డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేకపోతే ఈ పిల్లాడు అందవిహీనమేమిటి? అనుకునేదాన్ని. వాడిని అలా అన్నందుకు కొంచెం కోపం కూడా వచ్చింది. కాని మా వదిన రోజుకో పేరుతో ఆంజనేయ అష్టోత్తరం మాత్రం చేస్తూ ఉండేది. అన్నయ్య మాత్రం ‘‘ఏడే నా చంద్రుడు? ప్రపంచానికి నెలకో పున్నమి అయితే మన ఇంట్లో రోజూ పున్నమే’’ అనేవాడు.
మా వదిన మా అన్నయ్య వంక చూచి మూతి తిప్పుతూ వెక్కిరించేది.
‘‘పోవే! నా కళ్ళు పెట్టుకు చూడు’’ అంటాడు. అన్నయ్య ఎప్పుడూ వదినను ఒసేయ్! ఏమే! అని పిలిచేవాడుకాదు. సొంత మామయ్య కూతురే అయినా ఎప్పుడో మరీ మురిపెనంగా అనిపిస్తే తప్ప.
పురుడు కాగానే నాకు పూర్తిగా తెలివి రాకుండానే వెంటనే నాన్న హాస్పిటల్ నుంచే మామగారింటికి, రఘుకి ఫోన్ చేశారుట. వాళ్ళు సంతోషం అని మాత్రం అన్నారు. రఘు, కల్యాణి హెల్త్ బాగుందా అని మాత్రం అడిగాడుట. అది కూడా అమ్మతో అంటూంటే విన్నాను.
మరీ బాగుండదనుకున్నారేమో, మా అత్తగారు, మామగారు మాత్రం వారం తిరగకుండా ఒకసారి వచ్చి చూసి వెళ్లిపోయారు. నాకు మాత్రం వాళ్ళ కళ్ళల్లోకి చూడాలనిపించలేదు. ఏదో అర్థంకాని సంకోచం కలిగింది. మరి వాళ్లకెలాంటి భావన కలిగిందో నాకు తెలియదు.
వొళ్లో ఉన్న పిల్లాడి వంక తదేకంగా చూస్తూ ఉంటే వెనె్నముక మీద ఏదో జర జరా పాకినట్లు అనిపించేది. వీడి జన్మనా నిరోధించాలనుకున్నది? ఆ ఆలోచన అసలు వచ్చినందుకు భగవంతుడు క్షమిస్తాడా? చిత్రమయిన భయం మనసంతా నిండిపోయేది.
వాడు పుట్టుకమునుపు మనసులో ఒక రకమైన పట్టుదలతో రఘుకు ఏమీ రాయాలనిపించకపోయినా, వాడు పుట్టాక మాత్రం వాడిని గురించి ఉత్తరం చాలా వివరంగా రాసేదాన్ని.
పిల్లవాడికి 3వ నెల నిండిపోతుంది. వచ్చి నామకరణం చేయమని మా మామగారికి నాన్న రెండు మూడు ఉత్తరాలు రాశారు. కాని అటువైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తరువాత నాన్న ఫోన్ చేస్తే- ‘‘కానీయండి రఘు ఎప్పుడొస్తే అప్పుడే చేద్దాం’’ అన్నారుట.
కాని మామ్మకు ఎంత మాత్రం నచ్చలేదు. ‘‘వాడి నాన్న మరో ఏడాది వరకు రాడు. అంతవరకూ పేరు పెట్టకుండా ఏమిటి, నువ్వే రాసేయ్ పేరు’’ అంటూ ఒత్తిడి తెచ్చింది.
చివరకు క్లుప్తంగా పురోహితుడిని పిలిచి నాన్న నామకరణం చేయడానికి సిద్ధపడ్డారు.
సోమవారం పుట్టాడు, శివుని పేరు పెట్టమంది మామ్మ.
నాన్న నన్ను అడిగారు, నీకేం పేరు పెట్టాలని ఉంది కల్యాణీ’’ అని.
మళ్లీ కొత్త పేరు ఎందుకు నాన్న, అన్నయ్య పెట్టాడుగా చంద్రుడని- అదే పేరు రాయండి’’.
అన్నయ్య నా వంక ఎంతో అభిమానంగా చూసాడు.
ఇక మా రాజకుమారుడు పేర్ల జాబితా తయారుచేశాడు. శరత్ చంద్ర, రామచంద్ర, హరిశ్చంద్ర, చంద్రమోహన్- ఇలా ఒకటేమిటి చంద్రుడితో రకరకాల పేర్లు ముందుకొచ్చాయి. చంద్రుడిని కలిపిన పేర్లన్నీ తిరగేశారు.
ఇంక మామ్మ కోరిక ప్రకరాం చంద్రవౌళి అని రాసేశారు నాన్న. కాని వాడికి లెక్క లేనన్ని పేర్లు. అమ్మ, మామ్మకు బుజ్జి, వదినకు హనుమంతా, అన్నయ్య చంద్ర- ఒకటేమిటి ఎన్నిరకాల పిలుపులో. నేనూ, నాన్న మాత్రం వౌళితో ఆగిపోయాం.
వాడి వంకే చూడటానికి ఇష్టపడని నా మనసు, ముట్టుకోడానికి వెనుకాడిన చేతులు, ఇప్పుడు క్షణకాలం వాడికి దూరంగా ఉండటానికి ఇష్టపడటంలేదు. కాని వాడి పనులన్నీ మామ్మే చూచేది. నీ మడి అంతా ఏమయిపోయింది మామ్మ అంటే ఓ నవ్వు నవ్వి నా మడికేం- నా మనుమడిని ముట్టుకుంటే మైల పడేది కాదు అనేది. మా అమ్మకు మాత్రం అత్తగారిని ఆటపట్టించడానికి మంచి అవకాశం కలిగేది.
మా నాన్న మాత్రం- ‘పోనీద్దు ఎందుకు ఆవిడను వేళాకోళం చేస్తావు’ అంటూ మామ్మను వెనకేసుకువచ్చేవారు.
మా అమ్మ నా వంక చూస్తూ- ‘‘మీ నాన్నని చూడు, వాళ్ళమీద ఈగ వాలనిస్తారేమో’’ అంటూ ఉండేది.
మొత్తంమీద వౌళి ఇంట్లో అందరికి ఒక సందడి మోసుకొచ్చేశాడు. అన్నయ్య ఇంటికి రాగానే వాడిని ఎత్తుకుని షికారు తీసుకువెళ్ళేవాడు.
వదిన అయితే సరేసరి. రాజకుమారుడి తరువాత పిల్లలు పుట్టలేదేమో, వాడిని ఒక్క క్షణం నేలమీద దింపేది కాదు. నేను చిన్నదాన్ని, నాకు చేతనవునో లేదో అని మిగిలినవన్నీ మామ్మ, అమ్మ చేసేవారు. ఒకసారి మా వదిన డాక్టర్ ఫ్రెండ్ వచ్చి, ఇలా అయితే మీ మేనల్లుడికి పాకడం, నడవడం రాదు అంటూ వదినని కోప్పడింది. నిజంగానే కనడంతో నా బాధ్యత తీరిపోయింది.
కాని మామ్మ మాత్రం రాత్రి పూట వాడిని నా దగ్గర పడుకోపెట్టేది. ఎన్ని రాత్రులు వాడి మొహం వంక చూస్తూ గడిపేశానో నాకే తెలియదు. నా దగ్గరే కూచునే మామ్మ నా వంక చూస్తూ ‘వాళ్ళ నాన్న పోలికలు ఎంత వచ్చాయే’’ అంది.
నా మనసు మాత్రం ఎందుకో చివుక్కుమంది. ఎంతో చక్కని ఉత్తరాలు రాసినా, అటునుంచి పెద్ద స్పందన వచ్చేది కాదు. అన్నయ్య వౌళికి ఫొటోస్ తీసిపంపినా బేబీ చాలా క్యూట్ అని తప్ప పెద్దగా రాయలేదు. నిజంగా రీసెర్చిలో బిజీగా ఉండిపోయాడో, నా మీద కోపమో తెలిసేది కాదు. ఎవరికి ఎంత కోపం వచ్చినా వౌళి మొహం చూశాక కోపం ఎలా నిలబడగలుగుతుంది? అనిపించేది.
అలాగే రఘు తల్లిదండ్రులవైపు వాళ్ళు కూడా చాలా నిర్లిప్తంగా దూరంగా ఉండేవారు.
ఎవరు ప్రేమించినా లేకపోయినా నేనున్నాను అని హత్తుకునేదాన్ని. ఇది కర్తవ్యం కాదు. ఇది బాధ్యత కాదు. అంతకంటే ఏదో చాలా ఎక్కువే. ఒక బాధ్యతగా చేసేది ఉద్యోగం. తల్లి పెంపకం బాధ్యత అని ఎలా అనగలం? మళ్లీ నా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్లిపోయేవి.
నిజంగా తండ్రి ప్రేమంటే ఏమిటా అనిపించేది. అసలు తండ్రులకు నిజంగా, సహజంగా ప్రేమ జనిస్తుందా లేక కేవలం కళ్ళముందు పెరగడంవల్ల వచ్చే అనుబంధమా? ఏమో, నాన్న విషయంలో అటాచ్‌మెంట్ అనలేను. మరి రఘు ఎందుకింత దూరంగా ఉండిపోయాడు? అది నాకు అర్థం కాని విషయం.
-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి