డైలీ సీరియల్

బడబాగ్ని-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ అంతా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా ఎలా బయటకొచ్చిందో ఓ చిరుత పిల్ల బోనులోంచి బయటకొచ్చింది.. ఆమె మీద పడబోతే అక్కడే వున్న నేను చేతికి ఏదీ అందక దాన్ని కాలితో తనే్నను.. అప్పుడది అమాంతం నా కాలు పట్టుకుని కసక్కున కొరికేసింది.. సగం పాదం దాని నోటిలో ఉండిపోయింది.. తమాషా ఏమిటంటే దాని బారిన పడి కాలు పోగొట్టుకున్నది నేనయితే.. ఆ అమ్మాయి తెలుగు సినిమా హీరోయిన్‌లా కెవ్వున కేక పెట్టి కళ్ళు తిరిగి పడిపోయింది.. పిటీ ఏమిటంటే మా వాళ్ళంతా కాలు తెగి.. రక్తం వోడుతూ కిందపడి విలవిలలాడుతున్న నన్ను వదిలేసి ఆమె చుట్టూ చేరడం...
ఆ సీను గుర్తుకువచ్చి నవ్వుతూ అన్నాడు.
‘‘మరి ఆ రోజు నేను మీ గదిలో వున్న రోజు రాత్రి ప్రియతో మాట్లాడుతూ.. అజిత్‌కి ఉరి ఖాయం, వాడిని మరచిపో, మనం పెళ్లి చేసుకు హాయిగా ఉందాం అన్నావ్..’’ యింకా అనుమానం తీరలేదు అనే్వష్‌కి.
‘‘నువ్వు దొంగ నిద్ర నటిస్తున్నావ్ అని నాకు తెలుసు.. అందుకే అలా మాట్లాడి నీకు నా మీద వున్న అనుమానం పెంచుదామని.. అలా మాట్లాడేను.. ప్రియ ఫొటో చూస్తావా..’’ తన మొబైల్‌లో వున్న ఆమె ఫొటో చూపించేడు..
చాలా చక్కగా ఉంది.. నవ్వుతున్న ఆమె చాలా అందంగా ఉంది.. యింకా కొన్ని ఫొటోస్ వాళ్లిద్దరూ కలిసి ఉన్నవి చూపించేడు.
‘‘యిప్పుడేనా నమ్ముతావా..’’ నవ్వేడు.
‘‘నమ్ముతాను. రాహుల్ నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావ్.. కానీ ఎప్పుడూ ముఖం సీరియస్‌గా పెట్టుకుంటావెందుకు... బై ద బై సారీ నిన్ను అనుమానించినందుకు..’’
‘‘సారీ ఎందుకు? నువ్వు అనుమానించాలనే కదా నే అలా మాట్లాడేను...’’
అవునూ అరగంటలో చేస్తానన్నాడు కమల్ ఫోన్.. యింకా చెయ్యలేదేమిటీ? కమల్ సెల్ ట్రై చేస్తూ ఎంత సేపు ట్రై చేసినా కమల్ ఫోన్ కలవలేదు.. సరే పడుకున్నాడేమో అనుకుని రాహుల్, అనే్వష్ మళ్లీ కేస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.
ఒక అరగంటలో ఫోన్ వచ్చింది రాహుల్‌కి.. ఫోన్ ఎత్తిన రాహుల్ ముఖంలో రంగులు మారిపోయాయి. అనే్వష్ అయోమయంగా రాహుల్‌ని అడిగాడు ఏమైందని.. ఎటువంటి సమాధానం రాలేదు.
ఒక నిమిషం తర్వాత రాహుల్ భారంగా ‘‘కమల్ ఈజ్ డెడ్’’ అన్నాడు.
ఆ మాట వింటూనే మతిపోయింది అనే్వష్‌కి. ‘ఏంటి?’ మళ్లీ అడిగాడు.
‘‘అనే్వష్.. నువ్వు విన్నది కరెక్టే.. కమల్ ఈజ్ డెడ్’’ అన్నాడు.
ఒక నిమిషం ఒకరి ఊపిరి ఒకళ్ళకి వినిపించేంత నిశ్శబ్దం.
‘‘నిద్రమత్తులో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి జారిపడి మరణించాడట..’’
‘‘నాకేదో డౌట్‌గా ఉంది రాహుల్’’ అన్నాడు అనే్వష్.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా బయలుదేరారు అనే్వష్, రాహుల్.
అక్కడ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడాక వీళ్లకి అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
‘‘పోనీ ఆ మహేష్‌తో మాట్లాడితే? అసలు అతను మాత్రమే జవాబు చెప్పగలడు మనకి’’ బాధలో కూడా రాహుల్ గొంతు గంభీరంగా పలికింది.
‘‘అవును’’ అనే్వష్ గొంతులో కోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.
వెంటనే పోలీసువారి అనుమతితో కమల్ బ్యాగ్ తీసుకుని అందులో మహేష్ ఫోన్ నెంబర్, అడ్రస్ తీసుకుని బయలుదేరారు ఇద్దరు.
ఎన్నిసార్లు మహేష్‌కి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తూండడంతో వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక అతనికి ఇంటికి వెళ్లారు.
అక్కడ వాళ్ళు చూసిన దృశ్యానికి వారికి మెదళ్ళు పనిచెయ్యలేదు. వంద వోల్టుల కరెంట్ వాళ్ళ వొంట్లోంచి పోతున్నట్టు అనిపించింది ఇద్దరికీ. ఇంతకీ అక్కడ వాళ్ళు ఏమి చూశారు?
చలనం లేకుండా పడి వున్న మహేష్ శవం, పక్కనే రోదిస్తున్న భార్య, బంధువులు. వీరి వంక అయోమయంగా చూసిన మహేష్ భార్యను గమనించి ‘‘మేము మహేష్ కాలేజ్ మిత్రులం. చాలాకాలానికి మొన్ననే కలిశాం. ఇంతలో ఇలా అయ్యింది’’ అని బాధగా అన్నాడు. ఇంతలో రాహుల్ ‘‘అసలు ఏం అయింది?’’ అని స్వరం కలిపాడు.
కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ ‘‘ఏదో అర్జంటు మీటింగ్ ఉంది అని వెళ్లారు. తిరిగి వస్తూన్నప్పుడు కుక్క అడ్డు వచ్చింది, దానిని తప్పించబోయి డివైడర్‌ను గుద్దేసారు. చుట్టుప్రక్కల జనం చూసి హాస్పిటల్‌కి తీసుకుని వచ్చేసరికి...’’ అంటూ మళ్లీ శోకసముద్రంలో మునిగిపోయింది.
ఏం జరిగిందో, ఏక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థంకాని పోలీసులు, ఆ ఏక్సిడెంట్‌కి ఇచ్చిన వివరణ, కారణం ఇది. అందుకే అందరూ అది నమ్మారు.
బయటకు వచ్చాక రాహుల్ ‘‘ఇది కచ్చితంగా వాడి పనే. మనం ఇంత ప్లాన్ చేసుకున్నా వాడికి ఎలా తెలిసిపోతోంది అసలు?’’
‘‘కాని రెండూ సహజమైన మరణాలే అని పోలీసు వారు పోస్ట్‌మార్టంలో పేర్కొన్నారు?’’ అనే్వష్ సందేహంగా అన్నాడు.
‘‘నాకు అదే అంతు పట్టడంలేదు అస్సలు.. లేక ఇవి నిజంగానే సహజమైన మరణాలేనా?’’ రాహుల్ అందుకున్నాడు.
‘‘నాకు మాత్రం అలాగ అనిపించడంలేదు’’ అనే్వష్ గంభీరంగా.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్