డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంచెం అటూ ఇటూగా అనుకున్నవి సాధిస్తారు. మరికొందరు- తనలాంటివాళ్ళు. గాలి ఎటు వీస్తే అటు ఎగిరేవారు. ఎందుకీ తేడా? అని మామ్మని అడిగితే, అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు సమాధానం చెప్తుంది. అవి మనకి నచ్చాలి అంతే.
మామ్మ మనసులోకి రాగానే- పెదిమలపై చిరునవ్వు మెదిలింది. ఒక్కసారి ఆవిడ వడిలో తల పెట్టుకు పడుకోవాలనిపించింది.
ఆవిడ చేతులతో నా బుగ్గలు తడిమినట్టే అనిపించింది. ఉలిక్కిపడ్డట్టు అటూ ఇటూ చూశాను. నా పక్క సీట్‌లో కూచున్న 3 ఏళ్ళ పిల్ల చెయ్యి నా బుగ్గమీద ఉంది.
ఆ పిల్ల తల్లి ‘సారీ సారీ’ అంటూ పిల్లను లాక్కుని ఒడిలో కూచోబెట్టుకుంది. ఇట్స్ ఓకె! అంటూ ఆ పిల్ల వంక చూచాను. ఆ పిల్ల నోట్లో వేలు వేసుకుని నా వంకే చూస్తోంది. మామ్మ మళ్లీ ఇలా పుట్టిందేమో అనుకుని నవ్వుకున్నాను. వై నాట్..
ఎయిర్‌ప్లేన్ చుట్టూ పరికించి చూశాను. కొద్దిమంది తప్ప చాలా భాగం కొత్త ప్రయాణికులు.. లండన్‌లో ఎక్కినవాళ్ళు. చాలాభాగం విదేశీయులు. విమానం పైకి లేస్తోంది. కళ్ళు మూతలు పడ్డాయి.
కాళ్ళముందునుంచి ఏదో పాకినట్లు ఉండేటప్పటికి చటుక్కున కళ్ళు తెరిచాను. పక్క సీట్‌లో కూచున్న పాప వాళ్ళమ్మ వడిలోంచి జారి మెల్లగా ఐల్‌లోకి వెళ్ళబోతోంది. గబుక్కున ఆ పిల్లని ఆపి వాళ్ళ అమ్మమీద చెయ్యి వేసి లేపాను. ఆమెకు అప్పుడే నిద్ర పట్టినట్లుంది. ఉలిక్కిపడి లేచింది.
దిగి వెళ్లిపోతున్న పిల్లని లాగి ఒళ్లో పెట్టుకుని చెంపమీద ఒక్కటి వేసింది.
తెల్లని లేత బుగ్గ కందిపోయింది. బుగ్గలమీంచి నీళ్ళు కారిపోయాయి. గట్టిగా ఏడవబోయి మానేసి నోట్లో వేలు వేసుకుంది వెక్కుతూనే!
నా మనసు చివుక్కుమనిపించింది అనవసరంగా ఆ తల్లిని లేపానేమో అని.
పావుగంట గడిచేటప్పటికి మళ్లీ మామూలే. తల్లి కొట్టిన దెబ్బ మర్చిపోయింది. చేయద్దన్న పని చేయకుండా ఉండటమూ మరచిపోయింది. మెల్లగా ఒళ్లోంచి జారి బయటకు వెళ్లబోయింది. మళ్లీ ఆపాను ఆ పిల్లను. కానీ ఈసారి వాళ్లమ్మను లేపలేదు. నా వొళ్లోనే కూచోబెట్టుకున్నాను. ఆవిడను లేపితే మళ్లీ చెంపదెబ్బ పడుతుందేమో అని భయం వేసింది. దెబ్బ తిన్న పిల్ల మరచిపోయింది. కొట్టిన అమ్మా మరిచిపోయింది. కాని నేను మాత్రం మరచిపోలేదు.
చిన్నతనం ఎంత అదృష్టవంతమయిన దశ. హాయిగా ఏవీ గుర్తుండవు. ఏదీ బాదర్ చేయదు. బాధ్యతలు ఉండవు. నిట్టూర్చాను.
ఆ పిల్లకు ఓ కాగితం పెన్ ఇచ్చాను. దానిమీద పిచ్చిగీతలు గీస్తూ చాలాసేపు గడిపింది. ఇంతలో వాళ్ళ అమ్మ లేచి చాలా నొచ్చుకుంది. వాళ్ళ పిల్ల నన్ను విసిగిస్తోంది అనుకుని పదే పదే సారి చెప్పింది. చివరకు విని, విని విసుగొచ్చి అన్నాను.
‘‘ఎందుకంత బాధపడతారు. చిన్నపిపల్ల- ఏం తోచక చేస్తోంది. నాకూ ఏం తోచడంలేదు. ఏమీ పరవాలేదు’’ అన్నాను.
ఆ అమ్మాయి నా వంక చూస్తూ ‘‘మీకు పిల్లలు లేరా’’ అంది.
ఉన్నట్లు తల ఊగించాను చిరునవ్వుతో- ‘చాలా పెద్దవాడు’ అని చెప్పాను. నాకు అంత పెద్ద కొడుకున్నాడా అన్నట్లు చూచింది.
‘‘మీరలా లేరు’’ అంది.
చిరునవ్వుతో ఆమె వంక చూచాను.
‘‘అబ్బ ఇది కూడా ఎప్పుడు పెద్దదయిపోతుందో- నేను కూడా మీలా హాయిగా ప్రయాణం చెయ్యచ్చు’’ అంది.
నాకు నవ్వు వచ్చింది. మూడేళ్లపిల్ల ఓ 30 ఏళ్లుగా మారాలంటే మధ్యలో ఎంత జీవితం ఉంది. ‘‘అంత తొందరపడకండి. ఇదే అన్నిటికంటే మంచి టైం మీ అమ్మాయితో ఆడుకోవడానికి. స్కూల్‌కి వెళ్లిందంటే ఇంక సరదాలన్నీ హోంవర్క్ కింద నలిగిపోతాయి’’ అన్నాను.
ఆమె తల ఊగించింది అంగీకరిస్తున్నట్లు.
‘‘పిల్లలు కళ్లముందు పెరిగిపోతున్న కొద్ది, కళ్ళముందు ఏళ్ళు దాటిపోతాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే- ఆ సంవత్సరాలన్నీ ఎక్కడికి పోయాయి?’’ అనిపిస్తుంది.
ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉన్న వౌళి ఎక్కడికి వెళ్లిపోయాడు?
ఈ రోజు కూడా నాకు వౌళి పుట్టినరోజు గుర్తుంది. రోజులు గడిచినకొద్దీ, నాకు ఇంట్లో చాలా అసహనంగా ఉండేది.
యాంత్రికంగా రఘుకు ఉత్తరాలు రాయడం తప్ప, తిరిగి జవాబు అందుకోవాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోయినట్లపించేది. అందుకు కారణం బహుశ అతను నన్ను సపోర్టు చేయడంలేదన్న కోపం కావచ్చు.
ఎందుకో మనసులో ఒకటే కోపం. నా నిస్సహాయత మీదో, అతని నిర్లిప్తత మీదో, అతని కుటుంబం చూపిన నిర్లక్ష్యం మీదో నాకే తెలియదు. నాకేదో అన్యాయం జరిగిపోతోందన్న భావన. నెలలు నిండినకొద్దీ రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. ఇంటినిండా ఎంతమంది మనుషులు ఉన్నా ఏదో ఒంటరితనం. కడుపులో నిశ్చింతగా తిరిగే పాపాయి కదలిక, ఆనందానికి బదులు అసహనం కలిగింపజేస్తోంది.
శరీరానికి కలిగే ఇబ్బందికి చిరాకు తప్ప, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచన వచ్చేది కాదు. ఒక్కొక్కసారి నా స్వాతంత్య్రాన్ని హరించిపోయినందుకు కోపం వచ్చేది. అంతలోనే రఘు, అతని తల్లిదండ్రులు చేసిన సూచన మనసులోకి వచ్చేది.
వాళ్ళందరిమీద ఒక జుగుప్స కలిగేది. ఎందుకో మనసంతా ఒక గిల్టీనెస్ నిండిపోయింది. వీటన్నిటిమధ్య నాకూ ఊరట కలిగించేది ఒక్క నా సంగీత సాధనే! ఆ గంటసేపూ మాత్రం మనసుకు ఎనలేని ప్రశాంత కలిగేది.ఆ సాయంత్రం సంగీతం టీచర్‌గారింటి నుంచి వస్తుంటే వెన్నులోంచి ముందు కడుపులోకి ఒక బాణం వేసినట్లు అయింది. అలా మొదలైన నొప్పులు ఆ తరువాత రెండు రోజులు నరకయాతన కలిగించాయి. ఆ అర్థరాత్రి, అన్నయ్య టాక్సీ తెచ్చి హాస్పిటల్‌కి తీసుకువెళ్లాడు. దాదాపు 30 గంటల తరువాత చచ్చిపోవడం ఎంత సుఖమైన ముగింపు అనిపిస్తున్న క్షణాల్లో పాపాయి పుట్టాడు. ఆ తరువాత దాదాపు 48 గంటలు అసలు నేను స్పృహలోనే లేనుట.
నేను కళ్ళు తెరిచేసరికి అందరి మొహాల్లో పెద్ద రిలీఫ్ కనిపించింది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి