డైలీ సీరియల్

బడబాగ్ని-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి ఎనిమిది గంటలకు కమల్ రూంకి వస్తానని చెప్పినపుడు.. తను వెయిట్ చేస్తుంటానని, డిన్నర్‌కి అక్కడికే రమ్మనీ.. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెబుతాడు. తప్పకుండా వస్తానని మహేష్ మాట ఇచ్చాడు.
గత నాలుగు రోజులుగా ఈ పనిమీద తిండి నిద్రా సరిగా లేకుండా తిరుగుతున్న కమల్‌కి ఒక్కసారిగా భరోసా వచ్చేసింది.. రోహిత్ స్నేహితులని నలుగురైదుగురిని కలిసినా పెద్దగా పనికొచ్చే విషయాలేం తెలియలేదు.. ఈ మహేష్‌ని కలిస్తే అన్ని విషయాలు బయట పడతాయని.. తప్పకుండా ఈ హత్యల వెనుకనున్న మిస్టరీ విడిపోతుందని అనిపిస్తోంది.. మహష్ రావడానికి యింకా చాలా సమయం ఉంది.. కమల్ రూంకి వెళ్ళగానే షవర్ బాత్ చేసి.. మంచి భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు.. అంత అలసటలో జరిగిన విషయాలు రాహుల్‌కి ఫోన్ ద్వారా చెప్పి, అనే్వష్ వాళ్ల వివరాలు కనుక్కున్నాడు.
‘‘రాహుల్.. మహేష్‌తో మాట్లాడేకా మళ్లీ ఫోన్ చేస్తా.. ఐ థింక్ ఈ మిస్టరీ ఈనాటితో తీరిపోతుంది.. విషయం తెలిస్తే సరిపోదు, కావలసిన ఆధారాలు, సాక్ష్యాలు సంపాదించాలి. నేరం నిరూపించగలగాలి.. అక్కడ నీకేం ప్రాబ్లం లేదుగా..?’’
‘‘లేదు.. నేను ఆ జాబ్ వదిలేసి, అక్కడనుంచి మా ఊరు వెళ్లిపోయినట్టు ప్రచారం చేసాను.. యిక్కడ నా గది కూడా ఖాళీ చేసి దగ్గరలో వున్న గ్రామ ప్రాంతంలో పరారీలో ఉన్నా.. అనే్వష్, అరుణ్, అజిత్‌లు కూడా వారి వారి పోస్టింగ్ ప్లేసెస్‌కి వెళ్లి. ఒకటి రెండు రోజుల్లో జాయిన్ అయిపోతారు...
సరే అక్కడ నీకేం ఇబ్బంది అవలేదు కదా..? విషయం తెలిసాక ఫోన్ చెయ్యి.. ఏం చెయ్యాలో అపుడు ప్లాన్ చేద్దాం.. సీ యూ.. బై..’’ ఫోన్ కట్ చేశాడు రాహుల్.
కమల్ జరిగినవన్నీ తలచుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. అలారం సెట్ చేసుకు..
సుమారు రాత్రి ఏడు అవుతుండగా అలారం మోగింది. లేచి ఇంటర్‌కంలో కాఫీ ఆర్డర్ చేసి.. వచ్చాక తాగి ఫ్రెష్ అ మహేష్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మధ్యలో భార్యతో మాట్లాడేడు.
సరిగ్గా ఎనిమిది గంటలకు రూం కాలింగ్ బెల్ మోగింది.. ఫోనులో మహేష్‌ని కన్‌ఫర్మ్ చేసుకుని తలుపు తీశాడు కమల్.
పరస్పరం పరిచయం చేసుకుని, మంచి కాఫీ తాగి.. కూర్చున్నారు ఇద్దరూ.. ఒకరినొకరు క్రీగంట చూసుకుంటూ.. ఎవరికివారే ఎదుటివారే మొదలుపెడతారని చూస్తూ...
చివరికి మహేష్ గొంతు సవరించుకున్నాడు.. ‘‘వెల్.. రోహిత్ మరణం గురించి ఏదో చెబుతానన్నారు..’’ అడిగాడు.
‘‘చెప్పాల్సినది మీరు.. మీకు తెలుసు ఈ ఏడు జనవరి నెలలో సంక్రాంతి రోజుల్లో డెహ్రాడూన్ హిల్ రిస్టార్ట్స్‌కి కుటుంబ సమేతంగా వచ్చిన రోహిత్ హత్యకు గురయ్యాడు. రాష్ట్రం కాని రాష్ట్రంలో హత్యకు కారణం కూడా తెలియని నేపథ్యంలో.. యిలా ఎందుకంటున్నానంటే. కూడావున్న కుటుంబానికి ఏ హానీ జరగకుండా, డబ్బు కారణంగా కాకుండా.. తను తీసుకున్న కాటేజ్ దగ్గరలోనే మిస్టీరియస్‌గా చచ్చిపడి ఉన్నాడు.. యిది జరిగి సుమారు నెల కావస్తున్నా ఇంతవరకూ. హత్యచేసిన వాళ్ళ మాట దేముడెరుగు, కనీసం హత్యకి కారణం తెలియలేదు..
గత పది ఏళ్ళుగా రోహిత్‌ని పరిచయం ఉన్న వాళ్ళందరినీ కలిశాను. అతనిని చంపే అవసరం కానీ, అంత పగ కానీ ఎవరికీ లేవనే అంటున్నారంతా.. మరి ఈ హత్య ఎలా జరిగింది? ఎవరు.. ఎందుకు చేసారు?’’
‘‘అవన్నీ పోలీస్‌వారు, న్యాయస్థానాలు చూసుకోవాలి.. ననె్నందుకు వెదుక్కుంటూ వచ్చి మరీ అడుగుతున్నారు..’’ యింతసేపు కనబడిన కుతూహలం స్థానే.. విసుగు కనబడింది మహేష్ గొంతులో...
‘‘ఎందుకంటే.. రోహిత్ హత్యతో సిమిలారిటీ ఉన్న మరో మూడు హత్యలు సుమారుగా జరిగాయి కనుక.. రోహిత్ మీకు క్లోజ్‌ఫ్రెండ్.. కాబట్టి యింకో ముగ్గురు స్నేహితులు.. సుమారుగా ఆరు నెలల వ్యవధిలో.. ఇదే తరహాలో మరణించేరు కనుక.. మీకు ప్రణవ్, భార్గవ్.. ఆదిత్య కూడా తెలుసా.. ’’ సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు.
‘‘తెలుసు.. ఆమధ్య ఆదిత్య ఏదో రోడ్డు ప్రమాదంలో పోయాడని విన్నా..’’ అయోమయంగా చూస్తూ అన్నాడు.
‘‘రోడ్డు ప్రమాదం కాదు ఏం.. కాదు. అతను కుటుంబంతో కలుమనాలీ చూడటానికి వెళ్లి.. సుమారుగా యిలాగే.. అంటే రోహిత్‌లానే ఎవరు, ఎందుకు ఏమాశించి తెలియకుండానే చంపబడ్డారు. కొన్నాళ్లు పరిశోధించి.. కారణాలు తెలియక మిస్టీరియస్ మర్డర్‌గా కేసు క్లోజ్ చేశారు... బట్ నేనలా అనుకోవడంలేదు.. ఈ మర్డర్స్ వెనుక ఏదో మోటో వుంది..
అది పాత పగ కావచ్చు.. ప్రతీకారం కావచ్చు..’’ అలాగే మిగతా యిద్దరూ... అందుకే అంత దూరం నుంచి వెదుక్కుంటూ వచ్చి అడుగుతున్నా... మీ ప్రాణ స్నేహితుల హత్యల వెనుక ఉన్న కారణం తెలిస్తే.. అవి చేస్తున్న హంతకుల్ని పట్టుకోవడం తేలిక.. ప్లీజ్ చెప్పండి.. బాగా గుర్తు చేసుకు చెప్పండి.. అప్పటిలో మీలో మీరు ఏమైనా కొట్టుకుంటున్నారా.. ఎవరికైనా తెలిసో తెలియకో మీ మిత్ర బృందం వలన అపకారం జరిగిందా.. దయచేసి ఏది దాచకుండా చెప్పండి... యిప్పటికి నాలుగు హత్యలు జరిగాయి. ఇంకా ఈ వలయంలో ఎందరున్నారో... ఒకవేళ యింకా ఉంటే మాత్రం.. యింకో హత్య అతి త్వరలో జరగడం ఖాయం..’’ హెచ్చరింపుగా అన్నాడు కమల్..
మహేష్‌కి అంతటి ఏ.సి గదిలోనూ చెమటలు పట్టేయి.. ఎప్పటిమాట?

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్