డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తానని రాసిన మా అత్తగారు మాత్రం రాలేదు. చివరలో అనుకోకుండా ఏదో ఇబ్బంది వచ్చిందని కబురు చేశారు.
విజయవాడలో వున్న వాళ్ళ బంధువుల ద్వారా నాకో మంచి చీర, ఒక జత బంగారు గాజులు పంపించారు.
నాకెందుకో వాళ్ళింట్లో, ఈ పుట్టబోయే పాపాయి ఇవ్వాల్సినంత ఆనందం ఇవ్వడంలేదేమో అనిపించింది. మనసులోనే నిట్టూర్చాను. ఇంట్లో మిగిలిన వాళ్ళకు కూడా అసంతృప్తిగానే అనిపించింది. కాని ఎవ్వరూ నా ముందు ఎటువంటి భావాలు వెలిబుచ్చరు. ఆ రోజు మామ్మ, నాకు ఎంత దిష్టి తగిలిందో అని తపన పడిపోయింది.
ఆ రోజునుంచి నాకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువయిపోయాయి. గుమ్మంలో నుంచున్నా, ఇంటిముందు నడిచి వెళ్ళేవాళ్ళు ఒక్కక్షణం ఆగి చూచేవాళ్ళు. మామ్మ ఎక్కడకు వెళ్ళనిచ్చేది కాదు నాకు దిష్టి తగులుతుందని. చివరకు మామ్మతో పడలేక అన్నయ్య సెకెండ్ షో సినిమాకు తీసుకువెళ్లేవాడు.
***
మైక్‌లో పెద్దగా పైలట్ అనౌన్స్‌మెంట్ వినిపించింది. విమానం లండన్ చేరబోతోందని. సీట్ బెల్ట్ వేసుకోమని సైన్ వెలిగింది. ఎయిర్‌హోస్టెస్‌లు వచ్చి ప్రయాణీకుల దగ్గర ఉన్న గ్లాసులు అవి అన్నీ తీసుకోవడానికి వచ్చారు. చదువుదామని తీసిన నవల తిరిగి బాగ్‌లో పెట్టాను. ఇవాళ ఎందుకో మనసు నవలమీద నిలవడంలేదు. అది చక్కని నవల. ఇంగ్లీష్ రచయిత ఇండియన్ ఇమిగ్రెంట్స్‌మీద రాసిన నవల.
మన దేశం నుంచి ఎంతోమంది వేరే దేశాలు వలసవెళ్ళారు. ఎంతమంది ఎన్ని దేశాలు వెళ్లినా ఎక్కువ భాగం ఇంగ్లాండ్, యుఎస్‌ఎకి వెళ్లిన సంఖ్యే పెద్దది.
బ్రిటీష్‌వారి ధర్మమా అని ఇంగ్లండ్‌కి అన్ని తరగతులవారు వెడితే, అమెరికాకు క్రీమ్ ఆఫ్ ది క్రాప్ మాత్రం వెళ్లింది. వెళ్ళేటప్పుడు అందరూ కొద్ది సంవత్సరాలు ఉండాలని మాత్రమే అని వెళ్లినా, దాదాపు అందరూ అక్కడే ఉండిపోయారు. ఈ నవల అంతా పూర్తిగా అమెరికా వెళ్లిన ఒక భారతీయుడు, ఆయనకు, ఆయన భార్య అనుభవాలు, అక్కడ పుట్టిన పిల్లలు ఎట్‌సెట్రా..
బాగ్ భుజాన వేసుకుని అందరితోపాటు లండన్‌లో దిగాను. జీవితంలో తొలిసారిగా భారతదేశం వదిలి మరో దేశ గడ్డమీద కాలు మోపాను.
లండన్ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దగా, అధునాతనంగా కనిపించింది మన దేశపు ఎయిర్‌పోర్ట్‌మీద. మనుషులు అందరూ, చాలా పెద్దగా, ఆరోగ్యంగా కనిపించారు. అక్కడ దాదాపు 4 గంటలు ఆగిపోవాలి న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కడానికి. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు లీలా మహల్‌లో చూసిన ఇంగ్లీష్ సినిమాలాగనే వినిపించసాగింది.
రెస్ట్ రూంకి వెళ్లాను కొంచెం మొహం కడుక్కోవాలని. అక్కడ శుభ్రం చేసేవారిలో మన భారతీయ స్ర్తిలు కనిపించారు.
ఎందుకో మాత్రం మనసు చివుక్కుమనిపించింది. ఎందుకో నాకే అర్థం కాలేదు. మన దేశంలో ఆ పని చేసేవాళ్ళు అదే చేస్తారు కదా! అయినా స్వదేశం వదలి ఇంతదూరం వచ్చి, చివరికి ఇలాంటి పనులు చేయడానికా? ఈ పని అక్కడే చేసుకోవచ్చుగా? మనసెందుకో అసంతృప్తిగా మూలిగింది.
ఆ నాలుగుగంటల్లో అటూఇటూ తిరుగుతూ చాలా చూశాను. మనవాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో చాలామంది ఉన్నారు. ఎయిర్ పైలెట్స్, స్టోర్ కీపర్స్, పెద్ద బిజినెస్‌మెన్ అన్ని రకాలవారూను. ఆఖరికి లండన్ ఎయిర్‌పోర్ట్‌లో సమోసా, బంగాళాదుంప బజ్జీలు కూడా కనిపించాయి. నాకు వాటిని చూస్తే అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది.
విమానం ఎక్కాల్సిన గేటుదగ్గరకు వచ్చి కిటికీలోంచి బయటకు చూస్తూ నుంచున్నాను. నా మనసుకు మల్లెనే బయట మబ్బు, మబ్బుగా ఉంది. నా ఆలోచనలకు మల్లెనే వచ్చేపోయేవారితో బిజీగా ఉంది.
ఒకటే తేడా! బయట తిరుగుతున్న వాళ్ళంతా ముందుకు దూసుకుపోతున్నారు. నా మనసు మాత్రం వెనక్కు చొచ్చుకుపోతోంది.
మళ్లీ వెళ్లి ప్లేన్‌లో సెటిల్ అయ్యా. మరో 7, 8 గంటల్లో న్యూయార్క్ చేరతాను. వౌళి కనబడతాడు. ఆ ఆలోచన మాత్రం చాలా సంతోషం కలిగించింది. కాని అంతలోనే మరో ఆందోళన. వౌళి కోరిక ప్రకారం ఆరు వారాలు సెలవ పెట్టి వచ్చాను. కాని ఆరువారాలు అక్కడ ఎలా ఉండటం?
నాకు అసలు ఎక్కడ ఎవరింట్లో ఉండటం అలవాటు లేదు. కాలేజీ ఎగ్జామ్స్‌కు వెళ్లినా హోటల్‌లో ఉండేదాన్ని.
ఎంత కొడుకయినా వాడింట్లో ఆరు వారాలే! మనసులో కొంచెం ఆందోళనగా అనిపించింది. కాని, రాబోయే సందర్భాలు అన్నీ తలచుకుంటూ ఆందోళనని అణచుకోవాలని చూశాను.
బాగ్‌లో ఉన్న శుభలేఖని తీసి మరోసారి చదివాను. ఎన్నిసార్లు చూశానో? ఎన్నిసార్లు చదివానో? మనసులో అనిర్వచనీయమైన ఆనందం.
చేతితో శుభలేఖమీద రాస్తూ, నా వౌళిని ఊహించుకోబోయాను. నుదుట పొడిగాటి తిలకం, బుగ్గన నల్లని బొట్టు, తెల్లని పట్టు పంచ పైన సిల్క్ లాల్చి, మెళ్లో సన్నని చైన్, నదుట మీద ఎగురుతున్న జుట్టుతో వౌళి రూపం ఊహించుకోబోయాను. కాని వాటన్నిటితో వౌళి రూపం బదులు మరో రూపం కళ్ళముందు మెదిలింది. దాదాపు వౌళిలాగా ఉన్న మరో రూపం- నేను కూడా ఆ రూపం మనసులోంచి తుడిచేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశాను.
కాని సాధ్యపడలేదు. ఆ రూపం అలా చాలాసేపు మనసులో కదులుతూనే ఉంది. ఎందుకో కళ్ళు చమర్చాయి. ఇంతలో ఎయిర్‌హోస్టెస్ కాఫీ తెచ్చి ఇచ్చింది. వెచ్చటి కాఫీ గుటకవేస్తూ బలవంతంగా కళ్ళు మూసుకున్నాను.
మొదట 18 ఏళ్ళు నా జీవితం ఎలా గడిచిందో నాకు తెలియదు. కాని తరువాత 30 ఏళ్ళు మాత్రం చాలా బాగా తెలుసు. అది రాయని ఒక డైరీ! ముగింపు లేని కథ. తీయని సినిమా! అది అవసరం ఉన్నా లేకపోయినా అలా ఆడుతూనే ఉంటుంది. ఆ కథలో ప్రధాన పాత్ర నాదే అయినా, నాకు ఎటువంటి నియంత్రణ లేదు. నేనొక ప్రేక్షకురాలిని, పాత్రధారిణి. రెండూ నేనే!
కొందరు జీవితమంతా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం అన్ని చేసుకుంటూ పోతారు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి