డైలీ సీరియల్

బడబాగ్ని-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్వాత చట్టానికి చిక్కక ఎక్కడకు పోతాడు.. ఒకరకంగా వాడిని పట్టించే అవకాశం వాడే కల్పించాడు.. అనుకుంటూ బాత్‌రూంలో వాడు కూర్చుని కాలు డ్రెస్సింగ్ చేసుకునే చోటు కనిపించి అంతా క్లియర్‌గా రికార్డ్ అయ్యే విధంగా బాత్‌రూం వెంటిలేటర్‌లో బయటకి కనిపించకుండా, వాడి కాలు అంతా క్లియర్‌గా కనబడేలా అమర్చాడు..
‘‘ఇంకెక్కడికి పోతావ్‌రా రాహుల్‌గా?’’ అనుకుంటూ.
సరే ఈ పని అయిపోయింది.. ఇంకా ఏమైనా క్లూస్ దొరుకుతాయా అని ఆ గదంతా అంగుళం అంగుళం వెదికాడు.. అనుమానించ తగినవేమీ దొరకలేదు.. అక్కడ టేబుల్ మీద వున్న పుస్తకాల దొంతర తీశాడు.
అన్నీ.. క్రైమ్, అపరాధ పరిశోధన, హత్యలకు సంబంధించినవే.. వార్నీ.. చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి దొమ్మరి గుడిసెలూ.. అన్నట్లు చేసేదేమో కాలేజ్ ప్రొఫెసర్ ఉద్యోగం.. చదివేవి, చేసేవి ఇలాంటివన్నమాట... నీటిలో శవం, అర్థరాత్రి హత్య, అడవిలో హత్య.. ఆ పుస్తకాల పేర్లు చదువుతున్న అనే్వష్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.. అడవిలో హత్య.. కొంపతీసి ఈ పుస్తకం చదివి కాని ఈ హత్య చెయ్యలేదుకదా.. నెమ్మదిగా చేతి రుమాలుతో ఒక కొస పట్టుకుని ఆ పుస్తకం తెరిచాడు. అది చాలాసార్లు చదివిన గుర్తుగా బాగా నలిగిపోయింది. అందులో కొన్ని చోట్ల రెడ్ కలర్ బాల్ పాయింటు పెన్‌తో చేసిన అండర్‌లైన్స్...
రావు గబగబా నడుస్తున్నాడు.. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ.. ఆ కాళరాత్రి.. అడవిలో కాళికాలయం దగ్గర భూగర్భంలో నిధులున్నాయని, అవి కాజెయ్యడానికి అదే మంచి ముహూర్తమని చెప్పిన అహోబిలరావు మాటలు చెవుల్లో మారుమ్రోగుతుండగా.. అహోబిలరావు తన అనుచరుడు మహా భయంకరుడు కాళేశ్వరరావుతో చెప్పిన మాటలు అనుకోకుండా తన చెవిలో పడటం తన అదృష్టం.
ఈ రోజు కొంచెం ధైర్యం చేస్తే యిక ఈ వెధవ పనులకీ, దొంగతనాలకి గుడ్‌బై చెప్పి జీవితాంతం హాయిగా, ఆనందంగా రాజులా బతకవచ్చు.. ఆలోచిస్తూ చకచకా నడుస్తున్న రావుకి తన వెనకాతల ఎవరో వస్తున్న అలికిడి అయింది... ఎంత ధైర్యం చెప్పుకున్నా.. ఆ చీకటి.. ఆ చెట్లు గాలికి చేసే శబ్దాలు.. కీచురాళ్ళ ధ్వనులు.. దూరంగా రకరకాల జంతువులు చేస్తున్న వింత వింత ధ్వనులూ.. అతని గుండె జారి భయంతో మనిషి నిలువెల్లా వణకసాగాడు... బాబోయ్ బతికి బట్టకడితే కదా ఆ నిధి దొరికి అనుభవించడానికి... అసలు ఇంకొకళ్లనెవరినైనా తోడు తెచ్చుకోవలసింది.. వెధవ బుద్ధి.. ఎవరికైనా చెబితే వాటా ఇవ్వాల్సి వస్తుందని.. ఒక్కడే వచ్చాడు.. యిప్పుడు నిధి మాట దేముడెరుగు భయంతో ఇక్కడే హరీ అనేలా ఉన్నాడు... ‘‘ఏరా.. రావుగా.. ఏటి.. నిధి ఒట్టుకెల్లిపోదారనే.. అర్థరాతిరేల ఓ ఎగేసుకు.. ఎల్లిపోవచ్చీసినావ్..
కానొరే.. నీకు తెలియని... నాకు మాత్రమే తెల్సిన విషయమోటి చెబుతా యినోరే.. నిధి నేదు.. గాడిద గుడ్డూ నేదు.. నువ్వు నాకు సేసిన, సేస్తున్న అనే్నయానికి ప్రతిగా నిన్ను ఆ కాలికామ్మోరికి బలి యియ్యడానికే నేను నా నమ్మిన బంటు కాళేశ్వరరాగోడికి నువ్వు యింటుండగా అట్టా సేప్పానోరే.. నేకపోతే... నానింటో లేకుండాసూసి.. నా యింట్లో దూరి.. అక్కడా ఇక్కడా కొట్టుకొచ్చిన సిన్నాసితకా బగుమతులిచ్చేసి.. నా గురించి నోటికొచ్చినట్లు వాగి నా లచ్చి మనసు యిరిసేసి దాన్ని నువ్వు.. ఛ.. నీతి తక్కువ నాకొడకా.. అందుకే నీకు ఆశ పెట్టి ఒంటరిగా ఈడకి రప్పిస్తే. అమ్మోరికి బలి.. నరబలి... ’’ చేష్ట్టలుడిగి నిలబడిపోయిన రావు మెడలో యమపాశంలో పడింది తాడు..
అప్పటికి తెలివొచ్చి.. పారిపోబోయిన రావు మెడకి ఉచ్చు బిగిసింది.. ఊపిరి ఆడక గిలగిలలాడుతున్న రావు క్రింద పడగానే చేతిలో తాడు గట్టిగా బిగించి.. పైన ఊపిరి ఆడకుండా అతని గుండెలమీద ఉక్కుపాదం మోపాడు.. కొద్దిసేపు గింజుకు గింజుకు.. ప్రాణాలొదిలేశాడు రావు.
చదువుతున్న అనే్వష్‌కి భయంతో ముచ్చెమటలూ పట్టాయి.. ఓర్నీ.. యిలాంటి సాహిత్యం ఎందుకు రాస్తారో.. రాసే వాళ్లకి బుద్ధి లేకపోతే.. అది వేసే వాళ్లకైనా ఉండాలి.. ఏదో సైన్స్ ప్రాక్టికల్ లేబ్ బుక్‌లా వాడు రాయటం.. యిదికో ఇలాంటి ప్రబుద్ధులు వాటిని గైడ్‌లా ఫాలో అయి ప్రాక్టికల్స్ చెయ్యడం.. కారణం ఏదైనా హత్య జరిగిన పద్ధతి ఇంచుమించుగా అదే... బహుశా తాము సరదాగా ప్లాన్ చేసుకోవడం తెలిసి ఈ రాహుల్‌గాడు.. అవకాశం.. యిలా ఉపయోగించుకున్నాడన్నమాట.
ఇంక అక్కడున్న మిగతా పుస్తకాలు మట్టుకోవడానికి కూడా అసహ్యం వేసింది అనే్వష్‌కి. ఎంత కక్షలు.. కార్పణాలున్నా సాటి ప్రాణిని చంపడం.. ప్చ్.. క్రూర జంతువులు కూడా తమకి ఆకలి వేసి.. కడుపు నింపుకుందుకే సాటి జంతువులని చంపుతాయ్. కాని మనిషి.. తన ఉనికికోసం, అహం కోసం, ఆస్తికోసం.. కాంత కోసం.. యిలా ఎన్నింటికోసమో ఆ పశువులకన్నా, పూర్వం ఉండేవారన్న రాక్షసులకన్నా దారుణంగా తయారవుతున్నారు... ఎటు పోతోంది ఈ సభ్య సమాజం... కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని, ఆక్రోశాన్ని కంట్రోల్ చేసుకుంటూ... కాసేపు అలా కూర్చుండిపోయాడు అనే్వష్.
ఎలా ఇక్కడనుండి బయటపడాలి.. అని చుట్టూ చూసిన అతనికి మార్గం కనబడలేదు..
ఎలా.. ఎలా ఇక్కడనుంచి బయటపడాలి? పోనీ బాత్‌రూం వెంటిలేటర్ తీసేసి అందులోంచి బయటపడదామన్నా అక్కడ రెండు సమస్యలు.. ఒకటి అది తన సైజు మనిషి దూరేంత పెద్దది కాదు. పోనీ ఎలాగో అవస్థపడి దూరి బయటపడదామన్నా అక్కడ తను రాహుల్‌ని పట్టించే ముఖ్యమైన సాక్ష్యం కోసం సిసి కెమెరా పెట్టాడు.. అది బయటపడితే తన పాచిక పారదు.. లేదు తను రాహుల్ వచ్చి తలుపు తెరిచేవరకూ ఆగక తప్పదు.

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్