డైలీ సీరియల్

బడబాగ్ని-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరి చావుకి కారణం ఏంటి? వొంట్లో మద్యం లేదు, డ్రగ్స్ లేవు, చుట్టుప్రక్కల వేరే వ్యక్తి కూడా లేడు. అప్పటిదాకా బాగానే ఉన్నారు. మరి ఎలా జరిగి ఉంటుంది అంటావ్? ఏమన్నా దొరికితే కదా దర్యాప్తు చెయ్యడానికి?’’
‘‘ఇప్పుడు మన ముందు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి అమర్‌ది, రెండు కమల్, మహేష్ మర్డర్స్’’ అనే్వష్ అన్నాడు.
‘‘ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఇవి హత్యలే అయితే ఒకటే కేసు రెండు కాదు’’.
‘‘కాబట్టి ముందు అసలు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలి’’ అనే్వష్ ఉత్సాహం తెచ్చుకుంటూ.
‘‘కాని ఎలా?.. ఐడియా!’’ రాహుల్ అరిచాడు.
‘‘ఏంటి మళ్లీ కమల్ చేసిన ఇనె్వస్టిగేషన్ మొత్తం చెయ్యాలా?’’ చిరాకుగా ముఖం పెట్టాడు అనే్వష్.
‘‘కాదు.. అసలు ఇదంతా చేస్తున్నవాడు మనకి బాగా తెలిసున్నవాడే. అందుకే మనం ఎప్పుడు ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అన్నీ వాడికి ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయ్’’ అన్నాడు రాహుల్ ఏదో ఆలోచిస్తూ.
‘‘అబ్బ కనిపెట్టేసావ్ కదా..’’ వెటకారంగా అన్నాడు అనే్వష్.
ఇప్పుడు ఇలాంటివి అవసరమా అన్నట్టు ముఖం పెట్టాడు రాహుల్. వెంటనే సారీ చెప్పాడు అనే్వష్.
‘‘నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మనం రివర్స్‌లో ప్రయత్నిస్తే ఏమన్నా దొరుకుతుందేమో అని’’ రాహుల్ అనే్వష్ వంక చూస్తూ.
‘‘అంటే?’’ ఏమీ అర్థం కాలేదు అనే్వష్‌కి.
‘‘చెప్తా చెప్తా.. ముందు అమర్ డైరీతో మొదలుపెడదాం మనం’’ రాహుల్ ఏదో తట్టినట్టు.
‘‘ఇంకా ముందు ఏమన్నా తిందాం... ఇక్కడ ఆకలికి చచ్చేలా ఉన్నాను నేను’’ అనే్వష్ కడుపు చేత్తో పట్టుకు ఆకలి అభినయించేడు.
ఇద్దరు బయలుదేరారు.
ఇంటికి వెళ్లాక, ముందు అమర్ డైరీ తెరిచి మళ్లీ చదివారు. ఏమీ తట్టలేదు వాళ్ళకి. అయినా ఫర్వాలేదు అని రాహుల్ మళ్లీ మళ్లీ అదే పేజీ చదువుతున్నాడు. అనే్వష్‌కి ఏమీ అర్థం అవడంలేదు.
ఒక్క రెండు నిముషాలు తరువాత అనే్వష్ కలగజేసుకుని అసలు ఏమి చూస్తున్నావు అన్ని సార్లు? అని అడిగాడు.
‘‘నేను చూసేది ఏమిటి అంటే ఇప్పుడు ఈ మర్డర్ మిస్టరీ బయటపెడితే మనకు మంచి పేరు వస్తుందా లేక ఉద్యోగాల్లోంచి తీసేస్తారా? రాహుల్ అడిగాడు.
‘‘అదేం పిచ్చి ప్రశ్న అసలు? సత్కారాలే సత్కారాలు’’ అనే్వష్ ఉత్సాహంగా బదులిచ్చాడు.
‘‘మరి యిక్కడ అమర్ ఎలా ఎందుకు రాసాడు?’
‘‘ఎలాగ?’’
‘‘పోస్టింగ్ వచ్చే వేళ.. యిప్పుడు ఈ సంగతి గురించి మాకు తెలిసిందని తెలిస్తే.. మా కెరీర్ ఏమవుతుందో అని ఎందుకు రాశాడు అంటావ్?’’
‘‘అంటే..’’ ఏదో తట్టినట్లు అనే్వష్ ముఖంలో రంగులు మారాయి.
‘‘ఎస్స్... అంటే హత్యలు చేసేది మనలో ఎవరో.. కానీ ఎవరు అయి ఉంటారు?’’ రాహుల్ అన్నాడు.
‘‘మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక విషయం అర్థం అవుతుంది.. హంతకుడు మన మధ్యే ఉంటూ మన ప్రతి కదలికా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాడు. అందుకే మనం ఎవరికీ తెలియదు అనుకున్నవి కూడా వాడికి తెలిసి, మనం ఒక అడుగు వేసేలోపు వాడు మనల్ని దాటి యింకో రెండు అడుగులు ముందుకెళ్లిపోతున్నాడు, ఏదో చేద్దామనుకుని అనవసరంగా కమల్‌ని బలిపెట్టాం..’’ బాధగా అన్నాడు రాహుల్.
‘‘నిజంగానే ముందు తను ఫోన్ చేసినపుడు ఏదో చెప్పబోతే క్లాసులో ఉన్నా.. తర్వాత మాట్లాడదాం’’ అన్నాను. అప్పుడు మాట్లాడి వుంటే తను కష్టపడి సేకరించిన సమాచారం, ఈ కేసులో దొరికిన క్లూస్ మనకి తెలిసి ఉండేవి. కచ్చితంగా ఏవో ఆధారాలు దొరికే ఉండాలి. లేకపోతే అంత నిర్దాక్షిణ్యంగా కమల్‌ని చంపడు. నాకు తెలిసి కమల్ తాగడు. మత్తు పదార్థాలకి బానిస కాడు. అలాంటివాడు బాల్కనీ మీద నుంచి ఎలా జారిపడిపోతాడు. వెనకనుంచి ఎవరైనా తోసేసి ఉంటారా. ఎంత ఆలోచించినా ఏం అర్థం కావడంలేదు.. ఏది ఏమైనా ఈ అసైన్‌మెంట్ అతని చావుకి కారణం అయింది. ప్చ్..’’ మళ్లీ రాహులే అన్నాడు.. అతను కమల్ మరణాన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నాడు.
‘‘నిజమే, జరిగింది ఏదో జరిగింది అని వదిలేసి ఊరుకోవలసింది.. యిప్పుడు వాడు మనకే సవాల్ విసిరినట్టు మరో రెండు మర్డర్స్ చేశాడు.. యిప్పుడు నేను వెళ్లి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అటు చూస్తే ఈ ఇనె్వస్టిగేషన్‌లో ఏక్టివ్ రోల్ ప్లే చేసే కమల్ లేడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఎంతవరకూ చెయ్యగలుగుతావు. నువ్వేమో ఓపెన్‌గా కోర్ట్‌లో రివీల్ చేశావ్.. ఈ కేసు నేను ఫాలో అవుతున్నాను. త్వరలో సాల్వ్ చేస్తాను అని, బహుశా హంతకుడు తన దృష్టి అంతా నీమీదే కేంద్రీకరించి ఉంటాడు.. బహుశా ఈ కేసులో కమల్ పాత్ర కూడా తెలుసుకుని తనని ఫాలో చేసి ఉంటాడు.
పోనీ ఓ పని చేద్దామా, మా ట్రైనింగ్ సెంటర్‌లో సాహు సర్, అదే అప్పుడు అరుణ్ విషయంలో త్వరగా స్పందించి హాస్పిటల్‌లో జాయిన్ చేసి వెంటనే పోలీస్ కేసు కూడా పెట్టించారే.. ఆయన, ఆయన సాయం తీసుకుందామా పోనీ.. అలాగే లాయర్ భగవాన్‌గారి సాయం కూడా...’’
‘‘అసలు హంతకుడు ఎవరో తెలిసేదాకా మనం ఎవర్నీ నమ్మడానికి లేదు.. అందులో అసలు మిస్టరీ మీ ట్రైనింగ్ సెంటర్‌లోనే ఉందేమో అని నా అనుమానం..

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్