డైలీ సీరియల్

బడబాగ్ని-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు పదిహేడు, పద్దెనిమిది ఏళ్ల కింద మాట.. యిపుడు యిలా.. ఛ! అయి ఉంటుందా.. కొంపదీసి ఏనాటి కేసో తిరగతోడడానికి కాదు కదా ఈ ఎంక్వయిరీ? కానీ రోహిత్ హత్యకి గురయ్యాడు, కారణాలు మాత్రం ఎంత వెదికినా దొరకక.. మిస్టీరియస్ చావు కింద కేసు క్లోజ్ చేశారని తెలిసింది.. యిపుడు యితని మాటల వలన ఆదిత్య, ప్రణవ్, భార్గవ్‌లు కూడా అతని కళ్ళలో మరణ భయం స్పష్టంగా కనిపించింది.. కానీ.. యిప్పుడు తనని రుూ విషయాలు అడుగుతున్నది తన రక్షణకా?.. లేకపోతే ఆనాటి కేసు తనతో తనంత తానుగా ఒప్పించడానికా?
అతని ముఖంలో సందిగ్ధత.. అంతర్మథనం క్లియర్‌గా తెలిసిపోతున్నాయ్.. ఈమధ్య తన బిజినెస్ గొడవల్లో పడి సుమారు ఏడాదిపైగా తన స్నేహితులతో మాట్లాడడమే కుదరలేదు. ఆదిత్య, రోహిత్ మరణ వార్తలు కూడా యింట్లో ఏదో సందర్భంలో అన్నగారు చెబితేనే తెలిసింది.. ఎస్ తను ముందు ముందు భార్గవ్, ప్రణవ్ మరణవార్త నిర్థారించుకు కానీ నోరు మెదపకూడదు... ఏదో నిశ్చయానికి వచ్చిలేచి నించున్నాడు మహేష్...
‘‘ఎక్స్‌క్యూజ్‌మీ..’’ అంటూ బాత్‌రూంకి వెళ్లిన అతనిని చూడగానే అర్థం అయిపోయింది.. ఈ మిస్టరీ హత్యల వెనుక ఏదో పాత కథ ఉందనీ, అది అతనికి తెలుసనీ...’’
రిలాక్స్ అయిపోయాడు కమల్.. కూల్ వాటర్ తాగాడు.. యిప్పుడు తన అంచనా నిజమే అయితే నెక్స్ట్ టర్న్ ఈ మహేష్‌దే.. ఎస్, ఎలా అయినా ఇతని చేత ఆ పాత కథ చెప్పించి.. ప్లాన్ ప్రకారం ఇతనిని ఎర వేసి ఆ హంతకుడిని రెడ్ హాండెడ్‌గా పట్టుకోవాలి.. ఏమిటి ఇతను ఎంతకూ బయటికి రాడేంటి.. కొంపదీసి భయంతో పోలేదు కదా యిప్పుడు అనవసరంగా తను యిరుక్కుపోతాడు ఈ కేసులో.. నవ్వొచ్చింది తన ఆలోచనకి తనకే.
ఇంతలో బాత్‌రూం తలుపు చప్పుడు అయింది.. పాలిపోయిన ముఖంతో తనలో తను గొణుక్కుంటూ బయటికి వచ్చాడు మహేష్.. ఇతను చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమే.. వాళ్ళిద్దరిదీ.. అలాంటి మరణమే... తను నిజం చెబితే ముందు తన ప్రాణాలకు ముప్పు తప్పుతుంది.. ‘ఆ’ కేసు సంగతి దేముడెరుగు...
‘‘కూర్చోండి మహేష్.. కంగారు పడకండి.. నేను మీ శ్రేయోభిలాషిని, అప్పుడెప్పుడో ఏం జరిగిందో తెలుసుకుని మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు.. ఇప్పుడు జరుగుతున్న ఈ మారణకాండ ఆపి, కనీసం యింకా ఎందరున్నారో వాళ్ళనైనా రక్షించాలని.. ఆ హంతకుడిని పట్టుకుని శిక్షించాలని వచ్చాను. నన్ను నమ్మండి.. యిదికో ఈ చల్లటి నీళ్ళు తాగి రిలాక్స్ కండి.. కావాలంటే కాస్త చన్నీళ్ళతో ముఖం కడుక్కోండి.. పోనీ కొంతసేపు అయ్యాక, భోజనం చేశాక మాట్లాడుకుందాం..’’ ఇంటర్‌కం తీశాడు భోజనం ఆర్డర్ చెయ్యడానికి...
