డైలీ సీరియల్

బడబాగ్ని-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ.. ఏదో కోర్ట్ కేస్ నడుస్తున్నది.. మీ ట్రైనింగ్ సెంట్రల్ వాళ్ళమీద.. ఏమై రైట్..?’’’
‘‘అవును.. హతుడు నా స్నేహితుడే.. హత్యానేరం క్రింద అరెస్టు అయినదీ నా స్నేహితుడే.. ఏమిటో ఈపాటికి ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ వచ్చి ఉండవలసిన వాళ్ళం... యిలా చెయ్యని నేరానికి కోర్ట్... కేసు అంటూ తిరుగుతున్నాం.. ప్చ్’’ దిగులుగా అన్నాడు అనే్వష్.
‘‘మన టైం బాగుండకపోతే ఒక్కొక్కసారి అంతే.. అయినా ఏమో.. ఎటువంటి కేసు సాల్వ్ చెయ్యబోతున్నారో?.. యిదొక ఛాలెంజ్‌గా తీసుకోండి.. ఉద్యోగంలో చేరే ముందే మీ సత్తా చూపించుకునే అవకాశం అనుకోండి.. యింతకూ మీ లాయర్ భగవాన్ అట కదా.. ఆయన గురించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి.. జాగ్రత్త. దిగండి, మాటల్లోనే హాస్పిటల్‌కి వచ్చేసాం.. ఉండండి నే కూడా వచ్చి చూస్తా మీ ఫ్రెండ్‌కి ఎలా ఉందో.. అంటూ బైక్ పార్క్ చేసి వచ్చాడు కమల్.
రిసెప్షన్‌లో పేరు గట్రా చెప్పి రూం నెంబర్ కనుక్కుని హడావుడిగా పరుగుదీశాడు అనే్వష్.. వెనకనున్న కమల్ సంగతి కూడా మర్చిపోయి...
బెడ్‌మీద నిస్తేజంగా పడి ఉన్న అరుణ్‌ని చూసి దుఃఖం ఆగలేదు.. సెలైన్ ఎక్కిస్తున్నారు.. యింకా స్పృహ రాలేదు.. తమ కో ట్రైనీ ‘ఇంద్రజిత్’ పక్కనున్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు..
‘‘ఇంద్రజిత్ అసలు ఏమైంది.. అరుణ్ ఒక్కడికేనా లేక యింకా ఎవరికైనా యిలా జరిగిందా.. అందరితోబాటే తిన్న అరుణ్ ఒక్కడికే యిలా ఎలా జరిగింది?’’
అతని చెయ్యి పట్టుకు ఊపేస్తూ ప్రశ్న మీద ప్రశ్న గుప్పించేడు.
‘‘ఏమో అందరం అక్కడ డైనింగ్ హాల్‌లో కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం.. తిన్న వెంటనే అరుణ్ ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు.. అసలే ఈ కేస్ టెన్షన్ వలన అలా అయ్యిందేమో అని రూంకి తీసుకెళ్లి పడుకోబెడదాం అనుకుంటూండగా.. సాహు సార్ వచ్చాడు.. జరిగింది వినగానే గబ గబా మన పోలీస్ జీప్‌లో హాస్పిటల్‌కి తీసుకువచ్చి జాయిన్ చేశారు..
చాలా పవర్‌ఫుల్ విషం.. అప్పటికే వళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది అని గబగబా స్టమక్ వాష్ చేసి ఏంటి వీనం యింజెక్షన్స్ యిచ్చి.. బాగా వీక్‌గా ఉన్నాడని సెలైన్ పెట్టారు.. పోలీస్ కేసు ఫైల్ చెయ్యడానికి వాళ్ళంతా యిప్పుడే వెళ్ళారు.. ఇంతలో మీరు వచ్చారు.. అవునూ నువ్వు నిన్నంతా కూడా లేవు ఎక్కడికి వెళ్ళేవు.. యిప్పుడీ విషయం నీకెలా తెలిసింది..’’ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ గబగబా చెప్పాడు.
‘‘అంత పవర్‌ఫుల్ విషం అతను మాత్రమే తినే దానిలో కలిపారంటే అది కచ్చితంగా హత్యాయత్నమే.. సీ మిస్టర్... మీ పేరేమిటన్నారు...
‘‘ఇంద్రజిత్.. అదే మాకు అర్థం కావడంలేదు..’’ నెర్వస్‌గా అన్నాడు.
‘‘మిస్టర్ ఇంద్రజిత్.. మీ హాస్టల్‌లో ఎవరికీ వారే వడ్డించుకుంటారా లేక మైడ్స్ వడ్డిస్తారా..’’ కమల్ ఆరాగా అడిగాడు.
‘‘మైడ్స్ వడ్డిస్తారు.. కానీ ఆ టేబిల్ దగ్గర ఆరుగురు ఉన్నాం.. అందరికీ ఒకటే వడ్డించారు.. అలాంటప్పుడు అరుణ్ ఒక్కడికే అలా ఎందుకయింది.. అదే అర్థం కావడంలేదు.. ఏది ఏమైనా పెద్ద ప్రమాదం తప్పింది..’’ మాటిమాటికీ పడుతున్న చెమటల్ని తడుచుకుంటూ అన్నాడు ఇంద్రజిత్.
‘‘అరె.. మీరు బాగా అప్సెట్.. ఐ మీన్ డిస్టర్బ్ అయినట్లున్నారు.. అందుకే ఏసిలో ఉన్నా చెమటలు పడుతున్నాయి.. ప్రమాదం తప్పలేదు.. కూడానే ఉంది.. యిప్పుడే మీ ఫ్రెండ్ అనే్వష్‌కి కూడా తృటిలో తప్పింది..అనే్వష్.. మనం అనుకున్నట్లు ఆ లారీ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు. పక్కా ప్లానింగ్‌తో జరిగిందనిపిస్తోంది నాకెందుకో.. ఎనీ వే అది కూడా పోలీస్ కేసు నమోదు చేస్తే బెటర్ అనిపిస్తోంది. నేను మీ ఫ్రెండ్ దగ్గర ఉంటాను మీరిద్దరూ వెళ్లి కంప్లైంట్ యిచ్చి రండి.. కూర్చుంటూ అన్నాడు ఇంద్రజిత్‌ని సూటిగా చూస్తూ.
‘‘నో.. నో.. మీకెందుకు శ్రమ... నేనిక్కడ ఉంటాను మీరు వెళ్లండి..’’
‘‘శ్రమేముంది.. నేనూ మీ ఫ్రెండ్ అనుకోండి.. అరె.. అదేమిటి.. మీ కళ్ళు అలా మూతలు పడుతున్నాయి.. ఆ చెమటలేమిటి.. అనే్వష్ వెళ్లి డాక్టర్‌ని తీసుకురండి...
‘‘వద్దు.. నేనెలాగూ చచ్చిపోతాను.. నన్ను క్షమించవద్దు.. అమర్ చావుకు.. యిప్పటి అరుణ్ రుూ పరిస్థితికి నేనే కారణం.. ఎందుకు ఏమిటి అడగద్దు.. చెప్పడానికి ఏమీ నాకు తెలియదు.. ననె్నవరో బ్లాక్‌మెయిల్ చేసి నా చేత యివన్నీ చేయించారు..
నిజంగా వాళ్ళెవరో.. ఎందుకు యిదంతా చేయిస్తున్నారో కూడా నాకు తెలియదు.. నే తెలియక చేసిన చిన్న తప్పుకు.. వాళ్ళు నాకు విధించిన శిక్ష.. నన్ను క్షమించండి.. మిత్రద్రోహం చేసాను.. అజిత్ వస్తువులు అక్కడకి నేనే చేరేసాను.. అనే్వష్.. అరుణ్‌తో నన్ను క్షమించమని చెప్పు.. నాలాంటివాడు బతకకూడదు.. నన్ను మన్నించు.. మీరు యిప్పుడు ఇక్కడికి రాకపోతే నేను మళ్లీ అరుణ్‌ని చంపాలి.. మీరు వచ్చి నన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించారు...’’ నిలుచున్న పణంగా కూలిపోయాడు ఇంద్రజిత్.
‘‘డాక్టర్.. డాక్టర్..’’ అంటూ పరిగెత్తాడు కమల్.. నిశే్చష్టుడై నిలబడిపోయాడు అనే్వష్.
కమల్‌తోబాటు వచ్చిన డాక్టర్.. అతని నాడి చూసి పెదవి విరిచేడు.. ‘‘సారీ హి వాజ్ నో మోర్’’ అంటూ..
అనే్వష్ మతిపోయి పిచ్చివాడిలా కూర్చుండిపోయాడు.. ఏమిటిది.. అసలు ఏం జరుగుతోంది.. తమకి తెలియకుండానే తామొక విషవలయంలో చిక్కుకున్నారా?.. యిదంతా నిజంగా రాహుల్ చేస్తున్నాడా.. లేకపోతే.. ఎవరు...

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్