డైలీ సీరియల్

బడబాగ్ని-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే.. అది ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి ఎలా కావో ఇదీ అంతే.. నాకు తెలిసీ సాహూ సార్.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంపినవాళ్ళలో.. ఒక్క అమర్, కమల్ తప్ప అంతా నేరస్థులే.. ఇంకో విషయం.. ఆయన ట్రైనింగ్ సెంటర్‌కి వచ్చినప్పటినుండి.. ట్రైనీస్‌లో ఏ ఒక్కరైనా నేరప్రవృత్తి కలిగి వుంటే.. వాళ్ళు ఏదో రకంగా ఫినిష్ చెయ్యబడ్డారే తప్ప ట్రైనింగ్ పూర్తిచేసుకుని జనంమీదకు వెళ్ళలేదు.. ఇవన్నీ నేను స్టడీ చేసి తెలుసుకున్న నిజాలు.. ప్రతి బేచ్‌లోనూ.. ఒకరో ఇద్దరో.. ప్రమాదవశాత్తూ మరణించడం.. జరిగింది.. అయితే వారంతా... ఏదో తప్పు చేసిన తప్పుడు మనుషులే, మనకి ప్రత్యక్ష సాక్ష్యం.. ఇంద్రజిత్.. మనం ఒక ‘‘్భరతీయుడూ.. ఒక అపరిచితుడూ చూసి అది కరెక్ట్.. అలాంటివాళ్ళూ ప్రస్తుత సమాజానికి అవసరం అనుకుంటే.. సాహూ సర్ కూడా అవసరమే.. రీల్ హీరో కాదు.. రియల్ హీరో..’’ ఒక్క క్షణం ఆగాడు అలుపు తీర్చుకుందుకు అన్నట్లు....
ప్రస్తుత సమాజంలో, వ్యవస్థలో ఉన్న.. లోపాలవలనో.. లొసుగులవలనో ఎందరో నేరస్తులు తప్పించుకుంటున్నారు.. అలాగే ఎందరో చెయ్యని నేరాలకి బలి అయిపోతున్నారు.. అలాంటప్పుడు.. సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతున్న సాహూ సర్‌ని ఎందుకు శిక్షించి దూరం చేసుకోవాలి.. పోనీ దానివలన పోయిన అమర్, కమల్ తిరిగి వస్తారా? ఆలోచించండి.. ఇప్పుడు ఈ హత్యలన్నీ ఆయనే చేశాడన్న నిజం మనకు మాత్రమే తెలుసు.. దానిని మనం తెలియనట్టు.. వదిలెయ్యగలిగితే.. సమాజంలో కొంత ప్రక్షాళణ జరుగుతుంది.. నే చెప్పేదానిలో నిజం ఉందా.. లేదా ఆలోచించండి..’’ అనే్వష్ మాటలు అక్కడున్నవాళ్ళందరినీ ఆలోచింపచేశాయి.. అతని అభిప్రాయంతో అంతా ఏకీభవించారు.. అంతా ఆలోచనలో పడ్డారు.. కొంతసేపటికి ఆలోచనల్లోంచి తేరుకున్న రాహుల్ అన్నాడు... ‘‘నిజమే.. ఆయన చేస్తున్నది దుష్ట సంహారమే కావచ్చు కానీ చట్ట విర్దుద్ధం.. అందులోనూ ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్‌గా చెయ్యకూడని పని. ఎలా వదిలెయ్యడం? అలా ఎవరికివారే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటే.. సమాజం ఇంకా ప్రమాదంలో పడుతుంది.. అదీకాక అనె్నం పునె్నం ఎరుగని అమర్‌నీ, కమల్‌నీ అంతం చెయ్యడం క్షమించరాని నేరం... దానికి అతను శిక్షింపబడాల్సిందే..’’ కోపం, బాధా ప్రతిఫలిస్తుండగా..
‘‘నిజమే.. నువ్వు చెప్పినది నూటికి నూరుపాళ్ళూ నిజమే.. కానీ జరిగిపోయిన తప్పుకన్నా, జరగబోయే ఒప్పు హర్షదాయకం.. చట్టాన్ని గౌరవించాల్సినదే.. కానీ ధర్మాన్ని.. న్యాయాన్ని పరిరక్షించడం ఇంకా ముఖ్యం.. సో ఒక పని చేద్దాం.. మనం సేకరించిన సాక్ష్యాలూ.. తెలుసుకున్న నిజాలూ జాగ్రత్తగా ఉంచుదాం.. ఎప్పుడైనా అతను ధర్మాన్ని అతిక్రమించిన రోజు.. వాటిని సుదర్శన చక్రంలా ఉపయోగిద్దాం.. అంతవరకూ మనకు ఏమీ తెలియనట్లే ఉందాం..’’ లాయర్ భగవాన్ తన జడ్జిమెంట్ పాస్ చేశారు...
‘‘కానీ ఒక్క విషయం.. ఇదంతా మనం తెలుసుకున్నాం... మన దగ్గర సాక్ష్యాలున్నాయ్ అనే సంగతి మాత్రం సాహూ సర్‌కు తెలియజేద్దాం.. తను చేసిన హత్యల సంగతి ఎవరూ తెలుసుకోలేకపోయారు అనే భ్రమలో ఆయన ఉండడం మాత్రం మంచిది కాదు.. మనకు తెలిసినా అతను చేసిన పనిలో మంచిని మాత్రం చూసి, అతనిని క్షమించి వదిలేసాం అన్న సంగతి అతనికి తెలియాలి.. అప్పుడే అతను శిక్షింపబడకపోయినా.. మనం చేసిన ఈ పరిశోధనలకి అర్థం.. అనే్వష్ మాటలతో ఏకీభవించారు..
అలా.. ఆ హత్యలన్నీ. మిస్టీరిస్ మర్డర్స్‌గానే మిగిలిపోయాయి ఎప్పటికీ.. ‘‘్ధర్మసంస్థాపనార్దాయ సంభామి యుగే యుగే..’’
***
‘‘అరె... అనే్వష్.. నమితతో నీ పెళ్లి ప్రపోజల్ చెప్పావా?.. ఇద్దరికీ కేరళ పోస్టింగ్ వచ్చింది.. ఇంకా ఎందుకురా ఆలస్యం చేస్తావు..’’ అడిగాడు అజిత్.. వౌనంగా కూర్చున్న అనే్వష్‌ని తిరుగు ప్రయాణంలో.
‘‘అజిత్... నాకీ కల ఇంకొంచెం ముందు వస్తే.. పరిస్థితి వేరేగా ఉండేదేమో. సాహూ సర్ బ్రతికే వాడేమో కదరా..’’ దిగులుగా అన్నాడు అనే్వష్.
‘‘అనే్వష్.. జరగాల్సిందే జరిగింది. అన్ని హత్యలు చేసినవాడిని.. కారణం ఏదైనా కానీ మనం సమర్థించడం, రక్షించడం సరికాదురా..
... అయినా జరిగిందేదో జరిగిపోయింది. నువ్వింకా అదే ఆలోచనతో ఉండకు.. అది మన వృత్తికే విరుద్ధం.. లాయర్స్‌కూ, డాక్టర్స్‌కూ ముఖ్యంగా పోలీసులకు యింత సున్నిత మనస్తత్వం పనికిరాదురా.. చీరఫ్.. అయినా రాహుల్ చాలా గ్రేట్‌రా.. చిక్కుముళ్ళలాంటి ఈ కేస్‌ను.. యిలా పరిష్కరించగలగడం నిజంగా అద్భుతం.. అలాంటివాడు మన డిపార్ట్‌మెంట్‌లో ఉంటే ఎంత బాగుంటుంది.. సరే యింక ఆ విషయాలు వదిలెయ్.. నా పెళ్లికి.. నువ్వు నమిత తప్పకుండా రావాలోయ్.. జంటగా..
‘‘తప్పకుండా.. ఇంతకూ నమిత నా ప్రపోజల్ ఒప్పుకుంటుందంటావా?’’
‘చుప్హ్రో.. ఇంకా ఎంతకాలం సాగతీస్తావ్.. టెలీ సీరియల్‌లా... ఆ అరుణ్‌గాడు చూడు.. మహిమతో సెటిల్ అయిపోతున్నాడు. మన తెలివీ.. చురుకు డిపార్ట్‌మెంట్‌కే కాదు మనకీ ఉపయోగపడాలి.. బీ.. బ్రేవో.. ఆల్ ది బెస్ట్..’’ఇద్దరూ నవ్వుకున్నారు తేలికపడిన మనసులతో..

*

అయిపోయంది

- మీనాక్షి శ్రీనివాస్