డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మమ్మ, తాతగారు, అందరూ చాలా వర్రీ అయిపోతున్నారు. నేను, మా పెద్ద మామయ్య మాత్రం చాలా ధైర్యం నటిస్తున్నాం.
నాకు మాత్రం గుమ్మం వంక చూస్తూ కూర్చోవడం ఇంఫాజిబుల్‌గా అనిపించింది. చివరకు మామయ్యతో ‘‘నేను వెళ్లి చూసొస్తాను అని లేచాను’’ అన్నాడు వౌళి.
‘‘ఎక్కడికని వెడతావురా? ఈ వానలో’’ అన్నాడు మామయ్య.
‘‘ఎక్కడికనేముంది మామయ్యా, బస్సు స్టాండ్‌కి వెడతాను. అసలు సాయంత్రం బస్సు వచ్చిందో లేదో కనుక్కొస్తా’’ అని లేచాను. పక్కన ఉన్న గొడుగు తీసుకొని సైకిల్ వైపు నడుస్తూ.
‘‘ఈ వానలో ఆ సైకిల్‌మీద వెళ్ళలేవు’’ అన్నాడు.
‘‘ఆ మెయిన్ రోడ్‌మీద ఏదైనా ఆటో దొరుకుతుందేమో చూస్తాలే’’ అన్నాను.
‘‘ఈ వానలో ఏమీ దొరకవు. ఉండు నేనూ వస్తాను’’ అంటూ తన స్కూటర్ తీశాడు.
‘‘వద్దు మామయ్యా, నువ్వు తడిసిపోతావ్’’ అన్నాను.
‘‘నిన్ను ఒక్కడిని ఈ వానలో వెళ్లనివ్వను, పద’’ అని తనూ బయలుదేరాడు.
‘‘ఇద్దరం స్కూటర్ ఎక్కాం. అంత అడ్వెంచర్‌గా ఎప్పుడు అనిపించలేదు. చిమ్మ చీకటి, హోరున వాన, పైన ఉరుములు, మెరుపులు. నీళ్ల జోరుకు స్కూటర్ నడపడం కూడా చాలా కష్టంగా ఉంది.
మామయ్య చాలా జాగ్రత్తగా పోనిస్తున్నాడు. వెనకనే కూర్చొని గొడుగు పట్టుకున్నాను మామయ్య తలపై.
బస్సు స్టాండ్- ఆ బస్సు రాలేదని తెలిసి స్కూటర్‌మీద గుంటూరు వైపు బయలుదేరాం. ఎక్కడయినా ఏ ఆక్సిడెంట్ అయినా అయిందేమో అని.
మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా రోడ్డుపక్కన ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఓ బస్సు ఆగిపోయి ఉంది.
దాన్ని చూడగానే మామయ్య స్కూటర్ ఆపాడు. నేను గబగబా పరుగెత్తుకు వెళ్లి బస్సు లోపలకు ఎక్కాను.
అమ్మ నన్ను చూడగానే తెల్లబోయింది. నేను, మావయ్య చేసిన పనికి చాలా కోపం వచ్చేసింది. మా అమ్మను అంత కోపంగా అదే నేను మొట్టమొదటిసారి చూడటం.
అక్కడికి అక్కడే తిట్టేదే బస్సు నిండా మనుషులు ఉన్నారని బలవంతంగా కంట్రోల్ చేసుకుంది.
ఇంటికి రాగానే బాగా కోప్పడింది మావయ్యను కూడా!
‘‘ఏమిటన్నయ్యా! నేనేం చిన్నపిల్లనా? ఆ మాత్రం నా జాగ్రత్త నే చూసుకోలేనా’’ అంటూ.
‘‘వౌళికి బుద్ధి లేకపోతే నీకేమయింది? అసలు వాడిని ఆ వానలో ఎలా వెళ్లనిచ్చావ్? నువ్వెలా వచ్చావ్?’’ అంది కోపంగా.
బస్సు డ్రైవర్ ఎవరో చాలా జాగ్రత్తగలవాడిలా ఉన్నాడు. అసలు దోవ కనిపించడం కష్టమయ్యేసరికి బస్సు ఆపేశాడట. ప్రయాణీకులు బతుకు దేవుడా అని కూచున్నారు.
‘‘నేను క్షేమంగా ఉన్నాను, మీరిద్దరూ అనవసరంగా ప్రమాదానికి సిద్ధపడ్డారు’’ అంది అమ్మ. ఆ క్షణంలో మా అమ్మ కళ్ళముందు, నేను, మామయ్యా బోల్తాపడ్డ స్కూటర్ మెదిలింది.
అని పూర్తిచేసి నా వంక చూచింది. అతనిలో మీ గురించి మాట్లాడుతున్నంతసేపు మీమీద ఉన్న ఎడ్మిరేషన్ చూచి ఆశ్చర్యపోయాను.
నాకు తెలియకుండానే ఎందుకో నా భయం అంతా పారిపోయింది. అమ్మ గురించి అంతగా తలచుకునేవాడు మంచివాడు కాకుండా ఉండడని అనిపించింది.
ఆ తరువాత రెండేళ్ళలో ఆ పరిచయం స్నేహంగా మారింది. అతని సమక్షంలో అతను నాకు ఫారినర్ అనిపించేది కాదు అంటూ పూర్తిచేసింది తేజ.
‘‘ఏమిటంత సీరియస్‌గా కబుర్లు చెప్తున్నావ్?’’ అంటూ వౌళి కాఫీ తెచ్చి ఇచ్చాడు మా ఇద్దరికీ.
‘‘స్నో స్టార్మ్‌లో నీ అడ్వెంచర్ గురించి’’ అంది.
‘‘నువ్వు నమ్ముతావా అమ్మా, తేజ నన్ను అసలు ట్రస్ట్ చేయలేదు’’ అన్నాడు ఫిర్యాదుగా!
‘‘మంచి పని చేసింది. ఎర్రగా, బుర్రగా అందంగా కనిపించిన ప్రతి మగాడిని నమ్మేయడమేనా?’’ అన్నాను. వౌళి మూతి ముడుచుకున్నాడు.
‘‘లాభం లేదు వౌళి! నీకు మీ అమ్మ సింపతీ దొరకదు’’ అంది నవ్వుతూ!
నా ప్రయాణం నాలుగు రోజులలోకి వచ్చేసింది. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మూర్తిగారు, సావిత్రి వస్తామని ఫోన్ చేశారు.
నేను మామూలుగా కిచెన్‌లో కూరలు తరుగుతున్నాను. తేజ ఇంకా రాలేదు. వౌళి అప్పుడే గుర్తుకొచ్చినట్లు నా దగ్గరకు వచ్చాడు.
ఏమిటన్నట్లు చూశాను.
కొంచెం సంకోచిస్తూ అన్నాడు- ‘‘అమ్మా! నిన్నొక విషయం అడగాలి’’.
చేస్తున్న ఆపి వౌళి వంకే చూశాను. ఎందుకో సందేహిస్తున్నాడో అర్థం కాలేదు. వౌళి మామూలుగా అయితే అడగదల్చుకున్నది అడిగేస్తాడు.
‘‘నువ్వు ఈ దేశం వచ్చాక, నేను ఒక్కసారి కూడా అడగలేదు. మావయ్యగారు అడిగినపుడు కూడా నేనే సమాధానం ఇచ్చాను’’ అన్నాడు.
నాకు పూర్తిగా అర్థం కాలేదు. వాడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో.
‘‘నువ్వు ఇండియా వెళ్ళేలోగా డా.రఘురాంగారిని కలవాలని ఉందా?’’ అన్నాడు వౌళి.
నిర్ఘాంతపోయినట్లు చూచాను.
‘‘అదేమిటంటే ఒకవేళ నువ్వు అతనిని కలవాలనుకుంటే నేను అభ్యంతరపెట్టడం, అడ్డుగా ఉండటం ఇష్టంలేదు’’ అన్నాడు.
‘‘తేజ సజెస్ట్ చేసిందా?’’ అన్నాను.
వౌళి మాట్లాడలేదు.
‘‘నీకెందుకలా అనిపించింది?’’
భుజాలు కదిలించాడు ఏమో అన్నట్లు.
వాడికి పెళ్లయ్యాక అర్థం అయింది కాబోలు జీవితంలో పార్ట్‌నర్ అంటే ఏమిటో.
తల ఊగించాను అడ్డంగా, అవసరం లేనట్లు ‘‘నేను అతన్ని కలవాలని అనుకోలేదు, అనుకోను కూడా. మనం కావాలి అనుకునే వ్యక్తులను కలవాలి. వద్దనుకునేవారిని కలవాలన్న కోరిక నాకు లేదు.
‘‘అవచ్చు అమ్మా. కానీ, ఒకసారి కలసి క్లియర్‌గా తెలుసుకోవాలనిపిస్తుంది కదా!’’
‘‘చేయగలిగేది ఏమీ లేనపుడు తెలుసుకోవలసిన అవసరం ఏముంది?’’
వౌళి ఏదో అనబోయాడు.
‘‘వదిలేయ్ వౌళి! థాంక్ యు! నీకు ఈ పని ఎంత కష్టమయిన విషయమో నాకు తెలుసు. అయినా నా కోసం నువ్వు కలవడానికే సిద్ధమయ్యావు. చాలా పెద్దవాడివయ్యావు’’ అన్నాను తలవంచుకుని.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి