డైలీ సీరియల్

బడబాగ్ని-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటినుంచీ జరుగుతున్న హత్యల పరంపర.. విధానం జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాహుల్‌కి అన్వర్ మాటల వలన అర్థం అయిన విషయం.. ప్రణవ్ బిజినెస్ పనిమీద హైదరాబాద్ రావడం తెలుసుకుని అది అవకాశంగా తీసుకుని హతుని కారు పార్కింగ్‌లో వుండగా, డ్రైవర్ అన్వర్ ఏమరుపాటుగా ఉన్న అదను చూసుకుని.. దొంతనంగా ఆ కారులో పెట్రోల్ ఖాళీచేసి.. వాళ్ళు బయలుదేరే సమయంలో కారు డిక్కీలో చేరి.. పెట్రోల్ అయిపోయి... కారు అర్థరాత్రివేళ, నడిరోడ్డుమీద అర్థాంతరంగా ఆగిపోయి, డ్రైవర్ పెట్రోల్ కోసం వెళ్లిన సమయంలో హత్య చేసి.. ఆ శవాన్ని కారులో కూలేసి.. ఆ చీకటిరాత్రి.. ఆ హంతకుడు కూల్‌గా ఆ హైవే దిగి వెళ్లిపోయి ఉంటాడు.. చుక్క రక్తం చిందకుండా సునాయాసంగా చిన్న ఆధారం కూడా లేకుండా హత్యలు చేస్తున్న ఆ హంతకుడి తెలివికి.. చాకచక్యానికి నిర్ఘాంతపోయాడు రాహుల్.. వదలను.. నిన్ను చచ్చినా వదలను.. దొరికేవరకూ వేటాడే తీరతాను..’’ కసిగా శపథం చేశాడు మనసులోనే... విఫలయత్నం తెచ్చిన నిరాశా, నిస్పృహలతో తిరిగి డెహ్రాడూన్ చేరాడు రాహుల్...
***
ఈలోగా ఇక్కడ అజిత్ తన సామాన్లు సర్దుకుంటూ అమర్ డైరీ చూశాడు. అయ్యో రాహుల్ ఇనె్వస్టిగేషన్‌కి కావాల్సిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది? సరేలే అసలు ఒకసారి చూద్దాం అని తీసి చదవడం మొదలుపెట్టడు. ఎందుకో తేడా అనిపించింది అతనికి. మూడ్ మొత్తం పాడైపోయింది. ఏవో ఆలోచించుకంటూ పడుకున్నాడు కానీ నిద్ర మాత్రం రాలేదు. సడెన్‌గా ఏదో తట్టింది. వెంటనే అర్థరాత్రి అని కూడా ఆలోచించకుండా అనే్వష్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది తప్ప తీయడంలేదు.. ఇక్కడ అజిత్‌కి ఉత్సాహం, ఆతృత ఆగడంలేదు. మొత్తానికి అనే్వష్ ఫోన్ తీశాడు.
‘‘ఏంటిరా యిప్పుడు ఫోన్ చేశావు?’’ విసుగు, నిద్రమత్తు కలగలిపి అన్నాడు అనే్వష్.
‘‘రేయ్ హంతకుడు దొరికాడురా’’
ఒక్క ఉదుటున మంచంపైనుండి ఎగిరాడు అనే్వష్.
‘‘ఏంట్రా నువ్వు అనేది?’’
‘‘అవునురా.. చాలా సింపుల్’’ ఆతృతగా అన్నాడు అజిత్..
‘‘అర్థం అయ్యేలా చెప్పు బాబు.. నువ్వు షెర్లాక్ హోమ్స్ అని మాకు తెల్సులే’’
‘‘పోస్టింగ్ వచ్చేవేళ.. యిప్పుడు ఈ సంగతి గురించి మాకు తెలిసిందని తెలిస్తే.. మా కెరీర్ ఏమవుతుందో అని ఎందుకు రాసాడు అంటావ్?’’
‘‘అంటే..’’ ఏం అర్థం కాక అనే్వష్ అడిగాడు.
‘‘అంటే హత్యలు చేసేది మన ట్రైనర్లలో ఎవరో’’ ఉత్సాహంగా మోగింది అజిత్ గొంతు.
‘‘ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?’’
‘‘రేయ్ మట్టిబుర్రా, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండా మనల్ని ఎవరు ఆపగలరురా ట్రైనర్‌లు తప్ప?’’
‘‘అయితే?’’
‘‘మన పైఅధికారులు చేసిన తప్పుల్ని మనం బయటపెడితే వాళ్లు మనపైన కక్షకట్టి మనల్ని ఏమన్నా చెయ్యవచ్చు, అదే ఎవరో సంబంధం లేనివాళ్ళు చేస్తే మన కెరీర్లకు ఏమీ కాదు కదా’’
‘‘అవునురోయ్, ఆ అమర్‌గాడు పేరు రాయకపోయినా మంచి క్లూ ఇచ్చాడురా.. నువ్వు నిజంగా సూపర్‌రా..’’
‘‘ఆ.. చాల్లే కానీ ముందరేపు పొద్దునే్న మన పని మొదలుపెట్టాలి.. అన్నింటికన్నా ముందు మన ట్రైనర్లు పెట్టిన సెలవులు, మర్డర్ జరిగిన తారీఖులు కలుస్తాయేమ చూడాలి’’ అజిత్ ఉత్సాహం ఆపుకోలేకుండా ఉన్నాడు.
‘‘అవి ఎలా దొరుకుతాయో నాకు చెప్పక్కర్లే.. వాచ్‌మ్యాన్‌కి వంద కొడితే రిజిస్టర్లు ఏంటి ఏమన్నా యిస్తాడు’’ అనే్వష్ రెట్టింపు ఉత్సాహంతో.
‘‘ఆ సంగతి అరుణ్‌కి అప్పగిద్దాం, వాడికి దగ్గరే కదా.. ఇంతకీ వాడికి ఇప్పుడే చెపుదామా లేక రేపా?’’
‘‘అలాగే ఆపుకునే కమల్ నుంచి ఏమీ తెలుసుకోలేకపోయాము’’ అజిత్ గంభీరంగా అన్నాడు.
‘‘సరే ఫోన్ పెట్టేయి నేను చూస్కుంటా.. యిక పడుకో’’ అంటూ అనే్వష్ అరుణ్‌కి, రాహుల్‌కి ఫోన్ చేసి అంతా చెప్పేడు.
‘‘రేయ్.. అరుణ్, నువ్వు రేపు వీకెండ్ మన ట్రైనింగ్ సెంటర్‌కి వెళ్ళు. ఎలాగైనా వాళ్ల లీవ్ రికార్డ్స్, ఎవరి లీవ్స్, ఆ హత్యలు జరిగిన తారీఖులతో మేచ్ అవుతాయో వాళ్ళ మెయిల్ ఐ.డి, పాస్‌వర్డ్ సంపాదించు. కచ్చితంగా మనకి పనికివచ్చే ఆధారాలు ఆ మెయిల్‌లో దొరుకుతాయి. కానీ జాగ్రత్త ఒరే.. వాడికి ఏ మాత్రం అనుమానం కలిగినా నువ్వు అయిపోతావ్.. ఏదో వీకెండ్ గడపడానికి వెళ్లినట్లే ఉండాలి.. జాగ్రత్త సుమా..’’ మరోసారి హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు.
తనూ, రాహుల్ ఆ డైరీ చదివి అనుకున్నది కరెక్టే, యిపుడు అజిత్ అదే విషయం చెప్పేడు.. అక్కడ ఆరుగురు ట్రైనర్స్ ఉన్నారు అన్ని కేడర్స్ కలిపి. ఖచ్చితంగా వాళ్లలో ఎవరో ఒకరు.. అందరిలోకి సాహూ సర్ ఒక్కడే అక్కడ ట్రైనీస్‌తో క్లోజ్‌గా ఉంటూ వాళ్ల మంచి చెడ్డా పట్టించుకుంటాడు. నిజానికి అరుణ్ విషయంలో ఆయన వెంటనే స్పందించి హాస్పిటల్‌కి చేర్చకపోతే.. వాడు కూడా.. ప్చ్.. ఆ ఆలోచనే భరించలేనట్టు కదిలిపోయాడు.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్