డైలీ సీరియల్

బడబాగ్ని-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినా అవన్నీ రొటీన్‌గా జరిగేవే...దానికీ అతనెవరో మేడమీంచి పడి చనిపోవడానికి సంబంధం ఏమిటి.. పోలీసులు వచ్చి అన్నీ చూసుకుని అతను నిద్రమత్తులో ప్రమాదవశాత్తు పడి మరణించాడు అని రాసుకు వెళ్లిపోయారుగా, మళ్లీ మీరేంటి.. ఏదైనా అడగాలంటే హోటల్ యాజమాన్యాన్ని అడగండి’’ లేచాడు వెళ్లడానికి అన్నట్టు.
‘‘అరే.. యింకా నా ప్రశ్నలు అవలేదే.. అప్పుడే లేస్తే ఎలా.. కూర్చోండి.. ఆ రోజు సర్వీసింగ్‌కి వచ్చిన వాళ్లని ఓసారి పిలుస్తారా..’’
‘‘అతనెవరో కొత్తవాడు వచ్చాడు.. ప్రతిసారీ వచ్చే అతను కాదు’’ అప్పటికే అతనికి చెమటలు పడుతున్నాయి భయంతో...
‘‘యింత పెద్దహోటల్‌కి ఎలాటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఎవరినిబడితే వారిని రానిస్తారా.. అతనెవరో నాకు యిప్పుడే కావాలి పిలిపించండి..’’ సీరియస్‌గా చెప్పాడు.
‘‘ఎవరో నాకు తెలియదు..’’
‘‘ముక్కూ మొఖం తెలియనివాళ్లను ఎలా రానిస్తారు.. యిది పెద్ద హోటల్, యిక్కడికి ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీస్ వస్తారు, వారి రక్షణ బాధ్యత ఎవరిది.. రుూ విషయం.. యిప్పుడే తేలుస్తాను..’’ కోపంతో జేవురించింది రాహుల్ ముఖం.
‘‘లేదు.. లేదు.. ఎప్పుడూ వచ్చే అతనికి వంట్లో బాగుండక, అతనికి తెలిసిన వాళ్ళెవరినో పంపాడు’’ కంగారుగా అన్నాడు.
‘‘పిలవండి.. అతనిని వెంటనే పిలిపించండి..’’
‘‘సరే.. ’’ లేచాడు అతను.
‘‘ఎక్కడికి.. యిక్కడినుంచే ఫోన్ చెయ్యండి..’’
‘‘అతని నెంబర్ నా దగ్గర లేదు...’’ ముచ్చెమటలూ పడుతున్నాయ్ అతనికి.
‘‘చూడు.. నాకసలే సహనం తక్కువ.. కోపం ఎక్కువా.. విసిగించక అతనికి ఫోన్ చేసి వున్నపళాన రమ్మను.. లేకుంటే యిప్పుడే నిన్ను లోపల వేసేస్తా.. ఒక్క ఉదుటున లేచాడు కోపంగా.
‘‘చేస్తా.. చేస్తా.. కానీ నిజంగా నాకేం తెలియదు.. నాకు వంట్లో బాగాలేదు, ఈ రోజు సర్వీసింగ్‌కి మావాడు వస్తాడు అని వాడే ఫోన్ చేసి చెప్పి పంపాడు.. వాళ్ళ వాడే కదా అని అది అంత సీరియస్‌గా తీసుకోలేదు..’’
‘‘సరే.. చెయ్ ఫోన్..’’
అతను గబగబా జేబులోంచి ఫోన్ తీసి.. ఎవరికో ఫోన్ చేసి అర్జంట్‌గా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అరగంటలో అతను వచ్చి మెయింటనెన్స్ అప్పారావుకి ఫోన్ చేశాడు.. రమ్మని ఎక్కడికి పోయావ్ అంటూ.. అతనిని ఓసారి ఫలానా రూంకి రమ్మనీ, అక్కడ అర్జంట్ రిపేర్ వుందనీ రాహుల్ చెప్పమన్నట్లు చెప్పాడు అతను.
రూంలోకి వచ్చిన అతనిని అడిగాడు రాహల్.. ‘‘ఎవరతను.. నీకు బదులుగా ఆ రోజు అతనిని ఎందుకు పంపావ్?’’ అని.
‘‘ఏరోజు.. ఎవరిని పంపడమేంటి.. అసలు మీరెవరు..’’ అయోమయంగా అడిగాడు అతను.
‘‘అదే.. వారం రోజుల క్రింద నీకు మారుగా ఏ.సి సర్వీసింగ్‌కి ఎవరిని, ఎందుకు పంపావ్? అతను ఎవరు..’’ సీరియస్‌గా అడిగాడు రాహుల్ మళ్లీ.
‘‘ఓ.. ఆ రోజూ.. నాకు ఓంట్లో బాగాలేక.. మావోడినే పంపాను, అప్పారావ్ నీకు తెలుసుగా, మళ్లీ అడుగుతున్నావేటీ..’’ నిర్లక్ష్యంగా రాహుల్ మళ్లీ...
‘‘చూడూ నాకు సహనం తక్కువా.. కోపం ఎక్కువా అని మా డిపార్ట్‌మెంట్‌లో అంతా అంటుంటారు.. నన్ను అట్టే విసిగించక చెప్పు, ఎవరిని పంపావ్.. ఎందుకు పంపావ్... అతనిని ఏ రకంగా చంపించావ్..’’ మీదిమీదికొస్తూ అడిగాడు.
‘‘అయ్యో.. యిదేమిటి.. అప్పారావ్.. ఏమిటిదంతా..’’
‘‘చూడు.. ఆ రోజు నువ్వు రాకుండా ఎవరినో పంపడం నా చావుకొచ్చింది.. అతనెవరో నిజంగా మీ వాడేనా.. ఆ రోజు ఈ రూం బాల్కనీ మీంచి పడి ఈ రూంలో అతను చనిపోయాడు, దాని గురించి వచ్చిన పోలీస్ ఆఫీసరంట.. రుూయన.. నాకు భయంతో గుండె ఆగిపోయేలా ఉంది.. అలా రానీయడం యిలా నా ప్రాణంమీదికి వస్తుందని తెలిస్తే.. ఆ వేళ ఆడిని రానియ్యకపోయేవాడిని.. త్వరగా నీకు తెలిసింది చెప్పెహే..’’
అప్పటికి విషయం అర్థం అయింది అతనికి..
‘‘నిజంగా అతనెవరో, ఏం చేశాడో నాకు తెలియదు సార్.. ఆ వేళ నా బదులు ఈ హోటల్‌కి వెళ్ళనిస్తే నాకు పదివేల రూపాయలు ఇస్తానన్నాడు.. నే వెళ్లకుండా వాడిని పంపితే అంత డబ్బు వస్తుంది కదా అనుకున్నానే కానీ అందులో ఏదో మోసం ఉందనీ.. యిలా ఇరుక్కుపోతాననీ తెలియదు సార్. కావాలంటే ఆ పదివేలూ యిచ్చేస్తా.’’
‘‘నీ పదివేలూ నాకొద్దుగానీ,, వాడెవరో, వాడిని పట్టుకొస్తే.. నేనే నీకు యింకో యాభై వేలు ఇస్తా.. సరేనా..’’ శాంతం తెచ్చుకుంటూ అన్నాడు రాహుల్.
‘‘వాడెవడో ఎక్కడుంటాడో నిజంగా నాకు తెలియదు సార్..’’
‘‘ముక్కూ, ముఖం తెలియనివాడిని నీకు బదులుగా పంపేవంటే నమ్మేటంత చవటలా కనిపిస్తున్నానా.. నిజం చెప్పు, లేకుంటే హత్యానేరం కింద జైలు ఊచలు లెక్కబెడతావ్..’’
‘‘ఏటండీ.. బెదిరిస్తున్నారా... నాకు వళ్ళు బాగుండక నాకు బదులు ఎవరినో పంపిస్తే అదేం తప్పా... అంతమాత్రానికే నేను హత్య చేసినట్టా..’’ బుకాయించబోయిన అతని చెంప చెళ్ళుమని నత్రాలు కళ్ళముందు మెరిశాయి.
‘‘చూడూ.. మళ్లీ చెబుతున్నా.. మర్యాదగా అతనెవరో చెబితే నీకే మంచిది, మొండితనంతో కోరి కష్టాలు తెచ్చుకోకు..’’ జేబులోంచి రివాల్వర్ తీశాడు.
-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్