‌కి అటు భగవాన్‌కి.. యిటు రాహుల్, అజిత్ ఎటూ శిక్షింపబడతాడు. సో యిటు వాడి ఆస్తికి దానితో బాటు వాడికి నిశ్చయమైన ప్రియకి తనే హక్కుదారు అన్న అభిప్రాయానికి వచ్చినట్టు మాటాడుతున్నాడు.. ప్రియకు ఫోన్ చేసి రాత్రివేళ మాట్లాడటం విన్న అనే్వష్ వీడే తప్పకుండా అమర్‌ని హత్య చేసి ఆ నింద అజిత్‌మీద పడేలా చేసి ఇటు అజిత్‌మీద కోపాన్ని అటు ప్రియ మీద వున్న ప్రేమను తనకు అనుకూలంగా మలచుకంటున్నాడన్నది తిరుగులేని నిజం..
‘‘ప్రియా.. పాపం ఇంకొక్క వారం రోజుల్లో అజిత్‌ని ఉరి తీస్తారో.. లేకపోతే యావజ్జీవ శిక్ష వేస్తారో.. అసలు ఎంత అమర్‌కి నువ్వంటే ఇష్టం అయితే మాత్రం.. అలా బ్రూటల్‌గా చంపేస్తాడా? కనీసం నీ గురించి అయినా ఆలోచించాలిగా.. ఆ మాటకొస్తే నాకూ నువ్వంటే చాలా చాలా ఇష్టం.. చిన్నప్పటినుంచీ నేను నీ మీద పెంచుకున్న ఆశలు.. అయినా మేనమామ కూతురిగా, అమ్మ పెద్ద కొడుకుగా నాకే నీ మీద హక్కు ఎక్కువ. కాని ఆ త్రాష్టుడు.. అందం.. ఆస్తి.. అన్నింటికీ మించి ఆ అజిత్‌గాడికి నీమీద వున్న మక్కువ కారణంగా చూపి నిన్ను నాకు కాకుండా చేసి తన కొడుక్కి కట్టబెట్టాలనుకున్నాడు.. ఏమైంది.. పాపం పూర్ ఫెలో.. అసలుకే మోసం వచ్చి ఇప్పుడు కన్న కొడుకే దూరం అయ్యే పరిస్థితి... నువ్వేం వర్రీ అవకు, నీకు నేనున్నాను.. ఎవరు అడ్డుచెప్పినా.. ఎంత కాదన్నా నేను నిన్ను పెళ్లాడి తీరుతాను... ఇంక ఆ అజిత్‌గాడిని మర్చిపోయి.. హాయిగా మన గురించి కలలు కను.. బై డార్లింగ్’’
హార్నీ.. అజిత్‌మీద నీకున్న అసూయకి కారణం యిది కూడా అన్నమాట.
అవునూ.. అమర్‌కి ప్రియమీద ఇష్టం... ఒకసారి మాటల సందర్భంలో అమర్ అన్న మాటలకిదా అర్థం.. ఆ రోజు నలుగురూ సరదాగా మాట్లాడుకోవడం గుర్తొచ్చింది అనే్వష్‌కి.
‘‘అజిత్ పెళ్లి కుదిరిపోయింది సరే.. అనే్వష్‌గాడు ఎటూ నమిత వెంట పడుతున్నాడు.. అది ఇప్పుడప్పుడే తేలే సంగతి కాదు.. మరి నీ సంగతేమిటిరా అమర్..’’ అరుణ్ అన్న మాటలకి అమర్-
‘‘నా పెళ్లి యిక ఈ జన్మలో అయ్యేది కాదు. నేనో శాపగ్రస్తుడిని. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించాను.. అయితే నిజంగా ఆ అమ్మాయికి పెళ్లి అయిన సంగతి నాకు తెలియదు.. సో ఈ జన్మకి ప్రేమా.. పెళ్లి లాంటివి యిక అయిపోయినట్లే.. బెటర్‌లక్ నెక్స్ట్ జన్మ.. అసలు ఈ జన్మలూ.. గట్రా గట్రా అంటూ ఉంటే..’’
‘‘మా ముగ్గురి సంగతీ సరే.. మరి నీ మాట ఏమిటి..’’ అడిగాడు అనే్వష్.. అరుణ్‌ని.
‘‘అదీ అది.. సిగ్గుపడిపోయాడు అరుణ్..’’

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్