డైలీ సీరియల్

బడబాగ్ని-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చెప్పే విషయం కాస్త నమ్మతగ్గదిగా ఉండాలోయ్, బాల్కనీలోంచి పొరపాటున జారిపడటం అనేది అంత నమ్మదగ్గ విషయంలా లేదు.. అయితే ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఎవరైనా వెనకనుంచి తోసెయ్యాలి లేదా జీవితంవీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలి. బాల్కనీలోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటావా.. ఐ మీన్, బయటినుంచి, అంటే పైనుంచో, పక్కనుంచో..
‘‘ఇదేమైనా తెలుగు సినిమా ఏంటి సార్.. అలా వచ్చే అవకాశమే లేదు.. మరి హోటల్ వాళ్ళు ఎవరైనా, అంటే సర్వెంట్స్, హోటల్ స్ట్ఫా ఎవరైనా...
‘‘అంటే వాళ్ళు వచ్చిపోతుంటారులేండి.. రూం సర్వీసెస్, మైంటినెన్స్ వాళ్ళు..’’
‘‘ఆ రోజు ఈ రూంకి అలాంటివేమైనా జరిగాయా..’’
‘‘అంటే.. ఆ రోజు.. అంటే క్రిందటి బుధవారం కదండీ ఎ.సి సర్వీసింగ్ వాళ్ళు వచ్చారండి..’’
‘‘నాకు వాళ్ళ వివరాలు ఓసారి చెబుతావా?’’
‘‘అయ్యబాబోయ్.. అయ్యన్నీ అడుగుతున్నారెందుకండీ.. మీరు పోలీసులా..’’ భయం కనబడింది వాడి గొంతులో.
‘‘అవును, నువ్వు ఆ వివరాలు చెబితే నీకు ఏ సమస్యా ఉండదు, లేకపోతే ఆ రోజు ఈ రూంకి సర్వీసెస్ ఇచ్చిన నినే్న ముందు పట్టుకుంటారు..’’ బెదిరింపుగా అన్నాడు.
‘‘నాకేం తెలియదు సార్.. నన్ను పట్టుకోకండి..’’ ఏడుపు మొదలుపెట్టేశాడు.
‘‘మరి ఆ రోజు ఎ.సి సర్వీసింగ్ వాళ్ళను పిలు, నే వాళ్లతో మాట్లాడాలి..’’
‘‘ఆళ్ళెవరో కొత్తవాళ్లండి.. ఎప్పుడూ వచ్చేవాళ్ళుకాదు, ఆళ్ళ వివరాలు మైంటినెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి బాబు, ఆళ్ళని అడగండి, నన్ను వదిలెయ్యండి.’’ యించుమించు కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు కరీం.
‘‘సరే.. నువ్వు ఈ వివరాలన్నీ ఎవరి దగ్గరా అనకు, పోలీస్ ఎంక్వైరీ జరుగుతోందనీ తలిస్తే మీ హోటల్ పరువు, ప్రతిష్టా దెబ్బతిని బిజినెస్ తగ్గుతుందని.. మీ వాళ్ళు గొడవెట్టి, ఎవరో ఒకరిని పోలీసులకి అప్పజెపితే పోతుంది కదా అని ఆ రోజు రాత్రి ఈ రూంకి భోజనం గట్రా నువ్వే తెచ్చేవ్ కనుక నిన్ను ఇరికిస్తారు.. సరేనా’’
‘‘అయ్యబాబోయ్ నేనెవరి దగ్గరగా అనను, నన్ను వదిలేయండి..’’ ఏడ్చినంత పనిచేశాడు.
‘‘సరే నువ్ పో.. ఆ మైంటినెస్స్ చూసే అతన్ని నా దగ్గరకు పంపించు’’.
‘‘సరేనండి.. దండాలండి..’’ ఓ దండం పడేసి బతుకు జీవుడా అని అక్కడనుండి పారిపోయాడు.
రాహుల్ కూర్చున్న చోటునుంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు.. ఇక్కడే ఏదో జరిగింది.. అదేమిటి? యిటు కమల్‌ని, అటు మహేష్‌ని పొట్టన పెట్టుకున్నదెవరు? ఖచ్చితంగా యిది ఏక్సిడెంట్ మాత్రం కాదు, అలా అనిపించే మర్డర్.. అందులో సందేహం ఎంత మాత్రం లేదు, కానీ ఎలా జరిగింది? ఎవరు చేశారు?
‘‘మే ఐకమిన్ సర్’’ ఎవరో తలుపు తట్టి అడిగారు..
‘‘ఎస్.. కమిన్’’ ఆలోచనలకి ఆనకట్ట వేస్తూ అన్నాడు.
లావుగా పొట్టిగా దిట్టంగా ఉన్న తను ఒకరు లోపలికివచ్చాడు..
‘‘సార్ పిలిచారుట’’
‘‘అవును.. మీరేనా ఇక్కడ మైంటినెన్స్ చూసేది... మీ పేరు?’’ అతనిని పరిశీలనగా చూస్తూ అడిగాడు రాహుల్.
‘‘అవును సార్..నా పేరు అప్పారావు.. మైంటినెన్స్ అప్పారావు అంటారు’’
‘‘మైంటినెన్స్ అంటే ఏమేం చూస్తారు?’’
‘‘అన్నీ సార్.. ఇక్కడ దిగిన కస్టమర్స్‌కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ చూస్తాం..’’
‘‘అన్నీ అంటే..ఏమేం చూస్తారో కాస్త వివరంగా చెబుతారా?’’
‘‘అన్నీ అంటే.. రూంలలో వాటర్ ప్రాబ్లం లేకుండా, ఏసి ప్రాబ్లం లేకుండా అన్నీ సౌకర్యంగా ఉండేట్టు చూస్తాం.. అయినా ఇవన్నీ మీకెందుకండి.. నన్ను పిలిచి ఎందుకడుగుతున్నారు..’’ విసుగు దాచుకుంటూ అన్నాడు.
‘‘చెబుతా.. క్రిందిటి వారంలో ఈ రూంకి ఏ ఏ పనులమీద ఎవరెవరు వచ్చారో చెప్పగలరా..’’
‘‘అవన్నీ మీకెందుకు, అయినా ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అనేది క్రింద రిసెప్షన్‌లో చూసుకుంటారు, ఇప్పుడు మీకేమైనా అవసరం అయితే చెప్పండి.. అంతేకానీ.. అయినా మీరెవరు, ఎందుకిలా అడుగుతున్నారు.. ఈసారి అతను విసుగు దాచుకోలేదు.
‘‘నేను పోలీస్ డిపార్ట్‌మెంట్.. వారం క్రితం ఈ రూం బాల్కనీ నుండి ఒకతను పడి మరణించేడు.. దానిగురించి దర్యాప్తు కోసం వచ్చాను..’’
‘‘పోలీసా.. అయితే క్రింద మా హోటల్ మేనేజర్‌ని పిలవనాండి..’’ ఎవరో తరుముతున్నట్లు లేచాడు.
‘‘ఆహా, ఆయన్ని తరువాత కలుస్తాను.. యింతకూ నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు..’’
.......
‘‘ఏమిటి, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా... చెప్పండి..’’ గట్టిగా అడిగాడు రాహుల్.
‘‘ఏమిటండి.. నేనేదో తప్పు చేసినట్టు అంతలా అడుగుతున్నారు.. యిందులో చెప్పకపోవడానికి, ఆలోచించడానికి ఏముంది. రొటీన్‌గా వచ్చే ఏ.సి సర్వీసింగ్‌కి వచ్చారు...’’
‘‘ఏ.సి సర్వీసింగా.. అంటే రూంలోకి వచ్చి క్లీన్ చేస్తారా..?’’
‘‘లేదు.. ఏ రూంలో అయినా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే లోపలికి వస్తారు. లేకుంటే బయటనుంచే పైప్స్, మెషిన్స్ చెక్ చేసి వెళ్లిపోతారు..
-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్