‘‘నా.. నాకేం వద్దు.. మీకు కావాలంటే చెప్పండి..’’ ముఖం రుమాలుతో తుడుచుకుంటూ అన్నాడు.
‘‘వెల్.. నాకూ యిప్పుడేమీ వద్దు.. చెప్పండి..’’ ఫోన్ పెట్టేసి.. రెప్పపాటులో సెల్‌లో రికార్డర్ ఆన్ చేసి, అతను చూడకుండా టీపాయ్ కింద పెట్టాడు... ‘‘అది.. ఆ..పొడారిపోయిన గొంతు సవరించుకుని మెల్లిగా చెప్పడం మొదలుపెట్టాడు....’’
‘‘అది.. అవి మేం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులు... మేం విజయవాడ ‘వినె్సంట్’ కాలేజీలో బిఎ ఎకనమిక్స్ చదువుతున్న రోజులు.. మేం క్లాస్‌లో అందరితో స్నేహంగా ఉన్నా.. ఒక పదిమంది మాత్రం బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళం.. అల్లరి... ఆటలు.. అమ్మాయిల్ని ఏడిపించడాలు.. అందరి కుర్రాళ్లలాగే... మొదటి సంవత్సరం పరీక్షలు కాగానే, యిక సెలవలకి ఎవరి ఇండ్లకు వాళ్లు వెడతామనగా.. ‘‘క్షణం ఆగాడు..
ఆ సంఘటన గుర్తుతెచ్చుకోవడం, చెప్పడం యిష్టంలేనట్లు ముఖం ముడుచుకుపోయింది.. తలదించుకున్నాడు అరచేతి రేఖలు కుడి చేత్తో రాసుకుంటూ.
కమల్ నిశ్శబ్దంగా చూస్తున్నాడు అతని వంక...
.........
.........
రెండు క్షణాల వౌనం తరువాత మెల్లిగా గొంతు పెగల్చుకుని చెప్పడం మొదలుపెట్టాడతను.
‘‘యిక రేపటినుంచి సెలవులు ఇండ్లకెళ్లిపోతాం అనగా...
.... కళ్ళల్లో నీళ్లు... అప్పటి తప్పును కడుగుతున్నట్లు.. మొత్తం పదిహేను మంది అబ్బాయిలు అమ్మాయిలూ కలిసి కృష్ణా బేరేజ్ దగ్గర వున్న సరుగుడు తోటల్లోకి సరదాగా పిక్నిక్ పెట్టుకున్నాం.. అమ్మాయిలు సాయంత్రం వరకూ వుండి వెళ్లిపోయేట్టు.. అబ్బాయిలు అర్థరాత్రిదాకా మందు కొట్టి సరదాగా జల్సా చేసేట్టు అనుకున్నాం...
ఆటలు.. పాటలు. నవ్వులు.. కబుర్లు.. కేరింతలూ.. ఆనందం అంతా మాదే అన్నట్లు గడిపాం.. సాయంత్రంతో అమ్మాయిలంతా వెళ్లిపోయారు. కొంతమంది అబ్బాయిలూ వెళ్లిపోయారు.. మా గ్రూప్‌లో రవీంద్ర కూడా లేచాడు వెడతానని.. అదేమిటి అందరం కలిసి రాత్రి మందు పార్టీ పెట్టుకుంటే నువ్వెళ్లిపోతే ఎలా? నువ్వెళ్లడానికి వీల్లేదు గాక వీల్లేదు... ఇక్కడ ఇంత మంచి అరేంజ్‌మెంట్స్ పెట్టకుని పోతానంటావేమిటి..’’ మా గ్రూప్‌లో అందరికీ లీడర్‌లా ఉండే భార్గవ్ అన్నాడు.. అతను లోకల్ పొలిటికల్ లీడర్ కొడుకు.. బాగా ఆస్తిపరుడు.. ఆస్తితోపాటు ఉండే అవలక్షణాలు.. అమ్మా నాన్న అతి గారాబం, చేతినిండా డబ్బు, చుట్టూ మందీ మార్బలం, ఆ రోజుల్లోనే స్పోర్ట్స్ బైక్.. చిన్న సైజు రాజులా వెలిగే అతనంటే మా అందరికీ గొప్ప ఆకర్షణ.. ఇంట్లో వాళ్ళు అతనితో స్నేహం వద్దని తిడుతున్నా వినేవాళ్ళం కాదు.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్